హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Friday, May 25, 2012

మత్స్య యంత్రం


మత్స్య యంత్రం

             


 శ్రీ   మత్స్య యంత్రంను  
                శ్లో ||   స్వర్ణేన రజతే  నాపి  పంచాంగుళ  ప్రమాణకమ్ |
                         యంత్రపత్రం  విరచ్యాధ  సప్తకోణం  లిఖేత్పురమ్ |
                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |
                         మధ్యేతు మత్స్య  మాలిఖ్య  గృహస్థాపన శోభనమ్ |
                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |
                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ || 
                           
                               పై యంత్రమును ఐదు శేర్ల ధాన్యము నందు ఒక దినము , పంచామృతములందు ఒక దినము మంచి నీటి యందు ఒక దినము ఉంచి పూజించి  సహస్రాష్టోత్తర శతగాయత్రి   జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహము స్థలముల యందు ఈ యంత్రమును స్థాపించ వలెను.
                 ఈ యంత్రమును స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు  , కూప వేధలు , స్తంభ వేధలు ,
వీధీ శూలలు   ఆయుర్ధాయము  నశించిన  గృహ దోషములు  , శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును 
మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.
    
          


                      -: మత్స్య గాయత్రి :-
    జలచరాయ    విద్మహే మహామీనాయ   ధీమహి తన్నోమత్స్యః     ప్రచోదయాత్.//  
                            

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...