హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

పండగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పండగలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, సెప్టెంబర్ 09, 2017

09-09-2017 శనివారం

09-09-2017, శనివారం,
09 ఆగష్టు 2017, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.48 నిమి||
భాద్రపద బహుళ చవితికి విఘ్నరాజ సంకష్టహర చతుర్థి అని పేరు. విఘ్నాలను కలిగించేవాడు, తొలగించేవాడు విఘ్నరాజు. విఘ్నాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. మాయను ఆధీనంలో ఉంచుకున్న పరంబ్రహ్మమే విఘ్నరాజ గణపతి. ఓం శ్రీ విష్ణవే విఘ్నరాజాయ నమః
 భాద్రపద బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ
ఓం గం గణపతయే నమః
సంకష్టహరచవితి వ్రత విధానం :
సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి, #సంకష్టహర_చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. #గణపతి కి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకష్టహరవ్రతం అంటారు.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే తదియతో కూడిన చవితినే సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.
ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. (సేకరణ : శ్రీ శైల ప్రభ కొంత సవరణలతో )
ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, ఉపవాసం చేసి, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది.
ఉపవాసం కూడా చేయలేనివారు, కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి శనివారం వచ్చింది.)

సోమవారం, జనవరి 26, 2015

రథసప్తమి


మాఘప్రశస్తి:
మా+అఘ=పాపంలేనిది - పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా - రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్  - ఆరోగ్య ప్రదాతగా  శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ  శ్రద్ధ లతో  పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం. 

చదుకొవలిసిన స్తోత్రాలు
ఆదిత్యహృదయం,  సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం  తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం.

మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి  సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానంచేయాలి.
సప్తమి రోజు ఉదయాన్నే  ఇంటి దగరె స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా , విపిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు. నది స్నానకి వెళ్ళే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్త గా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీలలొ తేలుకుంటూ ముందుకు సాగి వెల్లెలాగ సూర్యోదయ సమయాన స్నానం చేయాలి.

ఏటా మాఘశుద్ధ సప్తమినాడు తలమీదా, భుజాల మీదా , మోచేతి మడతల మీద , అరచేతుల్లోనూ ( మొత్తం ఏడు) జిల్లేడు ఆకులను తలపైన ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము (ఆకు తలపై ఉంచుకుని దానిపై రేగిపండు పెట్టి తల స్నానం చేస్తూ కింది శ్లోకాన్ని చదువుకోవాలి) .

రధసప్తమినాటి శిరస్నానం వేళ పఠించవలసిన మంత్ర శ్లోకం

యదా జన్మకృతం పాపం మయాజన్మసు జన్మసు,
తన్మీరోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.

ఏతజ్ఞన్మకృతం పాపం యచ్చ జనమంతరార్జితం,
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతేచ యే పునః

సప్తవిధం పాపం స్నానామ్నే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి.


జనమ జన్మాంతారాలో, మనోవాక్కాయాలతో, తెలిసీ, తెలియక చేసిన సప్తవిధ పాపాలవల్ల ఏర్పడిన రోగం, శోకం, మున్నగునవన్నీ ఓ లక్ష్మీకరమైన  మకర రాశిలోని సప్తమి ఈ స్నానంతో నశించుగాక! అని దీనర్ధం.  అన్నట్టు ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడుస్తారు. ఈ రోజు ఆకాశం లో నక్షత్ర కూటమి రధం ఆకారం లో ఉంటుంది.

రోగ నివారణ /సంతాన ప్రాప్తి కోసం - రధ సప్తమి వ్రత విధానం
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని (7 గుర్రాలు) నడుపుతున్న  బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని  ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా గ ఉండాలి . సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవాలి .

వ్రత కధ
పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథ సప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు కృష్ణుడు వ్రత కధతో సహా వ్రత విధానాన్ని వివరించాడు.

పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధ పడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయే సరికి క్రాంతధర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియచేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుడిని చూసి ఆ బిడ్డ గత జన్మనంతటినీ అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైనా ఎవరికీ కద్దిపాటి దానం కూడా చేయలేదు. అయితే అతడు జీవితం చివరిదశలొ ఒకసారి ఎవరో చేస్తూ వున్న రథ సప్తమి వ్రతాన్ని చూసాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించినా నిరంతరం రోగగ్రస్తుడై ఉంటున్నాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్ధితి నుండి బయట పడటానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రధ సప్తమీ వ్రతాన్ని శాస్త్ర విధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు.


సాయంకాలం వరకూ ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది, సరోవర తీరాలలో చెయ్యడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దానధర్మాలు, వ్రతపారాయణ అనంతరం రధాన్ని, సూర్యప్రతిమను ఉత్తములూ, అర్హులూ అయిన వారికి దానమివ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి, పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రధం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రధాన్ని చేయడం కనిపిస్తుంది.

ఇంటి దగ్గర పూజ , నివేదన
ఈ రోజున సూర్యుణ్ణి పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగ  ప్రదేశాన్ని గోమయం తో  (ఆవు పేడ)  సుద్ధి చేసి  గోమయం తో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా  ఒక దాని పై ఒకటి అమర్చి వెలిగించి, ఆ పిడకల పొయ్యిమీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి, పాలు పొంగు వస్తున్న తరుణంలో కొత్త బియ్యం, బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధం గా చెక్ర పొంగలి వండుతారు.  ఈ  పరమానాని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం  చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు.  వితరణ కూడా చిక్కుడు అకులోనే చేస్తారు.


పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధి కి  సంకేతం. ఇంకో విషయం  ఈ పర్వదినాన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు కాయల్ని వాడి  కొబ్బరి  ఆకు పుల్లల సహాయంతో రథంగా చేసి  సూర్యదేవుని రధంగా దానిని భావించి పూజ చేయాలి . (బంగారం తో అంటే ఈ కాలంలో కష్టం కదా .. )

రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని ఆ రోజు ఉపవాసముండి, సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుత భారతీయతకు చిహ్నము.

సప్త…. అంటే ఏడు కి చాలా విశిష్టత ఆకాశం లో ఇంద్రధనుస్సు రంగులు ఏడు, సూర్యభగవానుడి రధానికి అశ్వాలు ఏడు, సంగీతాలు స్వరాలు ఏడూ(సప్త స్వరాలు), మనకి సప్త వారాలు,( ఏడు రోజులు)సప్త ద్వీపాలు, సప్త ఋషులు,సప్త గిరులు సంగతి తెలిసిందే( ఏడు కొండలవాడు),సప్త సముద్రాలు, సప్త లోకాలు,అలాగే సూర్యభగవానుడి కిరణాల్లో మొదటి ఎడు ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ ఏడింటి పేర్లు తెలుసునా!

మొదటి కిరణం- సుషుమ్నం                             రెండవ కిరణం- హరి కేశు
మూడవ కిరణం- విశ్వ కర్మ                              నాల్గవ కిరణం- విశ్వ వ్యచ
ఐదవ కిరణం- సంపద్వసు                                ఆరవ కిరణం- అర్వాదము
                                  ఏడవ కిరణం- స్వరాడ్వసు


