హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, ఏప్రిల్ 14, 2015

పోలి స్వర్గమునకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. ఆ మాటలను విని చాకలి, దాని ముగ్గురు కోడండ్లు పైకి చూచిరి. అంతలో పోలియెక్కిన విమానము వారి నెత్తి మీదనుండి పోవుచుండెను. వారు వెంటనే పోలికాళ్ళు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండిరి. అదిచూచి విష్ణుదేవుడు "ఈ పోలి అధిక భక్తితో జ్యోతివెలిగించినది. కాని మీరు కల్మష హృదయముతో అశ్రద్ధగా జ్యోతులు వెలిగించిరి. కావున మీకు స్వర్గమునకువచ్చు నదృష్టము లేదు పొండు" అని త్రోసి వేసి పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను.

దీనికి వుద్యాపనము లేదు.
పదహారురకముల పండ్లను యెంచుకొని పిమ్మట నొక్కొక్కజాతి ఫలమును యేరి, ముత్తయిదువులకు పంచి పెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలెను.

గురువారం, జనవరి 08, 2015

సంకష్టహరచవితి‬ వ్రత విధానం

8-01-2015, గురువారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.

‪‎సంకష్టహరచవితి‬ వ్రత విధానం :
సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.
ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు,  సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.

(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి గురువారం వచ్చింది.)









 సంకటహర గణపతి స్తోత్రం

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః

సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.


ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్‌ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్‌ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్‌ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.




సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం
భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ఈ ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు.
పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...
ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.
దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.
''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు.
''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.
''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు.
వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది.
దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు.
ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు.
''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు.
అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.
''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు.
అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది.

అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?

గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు. అదే వచ్చే నెల రెండో తారీఖున రాబోతున్న అద్భుత ముహూర్తం.
వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

సంక్షిప్త వ్రత విధానం :

1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.
4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.
9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.
14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.
15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.
16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.

నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,


1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి?
జ. పైన bold చేసినవి (2,3,7,8,11,12,13).
2. ఏ పూలు వాడాలి?
జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.
వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.
3. ఏ మంత్రం జపించాలి?
జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,
'గజానన' అనే నామ మంత్రంగానీ,
'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.
4. నైవేద్యం ఏమి సమర్పించాలి?
కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు
5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?
జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.
6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?
జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.
7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?
జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.
8. పూజ చేయడం చేతకాదనుకుంటే?
జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.

వ్రతాచరణ వలన లాభాలు :

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం

పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.

సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం

ఏకవింశతి నామ పూజ :

ఓం సుముఖాయ నమఃమాలతీ పత్రం పూజయామిఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామిఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామిఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామిఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామిఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామిఓం గుహాగ్రజాయ నమఃఅపామార్గ పత్రం పూజయామిఓం గజకర్ణాయ నమఃజంబూ పత్రం పూజయామిఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామిఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామిఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామిఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామిఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామిఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామిఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామిఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామిఓం సురాగ్రజాయ నమఃగణ్డకీ పత్రం పూజయామిఓం ఇభవక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామిఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామిఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామిఓం కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి
వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము

శనివారం, సెప్టెంబర్ 06, 2014

మునికార్తీక వ్రతము

ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.

ఒక బ్రాహ్మణి కడు పేదయై, దానిని భరించలేక బ్రహ్మ లోకమునకు వెళ్ళి వరము తెచ్చుకొనవలెనని ప్రయాణమై వెళ్ళుచుండెను. దారిలో ఒక బ్రహ్మణుడు కనిపించి, తన గతి బ్రహ్మతో చెప్పవలెనని ఆమెను కోరెను. అట్లే యని కొంతదూరము వెళ్ళగా, నక్కడ ఒక ముంతమామిడి చెట్టు కనిపించెను. తన ఫలము లెవరూ తినకుండుటకు కారణము బ్రహ్మనడుగుమని ఆమెను కోరెను. సరేనని ఆమె కొంతదూరము వెళ్ళగా నక్కడ ఒక మల్లె పొద విరబూచి యుండి, తన పూవులు ఎవ్వరూ ముట్టకుండుటకు కారణమడిగి రమ్మని కోరెను.ఆమె యట్లే యని కొంచెము దూరము నడువగా నొక దండెముపై బట్టలు తగులబడుచుండెను. ఇంక కొంతదూరములో నొక అట్లపెనెము చిటపటలాడు చుండెను.

అవన్నీ చూచిన తరువాత నామె బ్రహ్మ కెదురుగా వెళ్ళి నమస్కరించి, తన దరిద్రమునకు కారణము తెలుపమని కోరెను. అంత నా పరబ్రహ్మ "యువతీ! నీవు ముని కార్తిక దీపముల వ్రతము నోచి వుల్లంఘన చేయుటచే నీకిట్టి దరిద్రము గర్భశోకము ప్రాప్తించెను. ఇప్పుడు నీవు యింటికివెళ్ళి మూడుకార్తులు ముని కార్తీక దీపములను వెలిగించుకొని, సుఖముగా నుండు" మని చెప్పెను.

పిమ్మట నాపుణ్యవతి "స్వామీ! నేను దారిలో చూచిన వింతలకు కారణమేమి" అని యడిగెను. అప్పుడు బ్రహ్మ "అమ్మా! నీవు చూచిన బ్రాహ్మణుడు పూర్వజన్మయందు సర్వ విద్యలను నేర్చి, ఒకనికైనా విద్యచెప్పలేదు. అందుకే అతనికి ఆ గతి పట్టెను. కావున నీవువెళ్ళునప్పుడు నతనికి "రామ" అని చెప్పి వెళ్ళిపొమ్ము అతనికి దోషము తొలగును. నీవు చూచిన ముంతమామిడి పూర్వమొక స్త్రీ. ఆమెకు పది మంది పిల్లలున్నప్పుడు పెంచుకొనుటకు బిడ్డనివ్వమని అడుగగా ఆమె యివ్వలేదు. వారి వుసురు తగలి వంశనాశనమై పోయి, చివరికి మామిడిచెట్టుగా మారినది. నీవు వెళ్ళు నప్పుడు నొక మామిడిపండు తినుము. తరువాత నందరూ ఆ పండు కోయుదురు. అప్పుడామెకు శాంతి లభించును. తరువాత నీవు చూచిన మల్లెపొద పూర్వమొక భోగము స్త్రీ. ఆమె పువ్వులు తెచ్చుకొని ఎవ్వరికీ ఒక్క పువ్వయిననూ యిచ్చెడిది కాదు. అందుచే ఆమె యిప్పుడట్లున్నది. నీవు పోవుచు నొక పువ్వు కోసుకొనుము. ఆమె దోషము పోవును.

