హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

నోములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నోములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, డిసెంబర్ 19, 2012

గణేశుని నోము


           పూర్వం ఒకానొక ఊరిలో ఒక పుణ్యవతి గత జన్మలో గణేశు నోము నోచి వ్రతమును నియమాను సారము సమాప్తి చేయక వుల్లంఘించింది.    అందుచేత ఆమెకు ఈ జన్మలో దు:ఖము సంభవించినది.  అనుదినం కడుపారా తిన్నా ఎంతటి వేడుకలో పాల్గొన్నా ఆమెకు ఏమి తోచేదికాడు.  స్థిమితం కలిగేది కాదు.  దు:ఖం మున్చుకొస్తుండేది.    ఒక్కత్తే కూర్చుని ఎడుస్తుండేది.  తోటి మగువలందరూ ఆమెను దూషిస్తూ వుండేవారు.  

           కారణం తెలియకుండా దు:ఖిస్తున్న ఆమెను చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెతో నీవు ఒక పామును నీ కొడుకు పడుకున్న పక్కమీద ఉంచు, అది కరాచి నీ కొడుకు చనిపోయినచో నువ్వు ఎడువవలసినది.  నిన్నెవ్వరు నిందించారు అని చెప్పిరి.  వారి ఆదేశానుసారము ఆమె ఒక పామును కొడుకు పక్క వేయగా అది ఆ కొడుకునకు బంగారు మొలత్రాడు అయ్యింది.  
             నా ఏడుపు కారణం దొరకలేదని అడవికి పోయి ఏడవసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏమి జరిగినది అని ప్రశ్నించారు.  మీరు చెప్పిన ప్రకారము చేసినందున ఆ పాము నా బిడ్డ కి బంగారు మొలత్రాడై పోయినది.  అందువల్లనా ఏడుపుకు కారణం దొరకలేదని చెప్పింది.  పార్వతి పరమేశ్వరులు ఆమెకు ఒక తేలును ఇచ్చి దానిని నీ మనుమరాను బొట్టు పెట్టెలో పెట్టు, పెట్టె తెరవగానే  నీ మనుమరాలిని  తేలు  కుట్టి  ఏడ్చినప్పుడు  నువ్వు కూడా  ఆ కారణంగా  ఏడువ  వచ్చు  అన్నారు .  ఆ ప్రకారం  ఆమె ఆ తేలును బొట్టు పెట్టెలో పెట్టింది .  మనుమరాలు  ఆ పెట్టెని  తెరవగానే  ఆ తేలు  బంగారు బొట్టు చుక్కగా  మారిపోయింది .  ఈ పర్యాయం  కూడా  తన  ఏడుపుకు కారణం దొరకలేదని అడవికి వెళ్లి రోదించసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై సంగతి తెలుసుకున్నారు.  పిల్లిని ఇచ్చి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చంపి దాని కారణంగా ఏడువ వచ్చు అని చెప్పినారు.  ఆ ప్రకారం ఆ పిల్లిని ఇంటికి తీసుకుని పోయి చంపి తాను ఎడువడానికి ఇరుగు పొరుగు వారిని పిలిచింది.  తీరా ఆ ఇరుగు పొరుగు వారు ఇంటికి రాగా ఆ పిల్లి కాస్తా బంగారు పిల్లిగా మారి పోయింది. 
              ఇరుగు పొరుగు వారంతా నవ్వుకుని పెల్లిపోగా ఏమి చెయ్యాలో తోచక వున్న ఆమె చెంతకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి నువ్వు నీ గత జన్మలో గణేషుని నోమును ఉల్లంఘించి నందువల్లె నీకీ అకారణ దు:ఖం.  ఇది తోలగాలంటే నువ్వు గణేషుని నోమును నోచుకోవడమే నీకు మార్గం అని చెప్పారు.  ఆమాటలు మదికేక్కిన మగువ గణేషుని నోమును నోచుకున్నది.  దాని ప్రభావం వలన ఆమెకు దు:ఖం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించింది.  
ఉద్యాపన:  కొత్త మూకుడులో అయిదు గిద్దేల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి.  స్వయం పాకంను దక్షిణ తామ్బూలాడులతో శివాలయంలో నంది దగ్గర పెట్టాలి. 

