హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, మార్చి 06, 2015

9.ఈశావాస్య ఉపనిషత్తు

 || ఈశావాస్య ఉపనిషత్తు ||
1. ఓం పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే!
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే!!
ఓం శాంతి: ఓం శాంతి: శాంతి:
ఓం - ఓం; అద: - అది; పూర్ణం - అనంతం; ఇదం - ఇది; పూర్ణం - అనంతమైనది; పూర్ణాత్ - అనంతనుంచి (కంటికి కనిపించని ఈ అనంతం నుంచి); పూర్ణం - అనంతం (గోచర ప్రపంచమంతా); ఉదచ్యతే - ఉద్భవిస్తోంది; పూర్ణస్యపూర్ణమాదాయ - అనంతం నుంచి అనంతం తీసివేస్తే ; పూర్ణ ఏవ - అనంతమే; అవశిష్యతే - మిగిలి వుంటుంది ; ఓం - ఓం; శాంతి: - శాంతి
అది (ఆ కనిపించని అనంతం) పూర్ణం. ఇది కూడా (కనిపించే అనంతవిశ్వం) పూర్ణం. పూర్ణంనుంచి ఈ పూర్ణం బహిర్గతమౌతోంది. పూర్ణం నుంచి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగిలివుంటుంది.

2. ఓం ఈశావాస్య మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్
తేనత్యక్తేన భుంజీథా: మాగృథ: కస్యస్విద్ధనమ్.
జగత్యాం - జగత్తులో; యత్ కించ - ఏదేదైతే; జగత్ - మార్పుచెందేది; ఇదం సర్వం - ఇది అంతా; ఈశా - భగవంతుని చేత; వాస్యం - ఆవరింపబడి వుంది; తేనత్యక్తేన - ఆ త్యాగం చేత; భుంజీథా: - పోషణచేసుకో; కస్యస్విద్ ధనమ్ - ఎవని ధనాన్ని మాత్రంము; మాగృధ: - ఆశించకు.
ఈ జగత్ లో మార్పుచెందేది ఏదేది వున్నదో అదంతా భగవంతునిచేత ఆవరింపబడి వుంది. ఈ త్యాగం చేత నిన్ను నీవు పోషించుకో. ఎవరి ధనాన్ని మాత్రం ఆశించకు.

3. కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేత్ శతగ్గం సమా:!
ఏవం త్వయి నాన్యథేతోఁస్తిన కర్మ లిష్యతే నరే!!
ఇహ - ఈ జగత్తులో; కర్మాణి - శాస్త్రవిహితములైన కర్మలను; కుర్వన్ - చేస్తూ; ఏవం - ఇదేరీతిగా; త్వయి - నీకు; నరే - మానవునకు; ఇత: - ఇంతకంటే; అన్యథా - వేరొక మార్గం; న అస్తి - లేదు; కర్మ - కర్మ; న లిష్యతే - అంటదో
శాస్త్ర విహితమైన నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ మాత్రమే మానవుడు నూరు సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. మానవ జీవితం పైన ఆసక్తి వున్నంతవరకు దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోవడానికి ఇది తప్ప మరోదారి లేదు.

4. అసుర్యానామతే లోకా అంధేన తమసావృతా!
తాగంస్తే ప్రేతాభిగచ్ఛన్తి యేకే చాత్మహనో జనా:!!
అసుర్య: - రాక్షసులకు చెందిన; అంధేన తమసా - కటిక చీకటి చేత; ఆవృతా: - ఆవరింపబడినవి; నామ - నిజంగా; తే - ఆ; లోకా: - జన్మలు; యేకే - ఎవరెవరైతే; చ - కూడా; జనా: - జనులు : ఆత్మహన: - ఆత్మహంతకులో; తే - వారు; ప్రేత్య - మరణానంతరము; తాన్ - ఆయా జన్మలను; అభిగచ్ఛన్తి - పొందుతారు.
నిజంగా ఆ జన్మలు కటిక చీకటిచేత ఆవరింపబడిన రాక్షసజన్మలు. ఆత్మహంతకులైనవారు మరణానంతరం వాటిని పొందుతారు.

5. అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా
ఆప్నువన్ పూర్వమర్షత్!
తద్ధావతోఁ న్యానత్యేతి తిష్ఠ
త్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి!!
తత్ - ఆ ఆత్మ; ఏకం - ఒకటే; అనేజత్ - చలనములేనిది; మనస: - మస్సుకంటే; జవీయ: - వేగవంతమైనది; దేవా: - ఇంద్రియములు; ఏనత్ - దీనిని; నఆప్నువన్ - గ్రహించలేవు; పూర్వం అర్షత్ - మనస్సుకంటే ముందు వెళ్లింది; తత్ - అది; తిష్ఠత్ - స్థిరంగా వుంటూ; దావత: -పరుగెత్తుతూవున్న; అన్యాన్ - ఇతర విషయాలను; అత్యేతి - దాటిపోతుంది; తస్మిన్ - అది వుండడంచేత; మాతరిశ్వా - విశ్వాశక్తి అంటే ప్రాణశక్తి; ఆప: - ప్రాణులయొక్క కార్యకలాపమంతా; దధాతి - భరిస్తోంది.
ఆత్మ ఒక్కటే చలించనిదైనా కనస్సుకంటే వేగవంతమైనది. మనస్సుకన్నా ముందే వెళ్లగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. నిత్యమూ స్థిరమైన దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలాపాలను భరించటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది.

6. త దేజతి తన్నైజతి త ద్దూరే తద్వంతికే!
త దన్తరస్య సర్వస్య త దు సర్వ స్యాస్య బాహ్యత:!!
తత్ - అది; ఏజతి - చలించుచున్నది; తత్ - అది, న ఏ జతి - చలించదు; తత్ - అది; దూరే - దూరంలో వుంది; తత్ - అది, ఉ అంతికే - దగ్గరకూడా వుంది; తత్ - అది; ఉ - ఇంకా; అంతరస్య - లోపల; సర్వస్య అస్య - సర్వత్ర వుంది; బాహ్యత: - బయట కూడా వుంది.
ఆత్మ చలిస్తోంది, చలించదు. అది దూరంలో వుంది, దగ్గర కూడా వుంది. అది లోపలా బయటా అంతా వుంది.

7. యస్తు సర్వాణి భూతాన్యాత్మ న్యేవాను పశ్యతి!
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే!!
య: - ఎవరైతే; తు - మరి; సర్వాణి - సమస్త; భూతాని - జీవులన, ఆత్మని ఏవ - ఆత్మయందే; అనుపశ్యతి - దర్శించునో; చ - మరియు; సర్వభూతేషు - అన్ని జీవులయందు; ఆత్మానాం - ఆత్మను; తత: - అందుచేత; నవిజుగుప్సతే - ద్వేషింపడు
అన్ని జీవులు తన ఆత్మకంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మగా దర్శించే వాడు దేనిని ద్వేషింపడు.

8. యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మై వాభూ ద్విజానత: !
తత్రకో మోహ: క: శోక: ఏకత్వ మనుపశ్యత: !!
యస్మిన్ - ఎప్పుడైతే; విజానత: - విజ్ఞానానికి; ఆత్మ ఏవ - ఆత్మయే; సర్వాణి - సమస్త; భూతాని - జీవులు; అభూత్ - అయినదో; తత్ర - అప్పుడు; ఏకత్వం - ఐక్యతను; అనుపశ్యత: - దర్శించే అతనికి; క: - ఏమిటి; మోహ: - మోహము; క: - ఏమిటి; శోక: - శోకము.
అన్ని జీవులను తన ఆత్మగానూ, చరాచర జగత్తును ఆత్మయొక్క ఏకత్వంగాను దర్శించే ఆత్మజ్ఞానికి మోహమేమిటి? శోకమేమిటి?

