హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

నవగ్రహా కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నవగ్రహా కదంబం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, సెప్టెంబర్ 29, 2016

నవగ్రహ శాంతికి పూజించాల్సిన మొక్కలు ఇవే.....

నవగ్రహ శాంతికి పూజించాల్సిన మొక్కలు ఇవే


1.రవి గ్రహమునకు సంబందించిన తెల్లజిల్లేడు మొక్కలను నాటడము పూజించడము
2. చంద్ర గ్రహమునకు సంబందించిన మోదుగ మొక్కలను నాటడము పూజించడము.
3.కుజ గ్రహమునకు సంబందించిన చండ్ర (ఖదిర) మొక్కలను నాటడము పూజించడము. 
4.రాహు గ్రహమునకు సంబందించిన గరిక మొక్కలను నాటడము పూజించడము. 
5. గురు గ్రహమునకు సంబందించిన రావి మొక్కలను నాటడము పూజించడము.
6.శని గ్రహమునకు సంబందించిన జమ్మి మొక్కలను నాటడము పూజించడము. 
7. బుధ గ్రహమునకు సంబందించిన ఉత్తరేణి మొక్కలను నాటడము పూజించడము.
8. కేతు గ్రహమునకు సంబందించిన ధర్భ మొక్కలను నాటడము పూజించడము
9. శుక్ర గ్రహమునకు సంబందించిన మేడి మొక్కలను నాటడము పూజించడము.


నవగ్రహాల ఆధిపత్యంలో కష్టసుఖాలుంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కానీ నవగ్రహాలను శాంతి పరచడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఆయా గ్రహాధిపత్యంలో పుట్టిన జాతకులు తమ గ్రహాధిపత్య సంచారాన్ని అనుసరించి పూజ, దానం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. 



నవగ్రహ శాంతికి సంబంధించి జాతక ప్రకారం పూజాది కార్యక్రమాలు చేయాలనుకునేవారు నవగ్రహాలకు ప్రీతికరమైన వస్తువులతో పూజ, దానాది కార్యక్రమాలను నిర్వహించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నవగ్రహ పూజలో భాగంగా గ్రహ శాంతికి, దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి సకల శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

ఇందులో సూర్యగ్రహ శాంతి కోసం పూజ చేసేవారు గోధుమలను దానము చేయాలి. ఈ జాతకులు చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. 

గురు గ్రహానికి పూజ నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల వీరికి అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం చంద్రుణ్ణి పూజించి బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది.

ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శత్రు బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చ ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. 

శుక్రుని పూజలో అలచందల దానము చేయాలి. వజ్రం, పగడము ధరించిటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతరత్రా కష్టాలు తొలగిపోతాయి.

సోమవారం, జూన్ 01, 2015

నవగ్రహ ధ్యాన మన్త్రాః

 ॥ నవగ్రహ ధ్యాన మన్త్రాః సాధుసఙ్కులి తన్త్రాన్తర్గతమ్ ॥
గ్రహపురశ్చరణ ప్రయోగః

ఓం రక్తపద్మాసనం దేవం చతుర్బాహుసమన్వితమ్ ।
క్షత్రియం రక్తవర్ణఞ్చ గోత్రం కాశ్యపసమ్భవమ్ ॥

సప్తాశ్వరథమారూఢం ప్రచణ్డం సర్వసిద్ధిదమ్ ।
ద్విభుజం రక్తపద్మైశ్చ సంయుక్తం పరమాద్భుతమ్ ॥

కలిఙ్గదేశజం దేవం మౌలిమాణిక్యభూషణమ్ ।
త్రినేత్రం తేజసా పూర్ణముదయాచలసంస్థితమ్ ॥

ద్వాదశాఙ్గుల-విస్తీర్ణం ప్రవరం ఘృతకౌశికమ్ ।
శివాధిదైవం పుర్వాస్యం బ్రహ్మప్రత్యధిదైవతమ్ ॥

క్లీం ఐం శ్రీం హ్రీం సూర్యాయ నమః ।

ఓం శుక్లం శుక్లామ్బరధరం శ్వేతాబ్జస్థం చతుర్భుజమ్ ।
హారకేయూరనూపురైర్మణ్డితం తమసాపహమ్ ॥

సుఖదృశ్యం సుధాయుక్త-మాత్రేయం వైశ్యజాతిజమ్ ।
కలఙ్కాఙ్కితసర్వాఙ్గం కేశపాశాతిసున్దరమ్ ॥

ముకుటేర్మణిమాణిక్యైః శోభనీయం తు లోచనమ్ ।
యోషిత్ప్రియం మహానన్దం యమునాజలసమ్భవమ్ ॥

ఉమాధిదైవతం దేవమాపప్రత్యధిదైవతమ్ ॥

హ్రీం హ్రీం హుం సోమాయ స్వాహా ।

ఓం మేశాధిరూఢం ద్విభుజం శక్తిచాపధరం ముదా ।
రక్తవర్ణం మహాతేజం తేజస్వీనాం సమాకులమ్ ॥

రక్తవస్త్రపరిధానమ్ నానాలఙ్కారసంయుతమ్ ।
రక్తాఙ్గం ధరణీపుత్రం రక్తమాల్యానులేపనమ్ ॥

హస్తే వారాహదశనం పృష్ఠే తూణసమన్వితమ్ ।
కటాక్షాద్ భీతిజనకం మహామోహప్రదం మహత్ ॥

మహాచాపధరం దేవం మహోగ్రముగ్రవిగ్రహమ్ ।
స్కన్దాదిదైవం సూర్యాస్యం క్షితిప్రత్యధిదైవతమ్ ॥

హ్రీం ఓం ఐం కుజాయ స్వాహా ।

ఓం సుతప్తస్వర్ణాభతనుం రోమరాజివిరాజితమ్ ।
ద్విభుజం స్వర్ణదణ్డేవ శరచ్చన్ద్రనిభాననమ్ ॥

చరణే రత్నమఞ్జీరం కుమారం శుభలక్షణమ్ ।
స్వర్ణయజ్ఞోపవీతఞ్చ పీతవస్త్రయుగావృతమ్ ॥

అత్రిగోత్రసముత్పన్నం వైశ్యజాతిం మహాబలమ్ ।
మాగధం మహిమాపూర్ణం ద్వినేత్రం ద్విభుజం శుభమ్ ॥

నారాయణాధిదైవఞ్చ విష్ణుప్రత్యధిదైవతమ్ ।
చిన్తయేత్ సోమతనయం సర్వాభిష్టఫలప్రదం ॥

ఓం క్లీం ఓం బుధాయ స్వాహా ।

ఓం కనకరుచిరగౌరం చారుమూర్తిం ప్రసన్నం
ద్విభుజమపి సరజౌ సన్దధానం సురేజ్యం ।
వసనయుగదధానం పీతవస్త్రం సుభద్రం
సురవరనరపుజ్యమఙ్గిరోగోత్రయుక్తమ్ ॥

ద్విజవరకులజాతం సిన్ధుదేశప్రసిద్ధం
త్రిజగతి గణశ్రేష్ఠశ్చాధిదైవం తదీయమ్ ।
సకలగిరినిహన్తా ఇన్ద్రః ప్రత్యాధిదైవం 
గ్రహగణగురునాథం తం భజేఽభీష్టసిద్ధౌ ॥

రం యం హ్రీం ఐం గురవే నమః ।

ఓం శుక్లామ్బరం శుక్లరుచిం సుదీప్తం
తుషారకున్దేన్దుద్యుతిం చతుర్భుజమ్ ।
ఇన్ద్రాధిదైవం శచీప్రత్యాధిదైవం
వేదార్థవిజ్ఞం చ కవిం కవీనామ్ ॥

భృగుగోత్రయుక్తం ద్విజజాతిమాత్రం
దితీన్ద్రపూజ్యం ఖలు శుద్ధిశాన్తం ।
సర్వార్థసిద్ధిప్రదమేవ కావ్యం
భజేఽప్యహం భోజకతోద్భవం భృగుమ్ ॥

హుం హుం శ్రీం శ్రీం నం రం శుక్రాయ స్వాహా ।

ఓం సౌరిం గృధ్రగతాతికృష్ణవపుషం కాలాగ్నివత్ సఙ్కులం
సంయుక్తం భుజపల్లవైరుపలసత్స్తమ్భైశ్చతుర్భిః సమైః ।
భీమం చోగ్రమహాబలాతివపుషం బాధాగణైః సంయుతం
గోత్రం కాశ్యపజం సురాష్ట్రవిభవం కాలాగ్నిదైవం శనిమ్ ॥

వస్త్రైః కృష్ణమయైర్యుతం తనువరం తం సూర్యసూనుం భజే ॥

హ్రీం క్లీమ్ శనైశ్చరాయ నమః ।

ఓం మహిషస్థం కృష్ణం వదనమయవిభుం కర్ణనాసాక్షిమాత్రమ్
కారాలాస్యం భీమం గదవిభవయుతం శ్యామవర్ణం మహోగ్రం ।
పైఠీనం గోత్రయుక్తం రవిశశీదమనం చాధిదైవం యమోఽపి
సర్పప్రత్యధిదైవతం మలయగీర్భావం తం తమసం నమామి ॥

వం ఐం వం వం క్లీం వం తమసే స్వాహా ।

ఓం మహోగ్రం ధూమాభం కరచరణయుతం ఛిన్నశీర్షం సుదీప్తమ్
హస్తే వాణం కృపాణం త్రిశిఖశశిధృతం వేదహస్తం ప్రసన్నం ।
బ్రహ్మా తస్యాధిదైవం సకలగదయుతం సర్పప్రత్యధిదైవం ధ్యాయేత్
కేతుం విశాలం సకలసురనరే శాన్తిదం పుష్టిదఞ్చ ॥

శ్రీం శ్రీం ఆం వం రం లం కేతవే స్వాహా ।

గురువారం, డిసెంబర్ 18, 2014

శని శాంతి మంత్రం శని శాంతి మంత్ర స్తుతి

(Shani Shanti Mantra Stuti)

ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్
ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్
నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార
వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ
ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ
కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ
శుద్ధబుద్ధి ప్రదాయనే
య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్
మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే

ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు, నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి.
ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది.

