హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Sunday, December 23, 2012

కైలాసగౌరి నోము


       పూర్వము ఒక రాజ్యములో మహారాజు తన కుమార్తెను అతి గారాబముగా పెంచి పెద్ద దానిని చేశాడు.  యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని    వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.  రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది.  ఆమె భర్త వేశ్యాలోలుడు.  భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త  అనురాగానికి దూరమై  ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది.  మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు.  తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసినదిగా పరమేశ్వరరుడిని ప్రార్ధించేవాడు.  ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.  


             ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది.  నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు అని చెప్పింది.  ఆ ప్రకారం రాకు కూతురు కైలాస గౌరీ నోము నోచింది.  అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి.  ఉంపుడు గత్తెల  కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది.  భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది.  ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్తే యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది.  వారిని చూచినా వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.  
ఉద్యాపన:  పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు  పొందాలి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...