9. స పర్వగాచ్చుక్ర మకాయ మవ్రణ
మస్నావిరగం శుద్ధ మపాప విద్ధమ్ !
కవిర్మనిషీ పరిభూ: స్వయం భూర్యాథా
తథ్యతోఁ ర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్య: సమాభ్య: !!
స: - అతడు (ఆత్మ); స్వయంభూ: - స్వయంభువు; పర్యగాత్ - సర్వం వ్యాపించినవాడు; అకాయం - శరీరము లేనివాడు; అస్నావిరం - కండలులేనివాడు; అపాపవిద్ధమ్ - పాపం వలన కలుషితం కానివాడు; శుక్రం - ప్రకాశవంతుడు; అవ్రణం - గాయంలేనివాడు; శుద్ధం - స్వచ్ఛమైనవాడు; కవి: - అన్నిటినీ కలుపుకున్నవాడు; యాథాతథ్యత: - యథావిధిగా; శాస్వతీభ్య: - అనంతమైన; సమాభ్య: - ప్రజాప్రతులకు (సంవత్సరాలకు); అర్థాన్ - విధులను; వ్యదధాత్ - పంచియిచ్చాడు.
స్వయంభువు, సర్వవ్యాపి, అశరీరి, కండలు లేనివాడు, పాపకళంక రహితుడు, ప్రకాశవంతుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, సర్వదర్శి, సర్వవిదుడు అయిన ఆత్మ శాశ్వతులైన ప్రజాప్రతులకు యధావిధిన వారివారి కర్తవ్యాలను పంచియిచ్చాడు.

10. అంధం తమ: ప్రవిశన్తి యేఁ విద్యాముపాసతే !
తతోభూమ ఇవ తే తమో య ఉ విద్యాయాగం రతా: !!
యే - ఎవరైతే; అవిద్యాం - అవిద్యను; ఉపాసతే - ఉపాసించుతారో; తే - వారు; అంధం తమ: - గాఢాంధకారంలో; ప్రవిశన్తి - ప్రవేశిస్తారు; యే - ఎవరైతే; ఉ - మరి; విద్యాయాం - విద్యలోనే; రతా: - ఆనందిస్తారో; తే - వారు; తత: - అంతకంటే; భూయ - ఎక్కువైన; తమ: ఇవ - చీకటిలో; ప్రవిశన్తి - ప్రవేశిస్తారు.
ఆ విద్యను ఉపాశించేవారు గాఢాంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటే అంధకారంలో విద్యలో ఆనందించేవారు ప్రవేశిస్తారు.

11. అన్య దేవాహు ర్విద్యయా అన్య దాహు రవిద్యయా !
ఇది శుశ్రుమ ధీరాణాం యేన స్తద్విచచక్షిరే !!
విద్యాయా - విద్యవల్ల; అన్యత్ - వేరొక (ఫలితాన్ని); అహు: - చెబుతారు; అవిద్యయా - అవిద్యచేత; అన్యత ఏవ - వేరొక (ఫలితాన్ని); అహు: - చెపుతారు; ఇతి - అని; ధీరాణాం - ప్రాజ్ఞులనుండి; శుశ్రుమ - మేమువిన్నాము; యే - ఎవరైతే; న: - మాకు; తత్ - దానిని; విచచక్షిరే - వివరించారో.
విద్యవల్ల (యజ్ఞతత్వ విజ్ఞానంవల్ల) ఒక ఫలితం లభిస్తుందనీ, అవిద్యవల్ల (కేవలం యజ్ఞకర్మవల్ల) మరొక ఫలితం లభిస్తుందనీ వారు చెబుతారు. దీనిని మాకు వివరించి, ప్రాజ్ఞులనుండి మేము ఈ విధంగా విన్నాం.
12. విద్యాం చావిద్యాం చ
యస్త ద్వేదో భయగం తీర్త్వా
అవిద్యయా మృత్యుం తీర్త్వా
విద్యయాఁ మృతమశ్నుతే!!
విద్య, అవిద్య.. ఈ రెండింటినీ తెలుసుకున్నవాడు... అవిద్యవల్ల మృత్యువును జయించి, విద్యవల్ల అమరత్వాన్ని పొందుతాడు.