ఆదివారం, నవంబర్ 16, 2014

శ్రీ భాస్కరాష్టకమ్



1 . శ్లో || శ్రీ పద్మినీశ మరుణోజ్వల కాంతి మంతం |
          మౌనీంద్ర  బృంద సుర వన్దిత పాద పద్మమ్ |
          నీరేజ సంభవ ముకున్ద శివ స్వరూపమ్ |
          శ్రీ భాస్కరం భువన బాంద వ మాశ్రయామి ||

2 . శ్లో || మార్తాన్డ మీశమఖిలాత్మక మంశు మంతమ్ |
           ఆనంద రూప మఱి మాదిక సిద్ది దంచ |
           ఆద్యంత మధ్య రహితంచ శివ ప్రదంత్వాం |
           శ్రీ భాస్కరం నత జనాశ్రయ మాశ్రమామి ||

3 . శ్లో || సప్తాశ్వ మభ్రమణి మాశ్రిత పారిజాతమ్  |
           జాంబూన దాభ మతి నిర్మల దృష్టి దంచ |
           దివ్యంబరాభారణ భూషిత చారు మూర్తిమ్ |
           శ్రీ భాస్కరంగ్ర హగనాది పమాశ్రయామి ||

4 . శ్లో || పాపార్తి రోగ భయ ధు:ఖ హరం శరణ్యమ్
           సంసార గాఢ తమ సాగర తారకాంచ |
           హంసాత్మకం నిగమ వేద్య మహాశక రంత్వామ్ |
           శ్రీ భాస్కరం కమల భాందవ మాశ్రయామి ||

5 . శ్లో || ప్రత్యక్ష దైవ మాచలాత్మక మచ్యుతంచ |
           భక్తి ప్రియం సకల సాక్షిణ మప్రమేయమ్ |
           శ్రీ భాస్కరం జగదదీశ్వర మాశ్రయామి ||

6 . శ్లో || జ్యోతి స్వరూప మఘ సంచయ నాశకంచ |
           తాపత్రయాన్తక మనంత శుభ ప్రదంచ |
           కాలాత్మకం గ్రహ గణేన సుసేవితంచ |
           శ్రీ భాస్కరం భువన రక్షక మాశ్రయామి ||

7 . శ్లో || సృష్టి  స్థితి ప్రళయ కారణ మీశ్వరంచ |
           దృష్టి ప్రదం పరమ తుష్టిద మాశ్రిత్రానాం |
           ఇష్టార్దధం సకల కష్ట నివారకంచ |
           శ్రీ భాస్కరం మృగ పతీశ్వర మాశ్రయామి ||

8 . శ్లో || ఆదిత్య మార్త జన రక్షక మవ్యంచ |
           చాయాధవం కనక రేత సమగ్ని గర్భమ్ |
           సూర్యం కృపాళు మఖిలాశ్రయ యాదిదేవమ్
           లక్ష్మీనృసింహ కవి పాలక మాశ్రయామి ||

      ఫలశ్రుతి :
           శ్లో || శ్రీ భాస్కరాష్టక మిదం పరమం పవిత్రమ్ |
                 యత్ర శ్రుతంచ పఠితం సతతం స్మృతంచ |
                 తత్ర స్థిరాణి కమలాప్త కృపా విలాసై |
                 దీర్ఘాయురర్ధ బల వీర్య సుతాది కాని ||

                                                         హరి : ఓం - తత్ సత్

ఆదివారం, నవంబర్ 02, 2014

Surya Mandala stotram - సూర్యమండల స్తోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః
యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్
యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |

మంగళవారం, అక్టోబర్ 21, 2014

నవగ్రహ ప్రదక్షిణము నిష్ఫలం


ఇంతకు ముందు చెప్పినట్లుగా నవగ్రహ శాంతి పూజ దానము జపములు, నవరత్నములు ఎలా శుభాన్ని ఇవ్వవో అదేవిధముగా నవగ్రహ ప్రదక్షిణము కూడా ఫలితాన్నిఇవ్వదు.ఎందుకనగా నవగ్రహాలలో జాతకునికి కొందరు శుభులు కొందరు పాపులుగా లగ్నానుసారం నియమించబడ్డారు.
అలాంటప్పుడు పాపులకు ప్రదక్షిణ ఎలా శుభాన్నిస్తుంది. అందరికి తిరిగిన
పాపులెవరో పున్యులెవరో ఎలా తెలుస్తుంది ఫలితము. పాపపుణ్య మిశ్రితమాయి దుష్ఫలితము ఇస్తుంది తప్ప శుభఫలితము ఇవ్వదు.

ప్రతిదానికి నవగ్రహములు ఆవశ్యకమని నవగ్రహ ప్రతిష్ట చేసారు. ఇందులో రెండు తప్పులు కనబడుతున్నవి

ఒకటి అందరిని ఒకచోట ప్రతిష్టించి ఒక్కొక్కరికి విడిగా తిరుగునట్లు
వీలులేక సమిధ, యంత్రము, మంత్రము, పతాకము విడిచినారు. పాప గ్రహాలను పూజించకూడదు శుభగ్రహాలను పూజించాలి అప్పుడే పుణ్యము వృద్ధి అవుతుంది కాని అందరికి తిరిగిన మంచి చెడు కలగలసి మానవుడు కష్టాలపాలవుతాడు.

ఇక రెండవది దశదిక్కులకు అధిపతులను నియమించారు కాని వాటికి విరుధముగానే ఉన్నది ఇప్పటి నవగ్రహ ప్రతిష్ట. ఇది ఫలితము నివ్వజాలదు అసలు రాహుకేతువులే లేకుండా సప్తగ్రహ మండలిని నియమించినారు కొన్నిచోట్లలో ,వారు లేనప్పుడు వారి కారకత్వములను ఎవరికి ఇవ్వవలెను?

ఈశాన్యమునకు - గురు, కేతువులు
తూరుపుకు - సూర్యుడు
ఆగ్నేయమునకు - శుక్రుడు
దక్షినమునకు - కుజుడు
నైరుతికి - రాహువు
పశ్చిమమునకు - శని
వాయువ్యమునకు- చంద్రుడు
ఉత్తరమునకు - బుధుడు
భూమికి - కుజుడు
ఆకాశమునకు - చంద్రుడు

ఇలా దశదిక్కులకు అధిపతులను నియమించినారు కాని ఇప్పటి గ్రహమండలము వీటిని అనుసరించక తప్పుగా ఉన్నదని తేలుతున్నది.

సూర్యుడిని మద్యలో నిలిపి శుక్రుడుని తూర్పుకు నిలిపిరి, ఆగ్నేయమునకు
చంద్రుడిని చేర్చిరి, వాయువ్యము కేతువునకు ఇచ్చిరి ఉత్తరాధిపతి కుబేరుడు
ధనాగారము కలవాడని - గురువు ధనాకారకుదని పురానోక్తముగా గురువున్న చోటికి బుధున్ని, బుధుడున్న చోటికి గురువుని మార్చినారు. ఈ మార్పువలన నవగ్రహ మండలము అపసవ్యమని తేలుతున్నది. ఫలితము నిష్ఫలము.

గృహములకు దిక్కులను చూచిన ఇప్పటి నవగ్రహమండలము తప్పుగా ఉన్నదని తేలుతున్నది

శనివారం, సెప్టెంబర్ 20, 2014

శనిగ్రహ స్తోత్రం

1.శనిగ్రహ స్తోత్రం

నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే |
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయచ నమోస్తుతే |
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో |
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్యచ ||


2.ఏలినాటి శని స్తోత్రం:
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః |
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః ||
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః ||
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే ||

ఈ 16 నామాల్ని నిత్యం పఠిస్తే, శనీశ్చరుడు సంతుష్టినొంది కోరిన కొరికలను తీరుస్తాడు.

బుధవారం, సెప్టెంబర్ 17, 2014

నవగ్రహ దోష నివారణ స్తోత్రం

శ్రీ సూర్యగ్రహ దోష నివృత్యర్థం శ్రీ రామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ చంద్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కృష్ణావతార స్తుతి పఠనంచ కరిష్యే:
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశహరే
కాళియమర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కుజగ్రహ దోష నివృత్యర్థం శ్రీ నృసింహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
హిరణ్య కశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయ దాయక హేతో
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బుధగ్రహ దోష నివృత్యర్థం శ్రీ బుద్ధావతార స్తుతి పఠనంచ కరిష్యే:
దానవపతి మానాపహార త్రిపుర విజయ మర్దన రూప
బౌద్ధ జ్ఞానద బుద్ధనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బృహస్పతిగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వామనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భవ బంధన హర వితతమతే పాదోదక నిహతాఘతతే
వటుపటు వేష మనోజ్ఞనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శుక్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ పరశురామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
క్షీతిపతి వంశక్షయ కరమూర్తే క్షీతిపతి కర్తా హరిహరమూర్తే
భృగుహల రామ పరేశనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శనైశ్చరగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కూర్మావతార స్తుతి పఠనంచ కరిష్యే:
మంథనాచల ధారణహేతో దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ రాహుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వరాహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భూచోరక హర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే
క్రోడాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కేతుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ మీనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
వేదోధార విచారమతే సోమకదానవ సంహరణే
మీనాతార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కలి దోష నివృత్యర్థం శ్రీ కల్కీవతార స్తుతి పఠనంచ కరిష్యే:
శిష్టజనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే
కల్కిరూప పరిపాల నమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


పై స్తోత్ర్రం పఠిచవలసిన విధానం:
రవి స్తోత్రం ఆదివారం 6 సార్లు
చంద్ర స్తోత్రం సోమవారం 10 సార్లు
కుజ స్తోత్రం మాంగళవారం 7 సార్లు
బుధ స్తోత్రం బుధవారం 17 సార్లు
గురు స్తోత్రం గురువారం 16 సార్లు
శుక్ర స్తోత్రం శుక్రవారం 20 సార్లు
శని స్తోత్రం శనివారం 19 సార్లు
రాహు స్తోత్రం శని,ఆదివారం 18 సార్లు
కేతు స్తోత్రం మంగళవారం 7 సార్లు
ప్రతిరోజు మిగితావి ఒక్కసారి మాత్రమే.

