హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

అష్టాదశ శక్తిపీఠాలు


లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //

అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //

ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //

హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //

సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //


అష్టాదశ శక్తిపీఠాల స్థానాలను చూడడానికి అష్టాదశ శక్తిపీఠాల మ్యాపు ని దర్శించండి



భ్రమరాంబ / శ్రీశైలం
[ ఆంధ్రప్రదేశ్ ]
మహాకాళి / ఉజ్జయిని
[ మధ్యప్రదేశ్ ]
జోగులాంబ / అలంపూర్
[ ఆంధ్రప్రదేశ్ ]
ఏకవీర / మాహూర్
[ మహారాష్ట్ర ]
మాణిక్యాంబ / ద్రాక్షారామం
[ ఆంధ్రప్రదేశ్ ]
మహాలక్ష్మి / కొల్హాపూర్
[ మహారాష్ట్ర ]
పురుహూతికా / పిఠాపురం
[ ఆంధ్రప్రదేశ్ ]
గిరిజ / బిరజ
[ ఒరిస్సా ]
కామరూపిణి / గౌహతి
[ అస్సాం ]
శాంకరి / త్రింకోమలి
[ శ్రీలంక ]
మంగళ గౌరి / గయ
[ బీహార్ ]
కామాక్షి / కంచి
[ తమిళనాడు ]
వైష్ణవి / జ్వాలాముఖి
[ హిమాచల్ ప్రదేశ్ ]
శృంఖల
[ పశ్చిమ బెంగాల్ ]
సరస్వతి / శారిక / శ్రీనగర్
[ జమ్ము & కాశ్మీర్ ]
మాధవేశ్వరి / లలిత / ప్రయాగ / అలహాబాద్
[ ఉత్తరప్రదేశ్ ]
చాముండేశ్వరి / మైసూర్
[ కర్ణాటక ]
విశాలాక్షి / వారణాశి
[ ఉత్తరప్రదేశ్ ]

అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.


దుర్గ-శక్తి
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

పురాణ కథ


దాక్షాయణి శరీరాన్ని మోసుకెళుతున్న శివుడు - 17వ శతాబ్దపు కాంగ్రా శైలి చిత్రం
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

18 శక్తిపీఠాలు

పై  శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం[1] ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
  1. శాంకరి - శ్రీలంక - ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం[2] ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
  2. కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    కంచి కామాక్షి
  3. శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
  4. చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
  5. జోగులాంబ - ఆలంపూర్, తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
  6. భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
  7. మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
  8. ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
  9. మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
  10. పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
  11. గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది.
  12. మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
  13. కామరూప - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
  14. మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
  15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం, [3] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
  16. మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
  17. విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్.
  18. సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

శనివారం, సెప్టెంబర్ 20, 2014

శనిగ్రహ స్తోత్రం

1.శనిగ్రహ స్తోత్రం

నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోస్తుతే |
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయచ నమోస్తుతే |
నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ |
నమస్తే యమసంజ్ఞాయ నమస్తే సౌరయేవిభో |
నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే |
ప్రసాదం మమ దేవేశ దీనస్య ప్రణతస్యచ ||


2.ఏలినాటి శని స్తోత్రం:
కోణశ్శనైశ్చరో మందః చాయా హృదయనందనః |
మార్తాండజ స్తథా సౌరిః పాతంగో గ్రహనాయకః ||
అబ్రాహ్మణః క్రూరకర్మా నీలవస్త్రాం జనద్యుతిః |
కృష్ణో ధర్మానుజః శాంతః శుష్కోదర వరప్రదః ||
షోడశైతాని నామాని యః పఠేచ్చ దినే దినే |
విషమస్థోపి భగవాన్ సుప్రీత స్తస్యజాయతే ||

ఈ 16 నామాల్ని నిత్యం పఠిస్తే, శనీశ్చరుడు సంతుష్టినొంది కోరిన కొరికలను తీరుస్తాడు.

బుధవారం, సెప్టెంబర్ 17, 2014

నవగ్రహ దోష నివారణ స్తోత్రం

శ్రీ సూర్యగ్రహ దోష నివృత్యర్థం శ్రీ రామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో
రావణ మర్దన రామనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ చంద్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కృష్ణావతార స్తుతి పఠనంచ కరిష్యే:
కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశహరే
కాళియమర్దన లోకగురో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కుజగ్రహ దోష నివృత్యర్థం శ్రీ నృసింహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
హిరణ్య కశిపుచ్ఛేదనతో ప్రహ్లాదాభయ దాయక హేతో
నరసింహాచ్యుత రూపనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బుధగ్రహ దోష నివృత్యర్థం శ్రీ బుద్ధావతార స్తుతి పఠనంచ కరిష్యే:
దానవపతి మానాపహార త్రిపుర విజయ మర్దన రూప
బౌద్ధ జ్ఞానద బుద్ధనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ బృహస్పతిగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వామనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భవ బంధన హర వితతమతే పాదోదక నిహతాఘతతే
వటుపటు వేష మనోజ్ఞనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శుక్రగ్రహ దోష నివృత్యర్థం శ్రీ పరశురామావతార స్తుతి పఠనంచ కరిష్యే:
క్షీతిపతి వంశక్షయ కరమూర్తే క్షీతిపతి కర్తా హరిహరమూర్తే
భృగుహల రామ పరేశనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ శనైశ్చరగ్రహ దోష నివృత్యర్థం శ్రీ కూర్మావతార స్తుతి పఠనంచ కరిష్యే:
మంథనాచల ధారణహేతో దేవాసుర పరిపాలవిభో
కూర్మాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ రాహుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ వరాహావతార స్తుతి పఠనంచ కరిష్యే:
భూచోరక హర పుణ్యమతే క్రోడోధృత భూదేవహరే
క్రోడాకార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కేతుగ్రహ దోష నివృత్యర్థం శ్రీ మీనావతార స్తుతి పఠనంచ కరిష్యే:
వేదోధార విచారమతే సోమకదానవ సంహరణే
మీనాతార శరీరనమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