మంగళవారం, డిసెంబర్ 18, 2012

శివరాత్రి నోము


               పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు.  అతడెంతటి విద్యాసంపంనుదో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది.  యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాడు.  ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది.  ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు.  నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు.  క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది.  ప్రాణాలు తీసుకోవడా శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు.  క్రమక్రమంగా ఓర్పు నశించింది.  ఇంకా ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు.  నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు.  నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు.  సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు.  విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు  జననీ జనకులు  కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది.  ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది.  ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడువు ఆనాడు కలిగిని మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి.  దారిద్యము తొలగిపోతుంది .    ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు.  ఉద్యాపన:  ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి.  ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి.  మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి.  శివునకు అర్చన చెయ్యాలి.  ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి. 

సోమవారం, డిసెంబర్ 17, 2012

త్రినాధుని నోము


           పూరకాలములో ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు.  అతనికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు ఆబిడ్డడికి తల్లి వద్ద చాలినన్ని పాలు లేక ఆకలితో అలమటించు చుదేవాడు.  ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డడికి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు.  అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు కుంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరినాడు.  యెంత ధరకైన పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో తిరుగుతున్నాడు.  
         సంత జరిగే ప్రాంతానికి సమీపాన గల గ్రామంలో ఒక సంపన్నుని ఆవు ఇరుగు పొరుగు వారి పొలాలను పాడు చేస్తుండేది.  నిత్యం తగువులు తీర్మానాలతో విసిగిపోయిన అతడు దానిని ఎవరికైనా ఇచ్చి వేయాలని ఎంతో  ప్రయత్నిచినాడు  .    దానిని తీసుకోగాలన్డులకు ఎవ్వరూ ముందుకు రాలేదు.  సంతకు తోలుకు వెళ్తే దీని సంగతి తెలియని వారు ఖరీదు చేస్తారని నిర్ణయించుకొని ఆ సంపన్నుడు దానిని సంతకు తోలుకు వచాడు.  ఏ వెలకైనా అమాలని అతడు, ఏ వెలకైనా కొనాలని విప్రుడు సంతలో తారసపడ్డారు.  వదిలిపోతే చాలని అతడు దొరికితెచాలని యితడు ఉన్నందున ఆ ఆవు బార్హమ్నునకు అమ్మబడినది.  
          దానిని తోలుకుని స్వగ్రామానికి బయలుదేరిని విప్రుడు ఆనంద పారవశ్యంతో ఆదమరచి వుండగా ఆ ఆవు తప్పించుకుని పారి పోయింది.  అది దొరకక విప్రుడు ఒక చెట్టు నీడను కూర్చుని విచారిస్తున్నాడు.  విచారించి విచారించి తిరిగి సంతకు వెళ్లి వేదకాలని దాని యజమాని వైనం తెలుసుకుని అతని ఇంటికి గాని వేల్లిందేమో తీసితెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
            అలా వెళ్తున్న ఆ బ్రాహ్మణునకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఓయీ!నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని ప్రశ్నించారు.  ఆవును వెదుకుటకు వెళ్ళుచున్నాను అని విప్రుడు సమాధానం చెప్పాడు.  నువ్వు సంత దిక్కుగా గ్రామానికి వెళ్ళుతున్నావు గనుక నీవు తిరిగి వచ్చేటప్పుడు గంజాయి, ఆకు, వక్క, నూనె తెచ్చి పెట్టవలసినదిగా మూడు పైసలిచ్చారు.  అలాగేనని అంగీకరించి విప్రుడు సంతలో ఆవు అగుపించక తిరిగివస్తూ తెలేకలగానుగకు వెళ్లి ఒక పైసా నూనే ఇమ్మని చెంగుచాచాడు  ఇతడెవరో అమాయకుడని ఆలోచించి ఆగానుగా యజమాని సోలను తిరగేసి నూనెను అతని చెంగులోనికి కొలిచాడు.  ఆ విప్రుడు కొట్టుదిగేసరికి ఆ తెలికలవాని పాత్రల్లో నూనె అంటా మటుమాయమైయ్యింది.    అతడు లబూదిబూమని మొరపెట్టుకోగా చుట్టూ పక్కల వారంతా చేరి విషయాని తెలుసుకున్నారు.  విప్రుడిని మోసగించిన కారణం వల్ల అలా జరిగిందని గ్రహించారు.  అతడిని వెతుక్కుంటూ వెళ్ళి కిరాణా కొట్టు మీద ఆకు వక్కలు కొనుక్కుంటున్న ఆ విప్రుడిని చూసి అయ్యా! మీకు నూనె కొత్తాయన తక్కువ కొలిచాదట రండి సరిగా కొలిచిస్తాదట అని చెప్పి తీసుకెళ్ళి నూనె ఇప్పించారు.  అతడు తిరిగి వస్తుండగా త్రిమూర్తులు కనబడి అయ్యా నువ్వు మా కొరకై తెచ్చిన వస్తువులతో త్రినాధ పూజా చెయ్యి ణీ కష్టాలు తొలగుతాయి అని ఈ పూజలో నీకేమి ఖర్చు ఉండదని చెప్పి పంపించాడు.  అతడు ఇంటికి వెళ్ళి త్రినాధ పూజను గురించి భార్యకు చెప్పి దంపతులు ఇద్దరుకూడా భక్తి శ్రద్దలతో పూజా చేసారు.  త్రిమూర్తులు పూజా చేయడం వల్ల పోయిన ఆవు దొరికింది.  ఆ ఆవు అల్లరి చిల్లరిగా తిరగడం మాని చక్కగా పాలివ్వసాగింది.  బిడ్డది పాల బెడద తీరింది.  ఆయవారంవల్ల తిది వార నక్షత్రాలు చెప్పడం వల్ల కొద్దో, గొప్పో దానం ముట్టి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగనారంభించాయి.  
             ఈ పూజా చేసిన వారికి సంసార సంభందమైన ఇబ్బందులు తొలగి జీవితం ప్రశాంతంగా సాగుతుంది.

