హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఉపనిషత్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉపనిషత్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, మార్చి 06, 2015

9.ఈశావాస్య ఉపనిషత్తు

 || ఈశావాస్య ఉపనిషత్తు ||
1. ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే!
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే!!
ఓం శాంతి: ఓం శాంతి: శాంతి:
ఓం - ఓం; అద: - అది; పూర్ణం - అనంతం; ఇదం - ఇది; పూర్ణం - అనంతమైనది; పూర్ణాత్ - అనంతనుంచి (కంటికి కనిపించని ఈ అనంతం నుంచి); పూర్ణం - అనంతం (గోచర ప్రపంచమంతా); ఉదచ్యతే - ఉద్భవిస్తోంది; పూర్ణస్యపూర్ణమాదాయ - అనంతం నుంచి అనంతం తీసివేస్తే ; పూర్ణ ఏవ - అనంతమే; అవశిష్యతే - మిగిలి వుంటుంది ; ఓం - ఓం; శాంతి: - శాంతి
అది (ఆ కనిపించని అనంతం) పూర్ణం. ఇది కూడా (కనిపించే అనంతవిశ్వం) పూర్ణం. పూర్ణంనుంచి ఈ పూర్ణం బహిర్గతమౌతోంది. పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగిలివుంటుంది.

2. ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.
జగత్యాం - జగత్తులో; యత్ కించ - ఏదేదైతే; జగత్ - మార్పుచెందేది; ఇదం సర్వం - ఇది అంతా; ఈశా - భగవంతుని చేత; వాస్యం - ఆవరింపబడి వుంది; తేనత్యక్తేన - ఆ త్యాగం చేత; భుంజీథా: - పోషణచేసుకో; కస్యస్విద్ ధనమ్ - ఎవని ధనాన్ని మాత్రంము; మాగృధ: - ఆశించకు.
ఈ జగత్ లో మార్పుచెందేది ఏదేది వున్నదో అదంతా భగవంతునిచేత ఆవరింపబడి వుంది. ఈ త్యాగం చేత నిన్ను నీవు పోషించుకో. ఎవరి ధనాన్ని మాత్రం ఆశించకు.

3. కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేత్ శతగ్గం సమా:!
ఏవం త్వయి నాన్యథేతోఁస్తిన కర్మ లిష్యతే నరే!!
ఇహ - ఈ జగత్తులో; కర్మాణి - శాస్త్రవిహితములైన కర్మలను; కుర్వన్ - చేస్తూ; ఏవం - ఇదేరీతిగా; త్వయి - నీకు; నరే - మానవునకు; ఇత: - ఇంతకంటే; అన్యథా - వేరొక మార్గం; న అస్తి - లేదు; కర్మ - కర్మ; న లిష్యతే - అంటదో
శాస్త్ర విహితమైన నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ మాత్రమే మానవుడు నూరు సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. మానవ జీవితం పైన ఆసక్తి వున్నంతవరకు దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోవడానికి ఇది తప్ప మరోదారి లేదు.

4. అసుర్యానామతే లోకా అంధేన తమసావృతా!
తాగంస్తే ప్రేతాభిగచ్ఛన్తి యేకే చాత్మహనో జనా:!!
అసుర్య: - రాక్షసులకు చెందిన; అంధేన తమసా - కటిక చీకటి చేత; ఆవృతా: - ఆవరింపబడినవి; నామ - నిజంగా; తే - ఆ; లోకా: - జన్మలు; యేకే - ఎవరెవరైతే; చ - కూడా; జనా: - జనులు : ఆత్మహన: - ఆత్మహంతకులో; తే - వారు; ప్రేత్య - మరణానంతరము; తాన్ - ఆయా జన్మలను; అభిగచ్ఛన్తి - పొందుతారు.
నిజంగా ఆ జన్మలు కటిక చీకటిచేత ఆవరింపబడిన రాక్షసజన్మలు. ఆత్మహంతకులైనవారు మరణానంతరం వాటిని పొందుతారు.

5. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా
ఆప్నువన్ పూర్వమర్షత్!
తద్ధావతోఁ న్యానత్యేతి తిష్ఠ
త్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి!!
తత్ - ఆ ఆత్మ; ఏకం - ఒకటే; అనేజత్ - చలనములేనిది; మనస: - మస్సుకంటే; జవీయ: - వేగవంతమైనది; దేవా: - ఇంద్రియములు; ఏనత్ - దీనిని; నఆప్నువన్ - గ్రహించలేవు; పూర్వం అర్షత్ - మనస్సుకంటే ముందు వెళ్లింది; తత్ - అది; తిష్ఠత్ - స్థిరంగా వుంటూ; దావత: -పరుగెత్తుతూవున్న; అన్యాన్ - ఇతర విషయాలను; అత్యేతి - దాటిపోతుంది; తస్మిన్ - అది వుండడంచేత; మాతరిశ్వా - విశ్వాశక్తి అంటే ప్రాణశక్తి; ఆప: - ప్రాణులయొక్క కార్యకలాపమంతా; దధాతి - భరిస్తోంది.
ఆత్మ ఒక్కటే చలించనిదైనా కనస్సుకంటే వేగవంతమైనది. మనస్సుకన్నా ముందే వెళ్లగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. నిత్యమూ స్థిరమైన దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలాపాలను భరించటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది.

6. త దేజతి తన్నైజతి త ద్దూరే తద్వంతికే!
త దన్తరస్య సర్వస్య త దు సర్వ స్యాస్య బాహ్యత:!!
తత్ - అది; ఏజతి - చలించుచున్నది; తత్ - అది, న ఏ జతి - చలించదు; తత్ - అది; దూరే - దూరంలో వుంది; తత్ - అది, ఉ అంతికే - దగ్గరకూడా వుంది; తత్ - అది; ఉ - ఇంకా; అంతరస్య - లోపల; సర్వస్య అస్య - సర్వత్ర వుంది; బాహ్యత: - బయట కూడా వుంది.
ఆత్మ చలిస్తోంది, చలించదు. అది దూరంలో వుంది, దగ్గర కూడా వుంది. అది లోపలా బయటా అంతా వుంది.

7. యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి!
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే!!
య: - ఎవరైతే; తు - మరి; సర్వాణి - సమస్త; భూతాని - జీవులన, ఆత్మని ఏవ - ఆత్మయందే; అనుపశ్యతి - దర్శించునో; చ - మరియు; సర్వభూతేషు - అన్ని జీవులయందు; ఆత్మానాం - ఆత్మను; తత: - అందుచేత; నవిజుగుప్సతే - ద్వేషింపడు
అన్ని జీవులు తన ఆత్మకంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మగా దర్శించే వాడు దేనిని ద్వేషింపడు.

8. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వాభూ ద్విజానత: !
తత్రకో మోహ: క: శోక: ఏకత్వ మనుపశ్యత: !!
యస్మిన్ - ఎప్పుడైతే; విజానత: - విజ్ఞానానికి; ఆత్మ ఏవ - ఆత్మయే; సర్వాణి - సమస్త; భూతాని - జీవులు; అభూత్ - అయినదో; తత్ర - అప్పుడు; ఏకత్వం - ఐక్యతను; అనుపశ్యత: - దర్శించే అతనికి; క: - ఏమిటి; మోహ: - మోహము; క: - ఏమిటి; శోక: - శోకము.
అన్ని జీవులను తన ఆత్మగానూ, చరాచర జగత్తును ఆత్మయొక్క ఏకత్వంగాను దర్శించే ఆత్మజ్ఞానికి మోహమేమిటి? శోకమేమిటి?

9. స పర్వగాచ్చుక్ర మకాయ మవ్రణ
మస్నావిరగం శుద్ధ మపాప విద్ధమ్ !
కవిర్మనిషీ పరిభూ: స్వయం భూర్యాథా
తథ్యతోఁ ర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య: సమాభ్య: !!
స: - అతడు (ఆత్మ); స్వయంభూ: - స్వయంభువు; పర్యగాత్ - సర్వం వ్యాపించినవాడు; అకాయం - శరీరము లేనివాడు; అస్నావిరం - కండలులేనివాడు; అపాపవిద్ధమ్ - పాపం వలన కలుషితం కానివాడు; శుక్రం - ప్రకాశవంతుడు; అవ్రణం - గాయంలేనివాడు; శుద్ధం - స్వచ్ఛమైనవాడు; కవి: - అన్నిటినీ కలుపుకున్నవాడు; యాథాతథ్యత: - యథావిధిగా; శాస్వతీభ్య: - అనంతమైన; సమాభ్య: - ప్రజాప్రతులకు (సంవత్సరాలకు); అర్థాన్ - విధులను; వ్యదధాత్ - పంచియిచ్చాడు.
స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, కండలు లేనివాడు, పాపకళంక రహితుడు, ప్రకాశవంతుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు అయిన ఆత్మ శాశ్వతులైన ప్రజాప్రతులకు యధావిధిన వారివారి కర్తవ్యాలను పంచియిచ్చాడు.

10. అంధం తమ: ప్రవిశన్తి యేఁ విద్యాముపాసతే !
తతోభూమ ఇవ తే తమో య ఉ విద్యాయాగం రతా: !!
యే - ఎవరైతే; అవిద్యాం - అవిద్యను; ఉపాసతే - ఉపాసించుతారో; తే - వారు; అంధం తమ: - గాఢాంధకారంలో; ప్రవిశన్తి - ప్రవేశిస్తారు; యే - ఎవరైతే; ఉ - మరి; విద్యాయాం - విద్యలోనే; రతా: - ఆనందిస్తారో; తే - వారు; తత: - అంతకంటే; భూయ - ఎక్కువైన; తమ: ఇవ - చీకటిలో; ప్రవిశన్తి - ప్రవేశిస్తారు.
ఆ విద్యను ఉపాశించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటే అంధకారంలో విద్యలో ఆనందించేవారు ప్రవేశిస్తారు.

11. అన్య దేవాహు ర్విద్యయా అన్య దాహు రవిద్యయా !
ఇది శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే !!
విద్యాయా - విద్యవల్ల; అన్యత్ - వేరొక (ఫలితాన్ని); అహు: - చెబుతారు; అవిద్యయా - అవిద్యచేత; అన్యత ఏవ - వేరొక (ఫలితాన్ని); అహు: - చెపుతారు; ఇతి - అని; ధీరాణాం - ప్రాజ్ఞులనుండి; శుశ్రుమ - మేమువిన్నాము; యే - ఎవరైతే; న: - మాకు; తత్ - దానిని; విచచక్షిరే - వివరించారో.
విద్యవల్ల (యజ్ఞతత్వ విజ్ఞానంవల్ల) ఒక ఫలితం లభిస్తుందనీ, అవిద్యవల్ల (కేవలం యజ్ఞకర్మవల్ల) మరొక ఫలితం లభిస్తుందనీ వారు చెబుతారు. దీనిని మాకు వివరించి, ప్రాజ్ఞులనుండి మేము ఈ విధంగా విన్నాం.
12. విద్యాం చావిద్యాం చ
యస్త ద్వేదో భయగం తీర్త్వా
అవిద్యయా మృత్యుం తీర్త్వా
విద్యయాఁ మృతమశ్నుతే!!
విద్య, అవిద్య.. ఈ రెండింటినీ తెలుసుకున్నవాడు... అవిద్యవల్ల మృత్యువును జయించి, విద్యవల్ల అమరత్వాన్ని పొందుతాడు.

13. అంధం తమ: ప్రవిశన్తి
యేఁసంభూతి ముపాసతే !
తతో భూయ ఇవ తే తమో
య ఉ సంభూత్యాగం రతా: !!
ప్రకృతిని ఉపాసించేవారు గాఢ అంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటేమించినదా అనిపించే చీకటిలో హిరణ్యగర్భుని ఉపాసించి ఆనందించేవారు ప్రవేశిస్తారు.

14. అన్యదేవాహు: సంభవా దన్య దాహు రసంభవాత్ !
ఇతి శుశ్రుమధీరాణాం యే నస్త ద్విచచక్షిరే !!
హిరణ్యగర్భుని ఉపాసనవల్ల ఒక ఫలితం, ప్రకృతి ఉపాసనవల్ల మరొక ఫలితం వస్తుందని వారు చెబుతారు. దీనిని మాకు వివరించిన ప్రాజ్ఞులనుండి ఈ విధంగా విన్నాం.

