🌿🌼రేపు 29జులై 2025 మంగళవారం గరుడ పంచమి / నాగ పంచమి🌼🌿గరుడ పంచమి లేదా నాగ పంచమి ప్రాముఖ్యత 🌼🌿
🌿🌼ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి లేదా గరుడ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది🌼🌿
🌿🌼శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు🌼🌿
🌿🌼అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి🌼🌿
🌿🌼ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి🌼🌿
🌿🌼నాగ పంచమి వ్రత కథ🌼🌿
🌿🌼పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి. ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది🌼🌿
ఓం నమో భగవతే నాగరాజాయ
సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది. వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు, తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారంభిస్తాయి.
అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు, విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి. పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి. ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింపబడినవి. ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత తగ్గును.
అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.
సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.
సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.
అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
” తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో”
యజుర్వేద మంత్రం.
” ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను, యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు
మరలా మరలా నమస్కారము.
” ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll
శుభంభవతు
“శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః
పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ
విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ”
ఓ పార్వతీ దేవి… శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.
శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదే. వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది