హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

నోములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నోములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, డిసెంబర్ 19, 2014

16 కుడుముల తద్దె నోము

                            
                         పూర్వ కాలం నాటి మాట ఆ కాలాన ఒక గ్రామాన శ్రీ లక్ష్మీ ,భూలక్ష్మి అను పేర్లు గల ఇద్దరు అక్క చెల్లెండ్రు ఉండేవారు .వారిద్దరిలో శ్రీ లక్ష్మి నాస్తికురాలు.భూలక్ష్మి ఆస్తికురాలు .అన్నిటిలో ఇద్దరికీ వ్యత్యాసము ఉండేది .లేదా తేడా ఉండేది .భూలక్ష్మికి భక్తి ఎక్కువ ఆ కారణం చే ఆమె ఎవరే నోము నోచమంటే ఆ నోము నోచేది శ్రద్దా భక్తులతో ఆచరించేది .
 
                            ఒకనాడు ఆ గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు . ఆయన గ్రామస్తులకు 16 కుడుముల తద్దె నోము గురుంచి వివరించి చెప్పి ఆచరించమని చెప్పాడు. భూలక్ష్మి చక్కగా విని ఎంచక్కా వ్రత మాచరించింది. ఇక శ్రీ లక్ష్మి మాత్రం నాస్తికురాలు కావడం వల్ల వ్రతమా ? పాడా ! వ్రతాలు వద్దూ ,నోములూ వద్దూ అని హాయిగా పిండి వంటలు చేసుకుని తినేది .దేవతలూ లేరు ,దేముళ్ళు లేరు .అంతా ఈ పేరు చెప్పి తినడానికి ఈ వ్రతాలు -నోములు పెట్టారు .అంతా భూటకం ,నాటకం, మాయ, మిధ్య, పనీ -పాట లేని వారు ఇవన్నీ ఏర్పాటు చేసారు .అంతే కాని వీటి వల్ల ఏం ఫలితం ఉండదు. అని ఆమె ఏవేవో మాట్లాడేది . కొన్నాళ్ళకు ఆమె దరిద్రు రాలయింది .ముష్టి త్తుకుని తినేది .ఆమెకు ఎవరూ పిడికెడు బియ్యం కూడా పెట్టె వారు కాదు .తినుటకు తిండి ,ఉండేందుకు ఇల్లు ,కట్టుకునేందుకు బట్ట లేదు. అష్ట కష్టాలు పడసాగింది .పాడు పడిన గౌరీ దేవి గుడిలోనికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడవ సాగింది .తన గోడంతా ఆ దేవత ముందు చెప్పుకుంది .దయామయి అగు ఆ దేవత ప్రత్యక్షమై -అమ్మా ' శ్రీ లక్ష్మీ ' బాధ పడకు ,విచారించకు . 16 కుడుముల నోము నోయి . అన్ని బాధలు తీరుతాయి . గ్రామస్తుల సహకారం అర్ధించు , తప్పక నీకు సహకరిస్తారు వెళ్ళు అనగా ఆమె ఇంటికి వెళ్లి అందరి సహకారంతో నోము నోచినది .మహిమ అంతే ఆమె ధన వంతురాలయినది . ఉద్యాపన వినండి - పై కధ చదివి పవిత్రాక్షతలు శిరస్సున జల్లుకుని గౌరిని పూజించి 16 కుడుములు ,లక్క జోళ్ళు ,నల్ల పూసలు, దక్షిణ ,తాంబూలం సమర్పించాలి .16 చేటలు 16 మందికి ఇవ్వాలి .అన్నదానం చేయాలి.



బుధవారం, డిసెంబర్ 10, 2014

నిమ్మలగౌరీ నోము

                      భార్యా భర్తలను వేధించే ప్రధాన సమస్య ... సంతాన లోపం. ఈ సమస్య ఆనందాన్ని దూరం చేసి అనుక్షణం ఆవేదనను కలిగిస్తూనే వుంటుంది. అందువలన ఈ శాపాన్ని వరంగా మార్చుకోవడానికి భార్య భర్తలు ఎన్నో నోములు నోస్తుంటారు. అలాంటివాటిలో 'నిమ్మలగౌరీ నోము' ఒకటి.

ఈ నోము నోచుకోవాలనుకున్న వారు కాస్త పెద్దదిగా వున్న ఆరోగ్యకరమైన నిమ్మవేరును సంపాదించి దానిపై చిన్నపాటి 'గౌరీదేవి'ప్రతిమను చెక్కించాలి. మాఘ శుద్ధ సప్తమి (రథ సప్తమి) రోజున పూజా మందిరంలో ఆ ప్రతిమను ఉంచి పూజించాలి. ధూప ... దీపాలు సమర్పించుకుని పంచదార గానీ, బెల్లం గాని నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఇలా ఏడాది పూర్తయిన తరువాత ముగ్గురు పేరంటాళ్లను పిలిచి పూలు ... పండ్లు ... కొత్త వస్త్రాలు ... నల్ల పూసలు ... లక్క జోళ్లు ... ఐదు నిమ్మ పళ్ళను దక్షిణ తాంబూలాలతో పాటు వాయనమిచ్చి ఉద్యాపన చెప్పుకోవాలి.

ఇక ఈ వ్రతానికి కారణమైన కథను గురించి తెలుసుకుందాం. పూర్వం ఓ గ్రామంలో పద్మగంధి - పద్మనాభుడు అనే దంపతులు వుండేవారు. ధన ధాన్యాల విషయంలో వారికి ఎలాంటి లోటూ లేదు. అయితే సంతానం లేకపోవడం వారిని మానసికంగా కుంగదీస్తూ వస్తోంది. దాంతో ఇరుగు పొరుగు వారి మాటలు నమ్మి వారు ఎన్నో తీర్థ యాత్రలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఆ దంపతులు మరింత దిగాలు పడిపోయారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన ఓ మహర్షిని వాళ్లు కలుసుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు. దాంతో ఆ మహర్షి 'నిమ్మలగౌరీ నోము' నోచుకోమంటూ దాని విధి విధానాలను వారికి వివరించాడు. ఆయన చెప్పినట్టుగానే చేసిన ఆ దంపతులకి, కొంత కాలానికి సంతానం కలగడంతో వారి ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఆ రోజు నుంచి ఆ దంపతులు ఈ వ్రతానికి మరింత ప్రచారం కల్పించి, మరెంతో మంది సుఖ సంతోషాలకు కారకులయ్యారు.

సోమవారం, సెప్టెంబర్ 08, 2014

మూల గౌరీ నోము



ప్రాచీన కాలం నాటి మాట . ఆ రోజులలో ఒక రాజ్యం. ఆ రాజ్యమును ఒక రాజు పాలించే వాడు. ఆయనకు జగదీశ్వరి పట్టపురాణి . ఆమె భక్తురాలు ,నిరంతరం భగవదానుగ్రహం కోసం దేవారాధనతో గడిపేది ,పరమ పతివ్రత . సాద్వీ మణి గుణవంతురాలు .శీలవతి .అన్ని ఎందుకు సద్గుణ వతి. ఆమె ప్రతి ఏటా మూల గౌరీ నోము నోచేది. గౌరీ దేవి అనుగ్రహం కోసం అయిదవ తనం నిలుపు కుందుకు అ చల్లని తల్లి పూజలు చేసేది. భక్తి శ్రద్దలతో వ్రత మాచరించేది.
కాలం గడుస్తోంది .శత్రు రాజులు దండెత్తారు .వారి బలం ముందు తన భర్త పడిపోయాడు. అంతేకాదు చనిపోయాడు. సైన్యం మరణించారు. అంత మహారాణి విషయాలు అన్నీ తెలుసుకుని సైనికుల , భర్త ప్రాణాలు గొనిపోయె యమ భటుల నుద్దేశించి -
"ఓ యమకింకరులారా ! ఆగండి ,ఆగండి .నాపలుకులు వినండి . నేను మూల గౌరీ వ్రతం ఆచరించాను . ఆ వ్రత ఫలంగా నా మాంగల్యానికి భంగం రారాదు .నా ప్రజలు సైనికులు సుఖంగా ఉండాలి .నా రాజ్య మందు ఎవరికీ ఏ హాని కలుగరాదు. సుఖంగా ఉండాలి. " అని బిగ్గరగా అరచింది. ఆ అరుపులు విని యమభటులు భయపడి పోయి పారిపోయారు. రాజు సైనికులు తిరిగి ప్రాణాలతో లేచి కూర్చున్నారు. యుద్ధం చేశారు . శత్రువులను ఓడించారు .సుఖంగా జీవించారు . ఇదంతా మహారాణి చేసిన వ్రత ఫలం .
ఇక ఉద్యాపన వినండి. కధ చదువుకుని పవిత్రాక్షతలు శిరస్సున చల్లుకొనవలెను. ఒక సంవత్సరం పూర్తికాగానే ఒక పెరంటాలిని పిలిచి పిండి వంటలతో భోజనం పెట్టవలెను. పండ్లు, కొత్త బట్టలు , పసుపు ,కుంకుమ , నవరత్నాభరణములు ,దక్షిణ ,తాంబూలం సిద్దం చేసుకుని వాయన మందీయ వలెను. శ్రద్దా భక్తులతో నోము నోచిన ఫలం సిద్దించ గలదు.

మంగళవారం, జనవరి 08, 2013

మాఘ గౌరీ నోము


                పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రామ్హన దంపతులకు లేక లేక ఒక కుమార్తె పుట్టింది.  ఆమెను అల్లారుముద్దుగా పెంచారు.  యుక్త వయస్సు రాగానే ఆ కన్యకు అత్యంత వైభవంగా వివాహం చేసారు.  పెళ్లి అయిన ఐదవ నాడే వరుడు మరణించి  ఆ కన్యా విధవరాలైంది.  కుమార్తె ప్రారబ్ధమునకు ఆ తల్లి దండ్రులు ఎంతగానో దు:ఖించారు.  తీర్ధయాత్రల వలన పుణ్యము ప్రశాంతత కలుగుతుందని ఆ దంపతులు తమ కుమార్తెను తీసుకుని పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ తిరుగుతూ వున్నారు.  
           ఇలా తిరుగుతున్నా వారికి ఒకనాడు ఒక చెరువు వద్ద ముత్తైదువులు ఒకచోట, విధవరాల్లందరూ ఒక చోట చేరి పద్మములతో పూజలు చేస్తూ కనిపిస్తోన్నారు.  అదేమిటో తెలుసుకొనవలేనన్న కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు వెళ్ళారు.  అక్కడగల పుణ్య స్త్రీలలో వున్న పార్వతీదేవి వృద్దురాలి రూపంలో కనిపించింది.  వీరిని సమీపించింది.  దంపతులు ఆమెను అక్కడ జరుగుతున్నదేమిటి అని ప్రశ్నించారు .  వృద్ద రూపంలో వున్న పార్వతీదేవి చేరదీసి ఇది పుణ్యకా వ్రతమని చెప్పి వారి కుమార్తెను చెరువులో చేయించి దోసెడు ఇసుకను ఆమెచేత గట్టున వేయించింది  .  ఆ ఇసుక  పసుపుగా మారింది.  మరల స్నానం చేయించి దోసెడు ఇసుక గట్టున వేయించాగా అది కుంకుమ గా మారింది.  మూడవ పర్యాయము స్నానం చేయించి దోసెడు ఇసుకను ఒడ్డున వేయించాగా అది కొబ్బరికాయగా మారింది.  ఆ నాలుగు అయిదుసార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లముగా జీలకర్రగా మారింది.  అంట అమ్మవారు ఓ దంపతుల్లారా! చింతించక మీ బిడ్డ వైధవ్యం తొలగి పోయే మార్గం చెబుతాను మీ అమ్మాయిచేత అయిదు సంవత్సరాలు మాఘ గౌరీ నోమును నూయించండి అని చెప్పి మాయమైనది.  
             అంత ఆ తల్లి దండ్రులు ఆనందిన్చినవారై తమ కుమార్తెను తీసుకుని స్వగ్రామం వెళ్లి కుమార్తె చేత మాఘ గౌరీ నోముని అయిదు సంవత్సరాలు చ్యించారు.  అంట ఆమెకు పునర్వివాహమై జీవితకాలం ముమంగాలిగా జీవించింది.  
ఉద్యాపన:  ఈ నోమును మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు పొదలు పెట్టాలి.  ఆ నెల రోజులు ప్రతిరోజూ స్నానం చేసి నీలాతరేవులో పసుపుతో గౌరీదేవిని పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ లతో పూజించాలి.  మొదటి సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) పసుపు రెండవ సంవత్సరము   సేరుమ్బావు  (1-1/4kg)  కుంకుమ,  మూడవ సంవత్సరము (1-1/4kg) కొబ్బరి, నాలుగవ సంవత్సరము 1-1/4kg బెల్లము, అయిదవ సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) జీలకర్ర ముత్తైదువులకు దానమివ్వాలి.  ఉద్యాపన చెప్పుకుని ముత్తైదువులకు భోజనము పెట్టి, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డలు ఇవ్వాలి. 

