హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

శుక్రవారం, సెప్టెంబర్ 28, 2012

శ్రీ మహా సరస్వతీ యంత్రం

శ్రీ  మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం
:మరిన్నివివరములకుసంప్రదింపుడు:
E mail : pantula.parakrijaya@mail.com 
        parakrijaya@gmail.com

 మేరు తంత్ర న్యాయాను సారమైన ఈ యంత్రం  సప్త మాతృక విచలితం మేథా శక్తికి బుద్ధి కుశలతకు పరీక్ష జయమునకు సమస్త కొరికలు నెరవేరుటకు ఇది ఉపయుక్తము.

       మేరుతంత్ర గ్రంధమును అనుసరించి ఏడు విధములైన సరస్వతీ యంత్రములు గలవు. అవి 

౧. చింతమణి సరస్వతి              
౨.జ్ఞాన సరస్వతి 
౩. నీల  సరస్వతి 
౪. ఘట  సరస్వతి 
౫. కిణి  సరస్వతి
౬. అంతరిక్ష  సరస్వతి 
౭.మహా  సరస్వతి ,  అను రూపములను పొంది ఉన్నది. మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
-: మూల  మంత్రం :-
ఓం హ్రీం హ్ర్సైం హ్రీం ఓం ఐం ధీం క్లీం సౌః సరస్వత్య్తే  స్వాహా || 
 శ్రీ మహ సరస్వతీ యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న  మేథా శక్తి బుద్ధి కుశలత , పరీక్షలయందు విజయము , ఈ యంత్ర ప్రయోజనములు.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          


























                             -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-
      వాగ్దేవ్యైచ  విద్మహే  బ్రహ్మపత్న్యై చ  ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//




linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...