హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, మే 23, 2012

మంత్రసాధనలు- కార్యసాధనామంత్రములు

              మంత్రసాధనలు- కార్యసాధనామంత్రములు

        కార్యసాధనామంత్రములు:-  పది విధములైన కార్యసాధనా మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను. 


       1.    మం\\     సుముఖశ్చైకదంతశ్చ కపిలో  గజ కర్ణికహ్శ్చ్
                     లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపహ్
                     ధూమ కేతు ర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననహ్
                     వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజహ్//
                        ఈ శ్లోకమును ఏ పనికైనా బయలుదేరుటకు ముందు 16 సార్లు పఠించి
         వెళ్ళిన విఘ్నములు కలుగకుండా నివారింపబడి కార్యసిద్ధి చేకూర గలదు.
    2    మం\\      ‘’వక్రతుండాయ హుం ‘’
                                ఈమంత్రమును  శుక్ల పక్ష చవితినాడు ప్రారంభించి
    ఒక లక్ష  సార్లు జపించి విఘ్నేశునికి అటుకులు పాలు పాయసము నివేదించిన వారికి అన్ని
     విఘ్నములు తొలగిపోయి సకల కార్యసిద్ధి చేకూరగలదు.            
   3.  మం\\    ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
             లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం//
                          ఆపదలుకలుగగలవని సందేహమున్నప్పుడు ఈమంత్రమును 21 మార్లు
             పఠించిన క్షేమము గలుగును.
  
  4.  మం\\ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే
          శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణి నమోస్తుతే//
                      ఈ శ్లోకమును32 మార్లు పఠించిన విజయము లభింపగలదు.

 5. మం\\ నమోऽస్తురామాయ సలక్ష్మణాయ
         దేవ్యైచ తస్మై జనకాత్మజాయ
         నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్య
         నమోస్తుచంద్రార్క మరుద్గణేభ్యహ్//
                  ఇది ఆంజనేయ కౄత మంత్రము ,పనులు పేచీలుగా ఉన్నప్పుడు
    ఆటంకములు తొలిగి పోవుటకు 15 సార్లు పఠించిన  పనులు పూర్తి కాగలవు. 
  6. మం\\  ఓం కార భవన స్ధానంశంకరం దామతేజసాం
          శివంవందే వాసవాబ్జం భూనారాణసేవితం//
                    జపము పూజ ఏకాంతము మొ|| లగు  వాటి యందు విఘ్నములు తొలగి  త్వరగా సిద్ధి కలుగును. 54 మార్లు రోజుకు పఠించవలెను.
    7.   మం\\  ఐం బీజ మాదిందు సమాన దీప్తిం
               హ్రీం సూర్యతేజోద్యుతి మద్వితీయం
               క్లీం  మూర్తి వైశ్వానర తుల్య రూపం
               తౄతీయ ద్యూనంతు శుభామానం
        ఈ మంత్రమును 40 రోజులు రోజుకి 21 మార్లు అర్ధరాత్రి సమయంలో పఠించిన
   శత్రు ఆటంకములు తొలగి కార్యసిద్ధి కలుగును.
  8. మం\\  ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరద వరద సర్వ జనంమే వసమానయ  స్వాహా ||
          ఈ మంత్రమును మంగళవారం ప్రారంభించి ఒక లక్ష పర్యాయములు జపించి వినయకునికి ఉండ్రాళ్ళు , చెరుకు ముక్కలు నివేదించి ఎర్ర గన్నేరు పూలతో పూజించిన గ్రామ కక్షలు తొలగి జనులు ప్రసన్నులు కాగలరు. అట్లే మల్లెపూలు నేతి లో తడిపి హోమము గావించిన గ్రామజన సభా ,రాజ వశ్యములు కాగలవు. దీనికి సాటియగు మంత్రము లేదు. 
9.   మం\\ సీతామనోమానస రాజహంస
       సంసార సంనాశహర క్షమాళో
       శ్రీరామ దైత్యాంతక శాంతరూప
       శ్రీ తారక బ్రహ్మ నమోనమస్తే ||
                    ఈ మంత్రమును 108 మార్లు పఠించిన కుటుంబ కలహములు తొలగి
  ఈతిబాధలంతరించి సుఖ శాంతులు కలుగును.     
10.      మం\\ ఓం మణి ధరణి వజ్రిణి శిఖరిణి సర్వవశంకరణి హుం పట్ స్వాహా ||
       ఈ మంత్రమును శుద్ధ నవమి నాడు ప్రారంభించి 40 దినములు పఠించిన వౄత్తి వైషమ్యములు   తొలిగి విజయము చేకూరగలదు. జపము చేయు సమయములలో ప్రతి శుక్రవారం దేవీ కుంకుమ పూజ చేయాలి. రోజుకి 2500 జపము. శత్రువులు మిత్రులై సహాయపడగలరు.



linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...