ఆదివారం, జనవరి 06, 2013

అనంతపద్మనాభుని నోము


             పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు.  వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు.  యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు.  వివాహం చేసి ఆమెను అత్తా వారింటికి సాగనంపారు.  కుమార్తెకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వుల్లది ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు.  ఆ ఇల్లాలు ఇంట్లో వున్న కాస్త వరిపిందిని మూటగట్టి కూతురుకిచ్చింది.  
              నవవదూవరులిద్దరూ వారి స్వగ్రామమునకు కాళీ నడకన బయలుదేరారు.  వెళ్తూ మార్గ మధ్యలో సంధ్య వార్చుకోవడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు.  ఈ లోపున నవవధువు ఆ చుట్టూ పక్కల తిరుగుతూ కొందరు పూజచేసుకుంటూ వుండడం చూసింది.  వారి దగ్గరకు వెళ్లి ఆ పూజ వివరాలను అడిగి తెలుసుకుంది.  తన దగ్గర వున్న పిండితో పద్మనాభుని బొమ్మను చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్టించుకుని భక్తితో పూజ చేసింది.  సంధ్య వార్చుకుని భర్త వచ్చే సరికి ఆమె పూజ ముగించుకుంది.  భర్త తోపాటు గ్రామానికి బయలు దేరింది మార్గ మధ్యలో వారికి ఆకలికాగా ఆమె భర్త తన అత్తా గారిచ్చిన పిండితో తినడానికి ఏమైనా చెయ్యమని అడిగాడు.  అందుకామె పిండిలేదని బొమ్మను చేసి పూజచేసుకున్న వైనాన్ని చెప్పి చేతిని గల తోరాలను సాక్ష్యంగా చూపింది.  అతడు విసుగుకొని ఆతోరంతీసిపారేయ్యమన్నాడు.  ఎదురు చెప్పలేక చేతికున్న దారపు పోగులను తీసివేసింది.  
                అందుమీదట నోము వుల్లన్ఘిన్చినట్లయింది.  వారి ప్రయాణము కాదు  దుర్భరమైంది.    ఆకలి ఎక్కువైపోయింది. జవసత్వాలు సన్నగిల్లి పోయాయి.  యేమిటిదని ఆ వరుడు పరిపరి విధాల పరితపించాడు.  ఇదంతా తోరం తీసి పారేసి పద్మనాబుని వ్రత ఉల్లంఘన చేయడం వల్లనే జరిగి ఉంటుందని అనుకుని అనుమతిస్తే మళ్ళీ ఆ వ్రతం మొదలు పెట్టి భక్తి శ్రద్దలతో పూర్తి చేస్తాను మన బాధలు తొలగి పోతాయి అన్నది.  అందుకు అతడు అంగీకరించగా ఆ వధూవరులు మరింత భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించవలసిన పూజాద్రవ్యాలను పూజా విధి విధానాలను అనుసరించి మనసున తలచు కుంటూ అనంత పద్మనాభుని వ్రతం చేసారు.  స్వామీ అనుగ్రహం కలిగి ఆ వ్రత మహిమ వల్ల ప్రయాణం సుఖంగా సాగింది.  చెట్లు ఫలాలు లభించగా వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు.  ఇంటికి చేరుకునేసరికి రాజుగారి ఆస్థానము నుండి రాజ పురోహితునిగా రావసిందని ఆహ్వానము వచ్చింది.  అటుపై ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.  
ఉద్యాపన:  వార్షికంగా ఈ నోముకన్యాలు, వివాహిత వనితలు స్సుసుకోదగినది.  పిండితో దామోదరుని బొమ్మను చేసి ప్రీతితో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి.  ఆ రోజున ఒక సద్బ్రాహ్మనునికి భోజం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి.

