హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Tuesday, May 15, 2012

మహా మృత్యుంజయ యంత్రం


మహా మృత్యుంజయ యంత్రం

                                                                  
-: మూల  మంత్రం :-
ఓం హౌం  ఓం  జూం సః భూర్భవస్సువః త్య్రంబకం యజామహే సుగంధిమ్ పుష్టివర్ధనం | ఉర్వరుక మిత బంధనా న్మృత్యోర్ముక్షీ యమామృతాత్  భూర్భవస్సువరోం జూం సః హౌం  ఓం ||
                                                                      


 శ్రీ మహా మృత్యుంజయ  యంత్రంను అర్చించు వారు  యంత్రమును  రాగి రేకు పై కాని కాగితముపై  కాని  వ్రాసి పటము కట్టించి  యథా  శక్తి  గా  ఉదయాస్తమయములందు  షోడశోపచార పూజలు  చేయుచున్న   అప మృత్యువును జయించి దీర్ఘఆయుర్దాయమును కలవారు అగుదురు. రోజుకు వంద సార్లు మూల మంత్రమును జపించిన చో సమస్త వ్యాధులు కష్టములు శని గ్రహా దోషములు కూడా నశించును.
                           
                               శ్రద్ధా వంతులు ప్రతి నిత్యము ఆచమ్య , ప్రాణామాయ , గోత్ర దేశ  కాల మాన సంకీర్తణాధికముగా     త్రి న్యాస పూర్వకముగా  , పంచ పూజలొనర్చిన విశేష ఫలము కలుగును.మూల మంత్ర జపముతో పాటు క్రింది తత్  గాయిత్రి ని కూడ జపదశాంశము గావించిన మహోత్కృష్ట  ఫలితములు తప్పక కలుగును.

                  ధ్యానము , మూల మంత్రము , ఏ తత్ గాయిత్రి ఈ మూడింటిని అనునిత్యము అనుసరించు  సాధకుడు పొందలేని ఫలితమే లేదు. అనగా తలచినంతనే సాధకుని కృషి యత్నములనుసరించి  మంత్ర యంత్రములు పని సాధన లందు  అనంత ఫల సాధకము లగును.

          


                        -: శ్రీ మృత్యుంజయ గాయత్రి :-
    తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
  

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...