హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

గురువారం, డిసెంబర్ 20, 2012

నాగపంచమి నోము


               పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .   ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.  ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.  
              ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.  ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు.  ఆ సాదువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది.  అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది.
             అందుకా సాదు పుంగవుడు  తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించినది.  ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.   నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం.  నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.  చెవి చక్కబడుతుందని చెప్పి  ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.  ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.  
ఉద్యాపన:  శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది.  అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని  ఆరాధించాలి.  నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి.  నాడు ఉపవాసం వుండాలి.  నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...