చాఞ్చల్యారుణలోచనాఞ్చితకృపాం చన్ద్రార్ధచూడామణిం
చారుస్మేరముఖాం చరాచరజగత్సంరక్షిణీం తత్పదామ్|
చఞ్చచ్చమ్పకనాసికాగ్రవిలసన్ముక్తామణీరంజితాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౧||
చంచలములు- ఎర్రనివి- దయతోనిండినవి అగు కన్నులు
కలది, అర్థచంద్రుని చూడామణిగాధరించినదీ, చిరునవ్వుతో
అందమైన ముఖము కలది, చరాచర ప్రపంచము నంతటినీ సంరంక్షించునది,
’తత్’ అను పదమునకు అర్థమైనది, సంపెంగ పువ్వు వంటి
ముక్కు చివరన ముత్యము నలంకరించునది, శ్రీశైలము
నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.
కస్తూరీతిలకాఞ్చితేందువిలసత్ప్రోద్బాసిఫాలస్థలీం
కర్పూరద్రవమిశ్రచూర్ణఖదిరామోదోల్లసద్వీటికామ్|
లోలాపాఙ్గతరంగితైరతికృపాసారైర్నతానన్దినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౨||
కస్తూరి తిలకము శోభిల్లుచున్న నొసటి ప్రదేశము
కలది, కర్పూరము- సున్నము- వక్కలతో సుగంధభరితమైన
తాంబూలమును సేవించుచున్నది, చంచలమైన కటాక్షముల
ద్వారా వర్షించు కృపారసవర్షములచే భక్తులను ఆనందింపచేయునది,
శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను
ధ్యానించుచున్నాను.
రాజన్మత్తమరాలమన్దగమనాం రాజీవపత్రేక్షణాం
రాజీవప్రభవాదిదేవమకుటై రాజత్పదామ్భోరుహామ్|
రాజీవాయతపత్రమణ్డితకుచాం రాజాధిరాజేశ్వరీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౩||
మదించిన హంసవలే మెల్లగ నడచునది, తామరరేకుల వంటి
కన్నులు కలది, బ్రహ్మమొదలగు దేవతలచే నమస్కరించబడు
పాదపద్మములు కలది, విశాలమైన తామర రేకులతో అలంకరింపబడిన
స్తనములు కలది, రాజాధిరాజులను కూడ శాసించునది,
శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను
ధ్యానించుచున్నాను.
షట్తారాంగణదీపికాం శివసతీం షడ్వైరివర్గాపహాం
షట్చక్రాన్తరస్థితాం వరసుధాం షడ్యోగినీవేష్టితామ్|
షట్చక్రాంతిచితపాదుకాంచితపదాం షడ్భావగాం షోడశీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౪||
నక్షత్రముల వలే ప్రకాశించు ఆరుఅక్షరముల మంత్రము
నందు వెలుగొందుచున్నది, శివుని భార్యయైనది, అరిషడ్వర్గములను
నశింపచేయునది, మూలాధారము మొదలగు ఆరు చిక్రములలో
నుండునది, అమృతరూపమైనది, కాకిని మొదలగు ఆరు యోగినులచే
చుట్టబడినది, ఆరు చక్రములు శోభిల్లు పాదుకలు ధరించిన
పాదములు కలది, పుట్టుక మొదలగు ఆరు భావములను తొలగించినది,
పదహారు అక్షరముల మంత్రస్వరూపమైనది, శ్రీశైలము
నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.
శ్రీనాథాదృతపాలితత్రిభువనాం శ్రీచక్రసంచారిణీం
గానాసక్తమనోజయౌవనలసద్గంధర్వకన్యాదృతామ్|
దీనానామతివేలభాగ్యజననీం దివ్యామ్బరాలఙ్కృతాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౫||
విష్ణువుచే ఆదరించబడుచూ మూడులోకములను పాలించుచున్నది,
శ్రీచక్రము నందు సంచరించుచున్నది, యువతులైన గంధర్వకన్యలచే
పాటలు పాడుచూ సేవింపబడుచున్నది, దీనులకు మిక్కిలి
భాగ్యము నిచ్చునది, దివ్యవస్త్రములను ధరించినది,
శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను
ధ్యానించుచున్నాను.