15. సంభూతించ వినాశంచ యస్త ద్వేదో భయగం సహ !
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాఁ మృతమశ్నుతే !!
అసంభూతినీ, వినాశాన్నీ కలిపి తెలుసుకున్నవాడు, వినాశం (హిరణ్యగర్భుని) ఉపాసన ద్వారా మృత్యువును జయించి, అసంభూతి (ప్రకృతి) పైభక్తి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

16. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాఁ పిహితం ముఖమ్
తత్త్వం పూష న్నపావృణు సత్యధర్మాయ దృష్టయే !!
నీలో వున్న సత్యం ద్వారాన్ని, మెరుస్తూ వున్న నీ బంగారు బింబం మూతలాగా కప్పి వుంది. ఓ సూర్యదేవా! సత్యనిష్టుడైన నేను ఆ సత్యాన్ని చూడటానికి వీలుగు ఆ మూతను పక్కకి తప్పించు.

17. పూషన్నే కర్షే యమ సూర్య ప్రాజాపత్య
ప్యూహరశ్మీన్ సమూహ తేజ: !
యత్తే రూపం కల్యాణ తమం తత్ తే పశ్యామి
యోఁ సా వసౌ పురుష: సోఁహ మస్మి!!
ఓ సూర్యుడా! ప్రజాపతిపుత్రుడా! స్వర్గ వీధిలో ఒంటరి బాటసారీ! సర్వపోషకా! సర్వనియంతా! నీ కిరణాలను తొలగించు. కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహం వల్ల కల్యాణమమైన నీ రూపాన్ని చూడగలను. నిజంగా నీలో వుండే ఆ పురుషుడు నేనే అని గ్రహించాను.

18. వాయురనిల మమృత మథేదం భస్మాంతగం శరీరమ్ !
ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర !!
ఇక నా ప్రాణవాయువు సర్వవ్యాపి, శాశ్వతమూ అయిన ప్రాణంలో లీనంగాక. ఈ శరీరం బూడిద అగుగాక. ఓం ఓ మనసా! గుర్తుకు తెచ్చుకో. నీ పూర్వ కర్మలను గుర్తుకు తెచ్చుకో.

19. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవవయునాని విద్వాన్ !
యుయోధ్యస్మ జ్ఞాహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ !!
ఓ అగ్నిదేవా! మేము చేసి కర్మఫలితాలను అనుభవించడానికి మమ్మల్ని మంచి త్రోవలో నడిపించు. మేము ఆచరించిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ అగ్నిదేవా! మాలో మాయదారి పాపాలను దూరం చేయుము. నీకు పలుమార్లు నమస్కారం చేస్తున్నాము.

(ఇంతటితో ఈశావ్యాస ఉపనిషత్తు సమాప్తం)

బుధవారం, మార్చి 04, 2015

7.మాండుక్యోపనిషత్

మాండుక్యోపనిషత్


1. ఓమిత్యేతదక్షకరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం 
భవిద్భవిష్యదితి సర్వమోంకార ఏవ !
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ !!
ఈ మొత్తం లోకం ఓంకారమే. గతించినవి, వున్నవి, రాబోయేవి అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైంది ఏదైతేవుందో అది కూడా ఓంకారమే. 

2. సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా
సో యమాత్మా చతుష్పాత్ 
విశ్వంలో వున్నవన్నీ భగవంతుడే. ఈ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిణామాలు కలది. 

3. జాగరికస్థానో బహి: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవింశతి ముఖ: 
స్థూలభుగ్ వైశ్వానర: ప్రథమ: పాద: !
ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్మముఖంగా వుంది. 7 అవయవాలు, 19 నోళ్లుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు. 

4. స్వప్న: స్థానో న్త: ప్రజ్ఞ: సప్తాంగ ఏకోనవింశతిముఖ:
ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయ: పాద: !!
ఆత్మలో రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైంది. 7 అవయవాలు, 19 నోళ్లుగల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు. 

5. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం 
పశ్యతి తత్ సుషుప్తమ్ ! సుషుప్తస్థాన ఏకీభూత: ప్రజ్ఞానఘన 
ఏవానందమయో హ్యాననందభుక్ చేతోముఖ: ప్రాజ్ఞస్తృతీయ: పాద: !!
కోర్కెలు, కలలలో ఏదీలేని నిద్రాస్థితి ఆత్మలో మూడవ పరిమానమవుతుంది. ఈ స్థితిని అనుభవించేవాడు ప్రాజ్ఞాడు. ఈ స్థితిలో ఎటువంటి అనుభవాలుండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా వుంటుంది. అందువల్ల ఇది జాగ్రత్, స్వన్నస్థితి చేతనలకు ద్వారంగా వుంటుంది. ఆనందస్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు. 

6. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో న్తర్యామ్యేష యోని: 
సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ !!
ఇతడే సర్వేశ్వరుడు. సర్వం తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణులలో కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికి మూలకారకుడు. ప్రాణుల ఉత్పత్తికి, వారి వినాశనానికి కారకుడు ఇతడే. 
7. నాన్త: ప్రజ్ఞం న బహి: ప్రజ్ఞ: నోభయత: ప్రజ్ఞన ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా నా ప్రజ్ఞమ్ !
అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్ అవ్యవదేశ్యమ్ ఏకాత్మప్రత్యయసారం 
ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా సి విజ్ఞేయ: !!
నాలుగవ పరిణామం అంతర్ముఖ, బహిర్ముఖ స్థితులు కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. చేతన స్థితి కాదు. అది కనిపించదు. చేతులులేని, గ్రహించ శక్యంకాని, గుర్తులులేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి కాదు. దాన్ని ఆత్మ చేతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతకరమైంది.. మంగళకరమైంది.. అద్వయితం.. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి. 

8. సో యమాత్మా అధ్యక్షరమ్ ఓంకారో ధిమాత్రం పాదా
మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి !!
ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే.. అదే ఓంకారం. అక్షరాలలో అ;;మ్ అనే మూడు అక్షరాలతో ఓం రూపొందింది. 