అటుపైన నీవు చూచిన పైన మంటలు, కోకలు తగులబడిపోవుట వలన కల్గినది. పూర్వము కొందరు యేడు తరముల తరబడి పుట్టింట ఆడపడుచులకు బట్ట పెట్టలేదు. అందుకే వారి బట్టలు తగులబడుచున్నవి. నీవొక కోక తీసుకొని వారి దోషమును హరింపుము. ఇంకనూ నీవు చూచిన పెనములు పూర్వము అత్తాకోడండ్రు. వారిద్దరూ యెదురు వాయనాలందుకొన్నారు. అందుచే నిప్పుడట్లు చిటపట లాడుచున్నారు. నీవా పెనముల మీద నీళ్ళు చల్లినచో వారు శాంతి నొందుదురు. ఇన్ని చేసినందుకు నీకు ఫలితముగా వత్తి చేసి మొక్కిన ఫలమిచ్చితిని" పొమ్మనెను. అంత నామె వినయముతో బ్రహ్మకు నమస్కరించి, బ్రహ్మలోకము నుంచి వచ్చుచూ దారిలో బ్రహ్మ చెప్పినట్లు ఇంటికి వెళ్ళి శివరాత్రి నాడు నోము పట్టి మూడువందల అరువది వత్తులను వెలిగించి ఉద్యాపనమును చేసుకొని సుఖముగా నుండెను.
దీనికి వుద్యాపనము
కొత్త అంగ వస్త్రము పరచి, దానిమీద ఐదు మానికల బియ్యంతో మండపమేర్పరచి, దక్షిణ తాంబూలాదులు పెట్టి వెండి ప్రమిదెలో బమిడి వత్తి వెలిగించి బ్రాహ్మణునకు ఇవ్వవలెను.

గురువారం, నవంబర్ 14, 2013

క్షీరాబ్ధి ద్వాదశి వ్రతము


" కార్తీక శుద్ధ ద్వాదశి " ని క్షీరాబ్ది ద్వాదశి అందురు. దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున శ్రీ మహా లక్ష్మికి శ్రీ మన్నారాయుణునికి వివాహము చేసెదరు.
వ్రత పూజా విధానము : ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి ,అలికి , బియ్యపు పిండితో గాని ,రంగుల చూర్ణములతో గాని ముగ్గులు పెట్టి ,దైవ స్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి .పీట మరీ ఎత్తుగా గాని ,మరీ పల్లముగా గాని ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపు రాసి ,కుంకుమతో బొట్టు పెట్టి ,వరిపిండి (బియ్యపు పిండి ) తో ముగ్గు వేయాలి .సాదారణంగా అష్ట దళ పద్మాన్నే వేస్తారు. ఈ రోజున (క్షీరాబ్ది ద్వాదశి ) పద్మమును, శంఖమును, చక్ర ,పాదములు కూడా అలంకరించవలెను . పూజ చేసే వారు తూర్పు ముఖంగా కూర్చోవాలి .ఏ దైవాన్ని పూజించ బోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమను గాని ,చిత్ర పటమును గాని ఆ పీటపై ఉంచాలి .ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి ) దానికి కుంకుమ బొట్టు పెట్టి పిదప ఒక పళ్ళెంలో గాని ,కొత్త తుండు గుడ్డ మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమల పాకు నుంచి ,అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి .ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి .దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.
పూజకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము : దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద ) వెండిది గాని ,ఇత్తడిది గాని ,మట్టిది గాని వాడవచ్చును. కుందిలో 3 అడ్డ వత్తులు 1 కుంభ వత్తి (మధ్యలో )వేసి నూనెతో తడపవలెను . ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏక హారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు ) వేసి ముందుగా ఏకహారతి లో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి ,వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభ వత్తి వెలిగించవలెను. తరువాత చేయి కడుక్కుని నూనె కుంది నిండా వేసి పిదప ఆ కుందికి మూడు చోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాదనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను. కుందిలో మిగిలిన రెండు అడ్డ వత్తులు పూజా సమయములో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు వాడవలెను .దీపారాధనకు నువ్వుల నూనె గాని ,కొబ్బరి నూనె గాని ,ఆవు నెయ్యి గాని వాడవచ్చును. ఈ విధంగా దీపం వెలిగించి గంటను వాయిస్తూ నమస్కరించి ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను .
ఘంటా నాదము :
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్
కుర్యాద్ఘంటార వం తత్ర దేవతా హ్వాహాన లాంచనమ్
మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించ వలెను. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపదానము అతి ముఖ్య మైనది . ఆ రోజు దీపదానము చేయువారు స్వర్గ ప్రాప్తిని పొందుదురు. దీపమునకు ఆవు నెయ్యి ఉపయోగించ వలెను అది దొరకనిచో మంచి నూనె వాడవచ్చును. ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు మోక్ష ప్రాప్తి కలుగును.

పూజకు కావలసిన వస్తువులు :లక్ష్మీ నారాయణుల యొక్క బొమ్మ (ప్రతిమ ) (తమ శక్తి కొలది బంగారముతో నైనను ,వెండితో నైననూ లేక మట్టితో నైనను తీసుకొనవలెను ), లేదా చిత్ర పటము ,కొబ్బరికాయలు , బెల్లము, ఖర్జూరము, చెరకు, పళ్ళు ,పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె , అగరువత్తులు,వస్త్ర,యజ్నోపవీతములు,ప్రత్యేక నివేదనకు పిండివంటలుమొదలగునవి. పిమ్మట యజమానులు (పూజ చేసేవారు ) ఈ దిగువ కేశవ నామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి .ఈ నామములు మొత్తం 24 కలవు.
1  ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
.10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 .  ఓం పద్మనాభాయ నమః  పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము చెప్పుకోనవలెను .
ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
శ్లో || ఉత్తిష్టంతు భూత పిశాచాః యేతే భూమి భారకాః
  యేతేషామ విరోదేన బ్రహ్మ కర్మ సమారభే ||

ప్రాణాయామమ్య: ఓం భూ : -ఓం భువః ఓం సువః - ఓం మహః -ఓం జనః ఓం తపః - ఓగ్ సత్యం -ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ దీయో యోనః ప్రచోదయాత్ - ఓం ఆపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోం అని సంకల్పము చెప్పు కొనవలెను. సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || పిదప కలశారాదనను చేయవలెను.

