లేబుళ్లు
- 2015-2016
- అయ్యప్ప కదంబం
- అష్టకాలు
- అష్టోత్తర శతనామావళి
- ఆంజనేయ కదంబం
- ఉపనిషత్తులు
- ఋషిపంచమి
- కుబేర కదంబం
- గణపతి కదంబం
- గాయత్రి కదంబం
- జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
- తంత్ర గ్రంధాలు
- తులసీ కదంబం
- తొలి ఏకాదశి
- దక్షిణామూర్తి కదంబం
- దుర్గా కదంబం
- దేవి కదంబం
- దేవీ నవరాత్రులు
- నవగ్రహా కదంబం
- నవరాత్రి పూజ విధానం
- నోములు
- పండగలు
- పరాక్రి వ్యాసాలు
- పుష్కరాలు
- పూజ విధానం
- మంత్రం
- మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
- మృత్యుంజయ మంత్రం
- యంత్రం
- రథసప్తమి
- రాధాష్టమి
- రామ కదంబం
- లక్ష్మీ దేవి కదంబం
- లలితా కదంబం
- వరలక్ష్మీ
- విష్ణుమూర్తి కదంబం
- వేద-మంత్రాలు
- వ్రతములు
- శరన్నవరాత్రి ఉత్సవములు
- శివ కదంబము
- శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం
- శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
- శ్రీకృష్ణ కదంబం
- సరస్వతి కదంబం
- సాంఖ్యాక యంత్రములు
- సుబ్రమణ్యస్వామి కదంబం
- Advertisements
- audio mantras
- Free Telugu Astrology App
- mantaram
- Radhaashtami
- telugu astrology
- telugu rasi phalalu 2014-15
- Vedio Mantra
గణపతి కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, సెప్టెంబర్ 17, 2015
మంగళవారం, సెప్టెంబర్ 15, 2015
ఏకవింశతి పత్రపూజ
వినాయక చవితి ..
పిల్లలు..పెద్దలు అందరికీ ఇష్టమైన పండుగ. ఆరోజు వినాయకుని ప్రతిమను తెచ్చి..21 రకాల ఆకులతో పూజలు చేస్తారు. వీటినే ‘ఏకవింశతి’ పత్రాలు అంటారు.
అయితే ఆ 21 పత్రాలు ఏమిటో కొందరికి తెలియకపోవచ్చు. అలాగని ఏ ఆకుపడితే ఆ ఆకును పూజలో వినాయకునికి సమర్పించకూడదు.
ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.
దేహాన్ని ఆరోగ్యంగా నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహ్రణమంటే అతిశయోక్తి కాదు.
వినాయకచవితి రోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన సంప్రదాయం. వర్షఋతువు కారణంగా
ఆరోగ్యభంగము కలుగకుండా ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెడతాము.నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినయకునికి తొమ్మిది(నవ) రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.
వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.
ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి…
1. మాచీపత్రం (Artemisia vulgaris)
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి.. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.
2. బృహతీ పత్రం: వాకుడాకు: నేలమూలిక (solanum surattense)
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి. దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.
3. బిల్వపత్రం: మారేడు పత్రం (Aegle marmelos)
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడ ఇష్టమైందిగా చెపుతారు. ఇది హిందువులకు అతి పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.
4. దూర్వాయుగ్మం: గరిక (cynodon dactylon)
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.
5. దత్తూర పత్రం ; ఉమ్మెత్త ; (Datura stramonium)
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి. దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.
6. బదరి పత్రం : రేగు ఆకు : zizyphus jujuba)
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7. తులసీ పత్రం : (ocimum sanctum)
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. ఇందులొ శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి. క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.
8. అపామార్గ పత్రం : ఉత్తరేణి పత్రం (Achyranthus aspera)
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి. ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.
9. చూతపత్రం : మామిడి పతం (mangifera indica)
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు. లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.
10. కరవీరపత్రం : గన్నేరు పత్రాలు (nerium indicum)
దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.
11. విష్ణుక్రాంతం : హరిపత్రం (Evolulus alsinoides)
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.
12. దాడిమీ పత్రం : దానిమ్మ పత్రం (punica granatum)
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం. ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.
13. దేవదారుపత్రం ;(sedris diodaran)
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక వృక్షం ; మరువము:( originam marajOranaa)
దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.
15. సింధువార పత్రం : వావిలాకు ( vitex negundo)
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడ పిలుస్తుంటారు. దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.
16. జాజి పత్రం (nax maskaTaa)
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.
17. గండకీ పత్రం : కామంచి (soalnum nigrum)
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.
18. శమీపత్రం : జమ్మి పత్రం (prosopis spicigera)
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.
19. అశ్వత్థ పత్రం : రావి ఆకు (ficus religiosa)
రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం. ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.
20. అర్జున పత్రం : మద్ది ఆకు (terminalia arjuna)
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.
21. అర్కపత్రం : జిల్లేడు పత్రం (calotropis gigantia)
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. ఆయుర్వేదంలో దీనిని 64 రోగాలనివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.
ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలోకలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.
వినాయకుని ఏకవింశతి పత్రపూజ
సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।
గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।
ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।
గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి
హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।
లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।
గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।
గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,
ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,
వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।
భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,
సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,
ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,
హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి
శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,
సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,
ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,
వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,
సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।
కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి సమర్పయామి (పూజచేయగా మిగిలిన ఆకులన్నియు)
గణపతి ఏకవింశతి పత్రపూజ వినాయకుని పూజలో ఉపయోగించే రకరకాల ఆకులలో చాల విశేషమైన ఔషధ గుణాలున్నాయి. అవి నేత్ర సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులకు, చర్మ రోగాలకు, మరి కొన్ని ఇతర వ్యాధులకు మంచి మందుగా పని చేస్తాయి. అంటే కాక ఆ పత్రి నుండి వెలువడే సుగంధాన్ని పీల్చడం ద్వారా కూడా స్వస్థత చేకూరుతుంది. ఈ పత్రిలో గల వృక్ష సంబంధమైన రసాయన పదార్థాలు (phytochemicals), పత్రిని మనం చేతితో ముట్టుకోవడం వలన కావలసిన మోతాదులో చర్మం ద్వారా మన శరీరం లోకి శోషణం (absorb) చెంది ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. వినాయకుని పూజ వలన మనకు విఘ్నాలు తొలగి అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి. పిల్లలకు పత్రి సేకరణ వలన విజ్ఞానము, వినోదము, పర్యావరణ పట్ల స్నేహ భావము కలుగుతాయి. అందుకే వినాయకుని పూజ అంటే అందరికీ ఇష్టం.