9. జాగరితస్థానో వైశ్వానరో కార: ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్ 
వా ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద !!
ఓంకార మంత్రి మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వంవల్ల, ఆరంభత్వం వల్ల ఈ రెండూ సమంగా వున్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోరికలు నెరవేరుతాయి. అటువంటి ఉపాసకుడు ధన, కనక, వస్తు, వాహనాదులతో అగ్రగణ్యుడవుతాడు. 

10. స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్వాద్ వా ఉత్కర్షతి 
హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యాబ్రాహ్మవిత్ కులేభవతి య ఏవం వేద !!
ఓంకార మంత్రం రెండవభాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే.. శ్రేష్ఠత్వంవల్ల, రెండింటి సంబందంవల్ల రెండూ సమానంగా వున్నవి. ఈ విధంగా తెలసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ-దు:ఖాల వంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞానికాని వాడు ఎవరూ అతడి వంశంలో జన్మించరు. 

11. సుషుప్తస్థాన: ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి 
హ వా ఇదం హ వాఇదం సర్వమపీతిశ్చ భవతి య ఏవం వేద !!
ఓంకార మంత్రం మూడవభాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే.. కొలతవేసే స్వభావంవల్ల, గ్రహించే స్వభావంవల్ల, రెండూ సమానంగా వున్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని కొలతవేసేవాడుగా, గ్రహించేవాడుగా అవుతాడు. 

12. అమాత్రశ్చతుర్థోవ్యవహార్య: ప్రపంచోపశమ: శివో ద్వైత ఏవమోంకార 
ఆత్మైవ సంవిశత్యాత్మనా త్మానం య ఏవం వేద య ఏవం వేద !!
ఓంకార మంత్రంలో నాలుగవ భాగం.. లేదా భాగమని చెప్పలేనిది. నిర్వికారమైంది. మంగళకరమైంది. ఈ ఓంకారమే ఆత్మ. ఈవిధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మద్వారా పొందుతాడు. 



మంగళవారం, సెప్టెంబర్ 02, 2014

6.కేనోపనిషత్తు

|| కేనోపనిషత్తు ||
శాంతిమంత్రి :
ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు:
శ్రోతమథో బలమింద్రియాణిచ సర్వాణి !
సర్వం బ్రహ్మౌపనిషదం మాఁహం బ్రహ్మనిరాకుర్యాం
మామా బ్రహ్మి నిరాకరోదనిరాకరణ మస్త్వనిరాకరణం మేఁ స్తు !
తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసస్తు తేజమయిసస్తు !!
ఓం శాంతి: శాంతి: శాంతి:
మమ = నా; అంగాని = అవయవాలు; అప్యాయన్తు = శక్తివంతములగు గాక; ఆథో = ఇంకనూ; వాక్ = వాక్కు; ప్రాణ: = ప్రాణం; చక్షు: = కన్ను; శ్రోత్రమ్ = చెవి; బలమ్ = శక్తి; సర్వాణి = అన్ని; ఇంద్రియాణి = ఇంద్రియాలు; చ = కూడా; ఔపనిషదం = ఉపనిషత్తులో చెప్పబడిన; బ్రహ్మ = బ్రహ్మం; సర్వం = సమస్తం; అహం = నేను; బ్రహ్మ = బ్రహ్మాని; మానిరాకుర్యాం = నిరాకరింపకుందును గాక; బ్రహ్మ = బ్రహ్మం; మా = నన్ను; మాని రాకరోత్ = నిరాకరింపకుండుగాక; అనిరాకరణం = నిరాకరించుకుండటం; మే = నాయెడల; అస్తు = ఉండుగాక; ఉపనిషత్తు = ఉపనిషత్తులతో; యే = ఏఏ; ధర్మా: = ఉత్తమ గుణాలు (ఉన్నవో); తే = అవన్నీ; తదాత్మనివిరతే = ఆ ఆత్మలో శ్రద్ధగల; మయి = నాయందు; సన్తు = ఉండుగాక.
నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక (అనగా నేను ఆ బ్రహ్మమే కదా!). నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాకరణం కనీసం నాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతుడైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకలధర్మములు నెలకొనుగాక! ఓం శాంతి: శాంతి: శాంతి:

కేనోపనిషత్తు - మొదటిభాగం ;
1. కేనేషితం పతతి ప్రేషితం మన:
కేనప్రాణ: ప్రథమ: ప్రైతియుక్త: !
కేనేషితాం వాచమిమాం వదన్తి
చక్షు: శ్రోత్రం క ఉ దేవోయునక్తి !!
మన: = మనస్సు; కేన = దేనిచేత; ప్రేషితం = పంపబడి; పతతి = తన పనులుచేయ దుముకుచున్నది; కేన = ఎవనిచేత; యుక్త: = నియోగింపబడి; ప్రథమ: = ముఖ్యమైన; ప్రాణ: = ప్రాణం; ప్రైతి = తన పనులపై సంచరిస్తుంది; కేన = దేనిచేత; ఇషితామ్ = ఇష్టాన్ని అనుసరించి; ఇమామ్ = ఈ; వాచమ్ = మాటలు; వదన్తి = మానవులు పలుకుతారు; చక్షు: = కన్ను; శ్రోత్రం = చెవి; ఉ = నిజానికి; క: = ఏ; దేవ: = తేజోవంతుడు; యునక్తి = నియమించుతాడు..
శిష్యుడు : మనస్సుని దాని విషయాలపైకి పడేటట్లు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయోగింపబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవులు మాటలు మాట్లాడుతారు? నిజంగా ఏ బుద్ధి కళ్లను, చెవులను నియమిస్తుంది?

2. శ్రోత్తస్య శ్రోత్రం మనసో మనో యద్
వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణ: !
చక్షుషశ్చక్షురతి ముచ్యధీరా:
ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్తి !!
యత్ = ఏదైతే; శ్రోత్రస్య = చెవియొక్క; శ్రోత్రమ్ = చెవియో; మనస: = మనస్సుయొక్క; మన: = మనస్సో; వాచ: = వాక్కుయొక్క; హ = నిజంగా; వాచమ్ = వాక్కు; స: = అదే; ఉ = మరియు; ప్రాణస్య = ప్రాణంయొక్క; ప్రాణ: = ప్రాణమో; చక్షుష: = కన్నుయొక్క; చక్షు: = కన్నో(ఈ విధంగా తెలుసుకుని ఆత్మ ఈ ఇంద్రియాలూ మొదలైనవే అన్న భ్రాంతి); అతి ముచ్య = వదిలించుకుని; ధీరా: = బుద్ధిమంతులు; అస్మాత్ = ఈ; లోకాత్ = ఇంద్రియ జీవనం నుండి; ప్రేత్య = తప్పుకొని; అమృతా: = అమరులు; భవన్తి = అవుతారు.
ఆచార్యుడు : ఆత్మ శక్తి వలననే చెవి వుంటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. బుద్దిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాలనుండి వివక్షిస్తాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు.

