హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, డిసెంబర్ 14, 2015

హొమగుండం

హొమగుండం వద్ద ఎలాంటి ముగ్గులు వేస్తారు ?

సర్వత్ర  చక్రం  హొమగుండం  వద్ద , అలాగే  యజ్ఞయాగాదులప్పుడు  అష్టదళపద్మం , ఓంకారం  , స్వస్తిక్   వంటివి  వేస్తారు . ఇలా   వేయల్సివచ్చినప్పుడు   అవకాశముంటే  భగవత్  ప్రసాదంగా  భావించి  ముగ్గును  స్వయంగా  వేయండి . ఆ  ప్రాంతంలో   వేసిన  ముగ్గువలన  సప్తజన్మల  వరకు  సౌభాగ్యం  లభిస్తుంది .

సకల దేవతలకి సమర్పించవలసిన ప్రీతికరమైన నైవేద్యాలు ఏవి ?

    • బ్రహ్మ దేవునకు  జావ  నైవేద్యం  పెట్టాలి .
    • ఇంద్రునికి  భక్ష్యములు   నివేదించాలి .
    • అగ్ని దేవునకు  హవిష్యాన్నం .
    • వివస్వంతునకు  తేనే  , మాంసం , మద్యం .
    • శ్రిమహవిష్ణువునకు  శ్రేష్టాన్నం .
    • యమునకు  తీలాన్నం .
    • అశ్వనీకుమారులకు  భక్ష్యములు  .
    • పితృదేవతలకి  తేనే , నేయితో చేసినటువంటి  పాయసం నైవేద్యం  పెట్టాలి.
    • గౌరీదేవికి జావ  నైవేద్యం పెట్టాలి.
    • శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు నైవేద్యం.
    • చదువుల తల్లి సరస్వతిదేవికి త్రిమధురం.
    • వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం నైవేద్యం పెట్టాలి.
    • ధనరాజు  కుబేరునకు ,  వాని మిత్రుడు సూర్య దేవునకు శర్కరాన్నం.
    • ఋషులకు క్షిరన్నం.
    • సర్పములకు పాలు.
    • సుర్యరధమునకు  సర్వభూత బలి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...