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||
మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||
యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

నారదౌవాచ : ప్రణమ్య శిరసా దేవం , గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే.
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్, తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్.
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్.
నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకమ్, ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్
. ద్వాదశ ఈతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః, న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికారకం ప్రభో !
విద్యార్థీ లభతే విద్యాం, దనార్థీ లభతే ధనమ్, పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిమ్.
జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధిం చ, లభతే నాత్ర సంశయః.
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్, తస్య విద్యా భవేత్ సర్వా, గణేశస్య ప్రసాదతః .
ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశస్తోత్రం సంపూర్ణమ్.
పర్యవరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను మాత్రమే పూజిద్దాం.
Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM,

గురువారం, జనవరి 08, 2015
సంకష్టహరచవితి వ్రత విధానం
8-01-2015, గురువారం, పుష్య బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
సంకష్టహరచవితి వ్రత విధానం :
సంకష్టహర చతుర్థి, దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.
ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో (సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.
సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ, పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.
ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని, సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు (గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు, 2 వక్కలు, దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి. దానిని స్వామి ముందు ఉంచి ధూపం (అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.
ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరికంగానూ, మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.
సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. "సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్ధంగాని, ఉప్పు తగిలిన (కలిసిన) / వేయబడిన పదార్ధాలు తినకూడదు". పాలు, పళ్ళూ, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం (3,5,11 లేదా 21 'చవితి 'లు) పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి. చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప, దీప, నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.
ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు, సంకటనాశన గణేశ స్తోత్రం చదివి, దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశనగణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం.
(సంకష్టహర చవితి మంగళవారం వస్తే, దాన్ని అంగారక చతుర్థీ అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారమవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఈ సారి సంకటహర చవితి గురువారం వచ్చింది.)
సంకటహర గణపతి స్తోత్రం
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
సంకట హర చతుర్ధి గొప్పదనం తెలియపరుచు కధ.
ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాప ములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తలకించ సాగాడు.
అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమా నం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!
అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.
అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెం టనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉప వాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయా న నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతు ర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.
అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేష్ దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వల న ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.
ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పా టు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది.
వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష్ లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
సంకష్టహర చతుర్ధి ఉపవాసంతో స్వర్గలోక పయనం
భాద్రపద శుద్ధ చవితి వినాయకచవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెలా చవితి రోజు మహా ఇష్టమైన రోజని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధిని ''సంకటహర చతుర్థి'' లేదా ''సంకష్టహర చతుర్ధి'' అంటారు. ఈ ''సంకష్టహర చతుర్ధి'' గనుక మంగళవారం నాడు వస్తే ''అంగారకి చతుర్ధి'' అంటారు.
పూర్వం భ్రుశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భ్రుశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భ్రుశుండి మహర్షి ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే ''సంకష్టహర చతుర్థి'' లేదా ''సంకష్ట చతుర్ధి''నాడు వినాయకుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా ''సంకష్ట చతుర్ధి'' నాడు చేసే పూజ, ఉపవాసాలకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి...
ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు, భ్రుశుండిని దర్శించుకుని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు ధగధగాయమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు.
దేవేంద్రుని విమానం కిందికి దిగివచ్చింది. ఆ ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు.
''ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది.. అందుకే విమానం కిందికి వచ్చింది'' అన్నాడు.
''మరి, ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది.. తిరిగి వెళ్ళడం ఎలా దేవా?''అనడిగారు అంతే ఆశ్చర్యంగా.
''ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ ''ఈరోజు పంచమి.. నిన్న చతుర్ధి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి.. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే, వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే, ఇది తిరిగి బయల్దేరుతుంది...'' అన్నాడు.
వాళ్ళు ఊరంతా విచారించారు. కానీ, ఒక్కరు కూడా ముందురోజు ఉపవాసం లేరని తేలింది.
దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా, వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసికెళ్తూ కనిపించారు.
ఇంద్రుడు చూసి, ''అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసికెళ్తున్నారు" అనడిగాడు.
''నిజమే.. ఆమె ఉత్తమురాలేం కాదు. కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్ర పోవడంవల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి, ఈరోజు ఉదయం లేచిన తర్వాతే తింది. అలా ఆమెకి తెలీకుండానే నిన్న చతుర్ధినాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెని మేం తీసుకువెళ్తున్నాం'' అని చెప్పారు.
అంతా విన్న తర్వాత ఇంద్రుడు ''సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింపచేయండి..'' అన్నాడు.
''క్షమించండి, అలా కుదరదు స్వామీ'' అంటూ వారు వెళ్ళిపోయారు.
అయితే, ఆమె మీది నుండి వచ్చిన గాలితో విమానం బయల్దేరింది. చతుర్ధి నాటి ఉపవాసం చేసిన మహిమ అలాంటిది.
అసలు సంకష్టహర గణపతి వ్రతమంటే ఏమిటి?
గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.
సంకటహర గణపతి :
సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తూ ఉంటాయి. అయితే మాఘమాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మరింత అరుదు. అదే వచ్చే నెల రెండో తారీఖున రాబోతున్న అద్భుత ముహూర్తం.
వ్రత కథ :
పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.
సంక్షిప్త వ్రత విధానం :
1. సూర్యోదయమవకముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమూ, నిత్య పూజ పూర్తి చేసుకోవాలి.