3. నతత్ర చక్షుర్గచ్చి నవాగ్ గచ్చతి నోమున: !
న విద్మో న విజానీమో యథైత దనుశిష్వాత్ !!
తత్ర = ఆ బ్రహ్మ విషయములో; చక్షు: = కన్ను; నగచ్చతి = పోజాలదు; నవాక్ = మాటలు (పోజాలవు); న ఉ మన: = మనస్సుకూడా (పోజాలదు); తత్ = అది; న విద్య: = మాకు తెలియదు; యథా = ఎలాగ; ఏతత్ = దీనిని; అనుశిష్యాత్ = నేర్పించవచ్చునో; తత్ = అదికూడా; న విజానీమ: = మాకు తెలియదు.
ఆ బ్రహ్మ విషయంలో కన్ను పోజాలదు... మాటలుగాని, మనస్సుగాని పోలేవు. కాబట్టి మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏవిధంగా నేర్పించవచ్చునో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు.

4. అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి !
ఇది శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్ వ్యాచచక్షిరే !!
తత్ = అది; విదితాత్ = తెలిసిన దానికంటే; ఏవ = నిశ్చయంగా; అన్యత్ = భిన్నమైనది; అథో = ఆపైన; అవిదితాత్ = తెలియని దానికంటే; అధి = అతీతమైనది; యే = ఎవరైతే; స: = మాకు; వ్యాచచక్షిరే = వివరించారో; పూర్వేషాం = పూర్వీకులనుండి; ఇతి = ఇలా; శుశ్రుమ = మేం విన్నాం....
నిశ్చయంగా అది తెలిసిన దానికంటే భిన్నమైనది. ఆ తరువాత అది తెలియనిదానికంటే అతీతమైంది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం.

5. యత్ వాచా సభ్యుదితం యేన వాగభ్యుద్యతే !
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!
యత్ = ఏదైతే; వాచా = మాటలచేత; అనభ్యుదితమ్ = ప్రకటింపబడదో; యేన = దేనిచేత; వాక్ = మాటలు; అభ్యుద్యతే = ప్రకటింపబడుతాయో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్ = ఇది; న = కాదు...
మాటలు దేన్ని ప్రకటించలేవో మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో.

6. యన్మనసా నమనుతే యేనాహుర్మనో మతమ్ !
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!
యత్ = ఏది (ఏ ప్రత్యగాత్మ చైతన్యము); మనసా = మనస్సుచే; న మనుతే = గ్రహించబడదో; యేన = దేనిచేత (ఏ ప్రత్యగాత్మ చైతన్యము చేత); మన: = మనస్సు; మతమ్ (ఇతి) = సంకల్పాదులలో ప్రసరించును (అని); ఆహు: = చెప్పుదురో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు...
మనస్సుచేత గ్రహించ శక్యం కానిదీ, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

7. యచ్చక్షుషా న పశ్యతియే న చక్షూంషి పశ్యతి !
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!
యత్ = దేనినైతే; చక్షుషా = కన్నులచేత; న పశ్యతి = (మానవుడు) చూడడో; యేన = దేనిచేత; చక్షూంషి = కన్నులను; పశ్యతి = చూస్తాడో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు...
కన్నులు చూడజాలనిది కాని దృష్టిని చూచేది - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజింజేది కాదనీ తెలుసుకో.

8. యచ్చోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్ !
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!
యత్ = దేనిని; శ్రోత్రేణి = చెవిద్వారా; నశృణోతి = మానవుడు వినజాలడో; యేన = దేనిచేత; ఇదం = ఈ; శ్రోత్రం = వినికిడి; శ్రుతం = వినబడుతుందో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు.
మానవుడు చెవి ద్వారా వినజాలనిదీ దేనిచేత వినికిడి వినబడుతున్నదో - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో.

9. యత్ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణ: ప్రణీయతే !
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే !!
యత్ = దేనినైతే; ప్రాణేన = ఊపిరిచేత; నప్రాణిత = వాసన చూడజాలడో; యేన = దేనిచేత; ప్రాణ: = ఊపిరి; ప్రణీయతే = శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో; తత్ ఏవ = అది మాత్రమే; బ్రహ్మ = బ్రహ్మం అని; త్వమ్ = నువ్వు; విద్ధి = తెలుసుకో; యత్ = ఏదైతే; ఇదమ్ = ఈ; ఉపాసతే = జనులు పూజిస్తూ వున్నారో; ఇదమ్ = ఇది; న = కాదు.
మానవుడు ఊపిరి చేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్ఛ్వాసములను సలుపునో - అది మాత్రమే బ్రహ్మ అనీ ఈ జనులు ఇక్కడ పూజించే ఇది కాదనీ తెలుసుకో.
(ఇది ప్రథమ భాగము)
రెండవ భాగం ;
1. యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి
నూనం త్వం వేత్థ బ్రహ్మణో రూపమ్ !
యదస్యత్వం యదస్య దేవేష్యథను
మీ మాంస్యం మేవతే మన్యే విదితమ్ !
ఆచార్యుడు : ‘‘నేను బ్రహ్మతత్వం గురించి బాగానే తెలుసుకున్నాను’’ అని ఒకవేళ అనుకున్నట్లయితే.. నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే నువ్వు చూసే ప్రాణులలో దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మ రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మం గురించి నువ్వు తెలుసుకోవలసి వుంది.
శిష్యుడు : (మళ్లీ చింతనచేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని) బ్రహ్మం తెలుసుకున్నానని అనుకుంటున్నాను.

