దశమి విశిష్ఠత
|
||||||
విజయదశమి:
శ్లో|| సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్ర్యంబకేదేవి నారాయణి నమోస్తుతే
అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి
సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి,
పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క
శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.
ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు
పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా
పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో
అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు
చెబుతున్నారు.
ఎర్రటి బట్టలు ధరించి.. పూజకు రాజరాజేశ్వరి,
దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు,
కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు,
దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి.
ఆరు గంటలకు పూజను ప్రారంభించి.. రాజరాజేశ్వరి
అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే... "శ్రీ
మాత్రే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు
సమర్పించుకోవాలి.
ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము,
తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు
చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి.
ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి.. "రామలీల ఉత్సవాలు".
పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి
వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో
ఊరేగింపుగా తీసుకుని వెళ్లి, రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణసంచాలతో ఆ
బొమ్మలను తగులబెడతారు.
శమీపూజ :
సాయంత్రం క్రొత్త బట్టలు కట్టుకుంటారు. గుడికి
వెళతారు. . విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం
(జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం
స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు.
శ్లో// శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||
అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ.. పై
శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును వ్రాసుకున్న చీటీలను అందరూ జమ్మిచెట్టు
కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం ద్వారా అమ్మవారి కృపతో పాటు, శనిదోష
నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. జమ్మి ఆకులను కోసికొని ఇంటికి తిరిగి
వస్తారు. కొంతమంది జమ్మి చెట్టు మొదలు లో వుండే మట్టిని తీసుకుని ఇంటికి
వస్తారు.
పురాణలలో విజయదశిమి:
అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు.
అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును
పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున
ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయము సాధించారు.
ఇకపోతే.. శ్రీరామచంద్రుడు విజయదశమి,
విజయకాలమందు ఈ శమీపూజను గావించి లంకపై జైత్రయాత్ర ఆరంభించడం వల్ల ఆ
శమీవృక్షము, "రామస్య ప్రియదర్శిని" అయ్యింది.
అందుచేత అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా,
సర్వదుఖాల నుంచి ఉపశమనం పొందాలన్నా, దారిద్ర్యం తొలగి ఆయురారోగ్య
ఐశ్వర్యములతో జీవించాలన్నా నవరాత్రుల్లో ఆ దేవదేవిని పూజించడంతో పాటు
శమీపూజ, శ్రీలలితా సహస్రనామ పారాయణలు చేయాలని పురోహితులు అంటున్నారు.
మన రాష్ట్రంలో అమ్మవారికి పూజలు:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ, బాసరలో
సరస్వతీదేవి, ఇంకా అమ్మవారి శక్తి పీఠాలలో విజయదశమి నాడు వైదిక మంత్రాలతో
మహాభిషేకము, సుందరమైన అలంకారము, సాయంకాలము పల్లకీ సేవ, శమీపూజ జరుగుతాయి. ఈ
ఉత్సవాలలో భక్తులు, ఉపాసకులు తమ తమ అభిష్టానుసారం పూజలు చేసుకొంటారు. ఇంకా
ధార్మిక చర్చలు, ఉపన్యాసములు, హరికధలు, పురాణ పఠనం నిర్వహిస్తారు.
యాత్రికులకు నిరతాన్నదానం సమర్పిస్తారు.
కనకదుర్గమ్మకి కృష్ణానదిలో హంస పడవలో మీద
మల్లేశ్వరస్వామివారి ఆలయం నుండి తెప్పోత్సవం విశేషంగా జరుగుతుంది.
దసరాలలో అమ్మవారిని ఒక్కరోజైనా దర్శనం చేసుకోవడం మహద్భాగ్యంగా భక్తులు
భావిస్తారు.
శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీరాజరాజేశ్వరీదేవి. సకల భువన బ్రహ్మాండములకు ఈమె ఆరాధ్యదేవత.
మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురత్రయంలో
పూజలు అందుకుంటుంది. ఈమెనే "అపరాజితాదేవి"గా కూడా భక్తులు పూజించే ఆచారం
ఉంది. ఈమె స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకం ఈమెకు ఆసనం.
ఇచ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరంగా
అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి. మాయామోహిత మానవ మనోచైతన్యాన్ని
రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. అనంతశక్తి స్వరూపమైన శ్రీచక్రానికి
ఈమె అధిష్టాన దేవత.
"ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం"
అనే మంత్రం జపించాలి. లలితాసహస్రనామం పారాయణం చేసి కుంకుమార్చన చెయ్యాలి.
లడ్డూలు నివేదనం చెయ్యాలి. సువాసినీ పూజ చెయ్యాలి. వీలైనవారు శ్రీ
చక్రార్చన చేస్తే మంచిది.
దేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి ప్రథమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి ద్వితీయోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి తృతీయోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి చతుర్థోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి పన్చమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి షష్ఠోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి సప్తమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి అష్టమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి నవమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి దశమోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి ఏకాదశోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి ద్వాదశోஉధ్యాయఃదేవీ మహాత్మ్యమ్ దుర్గా సప్తశతి త్రయోదశోஉధ్యాయః |
లేబుళ్లు
- 2015-2016
- అయ్యప్ప కదంబం
- అష్టకాలు
- అష్టోత్తర శతనామావళి
- ఆంజనేయ కదంబం
- ఉపనిషత్తులు
- ఋషిపంచమి
- కుబేర కదంబం
- గణపతి కదంబం
- గాయత్రి కదంబం
- జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015
- తంత్ర గ్రంధాలు
- తులసీ కదంబం
- తొలి ఏకాదశి
- దక్షిణామూర్తి కదంబం
- దుర్గా కదంబం
- దేవి కదంబం
- దేవీ నవరాత్రులు
- నవగ్రహా కదంబం
- నవరాత్రి పూజ విధానం
- నోములు
- పండగలు
- పరాక్రి వ్యాసాలు
- పుష్కరాలు
- పూజ విధానం
- మంత్రం
- మన్మథ నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు
- మృత్యుంజయ మంత్రం
- యంత్రం
- రథసప్తమి
- రాధాష్టమి
- రామ కదంబం
- లక్ష్మీ దేవి కదంబం
- లలితా కదంబం
- వరలక్ష్మీ
- విష్ణుమూర్తి కదంబం
- వేద-మంత్రాలు
- వ్రతములు
- శరన్నవరాత్రి ఉత్సవములు
- శివ కదంబము
- శ్రీ వేంకటేశ్వర స్వామి కదంబం
- శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు
- శ్రీకృష్ణ కదంబం
- సరస్వతి కదంబం
- సాంఖ్యాక యంత్రములు
- సుబ్రమణ్యస్వామి కదంబం
- Advertisements
- audio mantras
- Free Telugu Astrology App
- mantaram
- Radhaashtami
- telugu astrology
- telugu rasi phalalu 2014-15
- Vedio Mantra
ఆదివారం, అక్టోబర్ 13, 2013
శ్రీ దేవీ నవరాత్రులు - 9.రాజరాజేశ్వరి
లేబుళ్లు:
దేవి కదంబం,
దేవీ నవరాత్రులు
Pantula Venkata Radhakrishna
Parakrijaya
Cell : 9966455872
Visakhapatnam