2. తరువాత గణేశుని తలచుకొని ఆరోజు సంకష్టహర గణపతి వ్రతం ఆచరించడానికి సంకల్పించుకోవాలి.
3. పగలంతా ఉపవాసంగాని, అల్పాహారంతోగాని ఉండాలి. నిష్ఠతో గడపాలి.
4. సాయంత్రమవగానే తెల్ల నువ్వులూ, ఉసిరి కలిపి నూరిన చూర్ణంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.
5. మట్టితో గణేశుని ప్రతిమచేసిగానీ, పసుపుతో మూర్తిని చేసిగానీ గణేశుని అందులోనికి రమ్మని ప్రార్థించాలి.
6. ధూప, దీపములూ, పుష్పాలంకరణ చేసి, తప్పనిసరిగా గరిక చిగుళ్ళతో పూజించాలి.
7. మూడు ఐదు లేదా ఏడు ఆకులు గల గరికలను, యిరవయ్యొకటి లేదా అంతకంటే ఎక్కువగానీ కనీసం ఒక్కటైనాగానీ సమర్పించాలి.
8. నలభై ఎనిమిది నిముషాలపాటు ఏదైనా గణేశ మంత్ర జపం చేయాలి.
9. గణేశునికి నైవేద్యం సమర్పించి, హారతినివ్వాలి.
10. చంద్రోదయ సమయానికల్లా ఈ పూజ అంతటినీ ముగించాలి.
11. తప్పనిసరిగా చంద్రుని చూచి, చంద్రునికీ చతుర్థీ తిథికి నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
12. తరువాత పూజామందిరంలోకి వెళ్ళి గణేశుని, "సంకటాం మాం నివారయ" (నా సంకటములను తొలగించు) అని వేడుకుని, నమస్కరించి అర్ఘ్యమివ్వాలి.
13. భోజన సమారాధన జరిపి, తరువాత తానూ భుజించాలి.
14. రాత్రంతా గణేశుని స్మరిస్తూ, కీర్తిస్తూ జాగారం చేయాలి.
15. తరువాత రోజు ఉదయం గణేశునికి సాధారణ పూజ చేసి, మళ్ళీ పూజించే అవకాశం అనుగ్రహించమంటూ స్వస్థానానికి తిరిగి వెళ్ళమని ప్రార్థించాలి.
16. తరువాత గణేశ నిమజ్జన కార్యక్రమం చేయాలి.
నిజానికి ఎంతో సులువుగా ఉన్నప్పటికీ, మనకు పూజలు అంతగా అలవాటు లేకపోవడంచేత, ఈ వ్రత విధిలో కొన్ని సందేహాలు రావడం సహజం. నాకు కలిగిన సందేహాల నివృత్తి కోసం గణేశ పురాణం శోధించగా,
1. అతి ముఖ్యమైన వ్రత విధి ఏమిటి?
జ. పైన bold చేసినవి (2,3,7,8,11,12,13).
2. ఏ పూలు వాడాలి?
జ. మందారము వంటి ఎరుపు రంగు పూలు వినాయకునికి అత్యంత యిష్టం.
వినాయక చవితి నాడు తప్ప గణేశ్వరుని పూజలో ఎప్పుడూ తులసి ఆకులు గానీ పూలు గానీ వాడరాదు. కాబట్టి అవి నిషిద్ధం.
3. ఏ మంత్రం జపించాలి?
జ. గురువుచే ఉపదేశింపబడిన గణపతి మంత్రం అత్యుత్తమం. అయినప్పటికీ,
'గజానన' అనే నామ మంత్రంగానీ,
'సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో గణాధిపః
ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః
ద్వాదశైతాని నామాని యః పఠేచ్ఛ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే' అనే నామ స్తోత్రంగానీ జపించవచ్చు.
4. నైవేద్యం ఏమి సమర్పించాలి?
కుడుములు, ఉండ్రాళ్ళు, అరటి కాయలు, పాయసము, నువ్వులు
5. ప్రసాదం తెల్లవారిన తరువాత స్వీకరించాలా?
జ. కాదు. చంద్రోదయం తరువాత గణేశునికి నమస్కరించి ప్రసాదం తప్పనిసరిగా భుజించాలి.
6. రోజంతా గణేశ స్మరణలో గడపడానికి తేలికైన దారి ఏదైనా ఉందా?
జ. గణేశ పురాణం చదవడం (వినడం) లేదా గణేశునికై నైవేద్యాలు వండటం (సమర్పించడం). చేతనైతే నృత్య గీతాలూ మంచివే.
7. అర్ఘ్యం యివ్వటం తెలియకపోతే?
జ. నమస్కరించడం ఉత్తమం. తెలియని పూజావిధి తలకెత్తుకోవడం మంచిది కాదు.
8. పూజ చేయడం చేతకాదనుకుంటే?
జ. మంచి బ్రాహ్మణుని పిలిచి అతనితో చేయించుకోవడం సర్వవిధాలా శ్రేయస్కరం. అయితే తప్పనిసరిగా పూజ పూర్తయిన వెంటనే దక్షిణ యివ్వండి.
వ్రతాచరణ వలన లాభాలు :
గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.
అనేక లాభాలు ఉన్న ఈ వ్రతాన్ని, ఒక్కరోజు ఆచరిస్తే చాలు గణేశలోకంలో స్థానాన్ని ప్రసాదించే ఈ వ్రతాన్ని, మళ్ళీ ఏడేళ్ళ తరువాత వచ్చినా అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో ఉండవో, ఈసారి తప్పక ఆచరిచి, మన అదృష్టాన్ని సార్థకం చేసుకుందాం. ఆ శక్తి పుత్రుని శక్తి సహితుని అనుగ్రహాన్ని పొందుదాం
పూర్తి వ్రతం చేయగలిగినా లేకున్నా కనీసం చంద్రోదయ సమయంలో చంద్రునికి, చతుర్థీ తిథికి, గణేశునికి నమస్కరించి భోజనం చేయండి. అత్యంత శ్రేయోదాయకమైన ముహూర్తం. గణేశానుగ్రహం తప్పక కలుగుతుంది.