శ్రీ సూర్యనారాయణుడు

శ్రీ సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం. సూర్యుడు ఏకచక్ర రథారూఢుడు. ఈ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి ఆరు ఆకులు. రథానికి ఏడు అశ్వాలు. చక్రం సంవత్సరానికి ప్రతీక. ఆకులు ఆరు ఋతువులు. ఏడు అశ్వాలు ఏడు కిరణాలు. సుషుమ్నము, హరికేశము, విశ్వకర్మ, విశ్వవచన, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాడ్వసులనబడే సహస్ర కిరణాలతో ప్రకాశించే ఈ సప్త కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడుతాయి. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపంగా, ప్రకృతిలో జీవాన్ని నింపి, మహేశ్వరునిగా మధ్యాహ్నం తన కిరణాల ద్వారా సృష్టియొక్క దైవిక వికారాలను రూపు మాపి, సాయంకాలం విష్ణురూపంగా భాసిల్లే తన కిరణాల వెలుగును మనోరంజకంగా ప్రసరింపజేస్తూ ఆనందాన్ని కలిగించే ద్వాదశ రూపుడు.
ధాతా, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్, పుషా, పర్జన్య, అంశుమాన్, భగ, త్వష్టా, విష్ణువు అనే ఈ పన్నెండు మంది సూర్యులు సమస్త జీవజాలానికి సృష్టి విధానానికి ఆధారభూతులవుతున్నారని, ఈ పన్నెండు నామాలు స్మరిస్తే, దీర్ఘ రోగాలు నయమవుతాయని, దారిద్య్రం పోతుందని భవిష్య పురాణంలో పేర్కొనబడింది.
రథసప్తమి
సౌరమానం, చాంద్రమానం, బార్హ స్పత్సమానం మొదలైనవి కాలగమన విధానంలో ప్రసిద్ధమైనవి. సౌరమాన ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమినాడు వచ్చే ‘రథసప్తమి’ని సూర్యవ్రతం అని పిలుస్తారు. మాఘమాసంలో ‘శుద్ద సప్తమి’, ‘సూర్యసప్తమి’, ‘అచలాసప్తమి’, ‘మహాసప్తమి’, ‘సప్తసప్తి సప్తమి’ అనీ… ఇలా ఎన్నో పేర్లతో పిలువబడే సూర్యారాధనకు, సూర్యవ్రతానికి విశిష్టమైన పర్వదినంగా భావిస్తున్న రోజు ‘రథసప్తమి’ దినంగా ‘సూర్యజయంతి’గా కూడా జరుపుకోవడం మన సంప్రదాయం.
ఈ సప్తమినాడు సూర్యోదయాన ఆకాశంలోని నక్షత్ర సముదాయం రథాకారాన్ని పోలి ఉండడం చేత ‘రథసప్తమి’ అని అంటారు. సూర్యుడు మాఘశుక్ల పక్షం అశ్వనీ నక్షత్రయుక్త ఆదివారం, సప్తమి తిథిన దక్ష ప్రజాపతి పుత్రికయైన అదితి, కశ్యప మహర్షికి ‘వివస్వంతుడు’ అనే పేరున జన్మించాడు. అదితి, కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుడని, కశ్యపుడని వ్యవహరిస్తారు.
విశ్వకర్మ కుమార్తె సంజ్ఞ సూర్యునికి భార్య. ఈమె యందు సూర్యునికి వైవస్వత మనువు, యమున, యముడు అనే కవలలు జన్మించారు. సంజ్ఞ తనకు మారుగా ఛాయను సృజించి, కొంత కాలము భర్తకు దూరంగా ఉన్నసమయంలో సూర్యుడు ఆ ఛాయనే సంజ్ఞగా భావించడం చేత ఆమె వల్ల సూర్యునికి శనైశ్చరుడు జన్మించాడు.