ఆదివారం, జూన్ 22, 2014

శ్రీదినేశస్తవః


శృఙ్గగిరి నికటస్థ శ్రీసూర్యనారాయణ దేవస్థానే విరచితం
మానససరోగతం మే
శోషయ పఙ్కం ఖరోస్ర దిననాథ
నో చేత్ఖరత్వమేషా-
మస్రాణాం భూయాత్కథం బ్రూహి ౧
నివార్య బాహ్యం పరమన్ధకారం
దినేశ గర్వం కురుషే వృథా త్వమ్
యద్యస్తి శక్తిస్తవ మామకీన-
మన్తఃస్థమాన్ధ్యం వినివారయాశు ౨
ఇతి శ్రీమచ్ఛృఙ్గేరీ జగద్గురు శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య అనన్తశ్రీ సచ్చిదానన్ద శివాభినవనృసింహభారతీ మహాస్వామిభిః శృఙ్గగిరి నికటస్థ శ్రీసూర్యనారాయణ దేవస్థానే విరచితం శ్రీదినేశ స్తవః

శనివారం, జూన్ 22, 2013

Sri Chandra ashtottara satanamavali in telugu - శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రం:-
శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః
సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః || ౧ ||
జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః
వికర్తనానుజో వీరో విశ్వేశో విదుశాంపతిః || ౨ ||

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః
అష్టమూర్తిప్రియోzనంత కష్టదారుకుఠారకః || ౩ ||

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః
కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః || ౪ ||

మృత్యుసంహారకోzమర్త్యో నిత్యానుష్ఠానదాయకః
క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః || ౫ ||

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః
సుధామయస్సురస్వామీ భక్తనామిష్టదాయకః || ౬ ||

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః
సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః || ౭ ||

భయాంతకృత్ భక్తిగమ్యో భవబంధవిమోచకః
జగత్ప్రకాశకిరణో జగదానందకారణః || ౮ ||

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః
భూచ్ఛాయాచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః || ౯ ||

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః
సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః || ౧౦ ||

సితచ్ఛత్రధ్వజోపేతః శీతాంగో శీతభూషణః
శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః || ౧౧ ||

దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః
కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోzత్యంతవినయః ప్రియదాయకః
కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః || ౧౩ ||

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః
వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః || ౧౪ ||

మహేశ్వరఃప్రియో దాంత్యో మేరుగోత్రప్రదక్షిణః
గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః || ౧౫ ||

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః
ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః || ౧౬ ||

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః
సకలాహ్లాదనకరో ఫలాశసమిధప్రియః || ౧౭ ||

శుక్రవారం, జూన్ 21, 2013

Sri Angaraka ashtottara satanamavali in telugu - శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం

 శ్రీ అంగారక అష్టోత్తర శతనామ స్తోత్రం :-
మహీసుతో మహాభాగో మంగళో మంగళప్రదః
మహావీరో మహాశూరో మహాబలపరాక్రమః || ౧ ||
మహారౌద్రో మహాభద్రో మాననీయో దయాకరః
మానజోzమర్షణః క్రూరః తాపపాపవివర్జితః || ౨ ||

సుప్రతీపః సుతామ్రాక్షః సుబ్రహ్మణ్యః సుఖప్రదః
వక్రస్తంభాదిగమనో వరేణ్యో వరదః సుఖీ || ౩ ||

వీరభద్రో విరూపాక్షో విదూరస్థో విభావసుః
నక్షత్రచక్రసంచారీ క్షత్రపః క్షాత్రవర్జితః || ౪ ||

క్షయవృద్ధివినిర్ముక్తః క్షమాయుక్తో విచక్షణః
అక్షీణఫలదః చక్షుర్గోచరశ్శుభలక్షణః || ౫ ||

వీతరాగో వీతభయో విజ్వరో విశ్వకారణః
నక్షత్రరాశిసంచారో నానాభయనికృంతనః || ౬ ||

కమనీయో దయాసారః కనత్కనకభూషణః
భయఘ్నో భవ్యఫలదో భక్తాభయవరప్రదః || ౭ ||

శత్రుహంతా శమోపేతః శరణాగతపోషకః
సాహసః సద్గుణాధ్యక్షః సాధుః సమరదుర్జయః || ౮ ||

దుష్టదూరః శిష్టపూజ్యః సర్వకష్టనివారకః
దుశ్చేష్టవారకో దుఃఖభంజనో దుర్ధరో హరిః || ౯ ||

దుఃస్వప్నహంతా దుర్ధర్షో దుష్టగర్వవిమోచకః
భరద్వాజకులోద్భూతో భూసుతో భవ్యభూషణః || ౧౦ ||

రక్తాంబరో రక్తవపుర్భక్తపాలనతత్పరః
చతుర్భుజో గదాధారీ మేషవాహో మితాశనః || ౧౧ ||

శక్తిశూలధరశ్శక్తః శస్త్రవిద్యావిశారదః
తార్కికః తామసాధారః తపస్వీ తామ్రలోచనః || ౧౨ ||

తప్తకాంచనసంకాశో రక్తకింజల్కసంనిభః
గోత్రాధిదేవో గోమధ్యచరో గుణవిభూషణః || ౧౩ ||

అసృజంగారకోzవంతీదేశాధీశో జనార్దనః
సూర్యయామ్యప్రదేశస్థో యావనో యామ్యదిఙ్ముఖః || ౧౪ ||

త్రికోణమండలగతో త్రిదశాధిపసన్నుతః
శుచిః శుచికరః శూరో శుచివశ్యః శుభావహః || ౧౫ ||

మేషవృశ్చికరాశీశో మేధావీ మితభాషణః
సుఖప్రదః సురూపాక్షః సర్వాభీష్టఫలప్రదః || ౧౬ ||

గురువారం, జూన్ 20, 2013

Sri Guru ashtottara satanamavali in telugu - శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ గురు అష్టోత్తరశతనామ స్తోత్రం:-

గురుర్గుణవరో గోప్తా గోచరో గోపతిప్రియః
గుణీ గుణవతాంశ్రేష్ఠో గురూణాంగురురవ్యయః || ౧ ||
జేతా జయంతో జయదో జీవోzనంతో జయావహః
ఆంగీరసోzధ్వరాసక్తో వివిక్తోzధ్వరకృత్పరః || ౨ ||

వాచస్పతిర్ వశీ వశ్యో వరిష్ఠో వాగ్విచక్షణః
చిత్తశుద్ధికరః శ్రీమాన్ చైత్రః చిత్రశిఖండిజః || ౩ ||

బృహద్రథో బృహద్భానుర్బృహస్పతిరభీష్టదః
సురాచార్యః సురారాధ్యః సురకార్యహితంకరః || ౪ ||

గీర్వాణపోషకో ధన్యో గీష్పతిర్గిరిశోzనఘః
ధీవరో ధిషణో దివ్యభూషణో దేవపూజితః || ౫ ||

ధనుర్ధరో దైత్యహంతా దయాసారో దయాకరః
దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయనసంభవః || ౬ ||

ధనుర్మీనాధిపో దేవో ధనుర్బాణధరో హరిః
ఆంగీరసాబ్జసంజాతః ఆంగీరసకులసంభవః || ౭ ||

సింధుదేశాధిపో ధీమాన్ స్వర్ణవర్ణః చతుర్భుజః
హేమాంగదో హేమవపుర్హేమభూషణభూషితః || ౮ ||

పుష్యనాథః పుష్యరాగమణిమండలమండితః
కాశపుష్పసమానాభః కలిదోషనివారకః || ౯ ||

ఇంద్రాదిదేవోదేవేశో దేవతాభీష్టదాయకః
అసమానబలః సత్త్వగుణసంపద్విభాసురః || ౧౦ ||

భూసురాభీష్టదో భూరియశః పుణ్యవివర్ధనః
ధర్మరూపో ధనాధ్యక్షో ధనదో ధర్మపాలనః || ౧౧ ||

సర్వవేదార్థతత్త్వజ్ఞః సర్వాపద్వినివారకః
సర్వపాపప్రశమనః స్వమతానుగతామరః || ౧౨ ||

ఋగ్వేదపారగో ఋక్షరాశిమార్గప్రచారకః
సదానందః సత్యసంధః సత్యసంకల్పమానసః || ౧౩ ||

సర్వాగమజ్ఞః సర్వజ్ఞః సర్వవేదాంతవిద్వరః
బ్రహ్మపుత్రో బ్రాహ్మణేశో బ్రహ్మవిద్యావిశారదః || ౧౪ ||

