హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, December 25, 2012

పసుపుగౌరి నోము కథ


            పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది.  పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు  అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది.  ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది.  ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు.  తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు.  తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు.  ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది.  రాను రాను అతనికి మరణ భయం పెరిగింది.  యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి.  పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.  
             ఒకనాడు భర్త భయాందోళనలతో  సొమ్మసిల్లి పడిపోయాడు.  కదలికలేని భర్తపై బడి తల్లీ!  మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్.  అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా  కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు.  నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు  .  ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది.  లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు.  తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి.  అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది  నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు .   అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది.  నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది.  ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి.  ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...