పూజ-స్నాన విధులు
శ్లో || సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ |
అరుణోదయవేళాయాం స్నానం తత్ర మమాలమ్ ||
మాఙే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యదా |
కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్య సంపద: ||
షష్ఠి నాడు రాత్రి ఉపవసించి సప్తమినాడు అరుణోదయమున స్నానమాచరించినట్లైతే ఏడు జన్మల పాపము తొలగిపోవునని, రోగశోకములు నశించుననియు, ఏడు విధములైన పాపములు పోతాయని విశ్వాసం. ప్రాతఃకాలములోనే స్నానమాచరించి సూర్యుని ధ్యానిస్తూ రాగి, వెండి, మట్టి ప్రమిదలలో, దేనిలోనైనా నువ్వుల నూనె పోసి దీపారాధన చేసి, దీపజ్యోతులను తలపై పెట్టుకుని నదీ జలాల్లో గానీ, మనకు దగ్గరగా కాలువలో పారే జలాల్లోగానీ తటాకాదులకు గాని, వెళ్లి సూర్యుని ధ్యానించి, ఆ దీపమును నీటిలో వదిలి, ఎవ్వరును నీటిని తాకకముందే స్నానము చేయాలి. స్నానము చేసేటప్పుడు ఏడు జిల్లేడుఆకులు గానీ, ఏడు రేగాకులుగాని తలపై ఉంచుకుని..
శ్రో|| జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే,
సప్తవ్యాహృతికే దేవి ! సమస్తే సూర్యమాతృకే ||
అనే మంత్రంతో స్నానం చేయాలి.
“సప్తాశ్యములు గల ఓ సప్తమీ ! నీవు సకల భూతములకును, లోకములకును జననివి. సూర్యునికి తల్లినైన నీకు నమస్కారము. అని ఈ మంత్రమునకు అర్థం.
సూర్యునకు అర్ఘ్యమిచ్చి పూజించి-అటుపైన పితృతర్పణము చేయాలి. పితృతర్పణము చేసేటప్పుడు తామ్రపాత్రముగాని, మట్టిపాత్రముగాని చిమ్మిలి వంటి పదార్థమును చేసిపెట్టి, దానిని ఎర్రగుడ్డతో కప్పి గంధపుష్పాక్షతలతో పూజించి, బ్రాహ్మణులకు దానమివ్వాలి.
సర్వదేవతామయుడు, సర్వవేదమూర్తి సూర్య భగవానుని ఈ రోజుల్లో ఆరాధించడం ఆరోగ్యాన్ని-ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ మాసమంతా నియమంగా సూర్యుని ఆరాధిస్తూ.. “ఆదిత్య హృదయం” వంటివి పారాయణం చేయడం మంచిది. ప్రతి ఆదివారం ఉదయాన్నే శుచిగా క్షీరాన్నం (పాయసాన్నం) వండి సూర్యునికి అర్చించాలి. ఆ రోజు తరిగిన కూరల్ని తినరాదు. (కత్తి తగలని పదార్థాలను తినవచ్చు).
విశేషాంశాలు
“భా” అంటే సూర్యకాంతి, “రతి” అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. “భారతీ” అంటే వేదమాత. వేదమాత నారాధించువారును భారతీయులే. మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆరోజు అరుణోదయవేళ స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును.
సప్తమినాడు షష్ఠి తిథి గూడయున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నా నము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.