సమానాధికనిర్ముక్తః సర్వలోకవశంవదః
ససురాసురగంధర్వవందితః సత్యభాషణః || ౧౫ ||

నమః సురేంద్రవంద్యాయ దేవాచార్యాయ తే నమః
నమస్తేzనంతసామర్థ్య వేదసిద్ధాంతపారగః || ౧౬ ||

సదానంద నమస్తేస్తు నమః పీడాహరాయ చ
నమో వాచస్పతే తుభ్యం నమస్తే పీతవాససే || ౧౭ ||

నమోzద్వితీయరూపాయ లంబకూర్చాయ తే నమః
నమః ప్రకృష్టనేత్రాయ విప్రాణాంపతయే నమః || ౧౮ ||

నమో భార్గవశిష్యాయ విపన్నహితకారిణే
నమస్తే సురసైన్యానాంవిపత్ఛిద్రానకేతవే || ౧౯ ||

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వగః సర్వతోవిభుః || ౨౦ ||

సర్వేశః సర్వదాతుష్టః సర్వదః సర్వపూజితః
అక్రోధనో మునిశ్రేష్ఠో దీప్తికర్తా జగత్పితా || ౨౧ ||

విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః
భూర్భువోధనదాసాజభక్తాజీవో మహాబలః || ౨౨ ||

బృహస్పతిః కాశ్యపేయో దయావాన్ శుభలక్షణః
అభీష్టఫలదః శ్రీమాన్ సుభద్గర నమోస్తు తే || ౨౩ ||

బృహస్పతిస్సురాచార్యో దేవాసురసుపూజితః
ఆచార్యోదానవారిష్ట సురమంత్రీ పురోహితః || ౨౪ ||

కాలజ్ఞః కాలఋగ్వేత్తా చిత్తదశ్చ ప్రజాపతిః
విష్ణుః కృష్ణః సదాసూక్ష్మః ప్రతిదేవోజ్జ్వలగ్రహః || ౨౫ ||

బుధవారం, జూన్ 19, 2013

Sri Budha ashtottara satanamavali in telugu - శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ బుధ అష్టోత్తరశతనామ స్తోత్రం :-

బుధో బుధార్చితః సౌమ్యః సౌమ్యచిత్తః శుభప్రదః
దృఢవ్రతో దృఢబల శ్రుతిజాలప్రబోధకః || ౧ ||
సత్యవాసః సత్యవచా శ్రేయసాంపతిరవ్యయః
సోమజః సుఖదః శ్రీమాన్ సోమవంశప్రదీపకః || ౨ ||

వేదవిద్వేదతత్త్వజ్ఞో వేదాంతజ్ఞానభాస్కరః
విద్యావిచక్షణ విదుర్ విద్వత్ప్రీతికరో ఋజః || ౩ ||

విశ్వానుకూలసంచారీ విశేషవినయాన్వితః
వివిధాగమసారజ్ఞో వీర్యవాన్ విగతజ్వరః || ౪ ||

త్రివర్గఫలదోzనంతః త్రిదశాధిపపూజితః
బుద్ధిమాన్ బహుశాస్త్రజ్ఞో బలీ బంధవిమోచకః || ౫ ||

వక్రాతివక్రగమనో వాసవో వసుధాధిపః
ప్రసాదవదనో వంద్యో వరేణ్యో వాగ్విలక్షణః || ౬ ||

సత్యవాన్ సత్యసంకల్పః సత్యబంధిః సదాదరః
సర్వరోగప్రశమనః సర్వమృత్యునివారకః || ౭ ||

వాణిజ్యనిపుణో వశ్యో వాతాంగీ వాతరోగహృత్
స్థూలః స్థైర్యగుణాధ్యక్షః స్థూలసూక్ష్మాదికారణః || ౮ ||

అప్రకాశః ప్రకాశాత్మా ఘనో గగనభూషణః
విధిస్తుత్యో విశాలాక్షో విద్వజ్జనమనోహరః || ౯ ||

చారుశీలః స్వప్రకాశో చపలశ్చ జితేంద్రియః
ఉదఙ్ముఖో మఖాసక్తో మగధాధిపతిర్హరః || ౧౦ ||

సౌమ్యవత్సరసంజాతః సోమప్రియకరః సుఖీ
సింహాధిరూఢః సర్వజ్ఞః శిఖివర్ణః శివంకరః || ౧౧ ||

పీతాంబరో పీతవపుః పీతచ్ఛత్రధ్వజాంకితః
ఖడ్గచర్మధరః కార్యకర్తా కలుషహారకః || ౧౨ ||

ఆత్రేయగోత్రజోzత్యంతవినయో విశ్వపావనః
చాంపేయపుష్పసంకాశః చారణః చారుభూషణః || ౧౩ ||

వీతరాగో వీతభయో విశుద్ధకనకప్రభః
బంధుప్రియో బంధయుక్తో వనమండలసంశ్రితః || ౧౪ ||

అర్కేశానప్రదేశస్థః తర్కశాస్త్రవిశారదః
ప్రశాంతః ప్రీతిసంయుక్తః ప్రియకృత్ ప్రియభాషణః || ౧౫ ||

మేధావీ మాధవాసక్తో మిథునాధిపతిః సుధీః
కన్యారాశిప్రియః కామప్రదో ఘనఫలాశ్రయః || ౧౬ ||

మంగళవారం, జూన్ 18, 2013

Sri Sukra ashtottara satanamavali in telugu - శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శుక్ర అష్టోత్తరశతనామ స్తోత్రం:-
 
శుక్రః శుచిః శుభగుణః శుభదః శుభలక్షణః
శోభనాక్షః శుభ్రరూపః శుద్ధస్ఫటికభాస్వరః || ౧ ||
దీనార్తిహారకో దైత్యగురుః దేవాభివందితః
కావ్యాసక్తః కామపాలః కవిః కళ్యాణదాయకః || ౨ ||

భద్రమూర్తిర్భద్రగుణో భార్గవో భక్తపాలనః
భోగదో భువనాధ్యక్షో భుక్తిముక్తిఫలప్రదః || ౩ ||

చారుశీలశ్చారురూపశ్చారుచంద్రనిభాననః
నిధిర్నిఖిలశాస్త్రజ్ఞో నీతివిద్యాధురంధరః || ౪ ||

సర్వలక్షణసంపన్నః సర్వాపద్గుణవర్జితః
సమానాధికనిర్ముక్తః సకలాగమపారగః || ౫ ||

భృగుర్భోగకరో భూమిసురపాలనతత్పరః
మనస్వీ మానదో మాన్యో మాయాతీతో మహాశయః || ౬ ||

బలిప్రసన్నోzభయదో బలీ బలపరాక్రమః
భవపాశపరిత్యాగో బలిబంధవిమోచకః || ౭ ||

ఘనాశయో ఘనాధ్యక్షో కంబుగ్రీవః కళాధరః
కారుణ్యరససంపూర్ణః కళ్యాణగుణవర్ధనః || ౮ ||

శ్వేతాంబరః శ్వేతవపుః చతుర్భుజసమన్వితః
అక్షమాలాధరోzచింత్యః అక్షీణగుణభాసురః || ౯ ||

నక్షత్రగణసంచారో నయదో నీతిమార్గదః
వర్షప్రదో హృషీకేశః క్లేశనాశకరః కవిః || ౧౦ ||

చింతితార్థప్రదః శాంతమతిః చిత్తసమాధికృత్
ఆధివ్యాధిహరో భూరివిక్రమః పుణ్యదాయకః || ౧౧ ||

పురాణపురుషః పూజ్యః పురుహూతాదిసన్నుతః
అజేయో విజితారాతిర్వివిధాభరణోజ్జ్వలః || ౧౨ ||

కుందపుష్పప్రతీకాశో మందహాసో మహామతిః
ముక్తాఫలసమానాభో ముక్తిదో మునిసన్నుతః || ౧౩ ||

రత్నసింహాసనారూఢో రథస్థో రజతప్రభః
సూర్యప్రాగ్దేశసంచారః సురశత్రుసుహృత్ కవిః || ౧౪ ||

తులావృషభరాశీశో దుర్ధరో ధర్మపాలకః
భాగ్యదో భవ్యచారిత్రో భవపాశవిమోచకః || ౧౫ ||

గౌడదేశేశ్వరో గోప్తా గుణీ గుణవిభూషణః
జ్యేష్ఠానక్షత్రసంభూతో జ్యేష్ఠః శ్రేష్ఠః శుచిస్మితః || ౧౬ ||

అపవర్గప్రదోzనంతః సంతానఫలదాయకః
సర్వైశ్వర్యప్రదః సర్వగీర్వాణగణసన్నుతః || ౧౭ ||

సోమవారం, జూన్ 17, 2013

Sri Sani ashtottara satanamavali in telugu - శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ శని అష్టోత్తరశతనామ స్తోత్రం:-
 
శనైశ్చరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయినే
శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః || ౧ ||
సౌమ్యాయ సురవంద్యాయ సురలోకవిహారిణే
సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః || ౨ ||

