నమఃశివాయ
ఓంకార రహితమైన ‘నమఃశివాయ’ అనేది ‘పంచాక్షరీ’ మంత్రమనీ, ఓంకార సహితమైన ‘ఓంనమఃశివాయ’ అనేది “షడక్షరీ” మంత్రమని చెప్పబడింది.
“ఓం నమః శివాయ” షడక్షరీమహామంత్రంలోని ‘ఓం’ – పరబ్రహ్మస్వరూపాన్ని, ‘న’ ౦ పృథ్విని, బ్రహ్మను, ‘మ’ – జలాన్ని, విష్ణువును, ‘శి’ – తేజస్సును, మహేశ్వరుని, ‘వా’ – వాయువును, జీవుని (ఆత్మ) , ‘య’ – ఆకాశాన్ని, పరమాత్మను….ఈవిధంగా షడక్షరీమంత్రంలోని మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.
ఇక, ‘నమఃశివాయ’ అనే పంచాక్షరీమంత్రంలో, ‘నమః’ అను పదానికి జీవాత్మ అనీ, ‘శివా’ అనే పదానికి పరమాత్మ అనీ, ‘ఆయ’ అను పదానికి ఐక్యం అని అర్ధమవడం వలన జీవాత్మ పరమాత్మలో ఐక్యం చెందటం అని అర్ధం. ఈ విధంగా పంచాక్షరీమహామంత్రం బ్రహ్మస్వరూపాన్ని తెలుపుతోంది.
సంసారబద్ధులైన జీవులకు, వారి క్షేమాన్ని కోరిన సాక్షాత్తూ శంకరుడే స్వయంగా ఈ మంత్రాలను అనుగ్రహించారు.