హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

మంగళవారం, నవంబర్ 25, 2025

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి



★ *ఉగాది:-* కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
★ *శ్రీరామ నవమి:-* భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
★ *అక్షయ తృతీయ:-* విలువైన వాటిని కూడబెట్టుకోమని.
★ *వ్యాస (గురు) పౌర్ణమి :-* జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
★ *నాగుల చవితి;-* ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
★ *వరలక్ష్మి వ్రతం :-* నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
★ *రాఖీ పౌర్ణమి:-* తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
★ *వినాయక చవితి ( నవరాత్రులు ) :-* ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
★ *పితృ అమావాస్య:-* చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
★ *దసరా ( ఆయుధ పూజ) :-* ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
★ *దీపావళి :-* పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
★ *కార్తీక పౌర్ణమి :-* చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
★ *సంక్రాంతి :-* మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
★ *మహాశివరాత్రి :-* కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
★ *హోలీ :-* వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

శనివారం, నవంబర్ 01, 2025

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక దివ్యమంత్రాలు


శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక - ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.

ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.
కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.
మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం - వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.

విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని - స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే. పైగా - ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.
ధ్యానమ్

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిసఫుర
జ్జ్యోతిఃస్ఫాటికలింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దా కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తిభేదా
రుద్రాశ్శ్రీరుద్రసూక ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే
ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్
తతః ప్రణమ్య బహుధా కృతాంజలిపుటః ప్రభుః
శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!

గణేశ ఉవాచ:

౧. నమస్తే దేవదేవాయ నమస్తే రుద్ర మన్యవే
నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః
౨. నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే
నమస్తే భగవన్ శమ్భో బాహుభ్యాముత తే నమః
౩. ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్
శివం ధనుర్యద్బభూవ తేనాపి మ్ఋడయాధునా
౪. శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో
యా తే రుద్ర శివా నిత్యం సర్వజ్ఞ్గల సాధనమ్
౫. తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాప తే
ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ
౬. యా తయా మృడయ స్వామిన్ సదా శన్తమా ప్రభో
గిరిశన్త మహారుద్ర హస్తే యా మిషు మస్ే
౭. బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే
శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామస
౮. త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్
యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్
౯. యథా తథావమా రుద్ర తదన్యధాపి మే ప్రభో
రుద్ర త్వం ప్రథమో దైవ్యోభిషక్ పాపవినాశకః
౧౦. అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా
అహీన్ సర్వాన్ యాతుధాన్యః సర్వా అప్యద్య జమ్భయమ్
౧౧. అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః
విలోహితో స్త్వయం శమ్భో త్వదధిష్ఠాన ఏవహి
౧౨. నమో నమస్తే భగవన్ నీలగ్రీవాయ మీఢుషే
సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానందమూర్తయే
౧౩. ఉభయోరార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్
సంప్రాప్య ధను రన్యేషాం భయాయ ప్రభవిష్యతి
౧౪. అస్మద్భయవినాశార్థ మధునాభయద ప్రభో
యాశ్చతేహస్త ఇషవః పరాతా భగవో వప
౧౫. అవతత్య ధను శ్చ త్వం సహస్రాక్ష శతేషుఢే
ముఖా నిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ
౧౬. విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి
అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః
౧౭. కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః
ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యేతు భయం భవేత్
౧౮. యాతే హేతిర్ధను ర్హస్తే మీఢుష్టమ బభూవ యా
తయాస్మాన్ విశ్వత స్తేన పాలయ త్వ మయక్ష్మయా
౧౯. అనాతతాయాయుధాయ నమస్తే ధష్ణవే నమః
బాహుభ్యాం ధన్వనే శమ్భో నమో భూయో నమో నమః
౨౦. పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః
ఇషుధిస్తవ యా తవదస్మారే నిధేహి తమ్
౨౧. హిరణ్యబాహవే తుభ్యం సేనాన్యే తే నమో నమః
దిశాంత పతయే తుభ్యం పశూనాం పతయే నమః
౨౨. త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే
నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః
౨౩. నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః
నమస్తే హరికేశాయ రుద్రాయా స్తూపవీతినే
౨౪. పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః
సంసారహేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే
౨౫. క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే
అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః
౨౬. రోహితాయ స్థపతయే మన్త్రిణే వాణిజాయ చ
కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువన్తయే
౨౭. తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః
ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే
౨౮. ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రన్దయతే నమః
౨౯. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః
ధావతే ధవాలాయపి సత్త్వనాం పతయే నమః
౩౦. ఆవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే
స్తేనానాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. తస్కరాణాం చ పతయే వంచతే పరివంచే
స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే
౩౨. నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః
అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః
౩౩. ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరచరాయతే
కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ
౩౪. నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతే నమః
నమ ఉగ్రాయ భీమాయ నమ శ్చాగ్రేవధాయచ
౩౫. నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః
హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః
౩౬. నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే
నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే
౩౭. గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః
నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే
౩౮. మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః
నమశ్శివాయ శర్వాయ నమ శ్శివతరాయ చ
౩౯. నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయ తే నమః
ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ
౪౦. నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః
ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ
౪౧. నమ శ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః
ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః
౪౨. వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః
వర్షీయసే నమస్ేస్తు నమో వృద్ధాయతే నమః
౪౩. సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః
ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ
౪౪. శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః
నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయ తే నమః
౪౫. స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః
జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః
౪౬. పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ
మధ్యమాయ నమస్తుభ్య మపగల్భాయ తే నమః
౪౭. జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః
సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయ చ నమోనమః
౪౮. క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః
ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయచ నమోనమః
౪౯. శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః
నమో వన్యాయ కక్ష్యాయ మౌంజ్యాయ చ నమోనమః
౫౦.శ్రవాయ చ నమస్తభ్యం ప్రతిశ్రవ నమోనమః
ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ
౫౧. వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః
శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః
౫౨. దుందుభ్యాయ నమస్తుభ్యమాహనన్యాయ తే నమః
ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయచ
౫౩. పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః
సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః
౫౪. నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః
నమో నీప్యాయ సూద్యాయ సరస్యాయ చ తే నమః
౫౫. నమో నాద్యాయ భవ్యాయ వైశన్తాయ నమోనమః
అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః
౫౬. అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః
విద్యుతాయ నమస్తుభ్య మీథ్రియాయ నమోనమః
౫౭. ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః
రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః
౫౮. వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః
నమోరుద్రాయ తామ్రాయా ప్యరుణాయ చ తే నమః
౫౯. నమ ఉగ్రాయ భీమాయ నమ శ్శంగాయ తే నమః
నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః
౬౦. ప్రవాహ్యాయ నమస్తుభ్య మిరిణ్యాయ నమోనమః
నమస్తే చన్ద్ర చూడాయ ప్రపధ్యాయ నమోనమః
౬౧. కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః
కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే
౬౨. నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః
సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః
౬౩. కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః
నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్ంసవ్యాయ తే నమః
౬౪. రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ
నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః
౬౫. హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః
నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః
౬౬. నమోపగురమాణాయ పర్ణశద్యాయ తే నమః
అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః
౬౭. విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః
త్ర్యమ్బకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః
౬౮. మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః
వేదవేదాన్త వేద్యాయ వృషారూఢాయ తే నమః
౬౯. అవిజ్ఞేయస్వరూపాయ సున్దరాయ నమోనమః
ఉమాకాన్త నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే
౭౦. హిరణ్యబాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ
నమో హిరణ్యరూపాయ రూపాతీతాయ తే నమః
౭౧. హిరణ్యపతయే తుభ్యమంబికా పతయే నమః
ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక
౭౨. మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే
తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణరూపిణే
౭౩. అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ
కాలాంతకాయాపి నమోనమస్తే దిక్కాలరూపాయ నమోనమస్తే
౭౪. వేదాంత బృందస్తుత సద్గుణాయ గుణప్రవీణాయ గుణాశ్రయాయ
శ్రీ విశ్వనాథాయ నమోనమస్తే కాశీనివాసాయ నమోనమస్తే
౭౫. అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధిరూపాయ నమోనమస్తే
ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమోనమస్తే
౭౬. నీహారశైలాత్మజ హృద్విహార ప్రకాశహార ప్రవిభాసి వీర
వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే

వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః
కృతాంజలిపుట స్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః
త మాలోక్య సుతం ప్రాప్తం వేదవేదాంగ పారగమ్
స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః
ఇతి శ్రీ శివరహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్థే
గణేశకృత రుద్రాధ్యాయస్తుతిః నామ దశమోధ్యాయః
అనేన శ్రీ గణేశకృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన
శ్రీ విశ్వేశ్వర స్సుప్రీతస్సుప్రసన్నోవరదో భవతు!!





శుక్రవారం, అక్టోబర్ 24, 2025

నాగుల చవితి శుభాకాంక్షలు

ఇందులో .....
సర్ప దేవతా ప్రత్యేక సంకేతం?
నాగ చతుర్థి/ పంచమి రోజు స్మరించాల్సిన స్తోత్రం నామ స్తుతి
దేవతల నుండి సర్ప దేవతలు వరాలు ఇలా పొందాయి
సర్ప క్షేత్రాలు

పంచ శీర్షాం మహా భోగం నీలవర్ణాం భయంకరీం సర్వారిష్ట నిహర్తారం వంతేతాం నాగదేవతాం ॥

సర్ప దేవతా సంకేతం
*సర్పం కాలానికి ప్రతీక* మరియు యోగ శాస్త్రంలో, మానవ శరీరంలోని వెన్నెముక వద్ద ఉండే కుండలినీ శక్తి సర్ప (పాము) ఆకారంలో చుట్టుకొని ఉంటుందని చెబుతారు. పుట్టలో పాలు పోయడం లేదా నాగదేవతను పూజించడం అనేది మనలోని ఈ కుండలినీ శక్తిని మేలుకొలపడానికి ఒక సంకేతం అనే చెప్పాలి. 

సర్పం మళ్లీ మళ్లీ చర్మం వదిలి కొత్త శరీరాన్ని పొందడం ద్వారా పునర్జన్మ ప్రతీక అని అర్ధం

నాగుల చవితి రోజున చదవాల్సిన
నవనాగ స్తోత్రం

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా || ౧ 

ఫలశ్రుతి
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః || ౨ ||
సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ || ౩ ||
సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ || ౪ 
ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి 
ఇతి శ్రీ నవనాగ స్తోత్రమ్ |

ఈ స్తోత్రం స్పష్టంగా చదవలేని వారు 
ఈ నామావళి చదివినా ఫలితo ఉంటుంది

ఓం అనంతాయ నమః
ఓం వాసుకయే నమః
ఓం శేషాయ నమః
ఓం పద్మనాభయ నమః
ఓం కంబలాయ నమః
ఓం శంఖ ఫాలాయ నమః
ఓం ధృత రాష్ట్రాయ నమః
ఓం తక్షకాయ నమః
ఓం కాళీయాయ నమః 

వివాహ సంతానం ఆరోగ్యం కావలసిన వారు పారాయణం చేసుకోవచ్చు ,శ్రీ నాగ విగ్రహానికి పూజలు శుభము

ఈ స్తోత్రo లేక నామావళి పఠించడం వలన సర్పభయం తొలగి, సర్వబాధలు నివారించబడి, కుటుంబ సభ్యులకు విజయం కలుగుతాయి.

దేవతల నుండి సర్ప దేవతలు వరాలు ఇలా పొందాయి

సర్పాలు పురాణాలలో దైవత్వం మరియు ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నందున, వివిధ దేవతల నుండి అనేక ముఖ్యమైన వరాలను పొందాయి. ఈ వరాలలో ముఖ్యమైనవి ఆదిశేషుడు (అనంతుడు) మరియు వాసుకి వంటి ప్రముఖ నాగరాజులకు సంబంధించినవి.

1. శ్రీ బ్రహ్మదేవతా వరం (ఆదిశేషుడికి)
నాగరాజులలోకెల్లా ప్రముఖుడు, విష్ణుమూర్తికి పడకగా, ఛత్రంగా ఉండే ఆదిశేషుడికి (అనంతుడికి) బ్రహ్మదేవుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు.
వరం యొక్క సందర్భం ఆదిశేషుడు తన కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడానికి, ధ్యానం చేయడానికి మరియు తపస్సు చేయడానికి ఒక మార్గం కావాలని బ్రహ్మను కోరుకుంటాడు.

 ఆదిశేషుడి భక్తికి సంతోషించిన బ్రహ్మదేవుడు, శాశ్వతమైన తపస్సు చేసే శక్తిని అనుగ్రహించి, భూభారాన్ని వహించే అత్యంత ముఖ్యమైన బాధ్యతను అప్పగించారు. అప్పటి నుండి, ఆదిశేషుడు తన వేయి పడగలపై సమస్త లోకాలను మోస్తూ, విష్ణుమూర్తిని సేవించే భాగ్యాన్ని పొందాడు.

2. శ్రీ మహావిష్ణు దేవతా వరం (ఆదిశేషుడికి)
 ఆదిశేషుడు విష్ణుమూర్తిని సేవించి, ఒక వరాన్ని కోరుకోగా, తాను జన్మించిన రోజు అయిన శ్రావణ శుద్ధ పంచమి నాడు భూమిపై ఉన్న ప్రజలందరూ నాగులను పూజించాలని కోరుకున్నాడు.
విష్ణువు ఈ కోరికను వరం ఇవ్వగా ఆ రోజును నాగ పంచమిగా జరుపుకోవడం సంప్రదాయంగా మారింది. ఈ రోజున నాగదేవతను పూజించడం వల్ల సర్ప భయం, సర్ప దోషాలు తొలగిపోతాయి

3. శ్రీమహాశివ దేవతా వరం (వాసుకికి)
సర్పరాజులలో ఒకరైన వాసుకి శివుని అనుగ్రహాన్ని పొంది, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన అలంకారంగా మారాడు.
 వాసుకిని శివుడు తన మెడలో నాగాభరణంగా ధరించడం. ఇది వాసుకి పొందిన అత్యున్నతమైన గౌరవం మరియు రక్షణ. వాసుకి శివుడి మెడలో ఉండటం కుండలినీ శక్తి యొక్క ప్రతీకగా యోగశాస్త్రంలో వివరించబడింది.