ఘనాయ ఘనరూపాయ ఘనాభరణధారిణే
ఘనసారవిలేపాయ ఖద్యోతాయ నమో నమః || ౩ ||

మందాయ మందచేష్టాయ మహనీయగుణాత్మనే
మర్త్యపావనపాదాయ మహేశాయ నమో నమః || ౪ ||

ఛాయాపుత్రాయ శర్వాయ శరతూణీరధారిణే
చరస్థిరస్వభావాయ చంచలాయ నమో నమః || ౫ ||

నీలవర్ణాయ నిత్యాయ నీలాంజననిభాయ చ
నీలాంబరవిభూషాయ నిశ్చలాయ నమో నమః || ౬ ||

వేద్యాయ విధిరూపాయ విరోధాధారభూమయే
భేదాస్పదస్వభావాయ వజ్రదేహాయ తే నమః || ౭ ||

వైరాగ్యదాయ వీరాయ వీతరోగభయాయ చ
విపత్పరంపరేశాయ విశ్వవంద్యాయ తే నమః || ౮ ||

గృధ్నవాహాయ గూఢాయ కూర్మాంగాయ కురూపిణే
కుత్సితాయ గుణాఢ్యాయ గోచరాయ నమో నమః || ౯ ||

అవిద్యామూలనాశాయ విద్యాzవిద్యాస్వరూపిణే
ఆయుష్యకారణాయాzపదుద్ధర్త్రే చ నమో నమః || ౧౦ ||

విష్ణుభక్తాయ వశినే వివిధాగమవేదినే
విధిస్తుత్యాయ వంద్యాయ విరూపాక్షాయ తే నమః || ౧౧ ||

వరిష్ఠాయ గరిష్ఠాయ వజ్రాంకుశధరాయ చ
వరదాభయహస్తాయ వామనాయ నమో నమః || ౧౨ ||

జ్యేష్ఠాపత్నీసమేతాయ శ్రేష్ఠాయ మితభాషిణే
కష్టౌఘనాశకర్యాయ పుష్టిదాయ నమో నమః || ౧౩ ||

స్తుత్యాయ స్తోత్రగమ్యాయ భక్తివశ్యాయ భానవే
భానుపుత్రాయ భవ్యాయ పావనాయ నమో నమః || ౧౪ ||

ధనుర్మండలసంస్థాయ ధనదాయ ధనుష్మతే
తనుప్రకాశదేహాయ తామసాయ నమో నమః || ౧౫ ||

అశేషజనవంద్యాయ విశేషఫలదాయినే
వశీకృతజనేశాయ పశూనాంపతయే నమః || ౧౬ ||

ఖేచరాయ ఖగేశాయ ఘననీలాంబరాయ చ
కాఠిన్యమానసాయాzర్యగణస్తుత్యాయ తే నమః || ౧౭ ||

నీలచ్ఛత్రాయ నిత్యాయ నిర్గుణాయ గుణాత్మనే
నిరామయాయ నింద్యాయ వందనీయాయ తే నమః || ౧౮ ||

ధీరాయ దివ్యదేహాయ దీనార్తిహరణాయ చ
దైన్యనాశకరాయాzర్యజనగణ్యాయ తే నమః || ౧౯ ||

క్రూరాయ క్రూరచేష్టాయ కామక్రోధకరాయ చ
కళత్రపుత్రశత్రుత్వకారణాయ నమో నమః || ౨౦ ||

పరిపోషితభక్తాయ పరభీతిహరాయ
భక్తసంఘమనోzభీష్టఫలదాయ నమో నమః || ౨౧ ||

ఆదివారం, జూన్ 16, 2013

Sri Rahu ashtottara satanamavali in telugu - శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం

 శ్రీ రాహు అష్టోత్తరశతనామ స్తోత్రం:-
శృణు నామాని రాహోశ్చ సైంహికేయో విధుంతుదః
సురశత్రుస్తమశ్చైవ ప్రాణీ గార్గ్యాయణస్తథా || ౧ ||
సురాగుర్నీలజీమూతసంకాశశ్చ చతుర్భుజః
ఖడ్గఖేటకధారీ చ వరదాయకహస్తకః || ౨ ||

శూలాయుధో మేఘవర్ణః కృష్ణధ్వజపతాకావాన్
దక్షిణాశాముఖరథః తీక్ష్ణదంష్ట్రధరాయ చ || ౩ ||

శూర్పాకారాసనస్థశ్చ గోమేదాభరణప్రియః
మాషప్రియః కశ్యపర్షినందనో భుజగేశ్వరః || ౪ ||

ఉల్కాపాతజనిః శూలీ నిధిపః కృష్ణసర్పరాట్
విషజ్వలావృతాస్యోzర్ధశరీరో జాద్యసంప్రదః || ౫ ||

రవీందుభీకరశ్ఛాయాస్వరూపీ కఠినాంగకః
ద్విషచ్చక్రచ్ఛేదకోzథ కరాలాస్యో భయంకరః || ౬ ||

క్రూరకర్మా తమోరూపః శ్యామాత్మా నీలలోహితః
కిరీటీ నీలవసనః శనిసామంతవర్త్మగః || ౭ ||

చాండాలవర్ణోzథాశ్వ్యర్క్షభవో మేషభవస్తథా
శనివత్ఫలదః శూరోzపసవ్యగతిరేవ చ || ౮ ||

ఉపరాగకరస్సూర్యహిమాంశుచ్ఛవిహారకః
నీలపుష్పవిహారశ్చ గ్రహశ్రేష్ఠోzష్టమగ్రహః || ౯ ||

కబంధమాత్రదేహశ్చ యాతుధానకులోద్భవః
గోవిందవరపాత్రం చ దేవజాతిప్రవిష్టకః || ౧౦ ||

క్రూరో ఘోరః శనేర్మిత్రం శుక్రమిత్రమగోచరః
మానేగంగాస్నానదాతా స్వగృహేప్రబలాఢ్యకః || ౧౧ ||

సద్గృహేzన్యబలధృచ్చతుర్థే మాతృనాశకః
చంద్రయుక్తేతు చండాలజన్మసూచక ఏవతు || ౧౨ ||

జన్మసింహే రాజ్యదాతా మహాకాయస్తథైవ చ
జన్మకర్తా విధురిపు మత్తకోజ్ఞానదశ్చ సః || ౧౩ ||

జన్మకన్యారాజ్యదాతా జన్మహానిద ఏవ చ
నవమే పితృహంతా చ పంచమే శోకదాయకః || ౧౪ ||

ద్యూనే కళత్రహంత్రే చ సప్తమే కలహప్రదః
షష్ఠే విత్తదాతా చ చతుర్థే వైరదాయకః || ౧౫ ||

నవమే పాపదాతా చ దశమే శోకదాయకః
ఆదౌ యశః ప్రదాతా చ అంతే వైరప్రదాయకః || ౧౬ ||

కాలాత్మా గోచరాచారో ధనే చాస్య కకుత్ప్రదః
పంచమే ధృషణాశృంగదః స్వర్భానుర్బలీ తథా || ౧౭ ||

మహాసౌఖ్యప్రదాయీ చ చంద్రవైరీ చ శాశ్వతః
సురశత్రుః పాపగ్రహః శాంభవః పూజ్యకస్తథా || ౧౮ ||

పాఠీనపూరణశ్చాథ పైఠీనసకులోద్భవః
దీర్ఘః కృష్ణోzశిరసః విష్ణునేత్రారిర్దేవదానవౌ || ౧౯ ||

భక్తరక్షో రాహుమూర్తిః సర్వాభీష్టఫలప్రదః
ఏతద్రాహుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

శ్రద్ధయా యో జపేన్నిత్యం ముచ్యతే సర్వ సంకటాత్
సర్వసంపత్కరస్తస్య రాహురిష్టప్రదాయకః || ౨౧ ||

శనివారం, జూన్ 15, 2013

Sri Ketu ashtottara satanamavali in telugu - శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ కేతు అష్టోత్తరశతనామ స్తోత్రం :-
శృణు నామాని జప్యాని కేతో రథ మహామతే
కేతుః స్థూలశిరాశ్చైవ శిరోమాత్రో ధ్వజాకృతిః || ౧ ||
నవగ్రహయుతః సింహికాసురీగర్భసంభవః
మహాభీతికరశ్చిత్రవర్ణో వై పింగళాక్షకః || ౨ ||

స ఫలోధూమ్రసంకాశః తీక్ష్ణదంష్ట్రో మహోరగః
రక్తనేత్రశ్చిత్రకారీ తీవ్రకోపో మహాసురః || ౩ ||

క్రూరకంఠః క్రోధనిధిశ్ఛాయాగ్రహవిశేషకః
అంత్యగ్రహో మహాశీర్షో సూర్యారిః పుష్పవద్గ్రహీ || ౪ ||

వరదహస్తో గదాపాణిశ్చిత్రవస్త్రధరస్తథా
చిత్రధ్వజపతాకశ్చ ఘోరశ్చిత్రరథశ్శిఖీ || ౫ ||

కుళుత్థభక్షకశ్చైవ వైడూర్యాభరణ స్తథా
ఉత్పాతజనకః శుక్రమిత్రం మందసఖస్తథా || ౬ ||

గదాధరః నాకపతిః అంతర్వేదీశ్వరస్తథా
జైమినీగోత్రజశ్చిత్రగుప్తాత్మా దక్షిణాముఖః || ౭ ||

ముకుందవరపాత్రం చ మహాసురకులోద్భవః
ఘనవర్ణో లంబదేహో మృత్యుపుత్రస్తథైవ చ || ౮ ||

ఉత్పాతరూపధారీ చాzదృశ్యః కాలాగ్నిసన్నిభః
నృపీడో గ్రహకారీ చ సర్వోపద్రవకారకః || ౯ ||

చిత్రప్రసూతో హ్యనలః సర్వవ్యాధివినాశకః
అపసవ్యప్రచారీ చ నవమే పాపదాయకః || ౧౦ ||

పంచమే శోకదశ్చోపరాగఖేచర ఏవ చ
అతిపురుషకర్మా చ తురీయే సుఖప్రదః || ౧౧ ||

తృతీయే వైరదః పాపగ్రహశ్చ స్ఫోటకకారకః
ప్రాణనాథః పంచమే తు శ్రమకారక ఏవ చ || ౧౨ ||

ద్వితీయేzస్ఫుటవగ్దాతా విషాకులితవక్త్రకః
కామరూపీ సింహదంతః సత్యప్యనృతవానపి || ౧౩ ||