శనివారం, జనవరి 05, 2013

ఉదయ కుంకుమ నోము


               పూర్వకాలములో ఒకానొక విప్రునకు నలుగురు కుమార్తెలు వుండేవారు.  పెద్ద పిల్లలు ముగ్గురికి వివాహాలు జరిగివారి భర్తలు చనిపోయి విధవరాళ్ళు అయ్యారు.  ఆ బ్రాహ్మణ దంపతులు కుమార్తెల దుస్థితికి ఎంతగానో బాధపడుతుండేవారు.    ఆఖరు కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది.  ఆమెకు వివాహం చెయ్యాలన్న వుబలాటం వున్నా అక్కగార్లవలె వైధవ్యం పోడుతుందేమో అని బాధ పాడుతుండేవాడు.  
                నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగళిగా వుద్దరించమని మొరపెట్టుకునేవాడు.  ఒకనాడు గౌరీదేవి కలలో కనిపించి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించమని చెప్పింది.  ఆమె మాటలు యందు నమ్మకము కలిగి అలా చేయడం వలన తన కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుందనే నమ్మకము కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించాడు.  వ్రత ప్రభావం వలన ఆమెకు భార్తలభించాడు.  పూర్నాయుష్కుడు వైధవ్య భయం తొలగి పోయింది.  ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గోరిదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగల్యము, సిరిసంపదలు, కలుగుతాయి.   ఉద్యాపన:  కన్నె పిల్లలు చేసుకుని తీరవలసిన నోము ఇది.  ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు కాటుక పెట్టుకొని పసుపు గౌరీ దేవిని చేసి ఫల పుష్పాదులతో ధూప దీప నైవేద్యాలతో ఆచరించాలి.  ఒక ముత్తైదువు నకు  గౌరీదేవి పేరున పసుపు పువ్వులు రవికల గుడ్డ తాంబూలము ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి. 

శుక్రవారం, జనవరి 04, 2013

ధైర్యలక్ష్మి నోము


         ధైర్య లక్ష్మి నోము ఇది ఒక భక్తి పపట్టులతో ఆత్మ విశ్వాసాన్ని రంగరించిన ఒక వృత్తాంతము వున్నది  ఒక గ్రామంలో ఒక స్త్రీ వుండేది.  ఆమెకు అయిదుగురు తమ్ముల్లునారు వారిలో నలుగురు తమ్ముళ్ళ పెళ్లిళ్లకు దేనికి ఆమె వేళ్ళ లేదు.  ఏ తమ్ముడి పెళ్ళికి వెళ్ళాలనుకున్న ఆమె భర్తకు ప్రాణాంతకమైన వ్యాధి సంభవిస్తుండేది.  ఆఖరు తమ్ముడి పెళ్ళికి భర్తకు ఆరోగ్య పరిస్థితి యెంత మాత్రం బాగాలేకపోయినా ఆమె నా భర్తకు ఏమి జరగదన్న ధైర్యంతో బయలుదేరింది.
      
            మార్గ మధ్యలో ఒక జమ్మి చెట్టు కనిపిస్తే దాని చుట్టూ ప్రదక్షణ చేసి నువ్వే నాకు ధైర్యం, నువ్వే నా భర్తను రక్షించాలని మనసులో దేవుణ్ణి ప్రార్ధించుకుని ఆ చెట్టుకు నమస్కారము చేసి తమ్ముడి  పెళ్ళికి వెళ్ళింది.పెళ్లి పూర్తి అయ్యాక ఇంటికి తిరిగి వచ్చింది.  ఆమె వచ్చే సరికి ఆమె భర్త పూర్తి ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నాడట.  ఈ ఇతిహాసంలో ధైర్య లక్ష్మి నోము చెప్పబడుతుంది. 

గురువారం, జనవరి 03, 2013

శాకాదానము నోము


               పూర్వము ఒక రాజ్యములో రాజు భార్య మంత్రి భార్య కలిసి శాఖ దానము నోమును నోచారు.  ఒక సంవత్సరము పాటు మంత్రి భార్య ప్రతి రోజు ఒక తోటకూర చెట్టును కొంత దక్షిణతో కలిపి ఒక విప్రునకు దానమిస్తుండేది.  రాజు భార్య సంవత్సరమునకు సరిపడు తోటకూర చెట్లు తెప్పించి విప్రులను రప్పించి వారికి దక్షిణ తామ్బూలాడులతో ఒక్క సారిగా దానమిచ్చింది.  కాలం గడుస్తున్దగ్తా మంత్రి భారీ సుఖ సంతోషములతో ఆనందముగా జీవిస్తున్నది.  రాజు భార్యకు సుఖ శాంతులు లేక కష్టాలతో జీవిస్తుండేది.  
               ఈ విషయం మంత్రి భార్య వద్దకు వెళ్లి చెప్పి మనమిద్దరమూ శాఖ దానము చేసితిమిగాడా మరి నీకు సుఖ శాంతులు కలుగుటకు కారణమేమిటి అని ప్రశ్నించినది.  అందుకా మంత్రి భార్య మహారాణి ఒక్క సారిగా వ్రతమును పూర్తి చేయాలన్న తొందరపాటు భావంతో మీరు వ్రత నియమాన్ని కూడా ఉల్లంఘించి సంవత్సరం రోజులపాటు ప్రతీ రోజు పంచవలసిన తోటకూర చెట్లను దక్షిణ ను ఒకే రోజు పంచడం వల్ల వ్రత విధి విదానాలను ఆచరించ కుండా వ్రతమును పూర్తి చేసినందువల్ల మీకు మనఃశాంతి లోపించి దు:ఖము కష్టములు కలుగుటకు కారణమని మరలా శాఖ దానము నోమును నోచి భక్తితో ప్రతి రోజు శాఖమును దక్షినలతో కలిపి ఏడాదిపాటు దానము చేయవలసినదని మంత్రి భార్య రాజు భార్యకు చెప్పింది.  ఆమె మాటల యందు నమ్మకము వుంచి రాజు భార్య శాఖ దాన నోమును భక్తితో వ్రాతవిది విదానములతో నియమముతో వ్రతమును పూర్తి చేసినందువల్ల ఆమె స్థితి మారి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించింది.   ఉద్యాపన:  ఒక బ్రాహ్మణుడిని పిలిచి తలంటి నీళ్ళు పోసి తోటకూర చెట్టును పదమూడు నాణాలను దక్షిణగా ఆ విప్రునకు దానమివ్వాలి.