2. నాహం మన్యే సువేదేతి నో న వేదేతి వేద చ!
యోనస్తత్ వేద తద్వేదనో న వేదేతి వేద చ!!
నాకు బాగా తెలుసు అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా! నా తోటివిద్యార్థులలో అది తెలియంది కాదు అని, తెలిసినది అని గ్రహించినవాడు దానిని గ్రహించగలడు.

3. యస్యామతం తస్య మతం మతం యస్య న వేద స:!
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతమ్!!
ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త అయితే తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో.. వాడు దాన్ని తెలుసుకోలేడు. బ్రహ్మవేత్తలు రెండుతెగలు. అందులో ఒకరు బ్రహ్మం తెలుసునని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలియదని కాదు కాని రెండవతెగవారు బ్రహ్మం తెలియదని అనుకునేవారు. వీరికి బ్రహ్మం తెలుసు.

4. ప్రతిబోధవిదితం మత మమృతత్వం హి విన్దతే!
ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతేఁ మృతమ్!!
మనస్సు చెందే వికారాన్ని స్పూర్తిగోచరం ద్వారా తెలుసుకున్నవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారా నిజమైన బలాన్ని, జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

5. ఇహ చేద వేదీ దథ సత్యమస్తి
న చేదిహావేదీ న్మహతీ వినష్టి: !
భూతేషు భూతేషు విచిత్య ధీరా:
ప్రేత్యాస్మాల్లోకా దమృతా భవన్తి !!
ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే.. ఆపైన నిజమైన జీవితం వుంది. అలా సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే. ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షిచుకుంటూ.. ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.
(ఇది రెండవ భాగం)
మూడవ భాగం :
1. బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే, తస్యహ
బ్రహ్మణో విజయే దేవా అమహీయన్త !
త ఐక్షన్తాస్మాకమేవాయం విజయోఁ
స్మాకమేవాయం మహిమేతి!!
ఆచార్యుడు : బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు రాక్షసులపైన విజయం సంపాదించిందని కథ. విజయం బ్రహ్మంవలనే అయినా.. దానివల్ల దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజంగా మేమే గెలిచాం.. మాదే ఈ ఘనత అని దేవతలు తలపోశారు.

2. తద్దైషాం విజజ్ఞౌ, తేభ్యోహ ప్రాదుర్భభూవ
తన్న వ్యజానత కిమిదం యక్షమితి
ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మం.. దేవతల ముందుకు దివ్యతేజంతో సాక్షాత్కరించింది. కానీ ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు.

3. తేఁగ్ని మబ్రువన్, జాతవేద; ఏతద్
విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!
దేవతలు అగ్నిదేవునితో ‘‘ఓ సర్వజ్ఞుడా.. ఈ శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు.

4. తదభ్యద్రవత్, తమభ్యవదత్ కోఁసీతి, అగ్నిర్వా
అహమస్మీత్య బ్రవీజ్జాతవేదా వా అహమస్మీతి !!
అగ్ని ఆ దివ్యశక్తి దగ్గరకు వేగంగా వెళ్లాడు. అప్పుడా శక్తి.. ‘‘నువ్వెవరివి’’ అని అగ్నిదేవుడ్ని ప్రశ్నించింది. ‘‘నేను అగ్నిని.. సర్వజ్ఞణ్ణి’’  అని బదులిచ్చాడు.

5. తస్మిం స్త్వయి కింవీర్య మిత్యపీదం సర్వం
దహేయం యదిదం పృథి వ్యామితి!!
‘‘అయితే నీలో ఏం శక్తి వుంది’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న అంతటిని నేను దహించివేయగలను’’ అని అగ్నిదేవుడు అన్నాడు.

6. తస్మైతృణం నిదధావేతద్ దహేతి
తదుపప్రేయాయ సర్వజవేన తన్న
శశాకదగ్ధుం స తత ఏవ నివవృతే నైత
దశకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!
అప్పుడా దివ్యశక్తి అతని ముందు ఒక గడ్డిపోచును పెట్టి కాల్చు అని అంది. అగ్ని తన యావచ్ఛక్తిని ఉపయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు దేవతల వద్దకు మళ్లీ తిరిగిపోయి ‘‘ఆ దివ్యశక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను’’ అని అన్నాడు.

7. అథవాయు మబృవన్, వాయువేతద్
విజానీహి కిమేతద్ యక్షమితి; తథేతి!!
అప్పుడు దేవతలు వాయుదేవునితో.. ‘‘ఓ వాయుదేవా, ఈ అసాధారణమైన శక్తి ఏమిటో తెలుసుకో’’ అన్నారు. అతడు అందుకు అంగీకరించాడు.

8. తదభ్యద్రవత్ తమభ్యవదత్ కోఁసీతి!
వాయుర్వా అహ మస్మీత్యబ్రవీన్మాతరిశ్వా వా అహమస్మీతి!!
వాయువు ఈ అసాధారణమైన శక్తి దగ్గరకు వెళ్లాడు. ఆ శక్తి ‘‘నువ్వెవరివి’’ అని ఇతణ్ణి అడిగింది. ‘‘నేను వాయువును, గాలిని ప్రభువును’’ అని సమాధానం చెప్పాడు.

9. తస్మి స్త్వయి కిం వీర్యమిత్యపీదం
సర్వమాదదీయ యదిదం పృథివ్యామితి!!
‘‘అయితే నీలో ఏం శక్తి వుంది?’’ అని దివ్యశక్తి అడిగింది. ‘‘భూమ్మీద వున్న దేన్నైనా నేను ఎగురగొట్టగలను’’ అన్నాడు వాయుదేవుడు.

10. తస్మైతృణం నిదధాతే తదాదత్స్వే తి
తదుపప్రేయాయ సర్వజవేన, తన్న శశా
కాదాతుం, స తత ఏవ నివవృతే! నై తద
శకం విజ్ఞాతుం యదేతద్ యక్షమితి!!
ఆ దివ్యశక్తి వాయుదేవుడి ముందు ఒక గడ్డిపోచను వుంచి, దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు తన పూర్తిశక్తిని ప్రయోగించాడు.. కానీ ఆ గడ్డిపోచ కదల్లేదు. దీంతో వాయుదేవుడు తిరిగి వెళ్లి ‘‘ఆ శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాను’’ అని దేవతలతో అన్నాడు.

