హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, ఆగస్టు 28, 2013

కొన్ని మూల మంత్రములు :

గణపతి మంత్రం :
"ఓం గం గణపతయే నమః "
దీపారాధనకు 2 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2- వత్తులు, దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, గణపతి వాహనము ఎలుకను చూస్తూ మొదలు పెట్టాలి . జపం తరువాత మంచి నీరు నైవేద్యం ఇవ్వాలి .

దుర్గా గాయత్రి 
మంత్రం:
" ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః  ప్రచోదయాత్ "
దీపారాధనకు 2 లేదా 4 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2 లేదా 4 లేదా 9- వత్తులు వాడవచ్చు , దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు


మహా లక్ష్మి మంత్రం  :
"ఓం శ్రీం హ్రీం హ్రీం  శ్రీం "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి , జపం తరువాత నీటి నైవేద్యం చాలు .
విష్ణు మూర్తి
మంత్రం:
" ఓం నమో నారాయణాయ "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి లేదా నువ్వుల నెయ్యి , జపం ముందు ఆది శేషుని కి , జపం ప్రారంభించాలి,  తరువాత నీటి నైవేద్యం చాలు .
దుర్గ దేవి
మంత్రం :
"ఓం అం హ్రీం క్రోం శ్రీం సౌహ్ ధుమ్ దుర్గాయై నమః "
దీపారాధనకు 2,4,9 వత్తులు వాడవచ్చు,  ఆవునెయ్యి , ఆముదం వాడవచ్చు దీపరదనలో,  జపానికి ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...