కలశ పూజను గూర్చిన వివరణ : వెండి, రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని పూయరాదు. గంధమును ఉంగరపు  వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు, దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .

మం || కలశస్య ముఖే విష్ణు : కంటే రుద్ర స్సమాశ్రితః
      మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతాః ||
      ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
      అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితః
శ్లో || గంగైచ యమునే చైవ కృష్ణే ,గోదావరి ,సరస్వతి ,నర్మదా సింధు
   కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు.
ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ పూజార్ధం దురితక్షయ కారకాః (ఏ దేవుని పూజిస్తున్నామో ఆ దేవుని పేరు చెప్పవలెను ) కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య  (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి) ,ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ) కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని ,ఆకుతో గాని చల్లాలి .
మార్జనము : ఓం అపవిత్రః పవిత్రోవా సర్వా వస్తాం గతోపివా
                 యస్మరే త్పుండరీ కాక్షం సభాహ్యాభ్యంతర శ్శుచి :||
అని పిదప కాసిని అక్షతలు ,పసుపు, గణపతిపై వేసి ,ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ట అనగా శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త స్సుముహూర్తోస్తు తధాస్తు . స్థిరోభవ, వరదోభవ ,సుముఖోభవ ,సుప్రసన్నోభవ. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను .
శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
   ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ||

   సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణక :
   లంబోరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
   ధూమ కేతు ర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః
   వక్ర తుండ శ్శూర్ప కర్ణో హీరంభః స్కంద పూర్వజః
   షోడ శైతాని నామాని యః పటే చ్చ్రుణు యాదపి
   విద్యా రంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
   సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్త స్యన జాయతే ||
పిదప షోడశోపచార పూజను చేయవలెను. షోడశోప చారములనగా ఆవాహన ,ఆసనం, అర్ఘ్యం ,పాద్యం ,ఆచమనీయం ,స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నమస్కారం ,ప్రదక్షణములు మొదలగునవి.

షోడశోపచార పూజా ప్రారంభః
ధ్యానం :
శ్లో || దక్షిణాగ్ర కరే శంఖం పద్మంత స్వాప్యదః కరే
   చక్ర మూర్ధ్వ కరే నామే గదాంత స్యాయ్సదః కరే
   దదానాం సర్వ లోకేశం సర్వా భరణ భూషితం
    క్షీరాబ్ధి శాయనం దేవం ధ్యాయేన్నారాయణ ప్రభుం
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ధ్యాయామి -ధ్యానం సమర్పయామి అని విష్ణువును మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.
ఆవాహనం :
శ్లో || ఆవాహయామి దేవత్వం పూజార్ధ మిహహే ప్రభో |
     ఆగచ్ఛ దేవ దేవేశ సర్వ దేవ గణై స్సహ ||
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి. అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లోకి ఆహ్వానించడం అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.
 
ఆసనం :
శ్లో || అనేత హార సంయుక్తం నానామణి విరాజితం
  రత్న సింహాసనం దేవ ప్రీత్యర్ధ ప్రతి గృహ్యతాం ||
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి .దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.
అర్ఘ్యం :
శ్లో || నిష్కళంక గుణా రాధ్య జగత్త్రితయ రక్షక
   అర్ఘ్యం గృహాణ మద్దత్తం శుద్దోదక వినిర్మితం
ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి .దేవుడు చేతులు కడుగు కొనుటకై నీళ్ళి స్తున్నామని మనసున తలుస్తూ ,ఉద్దరిణెతో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

పాద్యం :
శ్లో || పద్మనాభ సురారాధ్య పాదాంభుజ శుభ ప్రద
  పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం
ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పాదౌ : పాద్యం సమర్పయామి.దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను .
ఆచమనీయం :
శ్లో|| సర్వ రాధ్య నమస్తేస్తు సంసారార్ణవ తారక
  గృహాణ దేవ మదత్తం పరమాచామనీయకం
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి .అంటూ దేవుని ముఖము కడుగు కొనుటకై నీళ్లిస్తున్నామని మనమున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.
సూచన : అర్ఘ్యం , పాద్యం, ఆచమనం మొదలగువాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను .అరివేణంలోవదలరాదు.
మధుపర్కం :
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః మధుపర్కం సమర్పయామి అని స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని తలుస్తూ ,ఈ మధుపర్కం ను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకున్న దాన్ని మధుపర్కం అంటారు.)
పంచామృత స్నానం :
శ్లో|| స్వపాద పద్మ సంభూత గంగా శోదిత విష్ణవ
పంచామృతై స్నాపయిష్యే తతః శుద్దోద కేనేచ
ఓం శ్రీ తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి .అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి , ఆవుపాలు ,ఆవు పెరుగు ,తేనె, పంచదార కలిపినా పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.
 
శుద్దోదక స్నానం :
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి .పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.

