ధైర్య లక్ష్మి నోము ఇది ఒక భక్తి పపట్టులతో ఆత్మ విశ్వాసాన్ని రంగరించిన ఒక వృత్తాంతము వున్నది ఒక గ్రామంలో ఒక స్త్రీ వుండేది. ఆమెకు అయిదుగురు తమ్ముల్లునారు వారిలో నలుగురు తమ్ముళ్ళ పెళ్లిళ్లకు దేనికి ఆమె వేళ్ళ లేదు. ఏ తమ్ముడి పెళ్ళికి వెళ్ళాలనుకున్న ఆమె భర్తకు ప్రాణాంతకమైన వ్యాధి సంభవిస్తుండేది. ఆఖరు తమ్ముడి పెళ్ళికి భర్తకు ఆరోగ్య పరిస్థితి యెంత మాత్రం బాగాలేకపోయినా ఆమె నా భర్తకు ఏమి జరగదన్న ధైర్యంతో బయలుదేరింది.
మార్గ మధ్యలో ఒక జమ్మి చెట్టు కనిపిస్తే దాని చుట్టూ ప్రదక్షణ చేసి నువ్వే నాకు ధైర్యం, నువ్వే నా భర్తను రక్షించాలని మనసులో దేవుణ్ణి ప్రార్ధించుకుని ఆ చెట్టుకు నమస్కారము చేసి తమ్ముడి పెళ్ళికి వెళ్ళింది.పెళ్లి పూర్తి అయ్యాక ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వచ్చే సరికి ఆమె భర్త పూర్తి ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నాడట. ఈ ఇతిహాసంలో ధైర్య లక్ష్మి నోము చెప్పబడుతుంది.