హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, డిసెంబర్ 19, 2014

16 కుడుముల తద్దె నోము

                            
                         పూర్వ కాలం నాటి మాట ఆ కాలాన ఒక గ్రామాన శ్రీ లక్ష్మీ ,భూలక్ష్మి అను పేర్లు గల ఇద్దరు అక్క చెల్లెండ్రు ఉండేవారు .వారిద్దరిలో శ్రీ లక్ష్మి నాస్తికురాలు.భూలక్ష్మి ఆస్తికురాలు .అన్నిటిలో ఇద్దరికీ వ్యత్యాసము ఉండేది .లేదా తేడా ఉండేది .భూలక్ష్మికి భక్తి ఎక్కువ ఆ కారణం చే ఆమె ఎవరే నోము నోచమంటే ఆ నోము నోచేది శ్రద్దా భక్తులతో ఆచరించేది .
 
                            ఒకనాడు ఆ గ్రామానికి ఒక పండితుడు వచ్చాడు . ఆయన గ్రామస్తులకు 16 కుడుముల తద్దె నోము గురుంచి వివరించి చెప్పి ఆచరించమని చెప్పాడు. భూలక్ష్మి చక్కగా విని ఎంచక్కా వ్రత మాచరించింది. ఇక శ్రీ లక్ష్మి మాత్రం నాస్తికురాలు కావడం వల్ల వ్రతమా ? పాడా ! వ్రతాలు వద్దూ ,నోములూ వద్దూ అని హాయిగా పిండి వంటలు చేసుకుని తినేది .దేవతలూ లేరు ,దేముళ్ళు లేరు .అంతా ఈ పేరు చెప్పి తినడానికి ఈ వ్రతాలు -నోములు పెట్టారు .అంతా భూటకం ,నాటకం, మాయ, మిధ్య, పనీ -పాట లేని వారు ఇవన్నీ ఏర్పాటు చేసారు .అంతే కాని వీటి వల్ల ఏం ఫలితం ఉండదు. అని ఆమె ఏవేవో మాట్లాడేది . కొన్నాళ్ళకు ఆమె దరిద్రు రాలయింది .ముష్టి త్తుకుని తినేది .ఆమెకు ఎవరూ పిడికెడు బియ్యం కూడా పెట్టె వారు కాదు .తినుటకు తిండి ,ఉండేందుకు ఇల్లు ,కట్టుకునేందుకు బట్ట లేదు. అష్ట కష్టాలు పడసాగింది .పాడు పడిన గౌరీ దేవి గుడిలోనికి వెళ్ళింది. వెక్కి వెక్కి ఏడవ సాగింది .తన గోడంతా ఆ దేవత ముందు చెప్పుకుంది .దయామయి అగు ఆ దేవత ప్రత్యక్షమై -అమ్మా ' శ్రీ లక్ష్మీ ' బాధ పడకు ,విచారించకు . 16 కుడుముల నోము నోయి . అన్ని బాధలు తీరుతాయి . గ్రామస్తుల సహకారం అర్ధించు , తప్పక నీకు సహకరిస్తారు వెళ్ళు అనగా ఆమె ఇంటికి వెళ్లి అందరి సహకారంతో నోము నోచినది .మహిమ అంతే ఆమె ధన వంతురాలయినది . ఉద్యాపన వినండి - పై కధ చదివి పవిత్రాక్షతలు శిరస్సున జల్లుకుని గౌరిని పూజించి 16 కుడుములు ,లక్క జోళ్ళు ,నల్ల పూసలు, దక్షిణ ,తాంబూలం సమర్పించాలి .16 చేటలు 16 మందికి ఇవ్వాలి .అన్నదానం చేయాలి.



linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...