బుధవారం, జనవరి 02, 2013

నందికేషుని నోము


            పూర్వము ఒకానొక గ్రామంలో ఒక వృద్ద పెరంటాలుండేది.    ఆమె చేయని వ్రతాలు నోచని నోములు లేవు.  కాని ఆమెకు మాట కటువుగా   వుండేది.  చెట్లలో చీత్కారం చోటుచేసుకునేది.  ఆ కారణం వల్ల ఆ గ్రామస్తులేవ్వరికి ఆ ముడుసలిపట్ల ఉండవలసిన ఆదరాబిమానాలు ఉండేవి కావు.  కాని ఆమెను ఎవరూ దూషించేవారు కాదు .   సమస్త దేవతలా కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా సాగిపోతుండేది.  
          ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకంలో జరిగే విషయాలు విశేషాలను ముచ్చటించు కుంటున్నారు  .  పార్వతి పరమేశ్వరుని కాళ్ళు వత్తుచున్నది.   ఆమె చేతులు కఠినముగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు.  నాదా!  నా చేతులెందుకు కఠినముగా వున్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువైయ్యే మార్గామేమితో హేప్పమని వేడుకుంది.  దేవి నీవేవరిపట్లనో కాఠిన్యము పోయి మృదువైయ్యే మార్గమేమిటో  చెప్పమని వేడుకుంది.  దేవి నేవేవరిపట్ల నో కాఠిన్యముగా ఉండడమే ఈ నీ చేతులు ఠినత్వమునకు గల కారణం ఇందుకు నీవు నీళ్ళాట రేవుకు వెళ్లి వచ్చీపోయే వనితలకు తలంటి నీళ్ళు పోయవలసిందని ఇందువాళ్ళ ఒక భక్తురాలికి తలంటి నీళ్ళు పోయడం వల్ల స్నానం చేయిన్చేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించి పోవునని పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.  
            ఆమాటమేరకు పార్వతి భూలోకానికి వచ్చి నీళ్ళాట రేవు వద్ద నిలబడి వచ్చీపోయే మగువలను పిలచి తలంటి నీళ్ళు పోస్తూ వచ్చింది.  అలా వచ్చినవారందరికీ తలంటు పోయగా అహంకారవతియై ఒక వృద్ద పేరంటాలు రేవుకు వచ్చింది.  పార్వతి ఆమెను తలంటి నీళ్ళు పోస్తాను రమ్మన్నది.  నేను ఎన్నో వ్రతాలు హేసాను ఇదేమి వ్రతము?  తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుతానంటే కాదనడం ఎందుకు అని అలగేకాని  తలవంచుకుని కూర్చున్నది ఆ ముదుసలి పేరంటాలు.  పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది.  ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీ దేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో తనియింప చేయలేదు.  అయినా పార్వతి తన చేతులు మరుడువుగా మారడం వల్ల ఆ ముదుసలి పెరంటాలిని అనుగ్రహించి సిరిసంపదలు ప్రసాదించింది.  
             పలు నోములు నోచితినన్న అహంకారం ధనదాన్యాది సిరులున్నాయన్న అహంభావం ఆ వ్రుద్దురాలిలో కలిగాయి.  తనంతటి దానను కనుకనే పార్వతి  స్వయంగా వచ్చి తలారా స్నానం చేయిన్చిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తుండేది.  ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సిరులే ఆమె అహంకారానికి కారణమని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకుంది.  విఘ్నేశ్వరుడ్ని పిలిచింది.  ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది.  ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు.  ఆమె విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు పెట్టింది.  పార్వతి పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు.  
             ఈ సంగతి తెలిసిన పార్వతి బాగా ఆలోచించి నందిని ఆమెవద్దకు పంపించింది వచ్చిన నందిని ఆ వృద్ద పేరంటాలు ఆరాధించి శనగలు వాయనమిచ్చింది.  దానితో నందికేశ్వరుడు ఆమెకున్న భాగ్యాన్ని తీయకుండా వెనుదిరిగి పోయాడు. ఆ తదుపరి పార్వతి భైరవుడ్ని పంపించింది.  వచ్చిన భైరవునకు వృద్ద పేరంటాలు గారెలు పెట్టింది.  అందుకా భైరవుడు ఆమె సిరులు తొలగించకుండా వేణు తిరిగి వచ్చెను.  పార్వతి చంద్రుడిని పంపించింది.  వచ్చిన చంద్రునకు వృద్దురాలు చలిమిడి చేసి పెట్టింది.  చంద్రుడు ఏ విధంగాను ఆమె సిరులు తొలగించకుండా వెను తిరిగెను.  
               అటుపై పార్వతి సూర్యుడిని పంపించగా ఆ వృద్దురాలు క్షీరాన్నాన్ని ఆరగించమని పెట్టింది.  అందుకా సూర్యుడు ప్రసన్నుడై ఆమె సిరులపట్ల ఏవిధమైన చర్య తీసుకోలేదు.  కుమారస్వామిని వృద్దురాలి సిరులు తొలగించుటకు  పార్వతి పంపించగా చక్రపోగాలిని పెట్టి వృద్దురాలు తన ప్రమాదాన్ని తప్పించుకుంది.    వీరివల్ల సాద్యం కాదని సిరులను తొలగించుటకు పరమేశ్వరుడిని పంపించింది పార్వతి.  వచ్చిన సదాశివునికి ఆ వృద్ద భక్తురాలు చిమ్మిలిని పెట్టింది.  శంకరుడు వచ్చిన పని కాదని వెను తిరిగి వెళ్ళాడు.  
                ఇంకా పార్వతీ దేవి స్వయముగా తానె కార్యసాధన నిమిత్తం వృద్ద పేరంటాలు ఇంటికి వచ్చింది.  తన ఇంటికి వచ్చిన పార్వతిదేవిని సాదరంగా ఆహ్వానించి పీఠంవేసి  కూర్చోబెట్టి భక్తురాలు పసుపు వ్రాసింది.  కుంకుమ బొట్టు పెట్టింది.  ధూప దీప నైవేద్యాడులతో ఆరాధించింది.  పులగం వండి నివేదించింది.  పార్వతీ దేవి ప్రసన్నురాలై తన నిర్ణయాన్ని విరమించుకుంది ఆమె కాఠిన్యము తగ్గింది.  మనస్సు తనువూ మ్రుదువైయ్యాయి.  ఆమెకు మరింత సిరిసంపదలను ఆగ్రహించింది.  
                ఓ భక్తులారా!  నీవు నేను పంపించిన దేవతలకు నివేదించిన పదార్ధాలు నివేదించి పూజాపూర్వక ఉద్యాపన చేసిన వారికి సమస్త దేవతల అనుగ్రహం కలిగి కాఠిన్యము తొలగి పటుత్వంగా రూపొంది సమస్త సిరులు సమస్త భోగాలు కలుగుతాయని పార్వతి వచ్చింది. 
ఉద్యాపన:  కొద్ది కొద్దిగా నవ ప్రసాదాలను చేయాలి.  పార్వతీదేవిని ఆరాధించాలి ప్రసాదాలను నంది తదితరులకు నివేదించాలి.  అయిదు మానికల బియ్యం అత్తెసరుగా వండి ఇదుమూరాల అన్గావస్త్రముతో మూటగట్టి వెండితో చేసిన నందికి నివేదించి అత్తెసరును బంధువులకు వడ్డించాలి. దక్షిణ తామ్బూలాడులతో ఒక సద్బ్రామ్హమనులకు స్వయం పాకం ఇవ్వాలి.