11. అథేంద్రమబ్రువన్, మఘవన్నే
తద్విజానీహి, కిమేతద్
యక్షమితి; తథేతి; తదభ్య
ద్రవత్; తస్మాత్ తిరోదధే!!
అప్పుడు దేవతలు ఇంద్రుడితో.. ‘‘ఓ దేవేంద్రా! ఈ అపురూపమైన శక్తి ఏంటో తెలుసుకో’’ అన్నాడు. ఇంద్రుడు సరేనన్నాడు. ఆ శక్తి వద్దకు త్వరగా చేరుకున్నాడు. కాని ఆ దివ్యశక్తి అతని ఎదుటనుండి మాయమైపోయింది.

12. స తస్మిన్నే వాకేశే స్త్రియ
మాజగామ బహుశోభమానాముమాం
హైమవతీం; తాం హోవాచ
కిమేతద్ యక్షమితి!!
ఆకాశంలో అత్యంత అద్భుతంగా, సౌందర్యవంతంగా వున్న ఒక యువతిని, హిమవంతుని కుమార్తెను చూశాడు ఇంద్రుడు. అప్పుడామెను ‘‘ఈ అపురూపమైన దివ్య శక్తి ఏమిటి’’ అని అడిగాడు.
( ఇది మూడవ భాగం )
నాలుగవ భాగం :
సా బ్రహ్మేతి హోవాచ!!
బ్రహ్మణో వా ఏతద్ విజయే
మహియధ్వమితి; తతో హైవ
విదాఞ్చకార బ్రహ్మేతి!!
‘‘అది బ్రహ్మం అని.. బ్రహ్మం వల్ల కదా మీరు విజయం సాధించి, ఘనత పొందారు’’ అని ఉమాదేవి అంది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు.

2. తస్మాద్ వా ఏతే దేవా అతితరా
మివాన్యాన్ దేవాన్, యదగ్ని ర్వా
యురింద్రస్తే హ్యేనన్నే దిష్ఠం పస్పర్శుస్తే
హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!
అందువల్లే కదా ఈ దేవతలు అంటే.. అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించారు. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్లారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు.

3. తస్మాద్ వా ఇంద్రోఁతితరా
మివాన్యాన్ దేవాన్; సహ్యేనన్నే
దిష్ఠం పస్పర్శ, స హ్యేనత్
ప్రథమో విదాంచకార బ్రహ్మేతి!!
ఇంద్రుడు ఈ బ్రహ్మంను సమీపంలో స్పృశించాడు. అందువల్లే ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించాడు. అతడే ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.

4. తస్యైష ఆదేశ: యదేతద్ విద్యుతో వ్యద్యుతదా
ఇతీన్న్యమీమిషదా ఇత్యధి దైవతమ్!!
బ్రహ్మం వర్ణన ఇది : అహో! మిరుమిట్లుగొలుపు మెరుపును ప్రకాశింపచేసేది ఆ బ్రహ్మమే. మనిషిని రెప్పలు ఆర్చేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది.

5. అథా ధ్యాత్మం యదేతద్ గచ్ఛతీవ చ
మనోఁ నేన చైతదుపస్మరత్యభీక్ష్ణం సంకల్ప:
ఇప్పుడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుండి దాని వర్ణనను గురించి, ఆ బ్రహ్మంవల్లే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం వుంచుకుంటుంది, వస్తువులను ఊహించుకుంటుంది.

6. తద్ధ తద్వనం నామ
తద్వనమిత్యుపాసితవ్యం ;
సమ ఏతదేవం వేదాభిహైనం
సర్వాణి భూతాని సంవాచ్ఛంతి !!
బ్రహ్మం తద్వనం అని అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధించదగిందని ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమిస్తాయి.

7. ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్
బ్రాహ్మీం వావ త ఉపనిషదబ్రూమేతి !!
శిష్యుడు : ఆచార్యవర్యా.. నాకు ఉపనిషత్ ను ఉపదేశించండి.
ఆచార్యుడు : నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గురించి ఉపనిషత్తు నీకు ఉపదేశించాం.

8. తస్యై తపోదమ: కర్మేతి ప్రతిష్ఠా
వేదా: సర్వాంగాని సత్య మాయతనమ్ !!
తపస్సు, నిగ్రహం, నిష్టా పూర్వకమైన కర్మ. ఇవి ఉపనిషత్తులని బ్రహ్మ జ్ఞానానికి మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం.

9. యోవా ఏతామేవం వేదాపహత్య పాప్మాన
మనన్తే స్వర్గేలోకే జ్యేయే ప్రతితిష్ఠతి ప్రతితిష్ఠతి !
నిజంగా ఇలా ఉపనిషత్తును తెలుసుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతం మహోన్నతం, ఆనందమయం అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును.. అందులో ప్రతిష్టితుడౌతాడు.
(ఇది నాలుగవ భాగం)


సోమవారం, మార్చి 17, 2014

మెరుగైన కంటి చూపుకోసం లేదా పోయిన కంటి చూపు తిరిగి రావటం కోసం :చాక్షుశోపనిషత్


 
అస్యా  చాక్షుస్షి  విద్యాయా ఆహిర్బుఘ్న్య  రుశిహి, గయత్రీ  చందః II
సూర్యో  దేవతా ,చక్షు రోగ  నివ్రుత్తయే జపే  వినియోగః  II 1 II
ఓం  చక్షు:  చక్షు: తేజ:  స్థిరో  భవ I
మాం  పాహి  పాహి  II
త్వరితం  చక్షురోగాన్  శమయ  శమయ  II 2 II
మామ  జాతరూపం  తేజో  దర్శయ  దర్శయ  II
యథాహం  అందో  నశ్యాం  తథా  కల్పయ  కల్పయ  II
కల్యాణం  కురు  కురు  II 3 II
యాని  మామ  పూర్వజన్మోపార్జితాని  చక్షు: ప్రతిరోధక దుష్హ్క్రుతాని II
సర్వాని నిర్మూలయ  నిర్మూలయ  II 4 II
ఓం  నమ: చక్షుస్తేజోదాత్రే  దివ్యాయ  భాస్కరాయ  II
ఓం  నమ: కరునాకరాయామ్రుతాయ  ఓం  నమ: సూర్యాయ  II 5 II
ఓం  నమో  భగవతే  సూర్యాయ అక్షి తేజసే  నమ: II
ఖేచరాయ  నమః  II మహాతే  నమ: II రాజసే  నమ: II 6 II
అసతోమా  సత్గామయ  II
తమసోమా  జ్యోతిర్గమయా  II
మృత్యోర్మా  అమృతంగమయ  II 7 II
ఉష్హ్నో  భగవాన్  శుచిరూప: II
హంసో  భగవాన్  శుచిరప్రతిరూప: II
య  ఇమాం  చాక్శుష్మతీ  విద్యాం బ్రాహ్మనో  నిత్యమధీయతె    II
న  తస్యాక్షిరోగో  భవతి  II న  తస్య  కులే  అందో  భవతి  II
అష్టౌ    బ్రహ్మనాన్  గ్రాహయిత్యా  విద్యా  సిద్ధిర్భవతి  II 8 ఈఈ
విశ్వరూపం  గృనిణం జాతవేదసం  హిరణ్యమయ    పురుషం  జ్యోతిరూపం
తపంతం  సహస్ర రష్మిహ శతధావర్నమనః 
పురహ  ప్రజానా ముదయత్యేష్  సూర్యః 
ఓం  నమో  భగవతే  ఆదిత్యాయ 

