హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఆగస్టు 07, 2013

దక్షిణామూర్తి యంత్రం


   
-: మూల  మంత్రం :-
ఓం నమో   భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం  ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా  ||



 శ్రీ దక్షిణామూర్తి  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్నఐశ్వర్య వంతులు , మేథావి , విద్యా వంతుడు , గొప్ప యశస్సు కలవాడు అగును. యంత్ర పూజ వలన సులభముగా ఐశ్వర్య విద్యలను పొందవచ్చును.                      
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.
                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.



-: శ్రీ దక్షిణామూర్తి  గాయత్రి :-
     తత్పురుషాయ విద్మహే విద్యాభాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తిః ప్రచోధయాత్ ||

:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
P.V.RADHAKRISHNA
CELL : +91 9966455872
Email : pantula.parakrijaya@mail.com 
      parakrijaya@gmail.com

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...