హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, June 05, 2012

3.కైవల్యోపనిషత్

|| కైవల్యోపనిషత్ ||


అశ్వలాయనుడు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఈ విధంగా అంటాడు.... 
1. అధీహి భగవన్ ! బ్రహ్మవిద్యాం వరిష్ఠాం 
సదా సద్భి: సేవ్యమానాం నిగూఢామ్ !
యయా చిరాత్ సర్వపాపం వ్యపోహ్య 
పరాత్పరం పురుషం యాతి విద్వాన్ !!
హే భగవంతుడా... ఉత్తమమైనది, గోప్యమైనది ఎల్లప్పుడూ సజ్జనులచే ఆచరింపబడుతుంది. దేనిని అనుష్ఠించడం వల్ల సర్వపాపములు తొలగి పండితుడు పరాత్పరుని చేరగలడో... ఆ బ్రహ్మవిద్యను నాకు ఉపదేశించు. 
2. తస్మై స హోవాచ పితామహశ్చ !
శ్రద్ధా భక్తి ధ్యానయోగాదవైహి !!
అప్పుడు బ్రహ్మదేవుడు అశ్వలాయునికి ఈ విధంగా తెలుపుతాడు... ‘‘ఆ బ్రహ్మ విద్యను అత్యంత శ్రద్ధా, భక్తి, ధ్యానయోగాల ద్వారా బాగా గ్రహించగలవు’’. 
3. న కర్మణా న ప్రజయా ధనేన 
త్యాగే నైకేన అమృతత్వ మానశు: !
పరేణ నాకం నిహితం గుహాయాం 
విభ్రాజతే యద్యతయో విశన్తి !!
కర్మవల్లగాని, సంతానంవల్లగాని, ధనంవల్లగాని అమరత్వం లభించదు. త్యాగం వల్లే అమరత్వం లభ్యమవుతుంది. స్వర్గానికి అధిపతిఅయి హృదయకుహరంలో ప్రకాశిస్తున్న ఆ పరమాత్మను యతీశ్రులు పొందగలుగుతారు. 
4. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా: 
సంన్యాస యోగాద్యతయ: శుద్ధ సత్వా: 
తే బ్రహ్మ లోకేషు పరాన్తకాలే 
పరామృతాత్ పరిముచ్యన్తి సర్వే!!
వేదాంత విజ్ఞాన సూక్ష్మాలను గ్రహించి సన్యాసయోగ్యం ద్వారా పరిశుద్ధమైన అంత:కరణ కలిగిన యతీశ్వరులు బ్రహ్మానుభూతితో జీవభావం సంపూర్ణంగా నశించిన తరువాత బంధ విముక్తులై అమరత్వ స్థితిని పొందుతారు. 
5. వివిక్తదేశే చ సుఖాసనస్థ: 
శుచి: సమగ్రీవ శిర: శరీర: !
ఆత్యాశ్రమస్థ: సకలేంద్రియాణి నిరుధ్య 
భక్త్యాస్వగురుం ప్రణమ్య 
హృత్పుండరీకం విరజం విశుద్ధం 
విచిన్త్య మధ్యే యశదం విశోకమ్ 
ఏకాంతంగా వున్న ప్రదేశంలో సుఖాసీనుడై, మెడ శిరస్సు, శరీరాన్ని నిటారుగా, సమంగా వుంచి, శుచితో దేహాత్మ భావం లేకుండా సమస్త ఇంద్రియాలను నిరోధించి, భక్తితో తన గురువుకి నమస్కరించి, నిర్మలం, శుద్ధం, శోకరహితం అయిన హృదయపద్మంగా భాసిస్తున్న ఆ పరమాత్మని ధ్యానించాలి. 
6. అచిన్త్య మవ్యక్త మనన్త రూపం 
శివం ప్రశాంత మమృతం బ్రహ్మయోనిమ్ !
తథాది మధ్యాన్త విహీనమేకం 
విభుం చిదానంద మరూపమద్భుతమ్ !!
ఆ ఆత్మస్వరూపం అచింత్యం, అవ్యక్తం, అనంతరం, మంగళం, ప్రశాంతం, అమృతం బ్రహ్మకంటే సనాతనమైంది. ఆధి, మధ్య, అంతంలేనిది, ఏకం, సర్వం వ్యాపించినది, చిదానందమైంది, రూపంలేనిది, అద్భుతమైంది. 
7. ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం
త్రిలోచనం నీలకంఠం ప్రశాంతమ్ 
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం 
సమస్త సాక్షిం తమస: పరస్తాత్ 
ఉమాసమేతుడు, పరమేశ్వరుడు, ప్రభువు, ప్రశాంతుడు, త్రిలోచనుడు, నీలకంఠుడు అయిన పరమశివునిని ధ్యానించిన ముని సమస్తానికి సాక్షి అవుతున్నాడు. 
8. స బ్రహ్మ స శివ: సేంద్ర: సో క్షర: పరమ: స్వరాట్ 
స ఏవ విష్ణు స ప్రాణ: స కాలో గ్ని: స చంద్రమా: 
అతడే బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, విష్ణువు, నాశరహితుడు, పరమస్వరాట్, ప్రాణము, అగ్నిచంద్రుడు కాలము. 
9. స ఏవ సర్వం యద్ భూతం యచ్చభవ్యం సనాతనమ్ !
జ్ఞాత్వాతం మృత్యుమృత్యేతి నాన్య:పంథా విముక్తయే !!
భూతకాలంలో ఏది వుందో, భవిష్యత్ కాలంలో ఏది వుండగలదో అది ఆ బ్రహ్మయే. నిత్యతత్వమైన బ్రహ్మను తెలుసుకొని మృత్యువుని అధిగమిస్తున్నాడు. ముక్తికి ఇంతకంటే వేరే మార్గం లేదు. 
10. సర్వభూతాస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని !
సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా !!
సమస్తభూతాలను తనలో, తనను సమస్త భూతాలలో దర్శించువాడు ఆ బ్రహ్మను చేరుతున్నాడు. ఇది తప్ప వేరే మార్గం లేదు. 
11. ఆత్మాన మరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్ !
జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత: !!
జీవాత్మభావం కింద అరణిగా, ఓంకారం పై అరణిగా చేసే జ్ఞానమార్గాన్ని అభ్యసించే పండితుడు.. ఆ జ్ఞానం ద్వారా సమస్త బంధాలను నశింపచేసుకుంటున్నాడు. 
12. స ఏవ మాయా పరిమోహితాత్మా 
శరీరమాస్థాయ కరోతి సర్వమ్ !
స్త్రీయన్న పానాది విచిత్ర భోగై: 
స ఏవ జాగ్రత్ పరితృప్తి మేతి !!
అతడి మాయవల్ల ఈ శరీరాన్ని ధరించి జీవుడిగా అనేక కార్యాలను చేస్తున్నాడు. జాగ్రదవస్థలో ఆ జీవుడే స్త్రీ, అన్న పానాదులతో రకరకాల భోగాలను అనుభవిస్తూ, దానితోనే తృప్తి పొందుతున్నాడు. 
13. స్వప్నే స జీవ: సుఖదు:ఖ భోక్తా 
స్వమాయయా కల్పిత జీవ లోకే 
సుషుప్తికాలే సకలే విలీనే 
తమో భిభూత: సుఖరూపమేతి 
స్వప్నమందు ఈ జీవుడే తన మాయతో సృష్టించుకున్న స్వాప్నవిలోకంలో సుఖదు:ఖాలను పొందుతున్నాడు. సుషుప్తిలో సర్వం విలీనం అయినప్పుడు తమస్సుచే సుఖరూపంలో వున్నాడు. 
14. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ 
స ఏవ జీవ: స్వపితి ప్రబుద్ధ: !
పురత్రయే క్రీడతి యశ్చ 
జీవ స్తతస్తు జాతం సకలం విచిత్రం !!
ఆధారమానంద మఖండబోధం 
యస్మిన్ లయం యాతి పురత్రయం చ !!
ఆ జీవుడు జన్మాంతర కర్మయోగం వల్ల నిద్రించి మేల్కొంటున్నాడు. ఈ విధంగా మూడు పురాలలో ఆ ఆత్మ క్రీడించుచున్నది. ఆత్మ నుంచే విచిత్రమైన యావత్ ప్రపపంచం ఉత్పన్నమౌతోంది. మూడవస్థలకు అతడే ఆధారం. అఖండ జ్ఞానస్వరూపుడు, అతనిలోనే మూడవస్థలు లయమవుతున్నాయి. 
15. ఏతస్మాజ్జాయతే ప్రాణో మన: సర్వేంద్రియాణి చ !
ఖం వాయుర్జ్యోతిరాప: పృథ్వీ విశ్వస్య ధారిణీ !!
ఆ ఆత్మ నుంచే ప్రాణం, మనస్సు, సర్వేంద్రియాలు, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, విశ్వం, భూమి అన్నీ ఉద్భవించాయి. 
16. యత్పరం బ్రహ్మ సర్వత్రా విశ్వస్యాయతనం మహత్ !
సూక్ష్మా త్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్యమేవ తత్ !!
ఏది పరబ్రహ్మమో, ఏది అన్నింటా ఆత్మగా భాసిస్తోందో, ఏది విశ్వానికి ఆధారభూతమో, ఏది సూక్ష్మం కంటే సూక్ష్మమో, ఏది శాశ్వతమైంది అదే నువ్వు, నువ్వే అది. 
17. త్రిషుధామసు యద్ భోగ్యం భోక్తాభోగశ్చ యద్భవేత్ !
తేభ్యో విలక్షణ: సాక్షీ చిన్మాత్రో హం సదాశివ: !!
మూడు అవస్థలలో భోగ్యం, భోక్త, భోగరూపంలో దానికి భిన్నమైనవాటిని, సర్వసాక్షిని, చిద్రూపుడైన సదాశివుడు. 
19. మయ్యేవ సకలం జాతం మయి ప్రతిష్టితమ్ !
మయి సర్వం లయం యాతి తద్ర్భహ్మాద్వయమస్మ్యహమ్ !!
నా యందే సమస్తం పుట్టి, నాయందే వుండి, నాలోనే సర్వం లయమవుతున్నాయి. ఆ అద్వైత బ్రహ్మను నేనే. 
20. అణోరణీయానహమేవ 
తద్వన్మహానహం విశ్వమహం విచిత్రమ్ !
పురానోహం పురుషోహమీశో 
హిరణ్మయోహం శివరూపమస్మి !!
నేను అణువు కంటే అణువును. మహత్తు కన్నా మహత్తును. నేను విచిత్రమైన విశ్వాన్ని, సనాతుడిని, పురుషుడిని, ఈశ్వరుడిని, హిరణ్మయుడిని, శివుడిని. 
21. అపాణిపాదోహ మచింత్యశక్తి: 
పశ్యామ్యచక్షు: స శృణోమ్యకర్ణ: !
అహం విజానామి వివిక్తరూపో 
న చాస్తి వేత్తామమ చిత్సదాహమ్ !!
నాకు కాళ్లు, చేతులు వుండవు. అయినా జగద్వ్యాపారాలన్ని చేస్తున్నాను. నా శక్తి ఆలోచనకు అందనిది. కళ్లులేకుండా నేను చూస్తున్నాను. చెవులు లేకుండా వింటున్నాను. అన్నీ నాకు విదితమే. నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. నేను సదా చైతన్యస్వరూపుడిని. 
22. వేదైరనేకై రహమేవ వేద్యో 
వేదాంతకృద్వే దవిదేవ చాహమ్ !
న పుణ్య పాపే మమ నాస్తినాశో 
న జన్మదేహేంద్రియ బుద్ధిరస్తి 
సమస్త వేదాలద్వారా తెలియబడే బ్రహ్మను నేను. వేదాలను, వేదాంతాలలోని ఉపనిషత్తులను శ్రుతిగా అందించింది నేనే. వేదవిడుదుని నేనే. నాకు పుణ్యం, పాపాలు లేవు. నాకు జన్మలేదు, నాశనం లేదు. నాకు దేహేంద్రియ భావాలు లేవు. 
23. నభూమిరాపో న చ వహ్నిరస్తి 
న చా నిలో మే స్తి న చాంబరం చ !
ఏవం విదిత్వా పరమాత్మ రూపం 
గుహాశయం నిష్కల మద్వితీయమ్ !!