సంకటహర గణపతి ధ్యానం, ఏకవింశతి నామాలు
ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం జ్వలత్పావకలోచనం
ఆఖుపృష్ఠ సమారూఢం చామరైః వీజితం గణైః
శేషయజ్ఞోపవీతం చ చింతయేత్తం గజాననం
ఏకవింశతి నామ పూజ :
ఓం సుముఖాయ నమఃమాలతీ పత్రం పూజయామిఓం గణాధిపాయ నమఃబృహతీ పత్రం పూజయామిఓం ఉమాపుత్రాయ నమఃబిల్వ పత్రం పూజయామిఓం గజాననాయ నమఃదూర్వాయుగ్మం పూజయామిఓం హరసూనవే నమఃదత్తూర పత్రం పూజయామిఓం లంబోదరాయ నమఃబదరీ పత్రం పూజయామిఓం గుహాగ్రజాయ నమఃఅపామార్గ పత్రం పూజయామిఓం గజకర్ణాయ నమఃజంబూ పత్రం పూజయామిఓం ఏకదంతాయ నమఃచూత పత్రం పూజయామిఓం వికటాయ నమఃకరవీర పత్రం పూజయామిఓం భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంత పత్రం పూజయామిఓం వటవే నమఃదాడిమీ పత్రం పూజయామిఓం సర్వేశ్వరాయ నమఃదేవదారు పత్రం పూజయామిఓం ఫాలచంద్రాయ నమఃమరువక పత్రం పూజయామిఓం హేరంబాయ నమఃసింధువార పత్రం పూజయామిఓం శూర్పకర్ణాయ నమఃజాజీ పత్రం పూజయామిఓం సురాగ్రజాయ నమఃగణ్డకీ పత్రం పూజయామిఓం ఇభవక్త్రాయ నమఃశమీ పత్రం పూజయామిఓం వినాయకాయ నమఃఅశ్వత్థ పత్రం పూజయామిఓం సురసేవితాయ నమఃఅర్జున పత్రం పూజయామిఓం కపిలాయ నమఃఅర్క పత్రం పూజయామి
వినాయక చవితి నాటి పూజకీ సంకటహర గణపతి పూజకీ తేడా కేవలం రెండు విషయాలలోనే. తులసీ పత్రం బదులు జంబూ పత్రం (నేరేడాకు) వాడటము, నైవేద్యంగా కుడుములు, ఉండ్రాళ్ళకు తోడు నల్ల నువ్వులను సమర్పించడము

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014
శ్రీ విఘ్నేశ్వర భక్తి సుమాలు-(108 రూపాలలో శ్రీ గణపతి)
1. ఏకాక్షర గణపతి
ప్రాతర్భజామ్య్భయదం ఖలు భక్త శోక
దావానలం గణ్విభుం వరకుంజరాస్యమ్
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహ వర్ధనమహం సుతమీశ్వరస్య
|
2.
మహా గణపతి
భిభ్రాణోబ్జక బీజాపూరక కదా దంతేక్షు బాణైస్సమం
భిభ్రాణో మణికుంభశాలి కణిశం పాశంచ వక్ర్తాంచితం
గౌరంగ్యారుచి రారవిందయుతయా దేవ్యాసనాధాంతిక:
శోణాంగ శ్శుభమాతనోతుభవతాం నిత్యం గణేశో మహాన్
|
3.
బాల గణపతి
కరస్ధ కదళీచూత పనసేక్షు కపిత్ధకం
బాలసూర్యప్రభందేవం వందే బాలగణాధిపం
|
4.
తరుణ గణపతి
పాశాంకుశాపూస కపిత్ధ జంబూ
ఫలం తిలాం చేక్షు మపిసవ హసై:
ధత్తే సదాయ స్తరుణారుణాంభ:
పాయాత్సయుష్మాన్ తరుణో గణేశ:
|
5.
విఘ్నరాజ గణపతి
విఘ్నరాజావతారశ్చ శేషవాహన ఉచ్చతే
మమతాసుర సంహర్తా విష్ణు బ్రహ్మేతివాచక:
|
6.
సిద్ది గణపతి
ఏకదంతం చతుర్హస్తం పాశాంకుశ ధారిణమ్
అభయంచవరదం హసైర్ద దానమూషకధ్వజమ్
|
7.
బుద్ధి గణపతి
త్రయీమయాఖిలం బుద్ధిధాత్రే
బుద్ధి ప్రదీపాయ సురాధిపాయ |
నిత్యాయ సత్యాయచ నిత్యబుద్ధే
నిత్యం నిరీహాయ నమోస్తు నిత్యమ్ ||
|
8.
లక్ష్మీ గణపతి
బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోత్సస్సరో నిస్సర:
శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవీ చ యస్యాంతికే
గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహాన్
|
9.
సంతాన లక్ష్మీ గణపతి
శరణం భవదేవేశ సంతతిం సుదృఢాంకురు |
భవిష్యంతియే పుత్రామత్కులే గణనాయక: ||
|
10.
దుర్గా గణపతి
తప్తకాంచన సంకాశం శ్చాష్ట్ట్ట మహత్తను: |
దీప్తాంకుశం శరం చాక్షం దంతం దక్షే వహన్కరై: ||
|
11.
సర్వశక్తి గణపతి
ఆలింగ్య దేవీం హరితాం నిషణ్ణాం
పరస్పరాశ్లిష్టకటీ నివేశం
సంధ్యారుణం పాశసృణీం వహస్తం
భయాపహం శక్తి గణేశ మీఢే
|
12.
విరివిరి గణపతి
సుసిద్ధాదం భక్తిజనస్యదేవ సకామిదా మామిహ సౌఖ్యదంతం |
అకా మికాగాం భవబంధహరం గజాననం భక్తియుతం భజామ ||
|
13.
క్షిప్ర గణపతి
దంతం కల్పలతా పాశ రత్నకుంభోప శోభితం
బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం
|
14.