వస్త్ర యుగ్మం :
శ్లో|| విర్యు వ్విలాస రమ్యేణ సర్వ వస్త్రేణ సంయతం
వస్త్ర యుగ్మం గృహణేదం భక్త్యా దత్తం మయా ప్రభో
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మ మనగా రెండు ) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును.ఇటువంటివి రెండు చేసుకొనవలెను )స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
యజ్ఞోపవీతం :
శ్లో || నారాయణ నమస్తేస్తు నాక నాధాధి పూజితం
  స్వర్ణో పవీతం మద్దతం స్వర్ణ దం ప్రతి గృహ్యాతాం
 
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను .ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు ,మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించ వలెను.
గంధం :
శ్లో || రమాలింగన సంసక్త కాశ్మీర వక్షసే :
  కస్తూరి మిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః రమ్య గంధం సమర్పయామి. ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
అక్షతలు :
శ్లో || అక్షతాన్ ధవళాన్ శుభ్రాన్ పక్షి రాజ ధ్వజా వ్యయ
  గృహాణ దేవ దేవేశ కృపయా భక్త వత్సల
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి .(అక్షతలకు కొద్ది బియ్యమును తడిపి పసుపు వేసి కలుపవలెను ) అక్షతలు తీసుకుని స్వామివారి ప్రతిమపై చల్లవలెను.
పుష్ప సమర్పణ :
శ్లో || బిల్వపు దళ తులసీ దళ మల్లికాభి ,
  స్త్వాం పూజయామి జగదీశ్వర వాసుదేవః
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి స్వామివారికి పువ్వులతో అలంకారము చేయవలెను. పిదప అధాంగ పూజను చేయవలెను .ఈ క్రింది నామాలను చడువుచూ పుష్పములతో గాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.
అధాంగ పూజ :
పాదావనత కేశాయ నమః పాదౌ పూజయామి , నివృత్తిని మేషాది కాలాత్మనే నమః జంఘే పూజయామి ,విశ్వరూపాయ నమః జానునీ పూజయామి ,జగన్నాదాయనమః గుహ్యం పూజయామి , పద్మనాభాయ నమః నాభిం పూజయామి, కుక్షి స్థాకిల విష్టపాయ నమః కుక్షిం పూజయామి , లక్ష్మీ విలస ద్వక్షసే నమః వక్షః పూజయామి ,చక్రాది హస్తాయ నమః హస్తాన్ పూజయామి, కంబు కంటాయ నమః కంటం పూజయామి , చంద్ర ముఖాయ నమః ముఖం పూజయామి , వాచస్పతయే నమః వక్త్రం పూజయామి , కేశవాయ నమః నాసికం పూజయామి , నారాయణే నమః నేత్రౌ పూజయామి , గోవిందాయ నమః శ్రోత్రౌ పూజయామి, నిగమ శిరో గమ్యాయ నమః శిరః పూజయామి , సర్వేశ్వరాయ నమః సర్వాణ్యం గాని పూజయామి. తరువాత అష్టోత్తర శతనామావళి పూజ .దీని యందు 108 మంత్రములుండును. ఈ మంత్రములను చదువుచూ పుష్పములతో కాని ,పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను .

అష్టోత్తర శతనామావళి :
ఓం విష్ణవే నమః ;
ఓం లక్ష్మీ పతయే నమః ;
ఓం కృష్ణాయ నమః ;
ఓం వైకుంటాయ నమః ;
ఓం గరుడ ద్వజాయ నమః ;
ఓం పరబ్రహ్మణే నమః ;
ఓం జగన్నాదాయ నమః ;
ఓం వాసుదేవాయ నమః ;
ఓం త్రివిక్రమాయ నమః
; ఓం హంసాయ నమః ;
ఓం సమగ్ర మదనాయ నమః ;
ఓం హరయే నమః ;
ఓం శుభప్రదాయ నమః ;
ఓం మాధవాయ నమః ;
ఓం పద్మనాభాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం సనాతనాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం మధు పతయే నమః ;
ఓం రతా రోక్ష్య వాహనాయ నమః ;
ఓం దైత్యాంత కాయ నమః ;
ఓం శింసుమారాయ నమః ;
ఓం శ్రీ కరాయ నమః ;
ఓం కపిలాయ నమః ;
ఓం పుండరీ కాక్షాయ నమః ;
ఓం స్థితి ప్రత్యై నమః ;
ఓం పరాత్పరాయ నమః ;
ఓం వనమాలినే నమః ;
ఓం యజ్ఞ రూపాయ నమః ;
ఓం చక్ర రూపాయ నమః ;
ఓం గదాధరాయ నమః ;
ఓం ఉపేంద్రాయ నమః ;
ఓం కేశవాయ నమః ;
ఓం భూమజనకాయ నమః ;
ఓం శేష శాయినే నమః ;
ఓం చతుర్బుజాయ నమః ;
ఓం పాంచజన్య ధరాయ నమః ;
ఓం శ్రీ మతే నమః ;
ఓం శార్ జ్ఞ పాణాయ నమః ;
ఓం జనార్ధనాయ నమః ;
ఓం పీతాంబర ధరాయ నమః ;
ఓం దేవాయ నమః ;
ఓం సూర్య చంద్ర విలోచనాయ నమః ;
ఓం మత్స్య రూపాయ నమః ;
ఓం కూర్మ తనవే నమః ;
ఓం క్రోధరూపాయ నమః ;
ఓం హృషీ కేశాయ నమః ;
ఓం వామనాయ నమః ;
ఓం భార్గవాయ నమః ;
ఓం రామాయ నమః ;
ఓం హలినే నమః ;
ఓం కల్కినే నమః ;
ఓం హరా ననాయ నమః ;
ఓం విశ్వంభరాయ నమః ;
ఓం ధృవాయ నమః ;
ఓం దత్తాత్రేయాయ నమః ;
ఓం అచ్యుతాయ నమః ;
ఓం అనంతాయ నమః ;
ఓం రధ వాహనాయ నమః ;
ఓం ముకుందాయ నమః ;
ఓం ధన్వంతరే నమః ;
ఓం శ్రీనివాసాయ నమః ;
ఓం ప్రద్యుమ్నాయ నమః ;
ఓం పురుషోత్తమాయ నమః ;
ఓం శ్రీ వత్స కౌస్తుభ ధరాయ నమః ;
ఓం మురారాతయే నమః ;
ఓం అదోక్షజాయ నమః ;
ఓం ఋషభాయ నమః ;
ఓం మోహినీ రూపాయ నమః ;
ఓం ధరాయ నమః ;
ఓం సంకర్షనాయ నమః ;
ఓం ప్రుధవే నమః ;
ఓం క్షీరాబ్ది శాయినే నమః ;
ఓం భూతాత్మనే నమః ;
ఓం అనిరుద్దాయ నమః ;
ఓం భక్త వత్సలాయ నమః ;
ఓం నారాయణాయ నమః ;
ఓం గజేంద్ర వరదాయ నమః ;
ఓం త్రిగ్దామ్నే నమః ;
ఓం సూర్య మండల మధ్యగాయ నమః ;
ఓం సనకాది మునీ ధ్యేయాయ నమః ;
ఓం భగవాశతే నమః ;
ఓం శంకర ప్రియాయ నమః ;
ఓం వీర గందాయ నమః ;
ఓం ధరా కాంతాయ నమః ;
ఓం వేదాత్మనే నమః ;
ఓం బాదరాయ ణాయ నమః ;
ఓం భాగీ రదీ జన్మ భూమినే నమః ;
ఓం పాద పద్మాయ నమః ;
ఓం సతాం ప్రభవే నమః ;
ఓం స్వభవే నమః ;
ఓం విభవే నమః ;
ఓం ఘన శ్యామాతవాసనే నమః ;
ఓం శ్వేత ద్వీప వానినేవ్యాయ నమః ;
ఓం గోవిందాయ నమః ;
ఓం బ్రహ్మ జనకాయ నమః ;
ఓం కైటభాసుర మర్ధనాయ నమః ;
ఓం శ్రీధరాయ నమః ;
ఓం కాయ ణమః ;
ఓం జగత్కార ణాయ నమః ;
ఓం అవ్యయాయ నమః ;
ఓం దశావతారాయ నమః ;
ఓం శాంతాత్మనే నమః ;
ఓం లీలా మానుష విగ్రహాయ నమః ;
ఓం దామొధరాయ నమః ;
ఓం విరాట్ రూపాయా నమః ;
ఓం భూత భవ్య భవిత్రు భవనే నమః  