నైవేద్యం
బెల్లం పాయసం
కావలసిన పదార్థాలు:
  1. బియ్యం – ఒకకప్పు
  2. బెల్లం – 2 కప్పులు
  3. యాలుకుల పొడి
  4. తురిమిన కొబ్బరి – ఒకకప్పు
  5. నెయ్యి – 1టీస్పూన్
  6. జీడిపప్పు
  7. కిస్ మిస్
  8. పాలు – 3 కప్పులు
తయారు చేయు విధానము:
  1. మొట్టమొదటబియ్యని బాగా కడిగి అన్నంగా వండాలి.
  2. ఒక పాత్రలో నెయ్యి వేసి దానిలో జీడిపప్పు,కిస్ మిస్ వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి.
  3. పాలును తీసుకొని కాగబెట్టాలి.దానిలో ఒకకప్పు పాలు తీసి వేరుగా ఉంచండి.
  4. ఇప్పుడు 2 కప్పుల పాలను అన్నం లో పోసి ఒక 2 నిమిశాల పాటు తక్కువ మంట ఉంచి వేడి చేయాలి.
  5. తరువాత ఆ మిశ్రమానికి కొబ్బరి మరియు బెల్లాన్ని వేసి బాగా కలియబెట్టాలి.బాగా బెల్లం కరిగేంతవరకూ వేడి చేయాలి.
  6. తరువాత మంట ఆపివేసి దానిలో యాలుకుల పొడి వేసి దానిలో మిగిలిన ఒకకప్పు పాలు పోయాలి.
  7. తరువాత వేయించిన జీడిపప్పును మరియు కిస్ మిస్ ను దానిలో వేసి కలపాలి.
శ్రీ పసుపు గణపతి పూజ
లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం
కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్
(గంటను మ్రోగించవలెను)
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః
యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః
ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //
శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః
వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః
అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః
నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు
ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //
(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ప్రాణాయామము
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సమస్త దురితోపశమనార్థం శ్రీ సదాశివ స్వామిదేవతా దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
కలశారాధనం
శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)
శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య
(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి
(నీళ్ళు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి
(గంధం చల్లవలెను)
శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు చల్లవలెను)
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.
మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి
(అగరవత్తుల ధుపం చూపించవలెను.)
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.
(బెల్లం ముక్కను నివేదన చేయాలి)
ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా
ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
(నీరు వదలాలి.)
తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.
(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)
ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్
శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు
(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.
శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.
(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)
షోడశోపచార పూజ
ధ్యానం:
ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి లేకున్నను, క్రియాశూన్యమయినను, నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము.
(పుష్పము చేతపట్టుకొని)
ఆవాహనం:
ఓం ఆదిత్యాయ నమః ఆవాహయామి /
ఆసనం:
ఓం ఆదిత్యాయ నమః పుష్పం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)
పాద్యం:
ఓం ఆదిత్యాయ నమః పాద్యం సమర్పయామి.
(ఉదకమును విడవవలెను.)
అర్ఘ్యం:
ఓం ఆదిత్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
ఆచమనం:
ఓం ఆదిత్యాయ నమః ఆచమనీయం సమర్పయామి.
(ఉదకమును విడువవలెను.)
స్నానం :
ఓం ఆదిత్యాయ నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
(నీరు చల్లవలెను.)
పంచామృతస్నానం
ఓం ఆదిత్యాయ నమః క్షీరేణ స్నాపయామి .
(స్వామికి పాలతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః దధ్యా స్నాపయామి .
(స్వామికి పెరుగుతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః అజ్యేన్న స్నాపయామి.
