హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Sunday, May 06, 2012

0.ఉపనిషత్తులు - 108

ఉపనిషత్తులు మెత్తం 108

                     

సృష్టికి మూలం ప్రకృతి. ఈ ప్రకృతి పురుషుని మీద ఆధారపడి ఉంది. పురుషుడు రెండువిధాలుగాపేర్కొనబడి యున్నాడు.
1. జీవుడు (దేహములో ఉన్నవాడు).
2. దేవుడు (దేహములకు వెలుపల మొత్తమునందు ఉన్నవాడు).
పురుషుడు, అతని ప్రవర్తనమైన ప్రకృతి , అందులోంచి వచ్చివెళ్తున్న సృష్టి , ఈ సృష్టి లో ఇమిడియున్న విజ్ఞానంఈ మొత్తం ఒక శాశ్వతమైనగ్రంధం. దీనినే *వేదం* అని అంటారు. ఈ వేదం మనలో నాలుగు విధాలుగా కనబడుతుంది.
1. శ్వాస 2.కంఠనాదం 3. మనస్సు 4 . దేహము.

వేదాలు అపౌరుషేయాలు. ఎన్నటికీ శాశ్వతంగా విరజిల్లే సత్యాల సమాహారమే వేదాలు. అలా ఋషులు ఆవిష్కరించిన ఆ సత్యాలు నాల్గు భాగాలుగా క్రోడీకరింపబడ్డాయి. అవే ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలు. ప్రతి వేదమూ మూడు ప్రధాన భాగాలుగా వర్గీకరింపబడింది. అవి, సంహితలు, బ్రాహ్మణం మరియు ఆరణ్యకం (ఉపనిషత్తులు – చరమ సత్యాన్ని గురించిన వివరణ). చరమ సత్యాన్ని గురించిన విచారణలో మనిషి మనసు అందుకోగలిగిన ఎల్లలను ఉపనిషత్తులు ఆవిష్కరింపచేస్తాయి.     
ఉపనిషత్ అనే మాటకు, ఉప = సమీపము, దగ్గరగా ...నిషద్ =కూర్చుండబెట్టునది అని అర్ధము. ఎవరకు దగ్గరగా? అంటే - *గురువుకు దగ్గరగాకూర్చుండబెట్టునది* అని అర్ధము. ఇవి మూలస్తంభమైన మోక్షవిద్యలేదా ఆనందవిద్యలకు దారితీస్తూ ఉంటాయి. ఆ త్రోవలో మనమూ వెళ్దామనే ఉద్దేశంకొంచమైనా ఉంటే చాలు మనకు. మన చెయ్యి పట్టుకుని నడిపిస్తాయి ఈ ఉపనిషత్తులు.
ఉపనిషత్తులు అనేకం ఉన్నాయి. సామాన్యంగా వాటిలో 108 మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటిలో పద్నాలుగు మాత్రమే ప్రధానంగా పరిగణిస్తున్నారు. అవే
ఐతరేయ, కౌశీతకీ – ఋగ్వేదం నుండి
ఈశ, కఠ, తైత్తరీయ, బృహదారణ్యక, శేతాశ్వతర, మైత్రాయణీ, మహానారాయణా – యజుర్వేదం నుండి
కేన, ఛాంద్యోగ- సామవేదం నుండి
ప్రశ్న, ముండక, మాండూక్య – అథర్వణ వేదం నుండి.
కేవలం శాస్త్ర జ్ఞానంతోనో,పాండిత్యం వలనో ఉపనిషత్తుల నిజమైన అర్థాన్ని గ్రహించడం సాధ్యం కాదు. నిజమైన సాధనామయ జీవితంలో పాల్గొని, మనస్సుని పావనం చేసుకుని భగవదభిముఖంగా సాగే కొద్దీ వాటి అంతరార్థం మనకి మరింత లోతుగా అవగతమవుతుంది.    
ఈ ఉపనిషత్తులు వేదంలోని భాగంలో ఒకటిగా చెబుతారు. వేధంలోని ఈ ఉపనిషత్తులు తత్త్వ జ్ఞానం గురించి, దానికి సంబంధించి మహర్షులు అనుభవాల గురించి క్షుణ్ణంగా మనకు విశదపరుస్తాయి. వేదసారం-ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వాటిలో పది మాత్రమే ప్రధానమైనవి. అవి : 1.ఈశోపనిషత్తు 2. కఠోపనిషత్తు 3. ముండకోపనిషత్తు 4. కేనోపనిషత్తు.5 ప్రశ్నోపనిశషత్తు 6.మాండూక్యోపనిషత్తు 7.తైత్తరీయోపనిషత్తు 8. ఐతరీయోపనిషత్తు 9. బృహదారణ్యకోపనిషత్తు. 10. చాందోగ్యోపనిషత్తు.