సోమవారం, డిసెంబర్ 31, 2012

మారేడుదళాల నోము


          పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు.  రాజపీనుగు తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను పంపాడు.  ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ అంగీకరించలేదు.  
           ధనాశ పరులైన ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎట్టు ధనం పుచ్చుకుని పంపించుటకు అంగీకరించినది.  ఆమె కోరిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు పిల్లను తీసుకుని వెళ్ళారు.  అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కటి స్మాశానానికి తీసుకుని వెళ్ళుతున్నారు.  ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది.  ఆ వర్షంలో చెకటిలో ముందుకు పోలేక శవాన్ని శివాలంముండు దింపి వారంతా తప్పుకుని వెళ్ళారు.  ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలకు వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది.  కరునామయులైన ఆ దంపతులు ఆమెను ఆగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు.  మారేడు దళం నోచుకోవలసినదని చెప్పారు  ఆ ఆది దంపతులు ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దలముల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు వేసింది.  రాకుమారుడు నిద్రమేల్కొన్న్ట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు.  జరిగిన విషయాన్ని యావత్తు ఆమె వల్ల విన్నాడు.  
          ఇంతలో తెల్ల వారుతుండగా రాజు తాలూకు జనులు శవాదాహన సంస్కారం చేయడానికి వచ్చారు బ్రతికి వున్న రాకుమారుడిని చూసి ఆశ్చర్య పడ్డారు.  వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు.  రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి వివాహం చేసారు.  
ఉద్యాపన:  మారేడు దలములను వెండితోను బంగారముతోను చేయించి మారేడు దలములను మూడింటిని కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయ వలెను. 

శనివారం, డిసెంబర్ 29, 2012

బచ్చలిగౌరి నోము


          పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది.  ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు.  ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు చేసింది.  చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది.  కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు.  ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది.  భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది,   నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది.  అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది.  ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా వున్నారు.   ఉద్యాపన:  శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి. 

శుక్రవారం, డిసెంబర్ 28, 2012

చిత్రగుప్తుని నోము


           పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి  భార్య ఎంతో అన్యోన్యంగా వుండేవారు.  ఇరువురూ కలిసి నోములు నోచుకుంటూ వుండేవారు.  రాజు భార్య మాత్రం చిత్ర గుప్తుని నోము మరచి పోయింది.  మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది.  కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు.  చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగాచేసాడు.  రాజు భార్య చిత్ర గుప్తుడిని తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది.  నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను.  ఎండువాళ్ళ ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది.  అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ ఓ తరునీమనీ! నువ్వు మంత్రి భార్య తోపాటు అన్ని నోములను నోచినాను ఒక్క చిత్ర గుప్తుని నోమును మరచిటివి ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్పాడు. అప్పుడామే చిత్ర గుప్తా నీ మాత నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరచినాను.  నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వచ్చెదనని బ్రతిమిలాడెను.  అందుకా చిత్రగుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు  పంపించెను.  భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్ర గుప్తుని వద్దకు వచ్చెను.  అందుకా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తి నిచ్చెను.   ఉద్యాపన:  ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను.  అనంతరం ఉద్యాపన చేసుకోవలెను.  ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను.  ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను.  అడ్డెడు తవ్వాడు (2-1/2)  బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను. 

