హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Saturday, May 26, 2012

మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు


మంత్రసాధనలు- కోరికలు నెరవేరుటకు మంత్రములు

        కార్యసాధనామంత్రములు:-  ఏడు విధములైన  కోరికలు నెరవేరుటకు  మంత్రములు ఇక్కడ పొందుపరచుచున్నాను. 


       1.    మం\\  ఓం క్లీం హ్రీం రుం ద్రుః ఘ్రీం హ్రీం భైరవాయ నమః ||


       ఈ మంత్రమును 24000  పర్యాయములు జపించిన యెడల భైరవ స్వామి స్వప్న దర్శన మగును.  శివుని సన్నిధిలో స్థిర చిత్తముతో ఏకాంతముగా జపము చేయవలెను. అట్లైన ప్రయత్నము లేకుండానే మనస్సు లోని కోరికలు నెరవేరగలవు.  

       2    మం\\     ఓం క్రీం క్రీం క్రీం హూం హుం హ్రీం హ్రీం భైం భద్రకాళీ భైం హ్రీం హ్రీం హుం హూం క్రీం క్రీం క్రీం స్వాహా || 
           
               ఈ మంత్రమును శక్తి ఆలయంలో  ధ్యాన పూర్వకముగా 10000 సార్లు జపించి ఇష్ట బలి గావించిన కష్టతరమైన కోరికలు కూడా సత్వరముగా ఫలించగలవు. ( కాని మనో నిగ్రహం బాగా ఉండాలి )

   3.  మం\\   ఓం శ్రీం హ్రీం జయ లక్ష్మీ ప్రియాయ నిత్య ప్రముదిత చేతసే లక్ష్మీ శ్రితార్థదేహయ శ్రీం హ్రీం నమః ||

            ఈ మంత్రమును నృశింహ స్వామిని పూజిస్తూ 40 రోజులు లక్ష పర్యాయములు జపించిన ఊహాతీతముగా అన్ని కోరికలు నెరవేరగలవు. 

  4.  మం\\  సర్వానర్ధ హరం దేవం సర్వ మంగళ మంగళమ్ 
                  సర్వక్లేశ హరం  వందే స్మర్తృగామీ సనోనతు ||

             ఈ మంత్రమును ప్రతి నిత్యము పఠించు చున్న అభీష్టసిద్ధి జయము కలుగును. జప సంఖ్య లేదు.

  5. మం\\  వందే పద్మకరాం ప్రశన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం 
                హస్తాభ్యామభయ ప్రదాం మణిగణైర్నానావిధై ర్భూషితాం 
                 భక్తా భీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మా దిభి స్సేవితాం
                పార్శ్వే పంకజ శంఖ పద్మ నిధి భిర్యుక్తాం సధా శక్తిభిః  ||

            ఈ మంత్రమును  ఆసనమున కుర్చుండి లేవకుండా 108 పర్యయములు పఠించిన భాగ్యవంతులగుట తథ్యం . దారిద్య బాధలంతరించి కోరికలన్నీ నెరవేరుతాయి.

  6. మం\\  రోగానశేషా నపహంసి తుష్టా 
                 దదాసికామాన్ సకలానభిష్టాన్ 
                 త్వామాశ్రితానాం నవిపన్నరాణాం
                 త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి ||

             ఈ మంత్రమును ప్రతినిత్యము 24 మార్లు భక్తిగా పఠించిన అనతి కాలంలోనే కష్టములు తీరి కోరికలు నెరవేరి సుఖపడగలరు . 
         
  7.   మం\\   ఓం ఐం క్లీం సౌః క్లీం ఐం

                    ఈ మంత్రమును  లక్ష సార్లు జపించి జాకి పూలతో దేవి పూజ గావించి పాయస నైవేద్య మిచ్చిన తలచిన కోరికలు సత్వరమే నెరవేరగలవు. 
            


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...