హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, డిసెంబర్ 21, 2012

సౌభాగ్య గౌరీ నోము


          పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిద్దలవలె పరిపాలిస్తున్దేవారు.  ఆ రాజుగారి భార్య గౌరీ పూజలతో నిరంతరం కాలం వెళ్ళబుచ్చుతూ వుండేది.  గుణవంతులైన పుత్రులు, మురిపములోలికించే మనుమాలతో ఆ రాజ దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.  పార్వతీ పరమేశ్వర్లు ఆమె భక్తికి మెచ్చి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కలిగింది. 
           ఆ రాజుకు విరోధి అల్ప బలవంతుడైన మరొక సామంతుదాయన మీదకు దండెత్తి వచ్చేలా చేసారు.  దైవబలం జతపదినందున సామంతరాజు ఈ రాజుతో హోరాహోరి యుద్దముచేసినాడు.  ఎందరో సైనికులు వీరస్వర్గం అలంకరించినారు.  బందు కోటి మరణించారు.  ఆఖరుకు ఆ రాజు కూడా యుద్దంలో మరనిన్హినాడు.  మహారాణి కిన్చితైనబెదరక యుద్ధభూమికి వచ్చింది.  యమదూతలు విగత జీవులైన వారి ప్రాణాలను తీసుక పోతున్నారు.  
           అంత మహారాణి వారిని నిలువరిచి యమదూతలారా మీకిదేటిసాహాసం.   నా పసుపు కుంకుమలు నిలిచి ఉండేటందుకు పసుపు వాయనమిచ్చిన దానను.  మా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండగలందులకు బంగారం వాయనమిచ్చాను.  వసతి వాకిలి నిలిచేటందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను.  పొలం తోటలు వనాలు ఉండేటందుకు తోపు చీర వాయనమిచ్చినాను.  బిడ్డలా క్షేమం నిమిత్తం కుడుములు, అరిసెలు వాయనమిచ్చాను.  పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడపూలిచ్చాను.  బంధువుల బాగుకై బంతిపూలిచ్చాను.  రాజ్యం సుభిక్షంగా ఉండుటకు రత్నాలు దేశాశాంతిని కోరి చల్ల పునుకులు పాడిపంటల పెంపునకు పాయసము పేరుప్రతిష్టలు అభివృద్దికి గారెలు, ప్రాణభయము లేకుండా పానకము, కోరికలు నేరవేరుతకు కొబ్బరిబొండాలు, స్వర్గలోక ప్రాప్తికై స్వర్ణ రాశి వాయనములిచ్చాను.  అకాల మరణం కలుగాకున్డుతకు అరటిపళ్ళు వాయనమిచ్చాను.  మీరు నా భర్త ప్రాణాలు గైకొనలేదు.  నా ప్రజలను యమపురికి తరలించలేరు.  పొందు పొందు తొలగిపొండు అని పలికింది.  ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్య వాయనముల ప్రభావమునకు వెరచి యమభటులు ఉత్త చేతులతో మరలిపోయారు.  పార్వతి పరమేశ్వరులు ఆమె  ఔనత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను పరనించిన తదితరులను బ్రతికించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పిన వస్తువులను పుణ్య స్త్రీలకు వీలయినప్పుడల్లా వాయనమియ్యాలి.  అయిదుగురు ముత్తైదువులను పిలిచి గౌరీ దేవిని ఆరాధించి వారికి పసుపు, కుంకుమ రైకల గుడ్డ దక్షిణ తామ్బూలాడులతో ఒక్కొక్కరికి ఐదేసి వస్తువులు వాయనమివ్వాలి. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...