నమో భగవతే తస్మై విష్ణవే పరమాత్మనే!!
సర్వభూత శరణ్యాయ సర్వ జ్ణ్జాయ నమోనమ:
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే!!
నమ: పంకజ నేత్రాయ జగత్ధాత్రే చ్యుతాయచ
హౄషికేశాయ సర్వాయ నమ: కమలమాలినే!!
అనంత నాగ ప్రర్యంకే సహస్ర ఫణ శోభితే
దీప్యమానే మలే దివ్యే సహస్రార్కసమప్రభే!!
యోగ నిద్రాముపేతాయ తస్మై భగవతే నమ:
యద్రూపం నచ పశ్యంతి సూరయో నచ యోనిన:!!
సందర్భము:
వేంకటాద్రిపై అవతరించిన శ్రీమన్నారాయణుని బ్రహ్మరుద్రులి స్తుతించిన పిమ్మట మహర్షులు ఇట్లు స్తుతించినారు.
శ్రీకృష్ణా! శ్రీహరీ! నమస్కారము. పరబ్రహ్మ స్వరూపా!
షడ్గుణపూర్ణుడా! పరమాత్మా! విష్ణుదేవా! విశ్వవ్యాపీ! నీకు నమస్కారము. సర్వ
ప్రాణులను రక్షించువాడా! శరణు పొంద దగిన వాడా! సమస్తము తెలిసినవాడా!
వసుదేవుని పుత్రములు గలవాడా! అభీష్టముల నొసంగువాడా! సమస్కారము. పద్మ
పత్రముల వంటి నేత్రములు గలవాడా! జగదాధారా! అచ్యుతా! నాశరహితా! ఇంద్రియములను
నియమించువాడా! విశ్వమంతటా వ్యాపించు వాడా!
పద్మముల మాలలను ధరించిన దేవా! నీకు నమస్కారము.
వేయి పడగలచే ప్రకాశించుచు, స్వచ్చముగా
ప్రకాశించుచు, వేయిమంది సూర్యుల కాంతితో సమానమగు కాంతి గలిగిన శేషపానుపుపై
యోగనిద్రను జెందియున్న జ్ణ్జాన శక్త్యాది కల్యాణ గుణములు గలవానికి
నమస్కారాము.
యోగనిద్రలో నున్న నీ రూపమును పండితులు యోగులు కూడా చూడజాలరు.