హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, December 18, 2012

శివరాత్రి నోము


               పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు.  అతడెంతటి విద్యాసంపంనుదో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది.  యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాడు.  ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది.  ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు.  నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు.  క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది.  ప్రాణాలు తీసుకోవడా శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు.  క్రమక్రమంగా ఓర్పు నశించింది.  ఇంకా ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు.  నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు.  నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు.  సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు.  విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు  జననీ జనకులు  కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది.  ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది.  ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడువు ఆనాడు కలిగిని మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి.  దారిద్యము తొలగిపోతుంది .    ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.  ఉద్యాపన:  ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి.  ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి.  మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి.  శివునకు అర్చన చెయ్యాలి.  ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...