గురువారం, డిసెంబర్ 27, 2012

కన్నె తులసి నోము

       పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది.  అందకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు.  చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది.  పిల్లను పంపించమని అడిగింది.  వారు అంగీకరించలేదు.  వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.  
              ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది.  తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది.  ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా!  గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల  నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది.  కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది.  ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది.  నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది.  
ఉద్యాపన:  తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి.  ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి. 

మంగళవారం, డిసెంబర్ 25, 2012

పసుపుగౌరి నోము కథ


            పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది.  పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు  అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది.  ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది.  ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు.  తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు.  తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు.  ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది.  రాను రాను అతనికి మరణ భయం పెరిగింది.  యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి.  పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.  
             ఒకనాడు భర్త భయాందోళనలతో  సొమ్మసిల్లి పడిపోయాడు.  కదలికలేని భర్తపై బడి తల్లీ!  మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్.  అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా  కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు.  నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు  .  ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది.  లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు.  తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి.  అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది  నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు .   అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది.  నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది.  ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి.  ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి. 

సోమవారం, డిసెంబర్ 24, 2012

పదహారు ఫలాల నోము


         పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు.  రాజు భార్యకు గుణ హీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు.  మంత్రి భార్యకు రత్నమానిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు.  ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది.  మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా!  నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము.  మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది.  
            అందుకా మంత్రి  భార్య బాగా ఆలోచించి రాని గారికి ఈ విధంగా చెప్పింది.  మహారాణి!  మీరు వ్రాతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నోలివచేసినారు.  వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడిన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచి పెట్టారు.  అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిని సంతానం కుంతీ, గుడ్డి, గునహీనులు అయ్యారు.  మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిది, కనుక మీరు మరలా  పదహారు ఫలాల నోమును నోయండి.  చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తామ్బూలాడులతో వాయనమివ్వండి అని చెప్పింది.
           రాని మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది.  అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది.  అందుకా రాని ఎతగానో ఆనందించింది.  
ఉద్యాపన:  పరిశుబ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి.  ఒక్కొక్క పండును, పువ్వులను దక్షిణ తామ్బూలాలను  ముత్తైదువునకు  ఇవ్వాలి.   తదుపరి సంతర్పణం చెయ్యాలి.

ఆదివారం, డిసెంబర్ 23, 2012

కైలాసగౌరి నోము


       పూర్వము ఒక రాజ్యములో మహారాజు తన కుమార్తెను అతి గారాబముగా పెంచి పెద్ద దానిని చేశాడు.  యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని    వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.  రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది.  ఆమె భర్త వేశ్యాలోలుడు.  భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త  అనురాగానికి దూరమై  ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది.  మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు.  తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసినదిగా పరమేశ్వరరుడిని ప్రార్ధించేవాడు.  ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.  


             ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది.  నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు అని చెప్పింది.  ఆ ప్రకారం రాకు కూతురు కైలాస గౌరీ నోము నోచింది.  అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి.  ఉంపుడు గత్తెల  కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది.  భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది.  ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్తే యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది.  వారిని చూచినా వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.  
ఉద్యాపన:  పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు  పొందాలి.

శనివారం, డిసెంబర్ 22, 2012

చిట్టిబొట్టు నోము


             పూర్వకాలములో ఒకానొక పదాతి ఇరుగుపొరుగు వారితో చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుండేది.    ఏ ఒక్కరితోను మంచిగా వుండేది కాదు అందరితోను విరోధంగా వుండేది.  ఆమెకు ఎవరు చెప్పారో  ఎలా ఉద్దేశం కలిగిందో చిట్టి బొట్టు నోము నోచింది నోము నియమానుసారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  అందుకుగాను పిలవబడే పెరంటాళ్ళతో    ఏ ఒక్కరితోను ఆమెకు పొట్టు కించిత్తు కూడా లేదు.  ఎలాగైతేనేం నలుగురికి బొట్టు పెట్టింది.  అయిదవ ఆమెకు బొట్టు పెట్టబోయే సమయంలో ఆమెలోని జగడపు బుద్ది ప్రజ్వరిల్లింది.  ఆమెకు బొట్టు పెట్టకుండా కసిరి కొట్టింది.  ఆవేశం ఆపుకోలేక తన బొట్టు తుదచేసుకుంది.  ఆ విధముగా చిట్టి బొట్టు నోముకు ఉల్లంఘన జరిగింది.  
             మరుజన్మలో ఒక బ్రాహ్మణుని ఇంట జన్మించింది.  ఆ దంపతులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.  కాని ఆ బిడ్డ ముఖాన బొట్టు నిలిచేది కాదు.  యెంత ప్రయత్నించిన ఎలా ప్రయత్నించినా ఎన్నిసార్లు  పెట్టినా ఆబిడ్డ నుదుట బొట్టు నిలిచేది కాదు.  ఈ వైపరీత్యానికి ఆ దంపతులు ఎంతగానో బాధపడుతున్దేవారు.  ఒకనాడు ఆ గ్రామానికి వచ్చిన త్రికాలజ్ఞానియైన ఒక యోగిని దర్శించి ఆ దంపతులు తమ బిడ్డలా విషయం చెప్పి వైధవ్య ప్రాప్తి ఉన్నదేమో అన్న భయాందోళనలను విన్న వించుకొని తరుణోపాయం చెప్పవలసినదని ప్రార్ధించారు.  అంతట ఆ యోగి తన మనోనేత్రంతో విషయాని గ్రహించి దంపతుల్లారా విచారించకండి.  గత జన్మలో మీ బిడ్డ పరమ గయ్యాళి ఎవరితోనూ సానిగా పొందక వుద్న్డేది కాదు.  అందరితోను గొడవలు పెట్టుకునేది.  ఈ గొడవలు మాని చిట్టి బొట్టు నోమును నోచి పేరంటాల్లకు బొట్టు పెట్టడంలో ఒక ముత్తిడువను వదిలివేయదమేగాక తన బొట్టును కూడా చేరుపుకుంది.  ఆ కారణంగా ఆమెకు నుదుట బొట్టు నిలవడంలేదు.  మీరామె చేత చిట్టి బొట్టు నోము నోయించండి పరిస్థితి చక్కబడుతుందని వైదవ్య ప్రమాదం తప్పుతుందని చెప్పారు.  
             ఆ ప్రకారం ఆ దంపతులు తమ బిడ్డ చేత చిట్టి బొట్టు నోమును నోయించారు.  బొట్టురాలిపదకుండా నుదుట యందు అమరుకున్నది.  గుణవంతుడు, రూపవంతుడైన యువకునితో ఆమెకు వివాహం జరిగింది.  ఈ నోము నోచుకున్న వారి బొట్టు చెదరక మంచి దాంపత్య సౌభాగ్యం కలుగుతుంది.  
ఉద్యాపన:  సంవత్సరకాలంపాటు వారం వారం అయిదుగురు పేరంటాల్లకు బొట్టు పెట్టాలి.  వారిచే అక్షింతలు శిరస్సున జల్లించుకుని వారికి పాదాబివందనం చేసి వారి ఆశీర్వచనాలు పొందాలి.