4. *ఇతర వరాలు*
కామరూప ధారణ అనేకమంది నాగులు (నాగ దేవతలు) కామరూపధారులుగా, అంటే తమకు ఇష్టం వచ్చిన రూపాన్ని (మానవ రూపంతో సహా) ధరించగలిగే శక్తిని దేవతల నుండి పొందారు.

నిధి రక్షకత్వం నాగాలకు భూమి లోపల నిధులను, సంపదలను, మరియు నాగమణి వంటి అపురూపమైన రత్నాలను రక్షించే శక్తిని దేవతలు ప్రసాదించారని పురాణ వచనం

ఈ వరాలన్నీ సర్పాలకు కేవలం శక్తిని మాత్రమే కాకుండా, ధర్మం మరియు లోకకళ్యాణం వంటి ఉన్నతమైన విధులను కూడా నిర్వర్తించే భాగ్యాన్ని కల్పించాయి.

*కొన్ని సర్ప క్షేత్రాలు*
కుక్కే సుబ్రమణ్యం 
ఘాటీ సుబ్రమణ్యం
మోపి దేవీ
తిరునాగేశ్వరం తమిళనాడు
శ్రీకాళహస్తి
మన్నరసాల నాగరాజ దేవాలయం కేరళ
నాసిక్ త్రయంబకేశ్వర 
నాగర్ కోయిల్ నాగరాజ కృష్ణాలయం తమిళనాడు
అనంత పద్మనాభస్వామి ఆలయం




అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు

బుధవారం, అక్టోబర్ 22, 2025

కార్తీకపురాణం 1 అధ్యాయం

కార్తీక పురాణం ప్రారంభం
*🌴. కార్తీకపురాణం 1 అధ్యాయం 🌴*
*🌻. కార్తీక మాసం విశేషం🌻*


ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూతమహర్షితో ఇలా కోరారు… ”ఓ మహాత్మా… మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీకపురాణ ఫలితాలను కూడా వివరించండి..” అని కోరారు.

శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు… ”ఓ పునిపుంగవులారా… ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో, పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి” అని చెప్పసాగాడు.

పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా… పార్వతి దేవి పరమశివుడితో ”ప్రాణేశ్వరా… సకల ఐశ్వర్యాలను కలుగజేసి, మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి” అని కోరింది.

అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు ”దేవీ! నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది. అది స్కంధపురాణంలో ఉప పురాణంగా విరాజిల్లుతోంది. దానిని వశిష్ట మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు….” అని ఆ దిశగా చూపించాడు.

మిథిలానగరంలో వశిష్టుడి రాకకు జనకమహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు. ఆపై కాళ్లు కడిగి, ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ”ఓ మహామునివర్యా… మీ రాకవల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాము. మీ పాద ధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి?” అని కోరగా…. వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు ”జనక మహారాజ! నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావాల్సిన ధన, సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను” అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు.

దీనికి జనకుడు ”మునిపుంగవా… అలాగే ఇస్తాను. స్వీకరించండి. కానీ, ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది. మీలాంటి దైవజ్ఞులైనవారిని అడిగి సంశంయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా?” అని ప్రార్థించారు.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ”రాజ! తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది. సకల పాపాలను హరించేది. ఈ కార్తీకమాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇదీ… అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతేకాదు.. ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు….” అని చెప్పసాగాడు.

🌻. కార్తీక వ్రతవిధానం 🌻

”ఓ జనక మహారాజా! ఎవరైనా, ఏ వయసువారైనా పేద-ధనిక, తరతమ తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా…. వేకువ జామున లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మాలు, దేవతాపూజలు చేసినట్లయితే… దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ… విష్ణుసహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ‘ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీయక నన్ను కాపాడు’ అని ధ్యానించి ప్రారంభించాలి” అని వివరించారు.

వ్రతవిధానం గురించి చెబుతూ… ”ఓ రాజా! ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నదికిపోయి, స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారయణ, పరమేశ్వరులకు, బైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి, సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి, పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, యుమన తదితర నదుల్లో ఏ ఒక్కనదిలోనైనా స్నానం చేసినట్లయితే… గొప్ప ఫలితం లభిస్తుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని, శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి, నిత్యధూప, దీప, నైవేద్యాలతో భగవంతుని పూజచేయాలి.

గంధము తీసి, భగవంతునికి సమర్పించి, తానూ బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత అతిథిని పూజించి, వారికి ప్రసాదం పెట్టి, తన ఇంటివద్దగానీ, దేవాలయంలోగానీ, రావిచెట్టు మొదటగానీ కూర్చొని కార్తీకపురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి, విశాలయంలోగానీ, విష్ణు ఆలయంలోగానీ, తులసికోట వద్దగానీ, దీపారాధన చేసి, శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి, స్వామికి నివేదించాలి. అందరికీ పంచి, తానూ భుజించాలి. తర్వాతిరోజు మృష్టాన్నంతో భూతతృప్తిచేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గతజన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసినవారికి నమస్కరించినా… వారికి కూడా సమాన ఫలితం వస్తుంది.

ఇది స్కాంద పురాణంలోని వశిష్టమహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటిరోజు పారాయణం సమాప్తం.


కార్తీక పురాణ అధ్యాయములు


 సంక్షిప్తముగా అవగాహన కొరకు

1 వ అధ్యాయము : కార్తీకమాహత్మ్యము గురించి జనకుడు ప్రశ్నించుట, వశిష్టుడు కార్తీక వ్రతవిదానమును తెలుపుట, కార్తీకస్నాన విదానము.

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.

3 వ అధ్యాయము : కార్తీకస్నాన మహిమ, బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.

4 వ అధ్యాయము : దీపారాధన మహిమ, శతృజిత్ కథ.

5 వ అధ్యాయము : వనభోజన మహిమ, కిరాత మూషికములు మోక్షము నొందుట.

6 వ అధ్యాయము : దీపదానవిధి - మహత్యం, లుబ్దవితంతువు స్వర్గమున కేగుట.

7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.

8 వ అధ్యాయము : శ్రీహరి నామస్మరణ ధన్యోపాయం, అజామీళుని కథ.

9 వ అధ్యాయము : విష్ణు పార్షద, యమదూతల వివాదము.

10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.

11 వ అధ్యాయము : మంథరుడు - పురాణమహిమ.

12 వ అధ్యాయము : ద్వాదశీ ప్రశంస, సాలగ్రామ దాన మహిమ.

13 వ అధ్యాయము : కన్యాదానఫలము, సువీరచరిత్రము.

14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమసములో విసర్జింపవలసినవి, కార్తీక మాస శివపూజాకల్పము.

15 వ అధ్యాయము : దీపప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతిలో నరరూపమొందుట.

16 వ అధ్యాయము : స్తంభదీప ప్రశంస, దీపస్తంభము విప్రుడగుట.

17 వ అధ్యాయము : అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము.

18 వ అధ్యాయము : సత్కర్మానుష్ఠానఫల ప్రభావము.

19 వ అధ్యాయము : చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణము.

20 వ అధ్యాయము : పురంజయుడు దురాచారుడగుట.