చతుర్థే మాతృనాశశ్చ నవమే పితృనాశకః
అంత్యే వైరప్రదశ్చైవ సుతానందనబంధకః || ౧౪ ||

సర్పాక్షిజాతోzనంగశ్చ కర్మరాశ్యుద్భవస్తథా
ఉపాంతే కీర్తిదశ్చైవ సప్తమే కలహప్రదః || ౧౫ ||

అష్టమే వ్యాధికర్తా చ ధనే బహుసుఖప్రదః
జననే రోగదశ్చోర్ధ్వమూర్ధజో గ్రహనాయకః || ౧౬ ||

పాపదృష్టిః ఖేచరశ్చ శాంభవోzశేషపూజితః
శాశ్వతశ్చ నటశ్చైవ శుభాzశుభఫలప్రదః || ౧౭ ||

ధూమ్రశ్చైవ సుధాపాయీ హ్యజితో భక్తవత్సలః
సింహాసనః కేతుమూర్తీ రవీందుద్యుతినాశకః || ౧౮ ||

అమరః పీడకోzమర్త్యో విష్ణుదృష్టోzసురేశ్వరః
భక్తరక్షోzథ వైచిత్ర్యకపటస్యందనస్తథా || ౧౯ ||

విచిత్రఫలదాయీ చ భక్తాభీష్టఫలప్రదః
ఏతత్కేతుగ్రహస్యోక్తం నామ్నామష్టోత్తరం శతం || ౨౦ ||

యో భక్త్యేదం జపేత్కేతుర్నామ్నామష్టోత్తరం శతం
స తు కేతోః ప్రసాదేన సర్వాభీష్టం సమాప్నుయాత్ || ౨౧ ||

శుక్రవారం, మే 24, 2013

గురుస్తోత్రం

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౧ ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || ౨ ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || ౩ ||

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౪ ||

చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || ౫ ||

సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజః |
వేదాంతాంబుజసూర్యో యస్తస్మై శ్రీగురవే నమః || ౬ ||

చైతన్యః శాశ్వతః శాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః || ౭ ||

జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః || ౮ ||

అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః || ౯ ||

శోషణం భవసింధోశ్చ జ్ఞాపనం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః || ౧౦ ||

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౧ ||

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || ౧౨ ||

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః || ౧౩ ||

బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్ |
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షిభూతం
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి || ౧౪ ||

త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౧౪ ||

సోమవారం, మే 06, 2013

శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రమ్

. అథ భవిష్యపురాణాన్తర్గత- సూర్యసహస్రనామస్తోత్రమ్ .
ఓం విశ్వజిద్ విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః .

విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేన్ద్రియః .. ౧..
కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః .
మహాయోగీ మహాబుద్ధిర్మహాత్మా సుమహాబలః .. ౨..
ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా భువనేశ్వరః .
భూతభవ్యో భావితాత్మా భూతాన్తఃకరణః శివః .. ౩..
శరణ్యః కమలానన్దో నన్దనో నన్దవర్ధనః .
వరేణ్యో వరదో యోగీ సుసంయుక్తః ప్రకాశకః .. ౪..
వాక్ప్రాణః పరమః ప్రాణః ప్రీతాత్మా ప్రియతః ప్రియః .
నయః సహస్రపాత్ సాధుర్దివ్యకుణ్డలమణ్డితః .. ౫..
అవ్యఙ్గధారీ ధీరాత్మా ప్రచేతా వాయువాహనః .
సమాహితమతిర్ధాతా విధాతా కృతమఙ్గలః .. ౬..
కపర్దీ కల్పకృద్రుద్రః సుమనా ధర్మవత్సలః .
సమాయుక్తో విముక్తాత్మా కృతాత్మా కృతినాంవరః .. ౭..
అవిచిన్త్యవపుః శ్రేష్ఠో మహాయోగీ మహేశ్వరః .
కాన్తః కామాదిరాదిత్యో నియతాత్మా నిరాకులః .. ౮..
కామః కారుణికః కర్తా కమలాకరబోధనః .
సప్తసప్తిరచిన్త్యాత్మా మహాకారుణికోత్తమః .. ౯..
సంజీవనో జీవనాథో జగజ్జీవో జగత్పతిః .
అజయో విశ్వనిలయః సంవిభాగో వృషధ్వజః .. ౧౦..
వృషాకపిః కల్పకర్తా కల్పాన్తకరణో రవిః .
ఏకచక్రరథో మౌనీ సురథో రథినాంవరః .. ౧౧..
అక్రోధనో రశ్మిమాలీ తేజోరాశిర్విభావసుః .
దివ్యకృద్ దినకృద్ దేవో దేవదేవో దివస్పతిః .. ౧౨..
ధీరానాథో హవిర్హోతా దివ్యబాహుర్దివాకరః .
యజ్ఞో యజ్ఞపతిః పూషా స్వర్ణరేతాః పరావహః .. ౧౩..
పరాపరజ్ఞస్ తరణిరంశుమాలీ మనోహరః .
ప్రాజ్ఞః ప్రజాపతిః సూర్యః సవితా విష్ణురంశుమాన్ .. ౧౪..
సదాగతిర్గన్ధబాహుర్విహితో విధిరాశుగః .
పతఙ్గః పతగః స్థాణుర్విహఙ్గో విహగో వరః .. ౧౫..
హర్యశ్వో హరితాశ్వశ్చ హరిదశ్వో జగత్ప్రియః .
త్ర్యంబకః సర్వదమనో భావితాత్మా భిషగ్వరః .. ౧౬..
ఆలోకకృల్లోకనాథో లోకాలోకనమస్కృతః .
కాలః కల్పాన్తకో వహ్నిస్తపనః సమ్ప్రతాపనః .. ౧౭..
విరోచనో విరూపాక్షః సహస్రాక్షః పురందరః .
సహస్రరశ్మిర్మిహిరో వివిధామ్బరభూషణః .. ౧౮..
ఖగః ప్రతర్దనో ధన్యో హయగో వాగ్విశారదః .
శ్రీమాంశ్చ శిశిరో వాగ్మీ శ్రీపతిః శ్రీనికేతనః .. ౧౯..
శ్రీకణ్ఠః శ్రీధరః శ్రీమాన్ శ్రీనివాసో వసుప్రదః .
కామచారో మహామాయో మహేశో విదితాశయః .. ౨౦..
తీర్థక్రియావాన్ సునయో విభవో భక్తవత్సలః .
కీర్తిః కీర్తికరో నిత్యః కుణ్డలీ కవచీ రథీ .. ౨౧..
హిరణ్యరేతాః సప్తాశ్వః ప్రయతాత్మా పరంతపః .
బుద్ధిమాన్ అమరశ్రేష్ఠో రోచిష్ణుః పాతశాసనః .. ౨౨..
సముద్రో ధనదో ధాతా మాన్ధాతా కశ్మలాపహః .
తమోఘ్నో ధ్వాన్తహా వహ్నిర్హోతాన్తఃకరణో గుహః .. ౨౩..
పశుమాన్ ప్రయతానన్దో భూతేశః శ్రీమతాంవరః .
నిత్యోఽదితో నిత్యరథః సురేశః సురపూజితః .. ౨౪..
అజితో విజయో జేతా జఙ్గమస్థావరాత్మకః .
జీవానన్దో నిత్యకామీ విజేతా విజయప్రదః .. ౨౫..
పర్జన్యోఽగ్నిః స్థితిస్థేయః స్థవిరోఽణుర్నిరఞ్జనః .
ప్రద్యోతనో రథారూఢః సర్వలోకప్రకాశకః .. ౨౬..
ధ్రువో మేధీ మహావీర్యో హంసః సంసారతారకః .
సృష్టికర్తా క్రియాహేతుర్మార్తణ్డో మరుతాంపతిః .. ౨౭..
మరుత్వాన్ దహనః స్పష్టా భగో భాగ్యోఽర్యమాపతిః .
వరుణాంశో జగన్నాథః కృతకృత్యః సులోచనః .. ౨౮..
వివస్వాన్ భానుమాన్ కార్యకారణం తేజసాంనిధిః .
అసఙ్గవామీ తిగ్మాంశుర్ధర్మాదిర్దీప్తదీధితిః .. ౨౯..
సహస్రదీధితిర్భఘ్నః సహస్రాంశుర్దివాకరః .
గభస్తిమాన్ దీధితిమాన్ స్రగ్విమాన్ అతులద్యుతిః .. ౩౦..
భాస్కరః సురకార్యజ్ఞః సర్వజ్ఞస్ తీక్ష్ణదీధితిః .
సురజ్యేష్ఠః సురపతిర్బహుజ్ఞోవచసాంపతిః .. ౩౧..
తేజోనిధిర్బృహత్తేజా బృహత్కీర్తిర్బృహస్పతిః .
అహిమానూర్జితో ధీమాన్ ఆముక్తః కీర్తివర్ధనః .. ౩౨..
మహావైద్యాగ్రేణపతిర్గణేశో గణనాయకః .
తీవ్రప్రతాపనస్ తాపీ తాపనో విశ్వతాపనః .. ౩౩..
కార్తస్వరో హృషీకేశః పద్మానన్దోఽభినన్దితః .
పద్మనాభోఽమృతాహారః స్థితిమాన్ కేతుమాన్ నభః .. ౩౪..
అనాద్యన్తోఽచ్యుతో విశ్వో విశ్వామిత్రో ఘృణీ విరాట్ .
ఆముక్తః కవచీ వాగ్మీ కఞ్చుకీ విశ్వభావనః .. ౩౫..
అనిమిత్తగతిః శ్రేష్ఠః శరణ్యః సర్వతోముఖః .
విగాహీరేణురసహః సమాయుక్తః సమాహితః .. ౩౬..
ధర్మకేతుర్ధర్మరతిః సంహర్తా సంయమోయమః .
ప్రణతార్తిహరో వాదీ సిద్ధకార్యో జనేశ్వరః .. ౩౭..
నభో విగాహనః సత్యః స్థామసః సుమనో హరః .
హారీ హరిర్హరో వాయురృతుః కాలానలద్యుతిః .. ౩౮..
సుఖసేవ్యో మహాతేజా జగతామన్తకారణమ్ .
మహేన్ద్రో విష్టుతః స్తోత్రం స్తుతిహేతుః ప్రభాకరః .. ౩౯..
సహస్రకల ఆయుష్మాన్ అరోషః సుఖదః సుఖీ .
వ్యాధిహా సుఖదః సౌఖ్యం కల్యాణః కల్పినాంవరః .. ౪౦..
ఆరోగ్యకర్మణాం సిద్ధిర్వృద్ధిరృద్ధిరహస్పతిః .
హిరణ్యరేతా ఆరోగ్యం విద్వాన్ బన్ధుర్బుధో మహాన్ .. ౪౧..
ప్రణవాన్ ధృతిమాన్ ధర్మో ధర్మకర్తా రుచిప్రదః .
సర్వప్రియః సర్వసహః సర్వశత్రునివారుణః .. ౪౨..
ప్రాంశుర్విద్యోతనో ద్యోతః సహస్రకిరణః కృతిః .
కేయూరభూషణోద్భాసీ భాసితో భాసనోఽనలః .. ౪౩..
శరణ్యార్తిహరో హోతా ఖద్యోతః ఖగసత్తమః .
సర్వద్యోతోఽమవద్ద్యోతః సర్వద్యుతికరోఽమలః .. ౪౪..
కల్యాణః కల్యాణకరః కల్పః కల్పకరః కవిః .
కల్యాణకృత్ కల్పవపుః సర్వకల్యాణభాజనః .. ౪౫..
శాన్తిప్రియః ప్రసన్నాత్మా ప్రశాన్తః ప్రశమప్రియః .
ఉదారకర్మా సునయః సువర్చా వర్చసోజ్జ్వలః .. ౪౬..
వర్చస్వీ వర్చసామీశస్ త్రైలోక్యేశో వశానుగః .
తేజస్వీ సుయశావర్ణిర్వర్ణాధ్యక్షో బలిప్రియః .. ౪౭..
యశస్వీ వేదనిలయస్ తేజస్వీ ప్రకృతిస్థితః .
ఆకాశగః శీఘ్రగతిరాశుగః శ్రుతిమాన్ ఖగః .. ౪౮..
గోపతిర్గ్రహదేవేశో గోమాన్ ఏకః ప్రభఞ్జనః .
జనితాప్రజగణ్డీవో దీపః సర్వప్రకాశకః .. ౪౯..
కర్మసాక్షీ యోగనిత్యో నభస్వాన్ అసురాన్తకః .
రక్షోఘ్నో విఘ్నశమనః కిరీటీ సుమనఃప్రియః .. ౫౦..
మరీచిమాలీ సుమతిః కృతాతిథ్యోఽవిశేషతః .
శిష్టాచారః శుభాకారః స్వాచారా చారతత్పరః .. ౫౧..
మన్దారో మాఠరో రేణుః క్షోభణః పక్షిణాఙ్గురుః .
స్వవిశిష్టో విశిష్టాత్మా విధేయో జ్ఞానశోభనః .. ౫౨..
మహాశ్వేతా ప్రియో జ్ఞేయః సామగో మోదదాయకః .
సర్వవేదప్రగీతాత్మా సర్వవేదో గయాలయః .. ౫౩..
వేదమూర్తిశ్చతుర్వేదో వేదభృద్ వేదపారగః .
క్రియావాన్ అతిరోచిష్ణుర్వరీయాంశ్చ వరప్రదః .. ౫౪..
వ్రతధారీ వ్రతధరో లోకబన్ధురలంకృతః .
అలంకారాక్షరో దివ్యవిద్యావాన్ విదితాశయః .. ౫౫..
అకారో భూషణో భూష్యో భూష్ణుర్భవనపూజితః .
చక్రపాణిర్వజ్రధరః సువేశో లోకవత్సలః .. ౫౬..
రాజ్ఞీపతిర్మహాబాహుః ప్రకృతిర్వికృతిర్గుణః .
అన్ధకారాపహః శ్రేష్ఠో యుగావర్తో యుగాదికృత్ .. ౫౭..
అప్రమేయః సదాయోగీ నిరహంకార ఈశ్వరః .
శుభప్రదః శుభశోభా శుభకర్మా శుభాస్పదః .. ౫౮..
సత్యవాన్ ధృతిమాన్ అర్చ్యో హ్యకారో వృద్ధిదోఽనలః .
బలభృద్ బలగో బన్ధుర్బలవాన్ హరిణాంవరః .. ౫౯..
అనఙ్గోఽనాగరాణిన్ద్రః పద్మయోనిర్గణేశ్వరః .
సంవత్సర ఋతుర్నేతా కాలచక్రప్రవర్తకః .. ౬౦..
పద్మేక్షరః పద్మయోనిః ప్రభవోఽనసరద్యుతిః .
సుమూర్తిః సుమతిః సోమో గోవిన్దో జగదాదిజః .. ౬౧..
పీతవాసాః కృష్ణవాసా దిగ్వాసాతీన్ద్రియో హరిః .
అతీన్ద్రోఽనేకరూపాత్మా స్కన్దః పరపురంజయః .. ౬౨..
శక్తిమాన్ సూరధృగ్ భాస్వాన్ మోక్షహేతురయోనిజః .
సర్వదర్శోఽదితో దర్శో దుఃస్వప్నాశుభనాశనః .. ౬౩..
మాఙ్గల్యకర్తా కరణిర్వేగవాన్ కశ్మలాపహః .
స్పష్టాక్షరో మహామన్త్రో విశాఖో యజనప్రియః .. ౬౪..
విశ్వకర్మా మహాశక్తిర్జ్యోతిరీశవిహంగమః .
విచక్షణో దక్ష ఇన్ద్రః ప్రత్యూహః ప్రియదర్శనః .. ౬౫..
అశ్వినౌ వేదనిలయో వేదవిద్ విదితాశయః .
ప్రభాకరో జితరిపుః సుజనోఽరుణసారథిః .. ౬౬..
కుబేరసురథః స్కన్దో మహితోఽభిహితో గుహుః .
గ్రహరాజో గ్రహపతిర్గ్రహనక్షత్రమణ్డనః .. ౬౭..
భాస్కరః సతతానన్దో నన్దనో నన్దివర్ధనః .
మఙ్గలోఽప్యథ మఙ్గలవాన్ మాఙ్గల్యోఽమఙ్గలాపహః .. ౬౮..
మఙ్గలాచారచరితః శీర్ణః సర్వవ్రతో వ్రతీ .
చతుర్ముఖః పద్మమాలీ పూతాత్మా ప్రణతార్తిహా .. ౬౯..
అకిఞ్చనః సత్యసన్ధో నిర్గుణో గుణవాన్ గుణీ .
సమ్పూర్ణః పుణ్డరీకాక్షో విధేయో యోగతత్పరః .. ౭౦..
సహస్రాంశుః క్రతుపతిః సర్వస్వం సుమతిః సువాక్ .
సుభామనో మాల్యదామా ఘృతాహారో హరిప్రియః .. ౭౧..
బ్రహ్మప్రచేతా ప్రథితః ప్రతీతాత్మా స్థిరాత్మకః .
శతబిన్దుః శతమఖో గరీయాన్ అనలప్రభుః .. ౭౨..
ధీరో మహత్తరో ధన్యః పురుషః పురుషోత్తమః .
విద్యాధరాధిరాజోఽహివిద్యావాన్ భూతిదస్థితః ..౭౩..
అనిర్దేశ్యవపుః శ్రీమాన్ విశ్వాత్మా బహుమఙ్గలః .
సుస్థితః సురథః స్వర్ణో మోక్షాధారనికేతనః .. ౭౪..
నిర్ద్వన్ద్వో ద్వన్ద్వహా సర్గః సర్వగః సమ్ప్రకాశయః .
దయాలుః సూక్ష్మరీః శాన్తిః క్షేమాక్షేమస్థితిప్రియః .. ౭౫..
భూతరో భూపతిర్వక్తా పవిత్రాత్మా త్రిలోచనః .
మహావరాహః ప్రియకృద్ ధాతా భోక్తాభయప్రదః .. ౭౬..
చతుర్వేదధరో నిత్యో వినిద్రో వివిధాశనః .
చక్రవర్తీ ధృతికరః సమ్పూర్ణోఽథ మహేశ్వరః .. ౭౭..
విచిత్రరథ ఏకాకీ సప్తసప్తిః పరాత్పరః .
సర్వోదధిస్థితికరః స్థితిస్థేయః స్థితిప్రియః .. ౭౮..
నిష్కలః పుష్కరనిభో వసుమాన్ వాసవప్రియః .
వసుమాన్ వాసవస్వామీ వసురాతా వసుప్రదః .. ౭౯..
బలవాన్ జ్ఞానవాంస్తత్త్వమ్ ఓంకారస్ తృషుసంస్థితః .
సంకల్పయోనిర్దినకృద్ భగవాన్ కారణావహః .. ౮౦..
నీలకణ్ఠో ధనాధ్యక్షశ్చతుర్వేదప్రియంవదః .
వషట్కారో హుతం హోతా స్వాహాకారో హుతాహుతిః .. ౮౧..
జనార్దనో జనానన్దో నరో నారాయణోఽమ్బుదః .
స్వర్ణాఙ్గక్షపణో వాయుః సురా సురనమస్కృతః .. ౮౨..
విగ్రహో విమలో బిన్దుర్విశోకో విమలద్యుతిః .
ద్యోతితో ద్యోతనో విద్వాన్ వివిద్వాన్ వరదో బలీ .. ౮౩..
ధర్మయోనిర్మహామోహో విష్ణుభ్రాతా సనాతనః .
సావిత్రీభావితో రాజా విసృతో విఘృణీ విరాట్ .. ౮౪..
సప్తార్చిః సప్తతురగః సప్తలోకనమస్కృతః .
సమ్పన్నోఽథ జగన్నాథః సుమనాః శోభనప్రియః .. ౮౫..
సర్వాత్మా సర్వకృత్ సృష్టిః సప్తిమాన్ సప్తమీప్రియః .
సుమేధా మాధవో మేధ్యో మేధావీ మధుసూదనః .. ౮౬..
అఙ్గిరా గతికాలజ్ఞో ధూమకేతుసుకేతనః .
సుఖీ సుఖప్రదః సౌఖ్యం కామీ కాన్తిప్రియో మునిః .. ౮౭..
సంతాపనః సంతపన ఆతపీ తపసాంపతిః .
ఉగ్రశ్రవా సహస్రోస్రః ప్రియఙ్కారో ప్రియఙ్కరః .. ౮౮..
ప్రీతో విమన్యురమ్భోదో జీవనో జగతాంపతిః .
జగత్పితా ప్రీతమనాః సర్వః శర్వో గుహావలః .. ౮౯..
సర్వగో జగదానన్దో జగన్నేతా సురారిహా .
శ్రేయః శ్రేయస్కరో జ్యాయానుత్తమోత్తమ ఉత్తమః .. ౯౦..
ఉత్తమోఽథ మహామేరుర్ధారణో ధరణీధరః .
ధారాధరో ధర్మరాజో ధర్మాధర్మప్రవర్తకః .. ౯౧..
రథాధ్యక్షో రథపతిస్ త్వరమాణోఽమితానలః .
ఉత్తరోఽనుత్తరస్ తాపీ తారాపతిరపాంపతిః .. ౯౨..
పుణ్యసంకీర్తనః పుణ్యో హేతుర్లోకత్రయాశ్రయః .
స్వర్భానుర్విహగారిష్టో విశిష్టోత్కృష్టకర్మకృత్ .. ౯౩..
వ్యాధిప్రణాశనః క్షేమః శూరః సర్వజితామ్బరః .
ఏకనాథో రథాధీశః శనైశ్చరపితాసితః .. ౯౪..
వైవస్వతగురుర్మృత్యుర్ధర్మనిత్యో మహావ్రతః .
ప్రలమ్బహారః సంచారీ ప్రద్యోతో ద్యోతితోఽనలః .. ౯౫..
సంతానకృత్ పరో మన్త్రో మన్త్రమూర్తిర్మహాబలః .
శ్రేష్ఠాత్మా సుప్రియః శమ్భుర్మహతామీశ్వరేశ్వరః .. ౯౬..
సంసారగతివిచ్ఛేతా సంసారార్ణవతారకః .
సప్తజిహ్వః సహస్రార్చీ రత్నగర్భోఽపరాజితః .. ౯౭..
ధర్మకేతురమేయాత్మా ధర్మాధర్మవరప్రదః .
లోకసాక్షీ లోకగురుర్లోకేశశ్ ఛన్దవాహనః .. ౯౮..
ధర్మరూపః సూక్ష్మవాయుర్ధనుష్పాణిర్ధనుర్ధరః .
పినాకధృన్ మహోత్సాహో నైకమాయో మహాశనః .. ౯౯..
వారః శక్తిమతాంశ్రేష్ఠః సర్వశస్త్రభృతాంవరః .
జ్ఞానగమ్యో దురారాధ్యో లోహితాఙ్గోఽరిమర్దనః .. ౧౦౦..
అనన్తో ధర్మదో నిత్యో ధర్మకృచ్చిత్ త్రివిక్రమః .
దైవత్రస్ త్ర్యక్షరో మధ్యో నీలాఙ్గో నీలలోహితః .. ౧౦౧..
ఏకోఽనేకస్ త్రయీవ్యాసః సవితా సమితిఞ్జయః .
శార్ఙ్గధన్వానలో భీమః సర్వప్రహరణాయుధః .. ౧౦౨..
పరమేష్ఠీ పరంజ్యోతిర్నాకపాలీ దివస్పతిః .
వదాన్యో వాసుకిర్వైద్య ఆత్రేయోఽతిపరాక్రమః .. ౧౦౩..
ద్వాపరః పరమోదారః పరమబ్రహ్మచర్యవాన్ .
ఉద్దీప్తవేషో ముకుటీ పద్మహస్తోఽహిమాంశుభృత్ .. ౧౦౪..
స్మితః ప్రసన్నవదనః పద్మోదరనిభాననః .
సాయందివా దివ్యవపురనిర్దేశ్యో మహారథః .. ౧౦౫..
మహారథో మహానీశః శేషః సత్త్వరజస్తమః .
ధృతాతపత్రః ప్రతిమో విమర్శీ నిర్ణయస్థితః .. ౧౦౬..
అహింసకః శుద్ధమతిరద్వితీయో విమర్దనః .
సర్వదో ధనదో మోక్షో విహారీ బహుదాయకః .. ౧౦౭..
గ్రహనాథో గ్రహపతిర్గ్రహేశస్ తిమిరాపహః .
మనో హరవపుః శుభ్రః శోభనః సుప్రభాననః .. ౧౦౮..
సుప్రభః సుప్రభాకారః సునేత్రో నిక్షుభాపతిః .
రాజ్ఞీప్రియః శబ్దకరో గ్రహేశస్ తిమిరాపహః .. ౧౦౯..
సైంహికేయరిపుర్దేవో వరదో వరనాయకః .
చతుర్భుజో మహాయోగీ యోగీశ్వరపతిస్ తథా .. ౧౧౦..
అనాదిరూపోఽదితిజో రత్నకాన్తిః ప్రభామయః .
జగత్ప్రదీపో విస్తీర్ణో మహావిస్తీర్ణమణ్డలః .. ౧౧౧..
ఏకచక్రరథః స్వర్ణరథః స్వర్ణశరీరధృక్ .
నిరాలమ్బో గగనరో ధర్మకర్మప్రభావకృత్ .. ౧౧౨..
ధర్మాత్మా కర్మణాంసాక్షీ ప్రత్యక్షః పరమేశ్వరః .
మేరుసేవీ సుమేధావీ మేరురక్షాకరో మహాన్ .. ౧౧౩..
ఆధారభూకో రతిమాంస్తథా చ ధనధాన్యకృత్ .
పాపసంతాపసంహర్తా మనోవాంఛితదాయకః .. ౧౧౪..
లోకహర్తా రాజ్యదాయీ రమణీయగుణోఽనృణీ .
కాలత్రయానన్తరూపో మునివృన్దనమస్కృతః .. ౧౧౫..
సంధ్యారాగకరః సిద్ధః సంధ్యావన్దనవన్దితః .
సామ్రాజ్యదాననిరతః సమారాధనతోషవాన్ .. ౧౧౬..
భక్తదుఃఖక్షయకరో భవసాగరతారకః .
భయాపహర్తా భగవాన్ అప్రమేయపరాక్రమః .. ౧౧౭..
మనుస్వామీ మనుపతిర్మాన్యో మన్వన్తరాధిపః .. ౧౧౮..