హేరంబ గణపతి
అభయ వరద హస్త: పాశదంతాక్షమాల:
పరశుమధ త్రిశీర్షం ముద్గరం మోదకం చ
విదధతు నరసింహ: పంచమాతంగ వక్త్ర:
కనక రుచిర వర్ణ: పాతు హేరమ్బ నామా
|
15.
నిధి గణపతి
విచిత్ర రత్నై: ఖచితం సువర్ణ సమ్బూతకంగుహ్యమయా ప్రదత్తమం |
తధాంగులీష్పంగులికం గణేశ చిత్తేన సంశోభయ తత్పరేశ
|
16.
వక్రతుండ గణపతి
స్వర్ణవర్ణ చతుర్బాహుం | పాశాంకుశధరం విభుం |
ఆమ్రపాత్ర స్వదంతంచ | శక్తియుతం విచింతయేత్
|
17.
నవనీత గణపతి
దానాయ నానావిధ రూపకాంస్తే గృహాణ దత్తాన్మనసామయావై|
పదార్ధ భూతాన్ స్థిర జంగమాంశ్చ హేరమ్నమాం తారయ మోహభావాత్ ||
|
18.
ఉచ్ఛిష్గ్ట గణపతి
లీలాబ్జం దాడిమం వీణాశాలి గుంజాక్ష సూత్రకం
దధ దుచ్ఛిష్ట నామాయం గణేశ: పాతు మేచక:
|
19.
హరిద్రా గణపతి
హరిద్రాభం చతుర్బాహుం హరిద్రా వదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవచ
భక్తాభయ ప్రదాతాం వందే విఘ్న వినాశనమ్
|
20.
మోదక గణపతి
నాదబిందు కళాత్మకం వరనారదాది సుపూజితం |
మోదక ఫలదాయకం ప్రమోదవదన వినాయకం ||
|
21.
మేధా గణపతి
సకలభాగ్య వశంకరం వర సాధు సజ్జన సంహితం
అఖిలదేవ ప్రదాయకం మమ ఆత్మరక్ష వినాయకం
|
22.
మోహన గణపతి
రక్ష రక్ష గణాధ్యక్ష రక్షత్రైలోక్య రక్షక
భక్తానాం అభయంకర్తా త్రాతాభవ భవార్ణవాన్
|
23.
త్రైలోక్య మోహన గణపతి
గదా బీజాపూరే ధను: శూలచక్రే సరోజతృలే
పాశాధాన్య ప్రదంతారి కరై: సందధానం
స్వశుండాగ్ర రాజం | మణి కుంభ
మంగాధి రూఢం స పత్న్యా ||
|
24.
వీర గణపతి
భేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ
ఖట్వాంగ ముద్గర గధాంకుశ ముద్వహస్తం
వీరం గణేశ మరుణం సతతం స్మరామి
|
25.
ద్విజ గణపతి
యం పుస్తకాక్ష గుణ దండకమండలు
శ్రీవిద్యోతమాన కరభూషణమిందు వర్ణం
స్తంబేర మానన చతుష్టయ శోభమానం
త్వాం య: స్మరే ద్ద్విజ గణాధిపతే సధన్య: ||
|
26.
ఋణవిమోచన గణపతి
సృష్ట్యా బ్రహ్మణా సమ్యక్ పూజిత: ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్ర: ఋణనాశం కరోతుమే
|
27.
సంకష్టహర గణపతి
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాసం స్మరేన్నిత్యంమాయుష్కారమార్ధ సిద్ధయే
|
28.
గురు గణపతి
ప్రవరం సర్వదేవానాం సిద్ధినాం యోగినాం గురుం |
సర్వస్వరూపం సర్వేశం జ్ఞానరాశి స్వరూపిణమ్ ||
అవ్యక్తమక్షరం నిత్యంసత్యమాత్మ స్వరూపిణం |
వాయుతుల్యంచ నిర్లిప్తం చాక్షతం సర్వసాక్షిణం ||
|
29.
స్వర్ణ గణపతి
వందే వందారుమందార, మిందు భూషణ నందనం |
అమందానంద సందోహ, బంధురం సింధురాననమ్ ||
|
30.
అర్క గణపతి
మూషారూఢం లంబసూత్రం సర్పయజ్ఞోపవీతినల|
విషాణం పాష కమలం మోదకంచ కరైధృతం ||
|
31.
కుక్షి గణపతి
సరోజన్మన భూషాణాం భరణోజ్వలహస్త తన్వ్యా సమా
లింగితాంగాం | కరీంద్రాననాం చంద్ర చూడం త్రినేత్రం రక్తకాంతిం భజేత్తం ||
|
32.
పుష్టి గణపతి
ఏకదంతం మహాకాయం లంబోదరం గజాననం |
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ||
|
33.
వామన గణపతి
లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం |
అర్ధచంద్రధరం దేవం విఘ్నప్యూహం వినాశనం ||
|
34.
యోగ గణపతి
యోగరూఢో యోగ పట్టాభిరామో
బాలార్కభశ్చేంద్ర నీలాంశుకాఢ్య:
పాశాక్ష్వక్షాన్ యోగదండం దధానో
పాయాన్నిత్యం యోగ విఘ్నేశ్వరో న:
|
35.
నృత్య గణపతి
పాశాంకుశాపూప కుఠార దన్త చంచత్కరం వచరుతరాంగుళీయం
పీతప్రభం కల్పతరో రధస్ధం భజామి నృత్తైక పదం గణేశం
|
36.
దూర్వా గణపతి
దూర్వాంకురాన్వై మనసా ప్రదత్తాం స్త్రిపంచపత్రైర్యుతకాంశ్చ స్నిగ్ధాన్ |
గృహాణ విఘ్నేశ్వర సంఖ్యయా త్వం హీనాంశ్చ సర్వోపరి వక్రతుండ ||
|
37.
అభీష్టవరద గణపతి
నమస్తే వేద విదుషే నమస్తే వేద కారిణే |
కమన్యం శరణం యామ: కోను న: స్వాద్భయాపహ: ||
|
38.