21 వ అధ్యాయము : పురంజయుడు కార్తీక ప్రభావము నెరంగుట.

22 వ అధ్యాయము : పురంజయుడు కార్తీకపౌర్ణమీ వ్రతము చేయుట.

23 వ అధ్యాయము : శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట.

24 వ అధ్యాయము : అంబరీషుని ద్వాదశీ వ్రతము.

25 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శపించుట.

26 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట.

27 వ అధ్యాయము : దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట.

28 వ అధ్యాయము : విష్ణు (సుదర్శన) చక్ర మహిమ.

29 వ అధ్యాయము : అంబరీషుడు దూర్వాసుని పుజించుట - ద్వాదశీ పారాయణము.

30 వ అధ్యాయము : కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి.
🌹 🌹 🌹 🌹 🌹
కార్తీక పురాణ అధ్యాయములు

మంగళవారం, అక్టోబర్ 21, 2025

శివకేశవుల మాసం - కార్తీకమాసం

విష్ణుదేవుడితో సమానమైన దేవుడు.. 
గంగతో సమానమైన తీర్థం.. 
కార్తీకమాసంతో సమానమైన మాసం.. 
లేదని మహర్షులు చెపుతున్నారు.

కార్తీకమాసం శివకేశవులకు ఇష్టమైంది.
🕉️🏮🕉️🏮🕉️🏮🕉️🏮🕉️

ఈ మాసం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం, మహిమాన్విత మైనది.

శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తీకం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి.

కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి నుండి కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమి వరకు ఎంతో పవిత్రంగా వ్రతాలను చేస్తుంటారు 

కార్తీకమాసంలో వచ్చే పాడ్యమి రోజున బలిపాడ్యమి, విదియ నాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మిక సాధనకు అనువైన పండుగలు అని అంటారు.

కార్తీకమాసంలో చేసే దీప దానం చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది.

కార్తీకమాసంలో దానాలు, జపం, ఉపవాసం, వనభోజనం చాలా శుభప్రదం.

కార్తీకమాసంలోని మొదటి రోజు నుండీ సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది.

కార్తీకమాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి చన్నీళ్ళతోస్నానం చేసిన తరువాత సూర్యాస్తమయం తరువాత సంధ్యాదీపం పెట్టడం, తులసి పూజ, గౌరీపూజ చేయడం ఈ మాసంలోని ప్రత్యేకతలు.

కార్తీకమాసంలో కార్తీక శుద్ధ నవమిని అక్షయ నవమిగా, తరువాత వచ్చే ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని,
కార్తీక శుద్ధ ద్వాదశి రోజును క్షీరాబ్ధిద్వాదశి అని,
కార్తీక శుద్ధ త్రయోదశి రోజున స్వాయంభువ మన్వంతరం ప్రారంభమయిందని అంటారు.

కార్తీక శుద్ధ చతుర్థశిని మహాకార్తి అని కూడా అంటారు. అలాగే కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు.

కార్తీక బహుళ ఏకాదశి రోజున బోధనా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు.

కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా 'కార్తికదామోదర ప్రీత్యర్థం' అని ఆచరించాలని శాస్త్రోక్తి. శరదృతువులో నదీప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది, అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహిత మైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు.

కార్తీకమాసంలో మానసిక శారీరక రుగ్మతులను తొలగించి ఆయుష్షు, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ప్రముఖమైనది,

పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన వ్యాధులు నయమవుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే కార్తీకమాసం సూర్యోదయానికి పూర్వమే విష్ణు సన్నిధిలో విష్ణు కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలం, కీర్తనలకు వాయిద్యం వాయించేవానికి వాహపేయ యజ్ఞఫలం,

నాట్యం చేసేవానికి సర్వతీర్థ స్నానఫలం,

అర్చనా ద్రవ్యాలను సమర్పించి వానికి అన్ని ఫలాలూ, దర్శనాదులు చేసేవారికి ఈ ఫలాలలో ఆరవవంతు ఫలం లభిస్తుంది. 
సూర్యోదయ కాలంలో నిద్ర మేల్కొని విష్ణు, శివాలయాలలో భగవంతుణ్ణి ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వల్ల వేల గోవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.

విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో..

ఇతర దేవాలయాలలో.. లేకపొతే రావిచెట్టు మొదట్లో గాని, తులసీ వనంలో గాని ఉండి భగవత్ స్మరణ చేయాలి. 

ముఖ్యమైన సూచన ఏమిటంటే తడిబట్టలతో దీపారాధన చేయకూడదు. 
అలాగే శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసంలో... స్త్రీలు తులసిచెట్టు ముందు ప్రతిరోజూ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజ చేయాలి.

తులసిలో సర్వతీర్థాలు ఉన్నాయని అంటారు.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్

అని శ్లోకం చదువుతూ భక్తితో తులసికి నమస్కరించాలి. 

కార్తీకమాసంలో కృత్తికలో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి చంద్రని అనుగ్రహం పొందడానికి అభిషేక ప్రియుడు అయిన పరమేశ్వరుని ఆరాధించాలి.

కార్తీకమాస సోమవారాలు:
శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం.

అందులోనూ శివకేశవులకు యిష్టమైన కార్తీకమాసంలోని సోమవారాలు స్నాన, జపాలు ఆచరించేవారు వెయ్యి అశ్వ మేథాల ఫలాన్ని పొందుతారు.

కార్తీకమాస సోమవారాల్లో ఆరు రకాల వ్రత విధి ఉంది.
అవి ...

ఉపవాసం:
శక్తి ఉన్నవారు కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసంతో (అభోజనం) గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తరువాత తులసితీర్థం మాత్రమే సేవించాలి.

ఏకభుక్తం:
ఏకభుక్తం అంటే ఒక్కసారిమాత్రమే భోజనం చేయాలన్నమాట.

ఉదయం స్నానం చేసి దాన, తపం, జపాలు చేసినతరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి,
రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం:
పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.

అయాచితం:
భోజనం కోసం తాము ప్రయత్నించ కుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం

స్నానం :
పైవాటికి వేటికీ శక్తిలేని వాళ్ళు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.

తిలదానం:
మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన పేర్కొనబడిన వాటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని పురాణాల ద్వారా తెలుస్తోంది.

పరమశివుడి కుమారుడైన కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి.
గరళకంఠుడైన పరమశివుడు తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు

అందుకే ఈ నెలలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

కార్తీకమాసంలో పాడ్యమి నుంచి కార్తీక వ్రతం ప్రారంభించాలి.
దామోదరుడైన (పద్మనాభుడైన మహావిష్ణువు)ను ఉద్దేశించి దీన్ని చేయాలి.

ఈ తులామాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంత శయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడు.

నదులు, చెరువులు, బావులు, గుంటలలో స్నానాలు చేసిదేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు చేయాలి. త్రేతాయుగం కార్తీక శుద్ధ నవమి రోజున ప్రారంభం అయినట్లు పంచాంగాల ద్వారా తెలుస్తోంది.

కార్తీకమాసంలో ...
*కృత్తికా నక్షత్రం, గురు గ్రహం, సోమవారం* 
కలిసివస్తే దాన్ని పరమపవిత్రమైన రోజుగా గుర్తించాలి అని వేదం చెబుతుంది.