పిదప అగరువత్తిని వెలిగించి .......
ధూపం :
శ్లో || దశాంగం గగ్గులో పేతం చంద నాగరు వాసితం
  ధూపం గృహాణ దేవేశ ధూర్జటి స్తుత సద్గుణ
 
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి .ధూపం సమర్పయామి అంటూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ కుడి చేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను స్వామికి చూపవలెను.
దీపం :
శ్లో || అజ్ఞాన ద్వాంత నాశాయ అఖండా లోక శాలినే
  ఘ్రుతాకావర్తి సంయుక్త దీపం దాస్యామి శక్తితః
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాదనలో ఉన్న అదనపు వత్తులలో ఒక దానిని తీసుకుని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను .ధూప దీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి.
నైవెధ్యం
శ్లో || పృదు కానిక్షు ఖండాంశ్చ కదళీ ఫల సంయుతం
  దాపయిష్యే భవత్ప్రీ త్యై గృహాణ సురవందిత
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవెధ్యం సమర్పయామి అని ఒక బెల్లం ముక్క, పళ్ళు, కొబ్బరికాయ మొదలగునవి స్వామివద్ద ఉంచి దానిపై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమ చేత్తో గంట వాయిస్తూ ' ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ,దీయో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన  పరిషించామి ,(ఋ తంత్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను ) అమృతమస్తు అమృతో పస్తరణమసి , ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరు మార్లు చేతితో (చేతిలోని ఉద్దరి ణెతో ) స్వామికి నివేదనం చూపించాలి .పిదప ఓం తులసీదాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నైవేద్యా నంతరం 'హస్తౌ ప్రక్షాళయామి ' అని ఉద్దరిణెతో పంచ పాత్రలోని నీరు ముందు చెప్పిన అర్ఘ్య పాత్ర (పంచపాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకునే నీళ్ళ పాత్ర ) లో వదలాలి .తరువాత 'పాదౌ ప్రక్షాళ యామి ' అని మరొకసారి నీరు అర్ఘ్య పాత్రలో ఉద్దరిణెతో వదలాలి .పునః శుద్దాచ మనీయం సమర్పయామి .అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి .తదనంతరం .....

తాంబూలం :
శ్లో || ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం
  విస్తీర్ణ కర్పూరేణ సుశం మిశ్రమ తాంబూలం స్వీకురు ప్రభో
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు ,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి )స్వామీ వద్ద ఉంచాలి .తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,' తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్రలో వదలాలి .పిమ్మట కర్పూరం వెలిగించి .......
నీరాజనం :
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి అని కర్పూర బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి ,మూడుమార్లు తిప్పుచూ ,చిన్నగా గంట వాయించవలెను. అనంతరం మళ్ళీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ ' కర్పూర నీరాజనానంతరం శుద్దాచమనీయం సమర్పయామి ' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు ,పువ్వులు ,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని

మంత్రపుష్పం :
శ్లో || పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యా దత్తా మిదం ప్రభో
   అనుగ్రహ హేణ మాం రక్ష దేవ దేవ దయానిధే
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః యధా శక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు ,పువ్వులు ,చిల్లర స్వామి వద్ద ఉంచవలెను . పిమ్మట ఈ దిగువ మంత్రం జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి .
ప్రదక్షిణం :
శ్లో || ప్రదక్షిణం కరిష్యామి సర్వ భ్రమ నివారణం
  సంసార సాగరాన్సాంత్వం ముద్దర స్వ మహాప్రభో
శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర క్రుతానిచ
  తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి చేతిలో అక్షతలు , పువ్వులు తీసుకొని లేచి నిలబడి మూడుసార్లు ఆత్మ ప్రదక్షణ చేసి (అనగా తమలో తాము చుట్టూ తిరిగి ) పిమ్మట శ్రీ స్వామికి ,అమ్మవారికి (లక్ష్మీ నారాయణులకు) సాష్టాంగ నమస్కారం చేసి (మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలుపై వేసి )తరువాత స్వామిపై చేతిలో ఉన్న అక్షతలు పువ్వులు చల్లి మరల తమ స్థానమున ఆసీనులై నమస్కరించుచూ ........