1. ఈశావాస్యోపనిషత్
2. కేసోపనిషత్
3. కఠోపనిషత్
4. ప్రశ్నోపనిషత్
5. ముండకోపనిషత్
6. మాండూక్యోపనిషత్
7. తైత్తిరీయోపనిషత్
8. ఐతరేయోపనిషత్
9. ఛాందోగ్యోపనిషత్
10. బౄహదారణ్య కోపనిషత్
11. బ్రహ్మోపనిషత్
12. కైవల్యోపనిషత్
13. జాబాలోపనిషత్
14. శ్వేతాశ్వతరోపనిషత్
15. హంసోపనిషత్
16. అరుణికోపనిషత్
17. గర్భోపనిషత్
18. నారాయణోపనిషత్
19. పరమహంసోపనిషత్
20. అమౄతబిందూపనిషత్
21. అమౄతబిందూపనిషత్
22. అథర్వనాదోపనిషత్
23. అథర్వఖోపనిషత్
24. మైత్రాయణ్యుపనిషత్
25. కౌషితకీబ్రాహ్మణోపనిషత్
26. బౄహజ్జాబాలోపనిషత్
27. నౄసిమ్హతాపిన్యుపనిషత్ (పూర్వతాపిని, ఉత్తరతాపిని)
28. కాలాగ్నిరుద్రోపనిషత్
29. మైత్రేయోపనిషత్
30. సుబాలోపనిషత్
31. క్షురికోపనిషత్
32. మంత్రికోపనిషత్
33. సర్వసారోపనిషత్
34. నిరాలంబోపనిషత్
35. శుకరహస్యోపనిషత్
36. వజ్రసూచ్యుపనిషత్
37. తేజోబిందూపనిషత్
38. నాదబిందూపనిషత్
39. ధ్యానబిందూపనిషత్
40. బ్రహ్మవిద్యోపనిషత్
41. యోగతత్వోపనిషత్
42. ఆత్మబోధోపనిషత్
43. నారదపరివ్రాజకోపనిషత్
44. త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్
45. సీతోపనిషత్
46. యోగచూడామణ్యు పనిషత్
47. నిర్వాణోపనిషత్
48. మండల బ్రాహ్మణోపనిషత్
49. దక్షిణామూర్త్యుపనిషత్
50. శరభోపనిషత్
51. స్కందోపనిషత్
52. మహానారాయణోపనిషత్
53. అద్వయతారకోపనిషత్
54. రామరహస్యోపనిషత్
55. రామతాపిన్యుపనిషత్ (పూర్వతాపిన్యుపనిషత్ , ఉత్తరతాపిన్యుపనిషత్)
56. వాసుదేవోపనిషత్
57. ముద్గలోపనిషత్
58. శాండిల్యోపనిషత్
59. పైంగలోపనిషత్
60. భిక్షుకోపనిషత్
61. మహోపనిషత్
62. శారీరకోపనిషత్
63. యోగశిఖోపనిషత్
64. తురీయాతీతోపనిషత్
65. సన్న్యాసోపనిషత్
66. పరమహంసపరివ్రాజకోపనిషత్
67. అక్షమాలికోపనిషత్
68. అవ్యక్తోపనిషత్
69. ఏకాక్షరోపనిషత్
70. అన్నపూర్ణోపనిషత్
71. సూర్యోపనిషత్
72. అక్ష్యుపనిషత్
73. అధ్యాత్మోపనిషత్
74. కుండికోపనిషత్
75. సావిత్ర్యుపనిషత్
76. ఆత్మోపనిషత్
77. పాశుపతబ్రహ్మోపనిషత్
78. పరబ్రహ్మోపనిషత్
79. అవధూతో పనిషత్
80. త్రిపురతాపిన్యుపనిషత్
81. శ్రీదేవ్యుపనిషత్
82. త్రిపురోఒపనిషత్
83. కఠరుద్రోపనిషత్
84. భావనోపనిషత్
85. రుద్రహౄదయోపనిషత్
86. యోగకుండల్యుపనిషత్
87. భస్మజాబాలోపనిషత్
88. రుద్రాక్షజాబాలోపనిషత్
89. గణపత్యుపనిషత్
90. దర్శనోపనిషత్
91. తారసారోపనిషత్
92. మహావాక్యోపనిషత్
93. పంచబ్రహ్మోపనిషత్
94. ప్రాణాగ్నిహోత్రోపనిషత్
95. గోపాలతాపిన్యుపనిషత్
96. కౄష్ణోపనిషత్
97. యాజ్ణ్జవల్క్యోపనిషత్
98. వరాహోపనిషత్
99. శాట్యాయనీయొపనిషత్
100. హయగ్రీవోపనిషత్
101. దత్తత్రేయోపనిషత్
102. గారుడోపనిషత్
103. కలిసంతారణోపనిషత్
104. బాల్యుపనిషత్
105. సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్
106. సరస్వతీ రహస్యోపనిషత్
107. బహ్వౄచోపనిషత్
108. ముక్తికోపనిషత్

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...