ఆదివారం, డిసెంబర్ 16, 2012

కేదారేశ్వర (కార్తీక) నోము


               పూర్వకాలంలో  ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం వుండేది.  ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు.  వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్ద వాళ్ళయిన కుమార్తేలిద్దరూ అడవికిపోయి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తున్దేవారు.  ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తుండగా పోలిమేరలోని ఒక నీటిలో ఏదో పూజ చేసుకుంటుండడము  చూసి ప్రసాదము తెచ్చుకోవాలని అక్కడకు వెళ్ళారు.  పూజా క్రమం చూసి ముచ్చట పది ఆ అమ్మాయిలూ ఈ పూజగురించి చేసే విదాన్నాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.  ప్రసాదం తీసుకుని ఇంటికి వెడుతున్న వాళ్ళకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది.  ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుబ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఊడలు, పత్రీ ప్రోగుచేసుకుని వచ్చి నువ్వే మాదేవుదవని అక్కడగల ఒక రాతిని ఆ చెట్టు మొదలులో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమల పాకులు ఆకులు చేక్కలనుకో అని మర్రి ఆకులు, పళ్ళు పెట్టారు.  ఇవే బూరేలనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు.  ఇవే తోరాలనుకో అని మర్రి ఊడలు స్వామీ ముందు పెట్టి భక్తి టో పూజ పూర్తి చేసారు అక్కాచెల్లెళ్లు.  ఇంటికి బయలు దేరుతూ వాళ్ళు తమతమ గంపలను నెత్తిన ఎట్టుకోబోగా వాటిల్లోని పుడకలన్ని బంగారపు పుడకలుగా మారి వున్నాయి.  వారు ఆయనత ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లి తండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు.  
               సిరిసంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పునుండి ఒక మహారాజు వచ్చి పెద్దామేను, పడమరనుండి  ఒక మహారాజు వచ్చి చిన్నామేను పరిణయము చేసుకున్నారు.  వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్దా భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకున్తున్దవలసిందని చెప్పారు.  ఆ ప్రకారముగా చేస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు.  కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పించుకున్నాది.  పాత తోరాలను తీసి పెరటిలో కాకరపాదు మీద వేశాడు.  బంగారపుతోరాలు చేయించాడు.  నవగాయ పిండివంటలతో గారెలు, బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు.  గ్రామస్తులంతా అతనిని ఎంతగానో ప్రశంసించారు.  కానీ కేదారేశ్వరిని కరుణ మందగించింది.  ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది.  తినడానికి తిండిలేని దుస్తుతి కలిగింది.  ఏ పని చెయ్యాలన్న జరగక పోగా కష్టాలు కుగుతున్దేవి.  ఆ ఇల్లాలు తమ పెరటిలో విరగ కాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకిచ్చి అంగడికి వెళ్లి చారెడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపించింది.  ఆవి తీసుకు వెళ్లి అతడు షావుకారు అంగడి ముందు నిలుచున్నాడు.  యెంత సేపటికి ఆ షావుకారు చూడలేదు.  తరువాత చూసి ఏమిటి తీసుకోచావని ప్రశ్నించాడు.  అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఈ పూట కింత గంజితాగుటాము అన్నాడు.  అలానా మీకు దారపోయడానికి మాకేం మధ్యన్తరపు సిరికలుగలేదు.  వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు.  కాళ్ళా వెళ్ళా పది బ్రతిమిలాడినా యితడు  వదిలేల లేడు అని దోసెడు బియ్యం పప్పు ఉప్పు ఇప్పించి పంపించాడు.  ఆ పూటకు వాళ్ళు ఆకలు తీర్చుకుని మరునాడు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపింది.  