శ్రీ మహావిష్ణువును నక్షత్ర పురుషుడిగా ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది.

ఈ నక్షత్ర పురుషుని వర్ణన, విశ్వాంతరాళపు నక్షత్రసీమలను పురుషాకారంగా వర్ణించిన తీరుకు రూపకల్పన అనిపిస్తుంది.

నక్షత్ర పురుషునికి...

కృత్తికలు కటి (నడుము) స్థానంగా,
మూలా నక్షత్రం పాదాలుగా,
రోహిణి నక్షత్రం తొడలుగా,
అశ్విని నక్షత్రం మోకాళ్ళుగా ఉన్నాయి.
కాగా.. 
పూర్వాషాఢ నక్షత్రం, పురుషాఢ నక్షత్రం,
ఫల్గునీ నక్షత్రాలు మర్మస్థానాలుగా,
భాద్రపద నక్షత్రాలు భుజాలుగా,
రేవతి నక్షత్రం కుక్షిగా,
అనూరాధ నక్షత్రం వక్షస్థలంగా,
విశాఖ నక్షత్రం ముంజేతులుగా,
హస్త చేతులుగా,
పునర్వసు నక్షత్రం వేళ్ళుగా,
జ్యేష్ఠ కంఠంగా,
పుష్యమి నక్షత్రం ముఖంగా,
భరణి నక్షత్రం శిరస్సుగా మారిపోయాయి.

కార్తీక స్నాన సంకల్పం:
సర్వపాప హారం పుణ్యం స్నానం కార్తిక సంభవం !

నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తు తే !!
అనుకుంటూ ఆచమనం చేసిన తరువాత  

సంకల్పం:
దేశాకాలౌ సంకీర్త్య గంగా వాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌన్దరీ కాశ్యమేధాది సమస్తక్రాటు ఫలా వాప్త్యార్థం, ఇహజన్మని జన్మాంతర రేచ బాల్య యౌవన కౌమార వార్థకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యవస్థాసుజ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వతః ప్రేరణయా సంభావితానాం, సర్వేషాం పాపాన మపనోడ నార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ద్యర్థం, క్షేమ స్థైర్య విజయాయురారోగ్యైశ్వర్యాదీనాం ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం, శ్రీ శివకేశావానుగ్రహ సిద్ద్యర్థం వర్షే వర్షే ప్రయుక్త కార్తికమాసే ... వాసర (వారం పేరు), యుక్తానాం ..... తిథౌ (తిథి) శ్రీమాన్ (గోత్రనామం) గోత్రాభిజాతః --- (పేరు) నామదేయోహం - పవిత్ర కార్తిక ప్రాతఃస్నానం కరిష్యే!

మంత్రం:
తులా రాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ !
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తు తే!!

మంత్రం చదువుతూ ప్రవాహానికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖంగా స్నానం చేసి కుడిచేతి బొటనవేలితో నీళ్ళను తీసుకుని, మూడు దోసిళ్ళ నీళ్ళు తీరం వైపు చల్లి, తీరం చేరుకొని, కట్టుబట్టల కొనలను నీళ్ళు కారిపోయేలా పిండాలి. దీన్నే యక్షతర్పణం అని అంటారు.

ఆలయానికి వెళ్ళి, శివుడు లేదా విష్ణువుకు అర్చన చేసి ఆవునేతితో దీపారాధన చేయాలి.తరువాత స్త్రీలు తులసి మొక్కని..దీపాన్ని,
పురుషులు కాయలు ఉన్న ఉసిరి కొమ్మను..దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణతో దానం చేయాలి.

కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు.

దానిలో ...
ఒకటి క్షీరాబ్ధిద్వాదశి,

రెండవది కార్తీకపౌర్ణమి.

కార్తీక పౌర్ణమి రోజున దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులు పెట్టి దీపాలు పెడతారు, నదులలో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కార్తిక పౌర్ణమి రోజున కృత్తికా శివయోగం అనే పూజా విధానాన్ని కొన్ని ప్రాంతాలలో చేస్తారు.

మరికొన్ని ప్రాంతాలలో శివాలయాల దగ్గర జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడిపంటలను రక్షించమని కోరుకుంటారు.

జ్వాలాతోరణం అంటే కార్తికపౌర్ణమి రోజున గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని మూడు సార్లు ఆ మంటకిందుగా తిప్పుతారు.

జ్వాలాతోరణం నిర్వహించడానికి కారణం ఈ విధంగా చెబుతారు.
దేవతలు రాక్షసులు సముద్రమథన చేసిన సమయంలో హాలాహలం వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ప్రార్థించి మింగవలసిందిగా ప్రార్థించిన సందర్భంలో ప్రజారక్షణ చేసినందుకు సంకేతంగా జ్వాలాతోరణం జరుపుతారట.

ఉదయం పూట శ్రీహరి పూజ, సంధ్య వేళ శివారాధన, దీపాల అలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తున్నది.

దీపదాన మంత్రం:
సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వసంప చ్చుభావహం !
దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ !!

జ్ఞానం, సంపదలు, శుభాలనూ కలిగించేదైన, దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరం శాంతి సుఖాలు ఏర్పడుగాక' అని చెపుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి..

ఓం నమః శివాయ...
ఓం కార్తీక దామోదరాయ నమః..!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
లోకా సమస్తా సుఖినోభవంతు..!!

🕉️🏮🕉️🏮🕉️🏮🕉️🏮🕉️

మంగళవారం, జులై 29, 2025

నాగపంచమి (గరుడ పంచమి)

🌿🌼రేపు 29జులై 2025 మంగళవారం గరుడ పంచమి / నాగ పంచమి🌼🌿గరుడ పంచమి లేదా నాగ పంచమి ప్రాముఖ్యత 🌼🌿


🌿🌼ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి లేదా గరుడ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. ''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది🌼🌿

 

🌿🌼శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు🌼🌿


🌿🌼అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి🌼🌿


🌿🌼ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి🌼🌿


🌿🌼నాగ పంచమి వ్రత కథ🌼🌿


🌿🌼పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి. ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది🌼🌿


ఓం నమో భగవతే నాగరాజాయ

        సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది. వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు, తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారంభిస్తాయి.

అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు, విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి. పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి. ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింపబడినవి. ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత తగ్గును.

        అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.

సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.

సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.

అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ

” తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో”

యజుర్వేద మంత్రం.

” ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను, యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll

భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు

మరలా మరలా నమస్కారము.

” ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l

సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll

శుభంభవతు

శ్రావణ మాసే పంచమ్యాం శుక్ల పక్షేతు పార్వతి

ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః

పూజయే ద్విధివ ద్వీరలాజైః పంచామృతైః స్సహ

విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ”

       ఓ పార్వతీ దేవి… శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదే. వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2025

ఫాల్గుణం_ప్రఖ్యాతం

*🌺🌾సూర్యతేజస్సుతో ప్రభావితమైన ప్రకృతిలో కాలాలు. ఋతువులు, మాసాలు, తిథులు, అహోరాత్రములు మొదలగునవి ఏర్పడుతున్నాయి*. 