ఇతి శ్రీ భవిష్యే మహాపురాణే సూర్యసహస్రనామ స్తోత్రం సమ్పూర్ణమ్

శనివారం, ఫిబ్రవరి 09, 2013

Sri Surya ashtottara satanamavali in telugu - శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం

శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం:-
 
అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే
అసమానబలాయాzర్తరక్షకాయ నమో నమః || ౧ ||
ఆదిత్యాయాzదిభూతాయ అఖిలాగమవేదినే
అచ్యుతాయాzఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || ౨ ||

ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయైంద్రాయ భానవే
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || ౩ ||

ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || ౪ ||

ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || ౫ ||

ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ
ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || ౬ ||

ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || ౭ ||

ఋకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే
ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || ౮ ||

లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ
కనత్కనకభూషాయ ఖద్యోతాయ తే నమః || ౯ ||

లూనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే
అపవర్గప్రదాయాzర్తశరణ్యాయ నమో నమః || ౧౦ ||

ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || ౧౧ ||

ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || ౧౨ ||

ఓజస్కరాయ జయినే జగదానందహేతవే
జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః || ౧౩ ||

ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపినే
కమనీయకరాయాzబ్జవల్లభాయ నమో నమః || ౧౪ ||

అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాzత్మరూపిణే
అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః || ౧౫ ||

అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః || ౧౬ ||

ఓం నమో భాస్కరాయాzదిమధ్యాంతరహితాయ చ
సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః || ౧౭ ||

నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః || ౧౮ ||

ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ
ఓం ఐం ఇష్టార్థదాయాzనుప్రసన్నాయ నమో నమః || ౧౯ ||

శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః || ౨౦ ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...