24. సమస్త సాక్షిం సదసద్విహీనం 
ప్రయాతి శుద్ధం పరమాత్మ రూపమ్ !!
(24, 25) నాకు భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు అంటూ ఏదీలేదు. నిష్కళుడను. ఆద్వితీయుడిని. సర్వసాక్షిని సదసద్విహీనుడిని. అటువంటివాడినైన నన్ను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు, శుద్ధమైన నా రూపాన్నే పొందుతాడు. 
________________________________________________________________________
                  || కైవల్యోపనిషత్ ||

కైవల్యోపనిషద్వేద్యం కైవల్యానందతుందిలం |
కైవల్యగిరిజారామం స్వమాత్రం కలయేన్వహం ||
ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః ||
ఓం అథాష్వలాయనో భగవంతం పరమేష్ఠినముపసమేత్యోవాచ |


అధీహి భగవంబ్రహ్మవిద్యాం వరిష్ఠాం

 సదా సద్భిహ్ సేవ్యమానాం నిగూఢాం |
యథాచిరాత్సర్వపాపం వ్యపోహ్య 

పరాత్పరం పురుషం యాతి విద్వాన్ || 1 ||
 

తస్మై స హోవాచ పితామహశ్చ శ్రద్ధాభక్తిధ్యానయోగాదవైహి || 2 ||

న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః|
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి || 3 ||


