హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, ఏప్రిల్ 29, 2012

నవగ్రహ శ్లోకం తాత్పర్యం



నవ గ్రహములు



గ్రహాల ప్రభావం మన నిత్య కర్మలపై, దైనందిన జీవితం లోని ఫలితాలపై ఉంటుందని చాలామంది నమ్మకం. మన జ్యోతిష శాస్త్రము ప్రకారం గ్రహాలు తొమ్మిది. అవి సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు గ్రహాలు. ఇందులో రాహువు, కేతువు ఛాయా గ్రహాలు. దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా శివ కోవెలలో నవ గ్రహాలను ఈశాన్య దిక్కున ప్రతిష్టిస్తారు. సూర్యుడు కేంద్రంగా మిగిలిన ఎనిమిది గ్రహాలను 3 x 3 వరుసలో ప్రతిష్టిస్తారు. 

ఇందులో ఏ రెండు గ్రహాలు కూడా ఒక దానికొకటి ఎదురుగ ఉండవు. సూర్యుడు (Sun) తూర్పు ముఖంగా ఉంటాడు. సూర్యునికి తూర్పు దిక్కున శుక్రుడు (Venus), పశ్చిమాన శని (Saturn), ఉత్తరాన గురుడు / బృహస్పతి (Jupiter) దక్షిణ దిక్కున కుజుడు/అంగారకుడు/మంగళుడు (Mars), ఈశాన్య దిశను బుధుడు (Mercury), ఆగ్నేయాన చంద్రుడు (Moon), నైఋతి దిక్కున కేతువు (Neptune), వాయవ్య దిక్కున రాహువు (Pluto) ఉంటారు.  రాహువుకు తల, కేతువుకు తోక మాత్రం ఉంటాయి.  నవగ్రహ ఆరాధనను ఒక సాధారణ శ్లోకం తో చేయ వచ్చును.

నవగ్రహ శ్లోకం:
నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||


ప్రతి పదార్ధం: నమః = నమస్కారం;  సూర్యాయ = సూర్య గ్రహమునకు; చంద్రాయ = చంద్రగ్రహమునకు; మంగళాయ = మంగళ గ్రహమునకు; చ = మరియు; గురుః = గురు గ్రహానికి; శుక్రః = శుక్ర గ్రహానికి; శనిభ్యః = శని గ్రహమునకు; రాహుః = రాహువునకు; కేతవః = కేతువునకు; నమః = నమస్కారము.
 
తాత్పర్యము: నవగ్రహములైన సూర్యునకు, చంద్రునకు, మంగళునకు, బుధునికి, గురునికి, శుక్రునికి, శనికి, రాహువుకు, మరియు కేతువునకు నమస్కారములు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...