             వాటిని పట్టుకుని అంగడి వీధికి వెడుతున్న బాలుడిని షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా సెచ్చాలు బియ్యం ఇచ్చాడు.  ఆ షావుకారు ఎందువల్ల అతనికింత దయకలిగిందంటే ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తము కొస్తే వాటిల్లో నుండి బంగారం ముద్దలుగా రాలి పడ్డాయి.  ఇవి ఇంకెవరికి దక్కకూడదని ఆ షావుకారు యెంత ఇవ్వడానికైనా సిద్దపడ్డాడు.  రోజు కుర్రవాడు దగ్గర కాకరకాయలు కొంతుండేవాడు.  కాకరకాయలు అయిపోయాయి.  ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మాని వేశాడు.  
              ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుడిని ప్రయాణము చేసి తూర్పునగల పెద్ద అక్క దగ్గరకు పంపించింది.  కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది.  అతడు అక్క గారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలకు పెల్లనివ్వకపోతే అక్కడే వుండగా తల ఆరబోసుకోవడానికి మెడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలకు తీసుకు వెళ్ళింది.  అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు.  ఒక గుమ్మడికాయను దోలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్లి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపింది.  తిరిగి వస్తూ అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేలమీద పెట్టి చద్ది తింటున్నాడు.  అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాని తన్నుకు పోయింది.  చేసేదేమిలేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట వున్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు. నౌకరు వల్ల  అతని రాకను విని ఆమె బయటకొచ్చి తముడిని లోపలకు తీసుకు వెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నది.  ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది.  ఆ అక్క ఏమి ఇవ్వలేదు.  ఈ అక్కా ఏమి ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలు దేరాడు.  ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కుని కాసిన్ని మంచి నీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు.  అక్క గారు ఆ జోళ్ళను ఎక్కడా విడవ వద్దు అని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు కాని ఆ బురదలో కూరుకుపోయి యెంత వెదికినా జోళ్ళు  దొరకలేదు.  
          ఈ సంగతంతా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు.  అది కార్తీక మాసం ఆమె కార్తీక నోము నోచుకున్తున్నది.  ఆడంబరంగా నోము నోయడంవల్లనే తన పుట్టింటిన దారిద్రము తాన్దవిస్తుందని గ్రహించి తమ్ముడిచేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయనా ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్లి కేదారనోమును నోయండి అని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించింది.  అతడు ఇంటికి వస్తుండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది.  చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి.  వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపించాడు.  క్రమక్రమముగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభావముతో జీవించారు.  
ఉద్యాపన:  ఇది కార్తీక మాసములో సోమవారాల్లో ముఖ్యముగా మూడవ సోమవారము, కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సామ్ప్రదాయమైతే ఆ రోజున చేయాలి.  ఉదయం నుండి ఉపవాసము ఉంది సాయంత్రము పరమేశ్వరుణ్ణి ఫల, పుష్ప పత్రితో పూజించాలి.  పాత తోరాలను కొత్తవాతితోపాటు స్వామీ సన్నిదానాపెట్టాలి  .    స్వామికి బూరెలు నైవేద్యం పెట్టాలి.  ఈ బూరేలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమె తినాలి.  పున్నమి చంద్రుడిని చూచి ఆహారం తీసుకోవాలి.  తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచాలి.  ఈ నోమును కోడళ్ళకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసు కుండటం సాంప్రదాయం.