వేదాంతవిజ్ఞాన సునిశ్చితార్థాః సంన్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః |
తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్  పరిముచ్యంతి సర్వే || 4 ||


వివిక్తదెశేచ సుఖాసనస్థః శుచిః సమగ్రీవశిరఃశరీరః |
అంత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య || 5 ||


హృత్పుణ్డరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం |
అచింత్యమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమ
మృతం బ్రహ్మయోనిం || 6 ||


తమాదిమధ్యాంతవిహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం |
ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకణ్ఠం ప్రశాంతం |
ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్తసాక్షిం తమసః పరస్తాత్ || 7 ||స బ్రహ్మా స శివః సేంద్రః సోక్షరః పరమః స్వరాట్ |
స ఏవ విష్ణుః స ప్రాణః స కాలోగ్నిః స చంద్రమాః || 8 ||


స ఏవ సర్వం యద్భూతం యచ్చ భవ్యం సనాతనం |

 ఙ్ఞాత్వా తం మృత్యుమత్యేతి నాన్యః పంథా విముక్తయే || 9 ||

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
సంపశ్యన్ యంబ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా || 10 ||


ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం | ఙ్ఞాననిర్మథనాభ్యాసాత్పాపం దహతి పణ్డితః || 11 ||


స ఏవ మాయాపరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం |
స్త్రీయన్నపానాదివిచిత్రభోగైః స ఏవ జాగ్రత్పరితృప్తిమేతి || 12 ||


స్వప్నే స జీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే |
సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి || 13 ||


పునశ్చ జన్మాంతరకర్మయోగాత్స ఏవ జీవః స్వపితి ప్రబుద్ధః |
పురత్రయే క్రీడతి యశ్చ జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం |
ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ || 14 ||


ఏతస్మాజ్జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపశ్చ పృథ్వీ విష్వస్య ధారిణీ || 15 ||


యత్పరం బ్రహ్మ సర్వాత్మా విష్వస్యాయతనం మహత్ |
సూక్ష్మాత్సూక్ష్మతరం నిత్యం తత్త్వమేవ త్వమేవ తత్ || 16 ||


జాగ్రత్స్వప్నసుషుప్త్యాదిప్రపచం యత్ప్రకాశతే |
తద్బ్రహ్మాహ మితి  ఙ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే || 17 ||


త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ |
తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోహం సదాశివః || 18 ||


మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం |
మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం || 19 ||


 || ప్రథమః ఖండః || 1 ||


అణోరణీయానహమేవ తద్వన్మహానహం విశ్వమహం విచిత్రం |
పురాతనోహం పురుషోహమీశో హిరణ్మయోహం శివరూపమస్మి || 20 ||


అపాణిపాదోహమచింత్యశక్తిః పశ్యామ్యచక్షుః స శృణోమ్యకర్ణః |
అహం విజానామి వివిక్తరూపో న చాస్తి వేత్తా మమ చిత్సదాహం || 21


వేదైరనేకైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహం |
న పుణ్యపాపే మమ నాస్తి నాశో న జన్మ దేహేంద్రియబుద్ధిరస్తి || 22 ||


న భూమిరాపో న చ వహ్నిరస్తి న చానిలో మేస్తి న చాంబరం చ |
ఏవం విదిత్వా పరమాత్మరూపం గుహాశయం నిష్కలమద్వితీయం || 23


సమస్తసాక్షిం సదసద్విహీనం ప్రయాతి శుద్ధం పరమాత్మరూపం ||
యః శతరుద్రియమధీతే సోగ్నిపూతో భవతి సురాపానాత్పూతో భవతి
స బ్రహ్మహత్యాయాః పూతో భవతి స సువర్ణస్తేయాత్పూతో భవతి
స కృత్యా
కృత్యాత్పూతో భవతి తస్మాదవిముక్తమాశ్రితో
భవత్యత్యాశ్రమీ సర్వదా స
కృద్వా జపేత్ ||
అనేన ఙ్ఞానమాప్నోతి సంసారార్ణవనాశనం | తస్మాదేవం
విదిత్వైనం కైవల్యం పదమశ్నుతే కైవల్యం పదమశ్నుత ఇతి || 24 ||


ద్వితీయః ఖండః || 2 ||


ఓం సహనావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై ||
ఓం శాంతిః  శాంతిః శాంతిః
||
ఇత్యథర్వవేదీయా కైవల్యోపనిషత్సమాప్తా ||

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...