లంబోదర గణపతి
లంబోదరావతారో వైక్రోధాసుర నిబర్హణ:
శక్తిబ్రహ్మ ఖగ: సద్యత్ తస్యధారక ఉచ్యతౌ ||
|
39.
విద్యా గణపతి
భక్త ప్రియాయ దేవాయ నమో జ్ణాన స్వరూపిణే |
నమో విశ్వస్యకర్త్రేతే నమస్తత్పాలకాయచ ||
|
40.
సరస్వతీ గణపతి
వాగీశాద్యా స్సుమనస: సర్వార్ధానాముపక్రమే
యంనత్వాకృత కృత్వాస్స్యు: తం నమామి గజాననమ్ ||
|
41.
సంపత్ గణపతి
పక్వచూత ఫలపుష్ప మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుతే నమ: శ్రీ సమృద్ధియత హేమపింగళ:
|
42.
సూర్య గణపతి
హిరణ్యగర్భం జగదీశితారరమృషిం పురాణం మండలస్థం |
గజాననం యం ప్రవిశన్తిసంతస్తత్కాలయోగైస్త మహం ప్రపద్యే ||
|
43.
విజయ గణపతి
శంఖేక్షు చాప కుసుమేఘ కుఠారదంత
పాశాంకుశై: కళమమంజరికా సనైధై:
పాణిస్థితై: పరిసమావృత భూషణ శ్రీ:
|
44.
పంచముఖ గణపతి
గణేశాయ ధామ్నే పరేశాయ తుభ్యం సదానంద రూపాయ సర్వార్తిగాయ|
అపారస్వరూపాయ దేవాధిదేవ నమస్తే ప్రభో భక్త సంరక్షకాయ ||
|
45.
నీలకంఠ గణపతి
వినాయకం నాయకమౌక్తికం త్రయీ హారావళే రావళితం భుజంగమై: |
పినాకిజం నాకిజనేడ్య మంహసాం నివారణం వారణ్వక్త్ర మాశ్రయే ||
|
46.
గాయత్రి గణపతి
యజ్ఞోపవీతం త్రిగుణస్వరూపం సౌవర్ణమేవం హ్యహినాధ భూతం |
భావేనదత్తం గణనాథతత్వం గృహాణ భక్తోద్దృతి కారణాయ ||
|
47.
చింతామణి గణపతి
కల్పద్రుమాధ: స్థితకామధేయం |
చింతామణిం దక్షిణపాణి శుండమ్ |
బిభ్రాణ మత్యద్భుత చిత్రరూపం |
య: పూజయేత్తస్య సమస్త సిద్ధి: ||
|
48.
ఏకదంత గణపతి
అగజానన పద్మార్కమ్ గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
|
49.
వికట గణపతి
వికటోనామ విఖ్యాత: కామాసుర విదాహక: |
మయూర వాహనశ్చాయం సౌరబ్రహ్మధర: స్మ్రత: ||
|
50.
వరద గణపతి
వరదాభయ హస్తాయ నమ: పరశుధారిణే |
నమస్తే సృణిహస్తాయ నాభివిశేషాయతే నమ: ||
|
51.
వశ్య గణపతి
విఘ్నేశ వీర్యాణి విచిత్రకాణి వన్దే జనైర్మాగధకై: స్మృతాని |
శ్రుత్వాసమత్తిష్ఠ గజానన త్వం బ్రహ్మేజగన్మంగళకం కురుష్వ ||
|
52.
కుల గణపతి
శుండావిభూషార్థమనన్తఖేలిన్ సువర్ణజం కంచుకమాగృహేంణ |
రత్నైశ్చయుక్తం మనసామయాయ ద్ధతం ప్రభోతత్సఫలం కురుష్వ ||
|
53.
కుబేర గణపతి
రత్నై: సువర్ణేన కృతాని గృహాణచత్వారి మయాప్రకల్ప్య |
సమ్భూషయ త్వం కటకాని నాథ చతుర్భుజేషు వ్యాజ విఘ్నహారిన్ |
|
54.
రత్నగర్భ గణపతి
హేరంబతే రత్నసువర్ణయుక్తే సునూపుర మంజీరకే తథైవ|
సు కింకిణీ నాద యుతే సుబుద్ధ్యా సుపాదయో: శోభమయే ప్రదత్తే ||
|
55.
కుమార గణపతి
మాత్రే పిత్రేచ సర్వేషాం హేరంబాయ నమో నమ:
అనాదయేచ విఘ్నేశ విఘ్నకర్తే నమోనమ:
|
56.
సర్వసిద్ధి గణపతి
పరంధామ పరంబ్రహ్మ పరేశం పరమేశ్వరం |
విఘ్నవిఘ్నకరం శాంతం పుష్టం కాంతమనంతకం |
సురాసురేంద్ర్యై: సిద్ధేంద్ర్యై: స్తుతం స్తౌమి పరాత్పరం |
సురపద్మచినేశంచ గణేశం మంగళాయనం ||
|
57.
భక్త గణపతి
నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం
శరచ్ఛశాంక సదృశం భజే భక్తగణాధిపమ్
|
58.
విఘ్న గణపతి
పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాఖవాహన:
విఘ్నం నిహస్తు న: సర్వ రక్తవర్ణో వినాయక:
|
59.
ఊర్ధ్వ గణపతి
కల్హారిశాలి కణిశేక్షుక చాపబాణ,
దంత ప్రరోహ కబర: కనకోజ్జ్వలాంగ:,
ఆలింగనోద్యత కర: తటిదాభకట్యా
దేయాత్స శతృభయ మూర్థ్వ గణేశ్వరస్తే
|
60.
వర గణపతి
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన
ఈప్సితం మేం వరం దేహి పరత్రా చ పరాంగతిమ్
|
61.
త్ర్యక్ష్యర గణపతి
సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితం
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్
|
62.
క్షిప్రప్రసాద గణపతి
యక్షకిన్నర గంధర్వ సిద్ధవిద్యా ధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందే హం గణనాయకమ్
|
63.