శుక్రవారం, డిసెంబర్ 14, 2012

దంపతుల తాంబూల నోము


            పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.  
           కాలం గడచి పోతున్నదేకాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయవిధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.  
              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు. 
ఉద్యాపన:  పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు. 

బుధవారం, డిసెంబర్ 12, 2012

తులసినోము


           పూర్వకాలంలో
భారతదేశమున గల విన్ద్యపర్వతాలకు దిగువ కాన్చానపురం అనే దేశం వుండేది.  దానిని ధర్మ శీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.  ఆయనకు లేక లేక ఒక్కగానొక్క కూతురు. ఆమెకు వివాహము జరిగితే నెల తిరక్కునడగానే   వైధవ్యం కలుగుతుందని ఆమె జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులు చెప్పారు.  అందువల్ల ధర్మశీలుడు తన కుమార్తెకు, వివాహం చేసే ప్రయత్నమూ విరమించుకున్నాడు.  ఇలా కొంతకాలం గడుస్తుండగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడైన మహీశ్వర బట్టునకు తండ్రికి తగ్గ తనయుడు అనదగిన కుమారుడున్దేవాడు.  అతడు రాజకుమార్తె అందచందాలు గుణగణాలు విని ఆమెను వివాహం చేసుకోవలెనని నిర్ణయించుకున్నాడు .  
            ఒకానొక శుభ దినమునా బ్రాహ్మణ యువకుడు రాజు దర్శనం చేసుకున్నాడు.  మహారాజు ఆ యువకుడికి తగిన మర్యాదలు చేసి తన దర్శనానికి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించినాడు.  మహారాజా!  మీరు అనుగ్రహిస్తానంటే నాదొక కోరిక సమస్త శాస్త్రాలు చదువుకున్న వాణ్ని విద్యలన్నింటిని ఆరితెరిడిన వాడిని మీరు సరేనంటే మీ కుమార్తెను వివాహము చేసుకోవాలనుకుంటున్నాను.  మీ  అనుమతికై వచ్చాను అన్నాడు.  ఆ మాటలకు మహారాజు ముఖం వెలవెల బోయింది.  విప్రకుమారా!  ఆమెకు వైధవ్యం ఉన్నందువల్లనే తెలిసి తెలిసి ఒక యువకుడిని అర్దాయుష్కుడిని చేసే కన్యాదానానికి వెరచి ఊరుకున్నాను.  నీవు వివాహం చేసుకుంటా నన్నావు  .   నా కుమార్తెకు నీకనా రూప గుణ సంపన్నుడు దొరకడం దుర్లభం కాని నిన్ను అర్దాయుష్కుడిని చేసి బ్రాహ్మణ హత్యా దోషమును పొందలేను నన్ను మన్నించు అన్నాడు.  
          అందుకా బ్రాహ్మణ బాలుడు మహారాజ మీ కాభయం సందేహం అక్కరలేదు.  నేను పూర్నాయుష్కుడిని అని జ్యోతిష్కులు ఎంతోమంది చెప్పియున్నారు.  అయినా ఇందుకు నాకు తెలిసిన మేర ఒక ఉపాయము చెబుతాను.  ఒక నెలరోజులపాటు నన్ను అనుమతిన్తించండి. హిమాలయ పర్వతాలలో ఋషులను దర్శనము చేసుకొని వారి ఆశీర్వాదము పొంది వస్తాను.  ఈ లోగా మీ అమ్మాయి చేత తులసినోము నోచుకునేలా తగిన ఏర్పాట్లు చేయండి.  అక్షయ సౌభాగ్యాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ తులసి స్త్రీల పాలిత కల్పవల్లి అందువల్ల మీ అమ్మాయికి సుమంగళి జీవితమూ లభిస్తుంది.  పూర్వం దేవతలు తమకు కలుగుతున్న అపజయాన నివారణకు శ్రీ తులసిని ఆరాధించారు.  ఆ మాటలకు ఆ రాజు ముగ్ధుడై బ్రాహ్మణ కుమారా నీమాటలు న మదికేక్కాయి.  నా కుమార్తె చేత తులసి వ్రతం చేయిస్తాను నువ్వు ఋషిపుంగవుల  దీవెనలను పొంది సంవత్సరాన్తమునాటికి రావల్స్సిందని చెప్పాడు.  అంతట ఆ బ్రాహ్మణ యువకుడు తుఅలై వ్రత విధి విధానములను వ్రత నియమములను వివరించి వెళ్ళిపోయాడు.   రాకుమార్తె తులసి వ్రతం సమాప్తి కావడంతో బ్రాహ్మణ యువకుడు రాజ్యానికి వచ్చి ఆమెతో వివాహితుడై కాంచన పురాన్ని చిరకాలం పరిపాలించాడు.  
ఉద్యాపన:  కార్తీక మాసం ఈ వ్రతానికి తగిన కాలం.  శ్రీమన్నారాయణుని 
విగ్రహాన్ని తులసి మొక్క వద్ద వుంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పంచామృత స్నానం చేయించి ఆవాహనం చేయాలి.  ముత్తైదువులకు యధోచితంగా పసుపు కుంకుమ గాజులు దానమివ్వాలి.  పుష్ప ఫలాడులతో వారిని సత్కరించాలి.