లావణ్యాధికభూషితాఙ్గలతికాం లాక్షాలసద్రాగిణీం
సేవాయాతసమస్తదేవవనితాసీమన్తభూషాన్వితామ్|
భావోల్లాసవశీకృతప్రియతమాం భణ్డాసురచ్ఛేదినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౬||
అధిక సౌందర్యవంతమైన శరీరము కలది, లక్కవలే ఎర్రనైనది,
నమస్కరించు దేవతాస్త్రీల తలలపై నున్న ఆభరణములతో
ప్రకాశించుచున్నది, అనురాగముచే పరమేశ్వరుని వశీకరింపచేసుకున్నది,
భండాసురుని
సంహరించినది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన
శ్రీమాతను ధ్యానించుచున్నాను.
ధన్యాం సోమవిభావనీయచరితాం ధారాధరశ్యామలాం
మున్యారాధనమోదినీం సుమనసాం ముక్తిప్రధానవ్రతామ్|
కన్యాపూజనసుప్రసన్నహృదయాం కాఞ్చీలసన్మధ్యమాం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౭||
ధన్యురాలు, చంద్రునిలో ధ్యానింపదగిన చరిత్రము
కలది, మేఘము వలే నల్లనైనది, మునుల చేయు ఆరాధనలతో
సంతోషించునది, మహాత్మలకు ముక్తినిచ్చునది, కన్యకా
పూజలు చేయువారి యందు ప్రసన్నమైన హృదయము కలది, ఓడ్డాణముతో
ప్రకాశించు నడుము కలది, శ్రీశైలము నందు నివసించునది,
భగవతియైన శ్రీమాతను ధ్యానించుచున్నాను.
కర్పూరాగరుకుఙ్కుమాఙ్కితకుచాం కర్పూరవర్ణస్థితాం
కృష్టోత్కృష్టసుకృష్టకర్మదహనాం కామేశ్వరీం కామినీం|
కామాక్షీం కరుణారసార్ద్రహృదయాం కల్పాన్తరస్థాయినీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౮||
కర్పూరము- అగరు- కుంకుమలు పూయబడిన వక్షస్థలము కలది,
కర్పూరము వంటి శరీరచ్చాయ కలది, అన్ని విధములైన
కర్మలను దహించివేయునది, శివుని భార్యయైనది, కోరికలు
కలది, మన్మథుని తన కన్నులలో నింపుకున్నది, కరుణతో
నిండిన హృదయము కలది, ప్రళయకాలము నందు కూడా స్థిరముగా
నుండునది, శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన
శ్రీమాతను ధ్యానించుచున్నాను.
గాయత్రీం గరుడధ్వజాం గగనగాం గాన్ధర్వగానప్రియాం
గమ్భీరాం గజగామినీం గిరిసుతాం గన్ధాక్షతాలఙ్కృతామ్|
గంగాగౌతమగర్గసన్నుతపదాం గాం గౌతమీం గోమతీం
శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే||౯||
స్తుతించినవారిని రక్షించునది, జెండాపై గరుడచిహ్నము
కలది, ఆకాశము నందు సంచరించునది, గంధర్వగానమును
ఇష్టపడునది, గంభీరమైనది, గజగమనము కలది, హిమవంతుని
కుమార్తెయైనది, గంధము- అక్షతలతో అలంకరింపబడినది,
గంగ- గౌతమ మహర్షి- గర్గుడు మొదలగు వారిచే స్తుతించబడు
పాదములు కలది, గోవు- గౌతమి- గోమతి స్వరూపిణియైనది,
శ్రీశైలము నందు నివసించునది, భగవతియైన శ్రీమాతను
ధ్యానించుచున్నాను.
జయ జయ శఙ్కర హర హర శఙ్కర