శ్రీ కలి దోష నివృత్యర్థం శ్రీ కల్కీవతార స్తుతి పఠనంచ కరిష్యే:
శిష్టజనావన దుష్టహర ఖగతుర గోత్తమ వాహనతే
కల్కిరూప పరిపాల నమో భక్తంతే పరిపాలయమాం
రామస్మరణా ధన్యోపాయం నహిపశ్యామో భవతరణే
రామహరే కృష్ణహరే తవనామవదామి సదానృహరే

హరేరామ హరేరామ రామ రామ హరే హరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


పై స్తోత్ర్రం పఠిచవలసిన విధానం:
రవి స్తోత్రం ఆదివారం 6 సార్లు
చంద్ర స్తోత్రం సోమవారం 10 సార్లు
కుజ స్తోత్రం మాంగళవారం 7 సార్లు
బుధ స్తోత్రం బుధవారం 17 సార్లు
గురు స్తోత్రం గురువారం 16 సార్లు
శుక్ర స్తోత్రం శుక్రవారం 20 సార్లు
శని స్తోత్రం శనివారం 19 సార్లు
రాహు స్తోత్రం శని,ఆదివారం 18 సార్లు
కేతు స్తోత్రం మంగళవారం 7 సార్లు
ప్రతిరోజు మిగితావి ఒక్కసారి మాత్రమే.

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం


{ మొదటి అక్షరాలన్నీ కలిపితే 
"ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా ”
అని రావటం ఇందులో ప్రత్యేకత .గమనించండి }
ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే
నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే
మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే
భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ
వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే
తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయఘ్నాయ సర్వ క్లేశ హరాయచ
నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే
యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే
హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే
బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే
లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితా నా భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం
హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ ..


సోమవారం, సెప్టెంబర్ 15, 2014

దేవీ స్తుతి





యా దేవీ సర్వ భూతేషు మాతృ రూపేన సంస్తితః |
యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేన సంస్తితః
యా దేవీ సర్వ భూతేషు శాంతి రూపేన సంస్తితః |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః |
ఓం అంబాయై నమః ||

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

నిత్య పారాయణ శ్లోకాలు




గణేశ ఆవాహనం
ఓం ణానామ్ త్వా ణపతిగ్‍మ్ హవామహే విం కవీనాముమశ్రవస్తమమ్ | జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్ప ఆ నఃశృణ్వన్నూతిభిస్సీ సాదనమ్ || మహాగణపతయే నమః ||
ప్రభాత శ్లోకం.   కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||
ప్రభాత భూమి శ్లోకం.   సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
సూర్యోదయ శ్లోకం.   బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||
స్నాన శ్లోకం.   గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
భస్మ ధారణ శ్లోకం.   శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ | లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||
భోజన పూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే | గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
భోజనానంతర శ్లోకం.   అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ | ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||
సంధ్యా దీప దర్శన శ్లోకం.   దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌స్తుతే ||
నిద్రా శ్లోకం.   రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ | శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||
కార్య ప్రారంభ శ్లోకం.   వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః | నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
గాయత్రి మంత్రం.   ఓం భూర్భుస్సువః | తథ్సవితుర్వరేణ్యం | భర్గోదేవస్యధీమహి | ధియో యో నఃప్రచోదయాత్ ||
హనుమ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ | వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||
శ్రీరామ స్తోత్రం.   శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రాలు
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||

ఓం గజాననం భూత గనాది సేవితం, కపిత జంభు ఫల చారు భక్షణం;
ఉమా సుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం

ఏక దంతయ విద్మహే, వక్రతుండాయ ధీమహీ; తన్నో దంతి ప్రచోదయాత్
శివ స్తోత్రం.   త్ర్యంబకం యజామహే సుంధిం పుష్టివర్ధనమ్ | ఉర్వారుకమి బంధనాన్-మృత్యోర్-ముక్షీ మా‌మృతాత్||
గురు శ్లోకం.   గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||
సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా | యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా | సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
లక్ష్మీ శ్లోకం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ | దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ |
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ | త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||
వేంకటేశ్వర శ్లోకం.   శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయే‌ర్థినామ్ | శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ ||
దేవీ శ్లోకం.   సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే | శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ||
దక్షిణామూర్తి శ్లోకం.   గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ | నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
అపరాధ క్షమాపణ స్తోత్రం
అపరాధ సహస్రాణి, క్రియంతే‌హర్నిశం మయా | దాసో‌య మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర ||
కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా, శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ | విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ, శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ | కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ||
బౌద్ధ ప్రార్థన.   బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి
శాంతి మంత్రం : అసతోమా సద్గమయా | తమసోమా జ్యోతిర్గమయా | మృత్యోర్మా అమృతంగమయా | ఓం శాంతిః శాంతిః శాంతిః
సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః | సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్ ||
ఓం హ నావవతు | నౌభునక్తు | వీర్యంకరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై” ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||
విశేష మంత్రాః
పంచాక్షరి ఓం నమశ్శివాయ, అష్టాక్షరి ఓం నమో నారాయణాయ, ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...