 
II ఇతి  క్రుష్ణయజుర్వెదీయ  చాక్షుశ్హోపనిశ్హాద్   సంపూర్ణం  ఈఈ వేదాలలో చెప్పినట్లు మన విశ్వం లో పన్నెండు మంది సూర్యులు వుంటారు కాబట్టి  పై మంత్ర్హాన్ని రోజుకి పన్నెండు సార్లు చదువుకోవాలి. ఈ మంత్రాన్ని ఉచ్చరించే ముందు ఒక వెండి పాత్రలో కాని లేదా ఒక  రాగి పాత్రలోకాని నీళ్ళు తీసుకొని ఉచ్చారించటం అయిన వెంటనే ఆ నీటి తో కళ్ళను తుడుచుకోవాలి , మిగిలినవాటి సేవనం చెయ్యాలి.
అలానే రిగ్వేదం లో చెప్పిన
చక్షుర్నో  దేవః సవిత  చక్షుర్ణ   ఉత  పర్వతః 
చక్షుర్ధాత   దధాతూ  న:,చక్షుర్నో  దేహి  చక్షుషే    
చక్షుర్విఖ్యే  తనుచ్యః ,సంచేడం  విచా  పస్చఎమ 
సుసంద్రిశంత్వ  వయం  ప్రతి  పస్చఎమ  సూర్య: విపష్యెం  న్రిస్చ్క్షసః
పై చెప్పిన మంత్రాన్ని రోజు లో వీలున్నన్ని సార్లు జపించుకో తగిన మంత్రం.

సోమవారం, జూన్ 18, 2012

5.నారాయణోపనిషత్తు

||నారాయణోపనిషత్తు||
ఓం అథ పురుషో హ వై నారాయణోఁకామయత ప్రజా: సృజేయేతి !

నారాయణాత్ప్రాణో జాయతే !

మన: సర్వేన్ద్రియాణి చ !

ఖం వాయుర్జ్యోతిరాప: పృథివీ విశ్వస్య ధారిణీ !

నారాయణాద్ బ్రహ్మా జాయతే !

నారాయణాద్ రుద్రో జాయతే !

నారాయణాదిన్ద్రో జాయతే !

నారాయణాత్ప్రజాపతయ: ప్రజాయస్తే !

నారాయణాద్ ద్వాదశాదిత్యా: రుద్రా వసవస్సర్వాణి చ ఛన్దాగంసి !

నారాయణాదేవ సముత్పద్యస్తే !

నారాయణే ప్రవర్తస్తే !

నారాయణే ప్రలీయస్తే !!



ఓమ్ ! అథ నిత్యో నారాయణ: !

బ్రహ్మా నారాయణ: !

శివశ్చ నారాయణ: !

శక్రశ్చ నారాయణ: !

ద్యావాపృథివ్యౌ చ నారాయణ: !

కాలశ్చ నారాయణ: !

దిశశ్చ నారాయణ: !

ఊర్థ్వశ్చ నారాయణ: !

అధశ్చ నారాయణ: !

అస్తర్బహిశ్చ నారాయణ: !

నారాయణ ఏవేదగం సర్వమ్ !

యద్భూతం యచ్చ భవ్యమ్ !

నిష్కళో నిరఙ్ఞనో నిర్వికల్పో నిరాఖ్యాత: శుద్ధో దేవఏకో నారాయణ: !

న ద్వితీయోఁస్తి కశ్చిత్ !

య ఏవం వేద !

స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి !

ఓమిత్యగ్రే వ్యాహరేత్ !

నమ ఇతి పశ్చాత్ !

నారాయణాయేత్యుపరిష్టాత్ !

ఓమిత్యేకాక్షరమ్ !

నమ ఇతి ద్వే అక్షరే !

నారాయణాయేతి పంచాక్షరాణి !

ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం !

యో హవై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి !

అన పబ్రువస్సర్వమాయురేతి !

విన్దతే ప్రాజాపత్యగం రాయస్పోషం గౌపత్యమ్ !

తతోఁమృతత్వమశ్నుతే తతోఁమృతత్వమశ్నత ఇతి !

య ఏవం వేద !!



ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం !

అకార ఉకార మకార ఇతి !

తాసేకధా సమభరత్తదేతదోమితి !

యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ !

ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసక: !

వైకుంఠ భువనలోకం గమిష్యతి !

తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ !

తస్మాత్తదిదావన్మాత్రమ్ !

బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ !

సర్వభూతస్థమేకం నారాయణమ్ !

కారణరూపమకార పరబ్రహ్మోమ్ !

ఏతదథర్వ శిరోయోఁధీతే !

ప్రాతరధీయానో రాత్రి కృతం పాపం నాశయతి !

సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి !

మాధ్యన్దినమాదిత్యాభిముఖోఁధీయాన: పంచపాత కోపపాతకాత్ ప్రముచ్యతే !

సర్వ వేద పారాయణ పుణ్యం లభతే !

నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణసాయుజ్యమవాప్నోతి !

య ఏవం వేద !

ఇత్యుపనిషత్ !

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...