శుక్రవారం, డిసెంబర్ 21, 2012

సౌభాగ్య గౌరీ నోము


          పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిద్దలవలె పరిపాలిస్తున్దేవారు.  ఆ రాజుగారి భార్య గౌరీ పూజలతో నిరంతరం కాలం వెళ్ళబుచ్చుతూ వుండేది.  గుణవంతులైన పుత్రులు, మురిపములోలికించే మనుమాలతో ఆ రాజ దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.  పార్వతీ పరమేశ్వర్లు ఆమె భక్తికి మెచ్చి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కలిగింది. 
           ఆ రాజుకు విరోధి అల్ప బలవంతుడైన మరొక సామంతుదాయన మీదకు దండెత్తి వచ్చేలా చేసారు.  దైవబలం జతపదినందున సామంతరాజు ఈ రాజుతో హోరాహోరి యుద్దముచేసినాడు.  ఎందరో సైనికులు వీరస్వర్గం అలంకరించినారు.  బందు కోటి మరణించారు.  ఆఖరుకు ఆ రాజు కూడా యుద్దంలో మరనిన్హినాడు.  మహారాణి కిన్చితైనబెదరక యుద్ధభూమికి వచ్చింది.  యమదూతలు విగత జీవులైన వారి ప్రాణాలను తీసుక పోతున్నారు.  
           అంత మహారాణి వారిని నిలువరిచి యమదూతలారా మీకిదేటిసాహాసం.   నా పసుపు కుంకుమలు నిలిచి ఉండేటందుకు పసుపు వాయనమిచ్చిన దానను.  మా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండగలందులకు బంగారం వాయనమిచ్చాను.  వసతి వాకిలి నిలిచేటందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను.  పొలం తోటలు వనాలు ఉండేటందుకు తోపు చీర వాయనమిచ్చినాను.  బిడ్డలా క్షేమం నిమిత్తం కుడుములు, అరిసెలు వాయనమిచ్చాను.  పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడపూలిచ్చాను.  బంధువుల బాగుకై బంతిపూలిచ్చాను.  రాజ్యం సుభిక్షంగా ఉండుటకు రత్నాలు దేశాశాంతిని కోరి చల్ల పునుకులు పాడిపంటల పెంపునకు పాయసము పేరుప్రతిష్టలు అభివృద్దికి గారెలు, ప్రాణభయము లేకుండా పానకము, కోరికలు నేరవేరుతకు కొబ్బరిబొండాలు, స్వర్గలోక ప్రాప్తికై స్వర్ణ రాశి వాయనములిచ్చాను.  అకాల మరణం కలుగాకున్డుతకు అరటిపళ్ళు వాయనమిచ్చాను.  మీరు నా భర్త ప్రాణాలు గైకొనలేదు.  నా ప్రజలను యమపురికి తరలించలేరు.  పొందు పొందు తొలగిపొండు అని పలికింది.  ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్య వాయనముల ప్రభావమునకు వెరచి యమభటులు ఉత్త చేతులతో మరలిపోయారు.  పార్వతి పరమేశ్వరులు ఆమె  ఔనత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను పరనించిన తదితరులను బ్రతికించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పిన వస్తువులను పుణ్య స్త్రీలకు వీలయినప్పుడల్లా వాయనమియ్యాలి.  అయిదుగురు ముత్తైదువులను పిలిచి గౌరీ దేవిని ఆరాధించి వారికి పసుపు, కుంకుమ రైకల గుడ్డ దక్షిణ తామ్బూలాడులతో ఒక్కొక్కరికి ఐదేసి వస్తువులు వాయనమివ్వాలి. 

గురువారం, డిసెంబర్ 20, 2012

నాగపంచమి నోము


               పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .   ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.  ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.  
              ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.  ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు.  ఆ సాదువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది.  అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది.
             అందుకా సాదు పుంగవుడు  తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించినది.  ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.   నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం.  నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.  చెవి చక్కబడుతుందని చెప్పి  ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.  ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.  
ఉద్యాపన:  శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది.  అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని  ఆరాధించాలి.  నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి.  నాడు ఉపవాసం వుండాలి.  నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...