సృష్టి గణపతి
ప్రాతర్నమామి చతురానన వన్ద్యమానం
ఇచ్ఛానుకూలమఖిలం చ వరం దదానమ్
తం తుందిలం ద్విరసనాధిప యజ్ఞసూత్రం
పుత్రం విలాస చతురం శివయో: శివాయ
|
64.
ఉద్దండ గణపతి
ప్రాత:స్మరామి గణనాథమనాథ బంధుం
సిందూరపూర పరిశోభితగండయుగ్మం
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్
|
65.
డుండి గణపతి
అక్షమాలాం కుఠారంచ రత్నపాత్ర స్వదంతకమ్
ధతైకరైర్విఘ్నరాజో డుంఢినామా మదేస్తున:
|
66.
ద్విముఖ గణపతి
స్వదంత పాశాంకుశ రత్నపాత్రం కరైర్దదానో హరినీలగాత్ర:
రత్నాంశుకో రత్న కిరీటమాలీ భూత్యై సదామే ద్విముఖో గణేశ:
|
67.
త్రిముఖ గణపతి
శ్రీమత్తీక్షణ శిఖాం కుశాక్ష వరదాన్ దక్షే దదానం కరై:
పాశాంచామృత పూర్ణకుంభమయం వామే దదానోముదా
పీఠే స్వర్ణమయారవింద విలసత్సత్కర్ణికాభాసురే
స్వాసీనస్త్రిముఖ: పరశురుచిరో నాగనన: పాతున:
|
68.
సింహ గణపతి
వీణాం కల్పలతా మరించ వరదం దక్షేవిధత్తేకరై:
వేణే తామరసం చ రత్న కలశం సన్మంజరీం చా భయం
శుండాదండలసన్ మృగేంద్ర వందన: శంఖేందు గౌర: శుభో
దీప్యద్రత్న నిభాంకుశో గణపతి: పాయా దపాయాత్సన:
|
69.
గజానన గణపతి
సదా సుఖానందమయం జలేచ సముద్రేన ఇక్షురసే నివాసం|
ద్వంద్వ స్థయానేనచ నాళరూపం గజాననం భక్తియుతం భజామ||
|
70.
మహోదర గణపతి
మహోదర ఇతిఖ్యాతో జ్ఞానబ్రహ్మ ప్రకాశక:
మోహాసుర నిహంతావై ఆఖువాహన ఏవచ ||
|
71.
భువన గణపతి
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయతే |
నమో నమస్తే సత్యాయ సత్య పూర్ణాయ శుండినే ||
|
72.
ధూమ్రవర్ణ గణపతి
ధూమ్రవర్ణావతారశ్చాభి మానాసుర నాశక:
ఆఖువాహన ఏవాసౌ శివాత్మేతి స ఉచ్యతౌ
|
73.
శ్వేతార్క గణపతి
ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే
శ్వేతార్కమూలనివాసాయ
వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ
సూర్యవరదాయ కుమారగురవే
|
74.
ఆధార గణపతి
నాదం బాలసహస్ర భాను సదృశం నాగేంద్ర
వక్త్రాన్వితం | హస్తాభ్యాం చషకం పవిత్ర కలశం
హస్యంచ వృత్తాండవం | నానా చిత్రవిచిత్రయన్
పరగురుం ఆధార విద్యా స్థితిం | ఓంకార
ప్రణవాకృతిం గణపతిం నిత్యం భజేహం ప్రభో ||
|
75.
భూతరోగ నివారణ గణపతి
ఏకదంతం చతుర్హస్తం బిభ్రాణ పాశమంకుశం |
అభయం వరదం సాస్మృర్భధానం మూషిక ధ్వజం |
|
76.
ప్రసన్న విఘ్నహర గణపతి
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం |
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ||
|
77.
ద్వాదశభుజవీర గణపతి
సురేంద్రనేన్యం హ్యసురై: సుసేవ్యం సమానభావన విరాజయంతం|
అనంతబాహుం మూషక ధ్వజం తం గజాననం భక్తియుతం భజామ: ||
|
78.
వశీకర గణపతి
బీజాపూరగదేక్షుకార్ములసచ్చక్రోబ్జ పాశోత్పల|
వ్రీహ్యగ్రస్వ విషాణ రత్న కలశప్రోద్యత్కరాంభోరుహ: ||
ధ్యేయోవల్లభయా సపద్మకరయాశ్లిష్టోజ్వల- ద్భూషయ
విశ్వోత్పత్తి విపత్తి సంస్తుతికరో విఘ్నో విశిష్టార్ధద: ||
|
79.
అఘౌర గణపతి
గజవదనమంచింత్యం తీక్ష్ణదంష్టృం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతరాజం పురాణం
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం |
పశుపతి సుతమీశం విఘ్నరాజం నమామి ||
|
80.
విషహర గణపతి
నాగాననే నాగకృతోత్తరీయే క్రీడారతే, దేవకుమార సంఘై: |
త్వయిక్షణం కాలగతిం విహాయతౌ ప్రాపతు కన్దుకతామినేన్దూ ||
|
81.
భర్గ గణపతి
బాలార్కకోటి ద్యుతి మప్రమేయం
బాలేందు రేఖా కలితోత్తమాజ్ఞమ్ |
భ్రమద్ద్విరేపావృత గణ్డభాగం భజే భవానీతనయం గణేశమ్ ||
|
82.
సర్వ సమ్మోహన గణపతి
స్వాంకస్థితాయానిజవల్లభయాముఖామ్భుజాలోకేన లోలనేత్రం |
స్మేరాననాస్యం మదవైభవేన రుద్ధం భజే విశ్వవిమోహనంతం ||
|
83.
ఐశ్వర్య గణపతి
సహస్ర శీర్షం మనసా మయా త్వం దత్తం కిరీటంతు సువర్ణజంవై |
అనేకరత్నై: ఖచితం గృహాణ బ్రహ్మేశతే మస్తక శోభనాయ ||
|
84.
