హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Friday, December 28, 2012

చిత్రగుప్తుని నోము


           పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి  భార్య ఎంతో అన్యోన్యంగా వుండేవారు.  ఇరువురూ కలిసి నోములు నోచుకుంటూ వుండేవారు.  రాజు భార్య మాత్రం చిత్ర గుప్తుని నోము మరచి పోయింది.  మంత్రి భార్య మాత్రం మరువక నోము నోచుకున్నది.  కాల క్రమంలో వారిద్దరూ చనిపోయారు.  చిత్ర గుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకు నరకాన్ని కలుగాచేసాడు.  రాజు భార్య చిత్ర గుప్తుడిని తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది.  నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను.  ఎండువాళ్ళ ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది.  అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ ఓ తరునీమనీ! నువ్వు మంత్రి భార్య తోపాటు అన్ని నోములను నోచినాను ఒక్క చిత్ర గుప్తుని నోమును మరచిటివి ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్పాడు. అప్పుడామే చిత్ర గుప్తా నీ మాత నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరచినాను.  నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వచ్చెదనని బ్రతిమిలాడెను.  అందుకా చిత్రగుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు  పంపించెను.  భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్ర గుప్తుని వద్దకు వచ్చెను.  అందుకా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తి నిచ్చెను.   ఉద్యాపన:  ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను.  అనంతరం ఉద్యాపన చేసుకోవలెను.  ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను.  ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను.  అడ్డెడు తవ్వాడు (2-1/2)  బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...