*🌺🌾ప్రకృతిలో ఆకురాలే కాలం. నిర్మలాకాశంలో చక్కటి శీతల పవనాలు, ఆహ్లాద వాతావరణం ఆరోగ్యపు సిరులు చిగురులు తొడిగే కాలం. వసంతం అంకురించే కాలము పచ్చదనము పరిమళించే కాలం ఆద్యంతమూ ఆనందభరితమైన, లౌకిక ఆధ్యాత్మిక సమ్మళితమైన అనుభూతులను పంచే కాలం అదే ఫాల్గుణ మాస శుభతరుణం*

*🌺🌾షడృతువులలో అఖరిదైన శిశిర ఋతువులలో రెండవది, మాసాలలో చివరిది ఫాల్గుణం. ఈ మాసంలో రవి సాధారణంగా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశిలో ఉన్న సూర్యరశ్ముల ఫలితంగా మానవుల మనస్సు సంకల్ప వికల్పాలపై పరిగెడుతుంది. కామోద్రేకం వలన మానసికానందం తగ్గి మానవుడు ఆవేశానికి లోనవుతాడు. ఆ సమయంలో మనో నిగ్రహం కావలి*. 

*🌺🌾దానిని అభ్యాస వైరాగ్యాలతో సాధించుటకు అనువైన మాసం ఫాల్గుణము. వినీలాకాశంలో శ్వేతవర్ణంతో దండాకారంగా ప్రకాశిస్తున్న రెండు నక్షత్రాలతో కూడిన మండలమే ఫల్గుణీ నక్షత్రం. అందు ప్రధమం పూర్వ పల్గుణీ (పుబ్బ) ద్వితీయం ఉత్తర ఫల్గుణీ (ఉత్తర) పాండవ మధ్యముడు అర్జునుడు ఈ నక్షత్రం నాడు జన్మించుట వలన ఫల్గుణుడయ్యాడు. పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసంను ఫల్గుణ మాసమని పిలుస్తారు*. 

*🌺🌾ఈ మాసవ శిశిర ఋతువుకు వీడ్కొలు చెప్తూ వసంతాగమనానికి ఆహ్వానం పలుకుటకు స్వాగత ద్వారం వంటిది. ఫల+గుణ = ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కావుననే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్య ప్రభావం కలిగినది. అందుకే ప్రాముఖ్యత పొందింది*.

*https://whatsapp.com/channel/0029VaADSeK9mrGUJvH8io1o*

*🌺🌾విష్ణు సహస్రనామాలలో శిశిరఃశర్వరీ కరః నారాయణునకు ఒక నామం కలదు. నారాయణుడు ఈ సమాసంలో గోవిందనామంతో నియామకుడు*. 

*🌺🌾ఈ కారణంచే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు. ఫల్గుణీ నక్షత్రం దేవతా గణం. పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి సూర్యడు "ఆర్యముడు"" అనే పేరుతో దేవతగా ఉంటాడు. ఈయన అధిక తేజస్సు కలవాడు కావున దేవతలందరూ అనుసరించి ఉంటారు. ఫాల్గుణ మాసంలో ఎన్నో వ్రతాలాచరించాలని శాస్త్ర వచనం*.

*🌺🌾ఈ సంవత్సరం మార్చి 1న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది.* 

*🌺🌾ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీ ముహూర్త వేళలో క్రియాశీలమైన సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైన మాసం. ఫాల్గుణం ఆధ్యాత్మికమయం, తపోమయం, ఆరోగ్యమయం. విజ్ఞానమయం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతం ప్రయోవ్రతమంటారు*. 

*🌺🌾ఈ పన్నెండు దినాలు నదీస్నానమాచరించాలి. పాడ్యమినాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని "తిల" చతుర్థి అంటారు*. 

*🌺🌾దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్థీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి. ఈ రోజున పుత్రగణపతి వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది*.

*🌺🌾శుద్ధ పంచమినాడు అనంత పంచమి వ్రతం చేయాలి. ఈనాడు గణేశుని అర్చించి నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా తినాలి. సప్తమి నాడు అర్కసంపుట సప్తమి ఆచరించాలి. ఉషోదయ కాల స్నానానంతరం సూర్యునకు అర్ఘ్యమివ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్. కావున ఆరోగ్యం కొరకు సూర్యుని ప్రార్థించాలి*.

*🌺🌾ఈ మాసంలో లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి*. 

*🌺🌾నవమి నాడు ఆనంద నవమి అని శ్రీలక్ష్మీ నారాయణులను తులసి దళాలతో మందార పుష్పాలతో అర్చించాలి. మీన సంక్రమణం మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చెయ్యాలి. ఉసిరిక చెట్టు క్రింద శ్రీలక్ష్మీ నారాయణులను పూజించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన వ్రతాల వలన వేలకొలది గోదానాలు చేసిన ఫలితా కలుగుతుంది*. 

*🌺🌾శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీనృసింహస్వామిని అర్చిస్తే సర్వ విఘ్నాలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఈ రోజున చేసే గంగానది స్నానం అత్యంత మహిమాన్విత ఫలితాన్నిస్తుంది. శుద్ధ త్రయోదశి రోజున గ్రామక్షేమం కొరకు మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీమహేశ్వర వ్రతమాచరించాలి*. 

*🌺🌾ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, 'హోల' అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయాన్నే ఎండిన పిడకలు రాశిగా పోసి అగ్నిని రగిల్చి దానిలో రాక్షస పీడ పోయేందుకు హోళికా అనే ఒక విధమైన శక్తిని ఆవహింపజేసి "శ్రీహోళికాయైనమః "అని పూజించి మూడుసార్లు అగ్నికి ప్రదక్షిణలు చేస్తూ "వందితాసి సురేంద్రణే బ్రహ్మణా శంకరేణ ఛ అతస్త్వాం పాహినోదేవి భూతే భూతి ప్రధోభవ" అని చదవాలి*.

*🪷🚩హోళి పసుపుకు, పసుపు పరిమళానికి ప్రతీక. నీటిలో కలిపిన ద్రవాన్ని " వసంతం" అని అంటారు*.

*🪷🚩వసంతాలాడుకోవడం వసంతమాసానికి స్వాగతం చెప్పడమే. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలాత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దల నమ్మకం*.

*🪷🚩ఈ పూర్ణిమనాడు మధురైలో శ్రీమీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని ఒక ముత్తెదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం*.

*🪷🚩బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను అర్చించి ఉపవాసముండి నియమ బద్ధంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి*.

*🚩🪷బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమవాస్య అంటారు*. 

*🚩🪷ఈరోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం శ్రేష్ఠం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకం. అందుకే ఫాల్గుణం ప్రఖ్యాతం* 
🪷🌾🪷🌾🪷🌾🪷🌾🪷

ఆదివారం, డిసెంబర్ 29, 2024

తీర్థయాత్రలు

తీర్థయాత్రలకు బయలుదేరుముందు పఠించవలసిన శ్లోకాలు.....
1) యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!

2) ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!

3) తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!! 

4) యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!

5) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!

ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. (యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతినిత్యము ఉదయం ఇంట్లోనుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటినుండి  బయలుదేరినా అంతటా జయం కలుగుతుంది).

మరికొని ధర్మాలు.....

ధర్మమార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్థయాత్రలు చేయవలెనని శాస్త్రం నిర్ధేశించింది.