మాయావల్లభ గణపతి
సంసారార్ణవ పారేచ మాయాపోతే సుదుర్లభే |
కర్ణధార స్వరూపంచ భక్తానుగ్రహకారకం |
వరం వరేణ్యం వరదం వరదానామపి ఈశ్వరం |
సిద్ధం సిద్ధి స్వరూపంచ సిద్ధిదం సిద్ధి సాధనమ్ ||
|
85.
సౌభాగ్య గణపతి
తతో హరిద్రామచిరంగులాలం సిన్ధూరకం తేపరికల్పయామి |
సువాసితం వస్తు సువాస భూతై: గృహాణ బ్రహ్మేశ్వర శోభనార్థమ్ ||
|
86.
గౌరి గణపతి
విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ |
లంబోదరాయ సకలాయ జగద్ధితాయ |
నాగాసనాయ కృతియజ్ఞ విభూషితాయ |
గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే ||
|
87.
ప్రళయంకర్త గణపతి
అకాలమేవ ప్రళయ: కథం లబ్ధో జనైరయం |
హా ! గజానన దేవేశ: హాహా విఘ్న హరావ్యయ ||
|
88.
స్కంద గణపతి
కుమార భుక్తౌ పునరాత్మహేతో: పయోధరే పర్వతరాజ పుత్ర్యా|
ప్రక్షాళయంతం కరశీ కరేణ మౌగ్ధ్యేనతం నాగముఖం భజామి ||
|
89.
మృత్యుంజయ గణపతి
సరాగలోకదుర్లభం విరాగిలోక పూజితం
సురాసురైర్నమస్కృతం జరాప మృత్యునాశకం ||
|
90.
అశ్వ గణపతి
రాజోపచారాన్వి విధాన్గృహాణ హస్త్యశ్వఛత్రాధికమాద రాద్వై |
చిత్తేన దత్తాన్గణనాధడుణ్డే హ్యపార సంఖ్యాన్ స్థిరజంగమాంస్తే ||
|
91.
ఓంకార గణపతి
వందే గణేశం భుజగేంద్ర భూషణం సమస్త భక్తాళికృతాతితోషణం
విశ్వం భరా సంస్థితలోక రక్షణం మదీయ పాపౌఘతమస్సు పూషణమ్ ||
|
92.
బ్రహ్మవిద్యా గణపతి
బ్రహ్మేభ్యో బ్రహ్మదాత్రేచ గజానన నమోస్తుతే |
ఆదిపూజ్యాయ జ్యేష్ఠాయ జ్యేష్ఠరాజాయతే నమ: ||
|
93.
శివ అవతార గణపతి
విఘ్నానాం పతయే తుభ్యం నమో విఘ్న నివారణ |
సర్వాంతర్యామిణే తుభ్యాం నమస్సర్వప్రియంకర ||
|
94.
ఆపద గణపతి
ఓమ్ నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే ||
|
95.
జ్ఞాన గణపతి
గుణాతీతమౌనం చిదానంద రూపం |
చిదాభాసకం సర్వగం జ్ఞాన గమ్యం |
ముని శ్రేష్ఠమాకాశ రూపం పరేశం |
పరబ్రహ్మ రూపం గణేశం భజేమ ||
|
96.
సౌమ్య గణపతి
నమస్తే గణనాధాయ గణానాం పతయే నమ: |
భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యో సుఖదాయక ||
|
97.
మహాసిద్ధి గణపతి
గజవక్త్రం సురశ్రేష్ఠ కర్ణచామర భూషితం |
పాశాంకుశ ధరం దేవం వందే హం గణనాయకం ||
|
98.
గణపతి
సిందూరాస్త్రినేత్ర: పృథుతర జదరో హస్త పద్మం
దదానం | దంతం పాశాంకుశేష్ట్వానురుతర
విలసద్విజ పూరాభిరామం | బాలేందు ఖ్యాతిమౌళి
కరిపతి వదాన దాన పూర్ణార్థ గంధో | భోగేంద్రై
భూషితాంగోర్జేత్ గణపతిం రక్తస్త్రాంగరాగ: ||
|
99.
కార్యసిద్ధి గణపతి
యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: |
యతో విఘ్ననాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||
|
100.
భద్ర గణపతి
అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయతే నమ:
సుగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయచ ||
|
101.
సులభ గణపతి
వందే గజేంద్రవదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం
కుంకుమపరాగశోణం - క్వులయినీ జారకోరకా పీడమ్ ||
|
102.
నింబ గణపతి
విఘ్నహర్తే స్వభక్తానాం లంబోదర నమోస్తుతే |
త్వాదేయ భక్తియోగేన యోగీశాం శాంతిమాగతా: ||
|
103.
శుక్ల గణపతి
అంతరాయ తిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం |
తంనరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలంమహ: ||
|
104.
విష్ణు గణపతి
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
|
105.
ముక్తి గణపతి
పాశాంకుశౌ భగ్నరథం త్వభీష్టం కరైర్దధానం కరరన్ద్రముక్తై: |
ముక్తాఫలాభై: పృథుశీకరౌఘై: సిఙ్చన్తమఙ్గం శివయోర్భజామి ||
|
106.
సుముఖ గణపతి
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమోనమ: |
ప్రసన్న జనపాలాయ ప్రణతార్తివినాశినే ||
|
107.
సర్వ గణపతి
చతు: పదార్థా వివిధ ప్రకాశాస్త్త వివ హస్తా: సచతుర్భుజం |
అనాథనాథాంచ మహోదరంచ గజాననం భక్తియుతం భజామ:
|
108.
సిద్ధిబుద్ధి గణపతి
సత్పద్మరాగ మణివర్ణ శరీరకాంతి:
శ్రీ సిద్ధిబుద్ధి పరిచర్చిత కుంకుమశ్రీ:
వక్షస్థలే వలయితాతి మనోజ్ఞ శుణ్డో
విఘ్నం మామపహర సిద్ధి వినాయకత్వమ్ ||
|
లేబుళ్లు:
గణపతి కదంబం
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)