పునః పూజ :
ఓం శ్రీ తులసీ దాత్రీ సహిత లక్ష్మీ నారాయణ స్వామినే నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకొని ,పంచపాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు స్వామిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .
విశేషోపచారములు: ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి ,నృత్యం దర్శయామి , గీతం శ్రావయామి ,వాద్యం ఘోషయామి, సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోప చార పూజాం సమర్పయామి అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను.
పూజా ఫల సమర్పణమ్ :
శ్లో || యస్య స్మృత్యాచ నామోక్త్యా తపం పూజా క్రియాది షు
   యాన సంపూరతాం యాతి సద్యో వందే తమచ్యుతమ్
   మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం మహేశ్వర |
   యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
    అనయా ధ్యానా వాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ ...........సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు .
    ఏతత్ఫలం శ్రీ .............ర్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను .
   పిమ్మట 'శ్రీ ...............ప్రసాదం శిరసా గృహ్ణామి ' అనుకొని స్వామివద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను .ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
పూజా విధాణం సంపూర్ణమ్

తీర్ధ ప్రాశనమ్ :
శ్లో || అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణమ్ |
  సమస్త పాపక్షయకరం శ్రీ ........పాదోదకం పావనం శుభమ్ ||
అని తీర్ధమును చేతిలో వేసుకొని మూడు మార్లు నోటిలోనికి తీసుకొనవలెను .క్షీరాబ్ధి ద్వాదశి అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఉసిరి చెట్టు క్రింద తులసి మొక్కను పెట్టి పూజలు జరుపుతారు .ఈ విధంగా చేయుటవలన శ్రీ లక్ష్మీ నారాయణుల వివాహము చేసినట్లవుతుందని చెబుతారు. ఈ రోజున తులసి ముందు దీపముంచిన వారికి విష్ణు కృప కలుగుతుంది . అంతే కాక బృందావనంలో శ్రీ కృష్ణుని సన్నిదానంలో ఒక్క దీపమైన నూ వెలిగించినచో అనంత పుణ్యము ప్రాప్తించును . సరాసరి వైకుంటమునకేగుదురు. ఈ దీపమును దానము చేయవలెను. ప్రతిమా దానము (పూజను చేసిన ప్రతిమను కూడా దానము చేయవచ్చును .
ఈ వ్రతమునే తులసీ దామోదర వ్రతమని కూడా అంటారు. ఈ వ్రతమునకు శ్రీ మన్నారాయణుడి విగ్రహాన్ని బంగారంతో చేయించి ,తులసికోట వద్ద ఉంచి ,కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి విష్ణు, తులసి సహస్రనామాలతో అర్చించి ,పిదప తులసీ దామోదరు (నారాయణు) లకు కళ్యాణం జరిపిస్తారు .అనంతరం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు , పుణ్య స్త్రీలకు వాయన దానాలు సమర్పించి ,వారి ఆశీర్వాదం పొందుతారు.
క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ
క్షీరాబ్ధి ద్వాదశి కధను బ్రహ్మ దేవుడు ఈ విధంగా చెప్పుచున్నాడు .ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో శయనించి యుండు విష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ బ్రహ్మ మొదలగు వారితో కూడి బృందావనమున కేగును.(వెళ్ళును) కావున ఆ రోజున బృందావన మందు ఎవరు శ్రద్దా భక్తులతో విష్ణు పూజ చేయుదురో వారికి దీర్ఘమైన ఆయుష్షు , ఆరోగ్యము, ఐశ్వర్యములు కలిగి సంతోషముగా ఉందురు .ఈ వ్రతము చేయువారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడస్తమించిన తరువాత స్నానము గాని ,దానము గాని ,పూజ గాని చేసినచో అధిక ఫలమును పొందుదురు. క్షీర సముద్రము నుండి లక్ష్మీ దేవితో గూడి సమస్తమైన మునులచేత కీర్తించ బడుచున్న పరమేశ్వరుడైన నారాయణుడు ఎచ్చట వాసము చేయునో అట్టి బృందావనమందు పూజనీయుడై ,నిత్యుడై, తులసీ సహితుడైనట్టి శ్రీమన్నారాయణ మూర్తిని ,బ్రహ్మాది సమస్త దేవతలను శ్రద్దా భక్తి యుక్తులై పూజించియున్నారు . కావున మానవ మాత్రులెవరు ఈ వ్రతమును చేసినను సమస్త పాపములు నశించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు.

శ్రీ మహా విష్ణువు వశిష్టాది మహామునులచేత నానా విధ స్తోత్ర పూర్వకంగా తులసీ వనమందు పూజింప బడుతుంటాడు . ఆ కాలమందు ఈ కార్తీక శుద్ధ ద్వాదశినాడు తులసీవనమందు ఎవరు తులసీ సహిత విష్ణువును పూజించు చుందురో వారు సర్వ పాపములను పోగొట్టు కొన్నవారై విష్ణు సాన్నిధ్యము పొందుదురు. మునీశ్వరులైనను, యక్షులు, నారదుడు మొదలగువారు కూడ సమస్త పాపములు నశించుటకు గాను బృందావనములో సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేయుచున్నారు . పతితుడైనను ,శూద్రుడైనను, మహాపాతకము చేసిన వాడైనను కార్తీక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి ) రోజున తులసీ సహిత విష్ణువును పూజించిన వారి పాపములు అగ్నిహోత్రంలో వేసిన ప్రత్తి పోగువలె నశించును . ఇక బ్రాహ్మణుడైనచో ఫలము ఇట్టిదని చెప్పవలసిన పనిలేదు .తులసీ సహితుడైన విష్ణువును పూజ చేయని వారు పూర్వ పుణ్యములు కూడా పోయి నరకమును పొందుదురు . బృందావనమున సన్నిహితుడైన విష్ణువును పూజించినచో స్వర్గమును పొందుదురు. బృందావనము చాలా మహత్యము కలిగినదని ,అచ్చట పూజించి నట్లయితే విష్ణువునకు అత్యంత సంతోష కరమని పూర్వము దేవతలు ,గంధర్వులు ,ఋషులు మొదలగు వారందరును బృందావనమందు సన్నిహితుడైన శ్రీ మహా విష్ణువును పూజ చేసిరి . కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసీ సహితుడైన నారాయణ మూర్తిని పూజించని మనుజుడు కోటి జన్మలు పాపిగా చండాలునిగా పుట్టును. ఆ రోజున బృందావనమందు శ్రీ మహా విష్ణువును శ్రద్దా భక్తులతో పూజ చేసినట్లయితే బ్రహ్మ హత్యా మహా పాతకములు కూడ పూర్తిగా పోయి అనేక పుణ్య ఫలములు పొందుదురు. అట్టి మహా పుణ్య కరంబగు నట్టిది గాన తులసీ బృందావన సన్నిధానము నందు శ్రీ మహావిష్ణువును పూజించుట ప్రశస్తమగును . ఈ వ్రతమును చేయువారు (పురుషులు ) స్నాన సంధ్యా వందనములను పూర్తి గావించుకొని , యధావిధిగా నానావిధ వేద మంత్రములచేత గాని ,పురుష సూక్తము చేత గాని శ్రద్దా భక్తులతో పూజ చేయవలెను .ఎలాగంటే ప్రధమమున పంచామృత స్నానం గావించి , ఆ పిమ్మట శుద్దోకములచే అభిషేక మొనర్చి శ్రీ విష్ణువును వస్త్రములచే అలంకరించి నానావిధములగు పుష్పములచేతను , ధూప దీపముల చేతను పూజించి ,భక్తితో నైవేద్యము నిచ్చి ,దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ తరువాత కర్పూర నీరాజనములు సమర్పించవలెను . లోకమునందు ఎవరు ఈ ప్రకారము పూజ గావించుదురో వారు సకల పాపములు తొలిగి సమస్త సుఖములు పొందుదురు .ఇంటిలో ఈశాన్య మూలములో గోమయముచే (ఆవుపేడ ) అలికి, రంగుల ముగ్గులతో అలంకరించి ,పద్మము ,శంఖము, చక్రము, పాదములు ఆ తిన్నె మీద అలంకరించి పూజించి గీత వాద్యములతో వేద ఘోషములతో తులసి కధను వినవలెను. పుణ్యము కోరువారు ఎట్లైన తులసీ వ్రత మహత్యమును వినవలెను. విష్ణు దేవునికి మిక్కిలి ప్రీతి చేయవలెనన్న ద్వాదశి రోజున ,బ్రాహ్మణ సభలో తులసీ వ్రత మహత్యమును విన్నచో దుఃఖములన్నియు నశించి విష్ణు లోకమును పొందుదురు. ఈ పూజా సమయమునందు ధూప దీపములు చూచినా వారు గంగా స్నాన ఫలమును పొందుదురు . నీరాజనము (హారతి ) చూచినచో పాపమంతయు నిప్పులో పడిన ప్రత్తివలె నశించును.