(స్వామికి నెయ్యితో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః / మధునా స్నాపయామి
(స్వామికి తేనెతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః! శర్కరాన్ స్నపయామి.
(స్వామికి పంచదారతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః – ఫలోదకేన స్నాపయామి
(స్వామికి కొబ్బరినీళ్ళుతో స్నానము చేయవలెను)
ఓం ఆదిత్యాయ నమః – శుద్ధోదకస్నానం సమర్పయామి.
(స్వామికి నీళ్ళుతో స్నానము చేయవలెను)
వస్త్రం:
ఓం ఆదిత్యాయ నమః – వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం:
ఓం ఆదిత్యాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం:
ఓం ఆదిత్యాయ నమః గంధం విలేపయామి.
(గంధం చల్లవలెను.)
అక్షతలు
ఓం ఆదిత్యాయ నమః అక్షతాన్ సమర్పయామి.
(అక్షతలు సమర్పించవలెను)
అథాంగపూజ:
ఓం ఆదిత్యాయ నమః – పాదౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – జంఘే పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – జానునీ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ఊరుం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – గుహ్యం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – కటిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – నాభిం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ఉదరం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – హృదయం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – హస్తౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – భుజౌ పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – కంఠం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – ముఖం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – నేత్రాణి పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – లలాటం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – శిరః పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – మౌళీం పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి.
ఓం ఆదిత్యాయ నమః – అథాంగ పూజయామి.
ధూపం:
ఓం ఆదిత్యాయ నమః – ధూపమాఘ్రాపయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
దీపం:
ఓం ఆదిత్యాయ నమః దీపం దర్శయామి.
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
నైవేద్యం:
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)
ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి
(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)
(ఎడమచేతితో గంటను వాయించవలెను)
ఓం ప్రాణాయస్వాహా – ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రఃప్రచోదయాత్
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి – ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి – పాదౌ ప్రక్షాళయామి – శుద్దాచమనీయం సమర్పయామి.
తాంబూలం:
తాంబూలం చర్వణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి.
ఓం ఆదిత్యాయ నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం:
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)
ఓం ఆదిత్యాయ నమః నీరాజనం సమర్పయామి.
అనంతరం ఆచమనీయం సమర్పయామి.
ఆత్మప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ఆత్మప్రదక్షిణం చేయవలెను)
యానికానిచ పాపాని జన్మాంతరకృతాని చ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే.
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః,
త్రాహి మాం కృపయా దేవ శరణా గతవత్సల.
శ్రీ ఆదిత్యాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
అర్పణం::
శ్లో // యస్యస్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందేతమీశ్వరం //
మంత్రహీనం క్రియాహీనమ్ భక్తహీనం మహేశ్వర
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే //
సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు
శ్రీ ఆదిత్యాయ ప్రసాదం శిరసా గృహ్ణామి //
(పుష్పాదులు శిరస్సున ధరించవలెను.)
తీర్థస్వీకరణం:
శ్లో // అకాలమృత్యుహరణం – సర్వవ్యాధి నివారణం
సమస్త పాపక్షయకరం – ఆదిత్యాయ పాదోదకం పావనం శుభం //
(అనుచు స్వామి పాద తీర్థమును పుచ్చుకొనవలెను.)
శుభం భూయాత్ ..
పూజా విధానము సంపూర్ణం.