ఇంటినుండి బయలుదేరునప్పుడు ఇలవేల్పును, కులదేవతలను గ్రామదేవతల అనుమతి తీసుకొని, తల్లిదండ్రుల పెద్దల అనుమతి తీసుకొని బయలుదేరాలి(శ్రీరామచంద్ర స్వామి వారు  అరణ్యవాసానికి బయలుదేరునప్పుడు కూడా అయోధ్యానగరి దేవత అనుమతి తీసుకొనే బయలుదేరి సనాతన ధర్మాచరణ విషయంలో ఆచరించవలసిన ఆదర్శాన్ని మనకు చూపించారు.

తీర్థయాత్రలయందు అసత్య భాషణము, దంబ భాషణము చేయరాదు. బ్రహ్మచర్యవ్రతులై క్షేత్రాలను సేవించాలి.

యాత్రలకు బయలుదేరి వెళ్ళి మరల ఇంటికి తిరిగివచ్చునంతవరకును కూడా తలనీలాలు సమర్పించే విషయంలో తప్ప, అన్యప్రదేశాలలో క్షౌరాది కర్మలు చేసుకొనరాదు.

తీర్థాలయందు సంకల్పం చెప్పుకొని స్నానం  చేయాలి, అవకాశం లేని సమయంలో భగవన్నామాన్ని తలుస్తూ చేయవలెను. 

పుష్కరిణులయందును, నదులయందును, సరోవరాలయందును, సముద్రాలయందును, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానమాచరించడం మహాపరాధం. అంతేకాక వాటియందు మల,మూత్ర,వీర్య విసర్జనం చేయడం చాలా పెద్ద దోషం. 

అంతేకాకుండా చీరలు-జాకెట్లు, పంచెలు-ఉత్తరీయాలు వంటివాటిని నదీదేవతలకు సమర్పించదలుచుకొంటే మానసికంగా నదీమతల్లికి అర్పిస్తూ దగ్గరలోని  ముత్తయిదువులకో, బ్రాహ్మణోత్తములకో, లేక అభాగ్యులకో ఇవ్వడం వలన పుణ్యము మరియు పురుషార్థము సిద్ధిస్తాయి. 

స్త్రీలు జడముడి విడతీసుకొని క్రిందభాగమున ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. జుట్టు విరబూసుకొని నిత్యజీవితంలోనే ఉండరాదు. అటువంటిది పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అసలు ఉండకూడదు. దంపతులు వెళ్ళినప్పుడు ఇరువురు కూడా ఉత్తరీయ్యానికి చీరకు కలిపి ముడివేసుకొని సంకల్ప స్నానం చేయాలి. స్త్రీలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి. 

వీలయినంతవరకు అల్ప భాషణము చేస్తూ, మనస్సునందు ఎల్లప్పుడు భగవన్నామము జపిస్తూ ఉండాలి. 

తీర్థస్థాలాలలోను, క్షేత్రాలలోను మనం ఆచరించిన జప, తప, స్నాన, హోమ, అనుష్ఠాన, ధర్మాచరణ, దానాదుల పుణ్యము ఒకటికి వందలరెట్లు, వేలరెట్లు కలుగుతుంది. అదేవిధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే పలితము కలుగుతుంది. కావున జాగరూకులమై వర్తించాలి. 

పుణ్య తీర్థాలయందు  గతించిన తల్లిదండ్రులకు పెద్దలకు పిండప్రధాన, తర్పణాదులు తప్పకుండా చేయవలెను. వారి ఆశీస్సులే మనకు మన కుటుంబాలకీ శ్రీరామరక్ష.
*ఇలాంటి మరిన్ని దైవీక విషయాలు  తెలుసుకోవాలంటే మా గ్రూప్ లో జాయిన్ అవండి.* link 👇👇

ఆదివారం, జూన్ 04, 2023

రామాయణ జయ మంత్రం


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |

అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||

ఆదివారం, సెప్టెంబర్ 04, 2022

రాధాష్టమి సందర్భంగా

శ్రీ కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి (04వ తేది ఆదివారం) రాధాష్టమి పర్వదినం. 

ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. చాలామందికి తెలియని విషయమేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే.


ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.


శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదినం సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.

గురువారం, సెప్టెంబర్ 01, 2022

ఋషిపంచమి



సప్తఋషి ధ్యాన శ్లోకములు  

   కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః ఓం అదితి సహిత కశ్యపాయ నమః        

అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్ ఓం అనసూయా సహిత అత్రయే నమః        

భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః 

విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్    ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః        

గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః     ఓం అహల్యా సహిత గౌతమాయనమః        

జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్|  దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
       
వసిష్ఠ ఋషి: శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్|
బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా   
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః

@telugujyotishanilayam
  సప్తఋషిభ్యో నమః🙏

#ఋషిపంచమి

శుక్రవారం, జులై 22, 2022

ఆడి కృత్తిక

23 వ తేదీన ఆడి కృత్తిక
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు  ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు , పార్వతీ దేవి , వినాయకుడు , సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు గానీ , శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం ముందు గానీ వెలిగించాలి.

ఆ తరువాత చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు , వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు , తాంబూలం ఇవన్నీ నివేదించి , సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు , సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని , సాయంత్రం వరకూ ఉపవసించి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము , చిమ్మిలి, వడపప్పు , అరటి పండ్లు స్వీకరించాలి.

ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు , జడులు , మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు.  తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు

*అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాము*

తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది , కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది , అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. 

పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ , ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 

వీలైతే ఈ రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి , ఎర్రటి పంచ , పైపంచ , శక్తిమేరకు దక్షిణ , తాంబూలం , అరటి పండ్లు , గొడుగు , పాదరక్షలు , రాగి చెంబు ( లేదా పంచపాత్ర ఉద్దరిణ , అర్ఘ్య పాత్ర ) సమర్పించి , తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము.

ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే.

ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది , దీనికి ఒక నిదర్శనం కూడా చెబుతాను చూడండి. 

మా పిన్ని ఇది వరకు తమిళనాడు లోని తిరుప్పూరులో ఉండేవారు , ఒక ఆడి కృత్తిక రోజున ఎవరికైన మధ్యాహ్నం భోజనం పెట్టాలి అనుకుంది , కానీ రెండు రోజుల ముందు నుండీ తీవ్ర జ్వరం కారణంగా ఆడి కృత్తిక రోజున కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేక ఎంతో బాధపడుతూ సుబ్రహ్మణ్యుని తలచుకుని దుఃఖిస్తుండగా ఉన్నట్లుంది ఒక నెమలి వచ్చి వాళ్ళ బాల్కనీలో వాలింది. మా పిన్ని సుబ్రహ్మణ్యుడే నెమలి రూపంలో వచ్చాడని ఎంతో సంతోషించింది. నిదానంగా లేచి తన తెచ్చుకున్న బ్రెడ్ నే ఆ నెమలికి పెట్టింది , ఆ నెమలి ఆ బ్రెడ్ తినింది , అప్పుడు మా పిన్ని సుబ్రహ్మణ్యుని స్తోత్రం చదువుతుంటే ఆ నెమలి అలానే కాసేపు బాల్కనీలో కుర్చుని , ఆ స్తోత్ర పారాయణ అయ్యాక కదిలింది. ఇది ప్రత్యాన్యామ పధ్ధతి అయినా భక్తికి భగవంతుడు వశుడే అని చెప్పటానికే ఈ లీల చెప్పాను.

కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ రోజు ఆరాధించండి. 

మరో ముఖ్య విషయం , కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి , ఇది మా అత్తగారి ఇంట్లో లేదు కనుక చేయవచ్చా ? ఒకసారి చేసి మధ్యలో ఆపేస్తే ఆ దేవీ , దేవతలకు ఆగ్రహం వస్తుందా ? ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవలసినది ఒక్కటే , ఏ పూజయైన , వ్రతమైనా అందరూ ఆచరించాలనే మన మహర్షులు వాటిని మనకు అందించారు , ఇది వరకు తరాలలో ఎవరైనా ఏదైనా ఆటంకం వలనో , నాస్తికత్వం వలనో పాటించకపోయి ఉండచ్చేమో , మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టడం వలన మంచే జరుగుతుంది.

 *ఓం శరవణభవ ఓం శరవణభవ*

శనివారం, జులై 09, 2022

తొలి ఏకాదశి

తెలుసుకోండీ... 
తెలియజేయండీ....
రేపు
తొలి ఏకాదశి...
శయన ఏకాదశి
గోపద్మ వ్రతారంభం...
చతుర్మాస వ్రతారంభం
వ్రత విశేషం... 
ఎలా, ఏం చేయాలి?


ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, పెద్ద ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. 

 
ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
 
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే  సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
 
వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు 1.దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. 2. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్యమాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 5. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 6. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 7.అన్నదానం చేయడం చాలా మంచిది.

ఏకాదశి వ్రతమాచరించేవారు తినగూడనివి
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
 
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.
 
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
 
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

 తొలి ఏకాదశి రోజున హరిని పూజిస్తే

ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు.

బుధవారం, ఏప్రిల్ 13, 2022

ప్రాణహిత నదీ - పుష్కరాలు

🙏ప్రాణహిత నదీ -  పుష్కరాలు 🙏

బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయని పంచాంగం ప్రకారం మనకు, పెద్దలు చెబుతారు...
ఈ ప్రకారముగ ఈరోజు 13 నుండి 24 వరకు 12 రోజులపాటు ప్రాణహితకు పుష్కరాలు జరగనున్నాయి...

    పుష్కరం అంటే

జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది....
జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.
అలాంటి జలాన్నిదేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.
అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది...
అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది...
శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే...
నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం, 

తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం...

బ్రహ్మ నుండి ఆకాశం,

ఆకాశం నుండి వాయువు,

వాయువు నుండి జలం,

జలంనుండి భూమి,

భూమి నుండి ఔషధులు,

ఔషధుల నుండి అన్నం ,

అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది,

ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు,

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.

పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

*నది - రాశి :-*

1. గంగానది - మేష రాశి

2. రేవా నది (నర్మద) -వృషభ రాశి

3. సరస్వతీ నది -మిథున రాశి

4. యమునా నది- కర్కాట రాశి

5. గోదావరి -సింహ రాశి

6. కృష్ణా నది -కన్యా రాశి

7. కావేరీ నది -తులా రాశి

8. భీమా నది -వృశ్చిక రాశి

9. పుష్కరవాహిని/రాధ్యసాగ నది -ధనుర్ రాశి

10. తుంగభద్ర నది -మకర రాశి

11. సింధు నది -కుంభ రాశి

12. ప్రాణహిత నది -మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి...

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.

పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది...

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు...

ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి...

పుష్కర జననం

పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటారు...

నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి, మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటె పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు...
ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు...
పన్నెండు సంవత్సరాల కాలం, భారత దేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది...
పుష్కర అనేది భూమి మీది సప్త ద్వీపాలలోనూ ఒకదాని పేరు...
కానీ, సాధారణంగా పుష్కరం/ పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది.
మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది...

బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం.

బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌర విస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం...

గురుగ్రహం, అంటే బృహస్పతి
మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే మరికొన్ని నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి...
పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది...
సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది...
పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు, తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు.

ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు,
తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం ఉంది...

       
🕉🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏🕉

🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀

శుక్రవారం, జనవరి 21, 2022

శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం: జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2014/03/2014-2015.html

  ㅤ   ㅤ    ㅤ   
Like  Cᵒᵐᵐᵉⁿᵗ  Sᵃᵛᵉ  Sʰᵃʳᵉ

శుక్రవారం, ఆగస్టు 20, 2021

శ్రావణ వరలక్ష్మీ వ్రతం - పూజా విధానం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా
మహిళలు అందరికీ ముందస్తుగా 

🌿🌺🍀🌼వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు🌼🍀🌺🌿

🌹శ్రావణ వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం🌹

🙏 పాటించాల్సిన నియమాలు🙏

భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. 
ఈ వ్రతాన్నిఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, 
మడులు కొంచెం ఆచరించి... 
నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు 
వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. 
ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. 

స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

శ్రీవరలక్ష్మి పూజకు ఉపయోగించే సామగ్రి

పసుపు, కుంకుమ,గంధం, విడిపూలు,పూలమాలలు,
తమలపాకులు, 30వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం,

చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,కలశం,కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం.

‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.

వ్రత విధానము
వరలక్ష్మీ వ్రతన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.

తోరం తయారు చేసుకోవడం:

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

ముందుగా గణపతి పూజ: విధానము

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ చేయు విధానము
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ: పువ్వులు లేదా అక్షతలతో 
కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరంపూజ
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.

అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది.

శ్రీ వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.

మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.

                            

గురువారం, ఫిబ్రవరి 18, 2021

రథసప్తమి - 2021

రథసప్తమి నిర్ణయః 
{ధర్మసింధు} 
నిర్ణయ సింధౌః -
మాఘశుక్ల సప్తమీ 
రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ  గ్రాహ్యా!

సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్

అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|
ప్రయాగే యది లభ్యేత
కోటిసూర్య గ్రహైః సమా|| 
ఇతి వచనాచ్చ యత్తు
దివో దాసీయే 
  అచలా సప్తమీ దుర్గా
శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా 
ప్రాగ్యుతా సదా||
   ఇతి షష్ఠీయుతత్వముక్తం!
 
 తత్ యదా,
పూర్వేహ్ని 
ఘటికాద్వయం షష్ఠీ,
సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||

ఇత్యాది వచనముల చేత
 *షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము* అన్న వచనము 
సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి 
సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు  సమాప్తమైనప్పుడు
 మాత్రమే
షష్ఠీ యుత సప్తమి ని గ్రహించవలెను!.... 

 అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే
 రథసప్తమి పర్వము ఆచరించవలెను
  కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున
శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున
 19/02/ 2021 శుక్రవారమే రథసప్తమి

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవచనం.

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. 
ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. 
పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది. 

 శ్రీ శంకరాచార్యులవారిని రెండు సార్లు మృత్యువు నుంచి కాపాడారు స్వామివారు. ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి.
@SadhanaAradhana

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...