13. అంధం తమ: ప్రవిశన్తి
యేఁసంభూతి ముపాసతే !
తతో భూయ ఇవ తే తమో
య ఉ సంభూత్యాగం రతా: !!
ప్రకృతిని ఉపాసించేవారు గాఢ అంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటేమించినదా అనిపించే చీకటిలో హిరణ్యగర్భుని ఉపాసించి ఆనందించేవారు ప్రవేశిస్తారు.

14. అన్యదేవాహు: సంభవా దన్య దాహు రసంభవాత్ !
ఇతి శుశ్రుమధీరాణాం యే నస్త ద్విచచక్షిరే !!
హిరణ్యగర్భుని ఉపాసనవల్ల ఒక ఫలితం, ప్రకృతి ఉపాసనవల్ల మరొక ఫలితం వస్తుందని వారు చెబుతారు. దీనిని మాకు వివరించిన ప్రాజ్ఞులనుండి ఈ విధంగా విన్నాం.

15. సంభూతించ వినాశంచ యస్త ద్వేదో భయగం సహ !
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యాఁ మృతమశ్నుతే !!
అసంభూతినీ, వినాశాన్నీ కలిపి తెలుసుకున్నవాడు, వినాశం (హిరణ్యగర్భుని) ఉపాసన ద్వారా మృత్యువును జయించి, అసంభూతి (ప్రకృతి) పైభక్తి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.

16. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాఁ పిహితం ముఖమ్
తత్త్వం పూష న్నపావృణు సత్యధర్మాయ దృష్టయే !!
నీలో వున్న సత్యం ద్వారాన్ని, మెరుస్తూ వున్న నీ బంగారు బింబం మూతలాగా కప్పి వుంది. ఓ సూర్యదేవా! సత్యనిష్టుడైన నేను ఆ సత్యాన్ని చూడటానికి వీలుగు ఆ మూతను పక్కకి తప్పించు.

17. పూషన్నే కర్షే యమ సూర్య ప్రాజాపత్య
ప్యూహరశ్మీన్ సమూహ తేజ: !
యత్తే రూపం కల్యాణ తమం తత్ తే పశ్యామి
యోఁ సా వసౌ పురుష: సోఁహ మస్మి!!
ఓ సూర్యుడా! ప్రజాపతిపుత్రుడా! స్వర్గ వీధిలో ఒంటరి బాటసారీ! సర్వపోషకా! సర్వనియంతా! నీ కిరణాలను తొలగించు. కాంతిని ఉపసంహరించుకో. నీ అనుగ్రహం వల్ల కల్యాణమమైన నీ రూపాన్ని చూడగలను. నిజంగా నీలో వుండే ఆ పురుషుడు నేనే అని గ్రహించాను.

18. వాయురనిల మమృత మథేదం భస్మాంతగం శరీరమ్ !
ఓం క్రతోస్మర కృతగం స్మర క్రతోస్మర కృతగం స్మర !!
ఇక నా ప్రాణవాయువు సర్వవ్యాపి, శాశ్వతమూ అయిన ప్రాణంలో లీనంగాక. ఈ శరీరం బూడిద అగుగాక. ఓం ఓ మనసా! గుర్తుకు తెచ్చుకో. నీ పూర్వ కర్మలను గుర్తుకు తెచ్చుకో.

19. అగ్నే నయ సుపథా రాయే అస్మాన్
విశ్వాని దేవవయునాని విద్వాన్ !
యుయోధ్యస్మ జ్ఞాహురాణమేనో
భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ !!
ఓ అగ్నిదేవా! మేము చేసి కర్మఫలితాలను అనుభవించడానికి మమ్మల్ని మంచి త్రోవలో నడిపించు. మేము ఆచరించిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ అగ్నిదేవా! మాలో మాయదారి పాపాలను దూరం చేయుము. నీకు పలుమార్లు నమస్కారం చేస్తున్నాము.

(ఇంతటితో ఈశావ్యాస ఉపనిషత్తు సమాప్తం)

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...