హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, అక్టోబర్ 21, 2014

నవగ్రహ ప్రదక్షిణము నిష్ఫలం


ఇంతకు ముందు చెప్పినట్లుగా నవగ్రహ శాంతి పూజ దానము జపములు, నవరత్నములు ఎలా శుభాన్ని ఇవ్వవో అదేవిధముగా నవగ్రహ ప్రదక్షిణము కూడా ఫలితాన్నిఇవ్వదు.ఎందుకనగా నవగ్రహాలలో జాతకునికి కొందరు శుభులు కొందరు పాపులుగా లగ్నానుసారం నియమించబడ్డారు.
అలాంటప్పుడు పాపులకు ప్రదక్షిణ ఎలా శుభాన్నిస్తుంది. అందరికి తిరిగిన
పాపులెవరో పున్యులెవరో ఎలా తెలుస్తుంది ఫలితము. పాపపుణ్య మిశ్రితమాయి దుష్ఫలితము ఇస్తుంది తప్ప శుభఫలితము ఇవ్వదు.

ప్రతిదానికి నవగ్రహములు ఆవశ్యకమని నవగ్రహ ప్రతిష్ట చేసారు. ఇందులో రెండు తప్పులు కనబడుతున్నవి

ఒకటి అందరిని ఒకచోట ప్రతిష్టించి ఒక్కొక్కరికి విడిగా తిరుగునట్లు
వీలులేక సమిధ, యంత్రము, మంత్రము, పతాకము విడిచినారు. పాప గ్రహాలను పూజించకూడదు శుభగ్రహాలను పూజించాలి అప్పుడే పుణ్యము వృద్ధి అవుతుంది కాని అందరికి తిరిగిన మంచి చెడు కలగలసి మానవుడు కష్టాలపాలవుతాడు.

ఇక రెండవది దశదిక్కులకు అధిపతులను నియమించారు కాని వాటికి విరుధముగానే ఉన్నది ఇప్పటి నవగ్రహ ప్రతిష్ట. ఇది ఫలితము నివ్వజాలదు అసలు రాహుకేతువులే లేకుండా సప్తగ్రహ మండలిని నియమించినారు కొన్నిచోట్లలో ,వారు లేనప్పుడు వారి కారకత్వములను ఎవరికి ఇవ్వవలెను?

ఈశాన్యమునకు - గురు, కేతువులు
తూరుపుకు - సూర్యుడు
ఆగ్నేయమునకు - శుక్రుడు
దక్షినమునకు - కుజుడు
నైరుతికి - రాహువు
పశ్చిమమునకు - శని
వాయువ్యమునకు- చంద్రుడు
ఉత్తరమునకు - బుధుడు
భూమికి - కుజుడు
ఆకాశమునకు - చంద్రుడు

ఇలా దశదిక్కులకు అధిపతులను నియమించినారు కాని ఇప్పటి గ్రహమండలము వీటిని అనుసరించక తప్పుగా ఉన్నదని తేలుతున్నది.

సూర్యుడిని మద్యలో నిలిపి శుక్రుడుని తూర్పుకు నిలిపిరి, ఆగ్నేయమునకు
చంద్రుడిని చేర్చిరి, వాయువ్యము కేతువునకు ఇచ్చిరి ఉత్తరాధిపతి కుబేరుడు
ధనాగారము కలవాడని - గురువు ధనాకారకుదని పురానోక్తముగా గురువున్న చోటికి బుధున్ని, బుధుడున్న చోటికి గురువుని మార్చినారు. ఈ మార్పువలన నవగ్రహ మండలము అపసవ్యమని తేలుతున్నది. ఫలితము నిష్ఫలము.

గృహములకు దిక్కులను చూచిన ఇప్పటి నవగ్రహమండలము తప్పుగా ఉన్నదని తేలుతున్నది

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...