నీరాజనమును నేత్రములందు ,శిరస్సు నందు అద్దుకొనుదురో వారికి విష్ణు లోకము కలుగును. తరువాత బెల్లము, టెంకాయలు , ఖర్జూరము , అరటిపళ్ళు ,చెరకు ముక్కలు మొదలగునవి . స్వామికి నివేదనము చేయవలెను. తులసీ సహితుడైన శ్రీ మహా విష్ణువునకు నైవేద్యము సమర్పించి ,బ్రాహ్మణుల శ్రద్దా భక్తులతో పూజించి ,దక్షిణలను ఇవ్వవలెను .ఈ వ్రతమును ఆచరించిన వారి కోటిజన్మల పాపములు నశించి ,లోకమున సమస్త భోగములు అనుభవింతురు. ఈ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు అవశ్యము దీపదానం చేయవలెను. ఒక దీపము దానము చేసినట్లయిన ఉపపాతకములు నశించును. పది దీపములు దానం చేసిన వారికి శివ సాన్నిధ్యం కలుగును. ఇంతకు మీదట దీపదానం చేయుటవలన స్వర్గాదిపత్యమును పొందుదురు . బ్రహ్మాదులకు దీపదానం ప్రభావం వల్లనే వైకుంటము నందు శాశ్వతమైన నివాసము కలిగెను . కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావన సన్నిధి యందు దీపదానమును ఎవరు చేయుదురో వారు వైకుంటములో సమస్తమైన భోగముల ననుభవించి విష్ణు సాన్నిధ్యమును పొందుదురు .ఆ దీప దర్శన మాత్రముననే ఆయుష్షు , బుద్ది, బలము, ధైర్యము, సంపత్తులు ,పూర్వ జన్మ స్మరణం మొదలగునవి అన్నియు కలుగును. దీపమునకు ఆవునెయ్యి ఉత్తమం అనగా మంచిది .మంచినూనె మధ్యమము (అనగా మంచినూనె అయిననూ పరవాలేదు ) ఇతర వన్య తైలములు (అడవిలో లభించు నూనెలు ), ఇప్పనూనె అధమము (పై రెండు నూనెలు దొరకని సమయమున ఈ నూనెలు వాడవచ్చును ) ఆవు నెయ్యితో దీపము వెలిగించి దానము చేసినట్లయిన జ్ఞాన లాభములు, మోక్ష ప్రాప్తియు ను లభించును. మంచినూనెతో దీపము వెలిగించిన కీర్తి సంపదలు లభించును . ఇప్పనూనె ఇతర వన్య తైలములు కార్య సిద్ది కలుగును. ఆవనూనె గాని ,అవిశ నూనెతో గాని దీపము పెట్టిన శత్రువులు నశింతురు . ఆముదముచే దీపముంచిన సంపద ,కీర్తి , ఆయుష్షు క్షీణ మగును. గేదె నెయ్యితో దీపము వెలిగించిన పూర్వము చేసిన పుణ్యము కూడా నశించి పోవును. దానికి స్వల్పముగా ఆవునెయ్యి కలిపి దీపము పెట్టినట్లయిన దోషము లేదు. ఒక వత్తితో దీపము పెట్టి దానము చేసిన సమస్త పాపములు పోయి ,తేజస్వి గాను ,బుద్ది మంతుడుగాను అగును. నాలుగు వత్తులతో దీపములు పెట్టి దానము చేసిన రాజు అగును. పది వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన చక్రవర్తి అగును. ఏబది వత్తులతో దీపము వెలిగించి దానము చేసిన దేవతలలో ఒకడును ,వంద వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన విష్ణు సాన్నిధ్యమును పొందును. వేయి వత్తులతో దీపం వెలిగించి దానము చేసిన ఇంద్రుడితో సమాన మైన వాడగును. ఈ దీప దానము విష్ణు క్షేత్రమందు తులసీ సన్నిధి యందు చేసినట్లయిన విష్ణు లోక ప్రాప్తి కలుగును. ఈ వ్రత విధానము మరియు కధ ఈ క్రింది విధముగా కూడా చెబుతారు. ఈ క్షీరాబ్ది ద్వాదశిన అంబరీషుడు అను విష్ణు భక్తుడు ' ద్వాదశి వ్రతము'ను ఆచరించెను. కార్తీక శుద్ధ దశమి రోజున ,పగలు మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున యే వ్రతమూ చేయక పూర్తి ఉపవాస ముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాత నే భుజించావలయును. అంబరీషుడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు . ప్రతి ద్వాదశి నాడు తప్పక వ్రతం చేసేవాడు ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను. అందుచే ఆరోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచెను. ఆ సమయమునకు అచ్చటకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను.
అంబరీషుడు ఆ మునిని గౌరవించి ,ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయును గాన త్వరగా చేసి రమ్మని కోరెను. దూర్వాసుడు అందుకు అంగీకరించి వెడలెను.అంబరీషుడు ఎంత సేపు వేచియున్నను దూర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటి పోవుచున్నవి .ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు పిలిచి తరువాత పెట్టక పోయినచో మాట తప్పినట్లయి మహాపాప మగును. అది గృహస్తునకు ధర్మము కాదు .ఆయన వచ్చు వరకూ ఆగినచో ద్వాదశి ఘడియలు దాటిపోవును.వ్రత భంగ మవును. ఆయన రాకుండా నేను భుజించినచో నన్ను శపించును. నాకేమి తోచుట లేదు అని మనస్సులో తలచు చుండెను. భ్రాహ్మణ భోజనము అతిక్ర మించరాదు . ద్వాదశి ఘడియలు మించి పోకూడదు . ఘడియలు దాటిపోయిన పిదప హరి భక్తి వదలిన వాడనగుదును అని అంబరీషుడు ఆలోచించి ,బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహా విష్ణువే పోగొట్ట గలడు. అని ద్వాదశి ఘడియలు ఉండగానే భోజనము చేయ నిశ్చయించి ,పండిత శ్రేష్టులతో యోచించి జలపానము చేయుట దోషము గాదని యెంచి , స్వీకరించ బోవునంతలో దూర్వాసుడు వేగముగా కోపముతో అంబరీషుని యొద్దకు వచ్చి ఓరీ ! మధాందా నన్ను నన్ను భోజనమునకు రమ్మని పిలిచి నేను రాక మునుపే నీవేల భుజించితివి ? ఎంత నిర్లక్ష్యము ? ఎంతటి ధర్మ పరిత్యాగివి. నీవు భోజనము స్వీకరించి హరి భక్తిని అవమానించినావు. బ్రాహ్మణా వమానమును శ్రీ హరి సహింపడు నీవు మహా భక్తుడునని అతి గర్వము కలవాడ వైనావు.అని నోటికి వచ్చినట్లు తిట్టేను. అంబరీషుడు గడ గడ వణుకుచూ మహానుభావా ! నేను ధర్మ హీనుడను , నా అజ్ఞానం చే ఇట్టి అకార్యమును చేసితిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు దయగల వారుగాన నన్ను కాపాడుమని వేడుకొనెను . అంత దూర్వాసుడు దోషికి శాప మివ్వకుండా ఉండరాదని ఘోర శాపము నివ్వబోగా శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ శాపము వృధా కారాదు ,అటులనే తన భక్తునికి ఏ అపాయము కలుగ కూడదని ఎంచి తన సుదర్శన చక్రము అడ్డు పెట్టెను. ఆ సుదర్శనము దూర్వాసుని వెంబడింపగా అతను భీతి చెంది సర్వ మునులను, దేవతలను, బ్రహ్మను, శివుని ఎంత ప్రార్ధించిననూ ఎవ్వరునూ ఆ ఆయుధ భారి నుండి దూర్వాసుని కాపాడ లేక పోయిరి. ఏ లోకములోనివారు తనను రక్షించక పోవుటచే వైకుంట మందున్న మహావిష్ణువు కడకు వెళ్లి జగన్నాధా ! వాసుదేవా ! నేను అపరాధము చేసితిని నీవు నన్ను క్షమింపుము .నీ చక్రాయుధము నన్ను జంపగా వచ్చుచున్నది . దానిని నివారించి నన్ను అనుగ్రహింపుము . నీవు బృగు మహర్షి చేసిన అపరాధమును సహించితివి. నా యందు కూడా నీ దయ కురిపించుము. అని వేడుకొనగా శ్రీ హరి చిరునవ్వు నవ్వి ,దూర్వాసా నేను బ్రాహ్మణ ప్రియుడను నీవు బ్రాహ్మణావతారమెత్తిన రుద్రుడవు. నేను త్రికరణ ములచే బ్రాహ్మణులకు ఎట్టి హాని కలిగించను ప్రతియుగమున గో, దేవ, బ్రాహ్మణ ,సాదు జనంబులకు సంభవించే ఆపదలు పోగొట్టుటకు అవతారములెత్తి దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ గావింతును నీవు అకారణ ముగా అంబరీషుని శపించితివి నీవిచ్చిన పది శాపములకు అనుభవించెద నని అంబరీషుని ద్వారా బదులు పల్కిన వాడను నేనే బ్రాహ్మణులను దూషించరాదు. నీవు పోయి అంబరీషుని వద్దకే వెళ్లి వేడుకొమ్మని పంపెను. వెంటనే శ్రీ మన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని , అంబరీషుని వద్దకు వచ్చి ధర్మ పాలకా అంబరీషా నన్ను రక్షింపుము నా తప్పును క్షమింపుము . శ్రీ మన్నా రాయణుని వేడుకొనగా నీ దగ్గరకు పంపినాడు . అనిన అంబరీషుడు సుదర్శన చక్రమును ధ్యానింపగా అది శాంతించెను . ఈ రీతిగా దూర్వాసుడు శాంతించి అంబరీషునితో నీ వలన సుదర్శన చక్రమును ,శ్రీ మహావిష్ణువును దర్శించు భాగ్యము నాకు కలిగినది .నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దుర్వాస మహా ముని పలికి , అంబరీషుని కోరిక మేరకు పంచ భక్ష్య పరమాన్న ములతో విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తిరిగి తన ఆశ్రమమునకు వెళ్ళెను.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...