రథసప్తమీ వ్రతకథ

యధిష్ఠిరుడు కృష్ణుని అడిగెను.
” ఓ కృష్ణా ! రధసప్తమినాడు జేయవలసిన విధివిధానము ననుసరించి, భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పియుంటివి. అట్లు యెవ్వరికైననూ ప్రాప్తించినదా ? ” అనాగా, కృష్ణుడిట్లు జవాబిచ్చెను.
కాంభోజదేశమున యశోవర్తియను చక్రవర్తి యుండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరు సర్వరోగముల చేత బాధపడుచున్న వారైరి అట్టి కర్మపరిపాకముయెందు వలన గల్గెనోతెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుని అడిగెను. అట్లడిగిన రాజుతో ” ఓరాజా! వీరు వీరి పూర్వజన్మలో వైశ్యకులమున జన్మించ మిక్కిలి లోభులైయుండిరి. అందుచేత వీరిట్టి రోవములకు గురికావలసిన వారైరి వారి రోగనివారణకు రధసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. అ విధముగా నావ్రతము చూచినంత మాత్రమున దాని మాహాత్మ్యముచేవారి పాపములు పోవును. కాన, వ్యాదితో బాధపడువారిని గొని వచ్చి ఆ వ్రతవైభవము వారికి చూపవలెను. అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు అయ్యా! ఆ వ్రతమెట్లు చేయవలెనో దాని విధివిధానమును తెలుపు” డని ప్రార్ధించెను.
అందులకా బ్రాహ్మణుడు ‘ ఓరాజా ! ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆరధసప్తమి’ అని పేరుగల వ్రతము సర్వులూ ఆచరించదగినది ఆ వ్రత ప్రభావమున సకల పాపమూలూ హరించి. చక్రవర్తిత్వము గల్గును. ఆ వ్రతవిధానమును తెలుపుచున్నాను శ్రద్ధగా వినుము.
మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠి తిధి దినమున గృహన్తు యీ వ్రతమాచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలోగాని, చెరువునందు గాని, నూతియందుగాని తెల్లని నువ్వులతో విధివిధానముగా స్నానమాచరించవలెను. ఇలవేలుపులకు , కులదేవతలకు, యిష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్యదేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షితలతో శుభప్రాప్తికొరకు పూజించవలెను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి, అతిధులతో సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములు ఆరగించవలెను. ఆదినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆరాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి, సూర్యభగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి, సప్తమి తిధి రోజున నిరాహారుడై, భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము ” ఓ జగన్నాధుడా ! నేను చేయబోవు ఈ రథసప్తమీ వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను ” అని వుచ్చరించుచు, తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు, తాను, గృహమున నేలపైనా రాతి శయనించి జితేంద్రియుడై ఉండి , ఉదయమున లేచి నిత్యకృత్యములాచరించి శుచియై ఉండవవలెను. ఒక దివ్యమైన సూర్యర్ధాన్ని దివ్యమాలికల్తోను, చిరుగంటలతోను, సర్వోపచారాలతోను తయారు చేసి సర్వాంగములును రత్నాలు, మణులుతో అలంకరించవలెను. బంగారుతోగాని, వెండితోగాని, గుర్రాలను, రధసారధినీ, రధమునూ తయారు చేసి మధ్యాహ్నవేళ స్నానాదికములచు నిర్విర్తించుకొనవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి – ప్రాజ్ఞులు సౌరసూక్తపారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను.
పిమ్మట తననిత్యకృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండప మధ్యభాగమున రధమును స్థాపించవలెను. కుంకుమతోను, సుగంధద్రవ్యములతోను, పుష్పములతోను పూజించి రధమును పుష్పములతోను, దీపములతోను అలంకరించవలెను. అగరుధూపములుంచవలెను. రధమధ్యముననున్న సూర్యుని సర్వ సంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభియై ధనమును ఖర్చు చేయుటకు మనస్సంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దానిఅవలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రధాన్నీ, రధసారధిని అందుగల సూర్యభగవానునీ పుష్ప, ధూప, గంధ, వస్త్రాలు అలంకారాలు భూషణాలు నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి యీ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను.
ఓ భాస్కరా ! దివాకరా ! ఆదిత్యా ! మార్తాండా ! గ్రహాధిపాఅపారనిధే ! జగద్రక్షకా ! భూతభవనా ! భూతేశా ! భాస్కరా ! ఆర్తత్రాణ పరాయణా హరా ! అంచిత్యా విశ్వసంచారా ! హేవిష్ణో ! ఆదిభూతేశా ! ఆదిమధ్యాస్త భాస్కరా ! ఓ జగత్ప్రతే ! భక్తి లేకున్నను, క్రియాశూన్యమయినను, నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము ” పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్దించవలెను. ధనహీనుడయినను, విధిప్రకారము అన్ని కార్యములు చేయవలెను. రధము సారధి, గుర్రములు వివిధరకాల రంగులతో లిఖించిన బొమ్మలు Yఎదయిన జిల్లేడుప్రతిమలతో సూర్యభగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధివిధానముగా పూజించవలెను. ఆరాత్రి జాగరణ చేసి, పురాణ శ్రావణ మంగళగీతాలతో మంగళవాయుధ్యాలతో పుణ్యకదలను వినవలెను. పిమ్మట రదయాత్రకు బయలెదేరి సూర్య్ని మనస్సున ధ్యానమణేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతఃకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి, వివిధ రత్నభూషణములతో ధాన్యాదులతో, వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును. అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యధాశక్తి దానము నీయవలెను. ఈ రధమును తమ పురోహితులయిన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆవిధంగా చెసినచో యెందుకు జగత్పతిగాకుండును ? కాన, సర్వయత్నముల చేత రధసప్తమి వ్రతమాచరించవలెను దానివల భాస్కరానుగ్రహము గల్గి మహాతేజులు, బలపరాక్రమవంతులు అయి విపుల భోగములననుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసికొందురు. ఈ రధసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రాదులను బడసి చివరగా సూర్యలోకము చేరును, అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవి ననుభవించును.”
కృష్ణుడు చెప్పుచున్నాడు :
ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వవిషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడుపదేశించినరీతిగా ఆచరించి సమస్తసౌఖ్యముల ననుభవించెను. ఈ విధముగా ఆ రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కధను భక్తితో యెవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును ఈ విధముగా బంగారుతో చేయబడిన సారధి గుర్రాలతో గూడుకొనిన శ్రేష్ఠరధమును మాఘమాస సప్తమిరోజున యెవరు దానము చేయ్దురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు.
ఇతి రధసప్తమీ వ్రతకధ సంపూర్ణం.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...