మంగళవారం, డిసెంబర్ 11, 2012

రథసప్తమి నోము



         పూర్వకాలంలో ఒకానొక మహారాజుకు లేక లేక ఒక కూతురు జన్మించింది.  ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు.  కాని ఆమె పుట్టుక కారణంగా రాజ్యంలో కొన్ని కలతలు ఏర్పడుతున్దేవి.  మహారాజు ఏ పని తలపెట్టినా జరిగేదికాడు.  ఇందుకు విఙులను పిలిచి శాంతి చేయించాలని నిర్ణయించారు.  రాజ్యంలోగల ప్రజ్ఞావంతులు అయిన విప్రులను పిలిపించి అన్ని విషయాలను వివరించాడు.  ఈ దుస్థితి తొలగే మార్గం ఏదైనా చెప్పమని అడిగాడు.  ఆ విప్రోత్తములందరూ ఒకటై ఆలోచించారు.  
           రాజా ఈమె గత జన్మలో వితంతువు అంతకు ముందు జన్మలో రధకారుని భార్య రధకారుడు చేసే ప్రతి పనిని విమర్శించి అతని పనులకు అడ్డుతగులుతుండేది.  అందువల్ల పై జన్మలో విధవరాలైంది.  తన కుటుంబ పోషణ భారం ఆమెదేకావడం వల్ల తప్పనిసరై వ్యభిచారం చేసి సంసారం సాగించింది.  వ్యభిచారం కారణంగా అనేక దుష్కృత్యాల పాలైంది.  ఆమె రథసప్తమి నోమును నోస్తే తమకు ఈ గండాలుండవు.  ఆమెకు  గల గతజన్మ పాతకాన్ని రూపు మాసి పోతాయి అని చెప్పారు.  
         వేద జ్ఞానుల భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన వేత్తలు నాకు నారాజ్యానికి గల సిరిసంపదలు మీరే, కనుక నాయందు నా పుత్రిక యందు పరిపూర్ణ ప్రేమాభిమానాలు కలుగచేసి నన్ను నా రాజ్యాన్ని కాపాదేతందుకు మీరందరూ రథసప్తమి నోమును నాకుమార్తేచేతనో యుంచండి వ్యయభారాలకు వేరవకండి అన్నాడు రాజు.  అందుకు వారందరూ ప్రభువు ఆజ్ఞ ప్రకారము రాజకుమార్తె చేత రథసప్తమి నోమును నోయించారు.  అరిష్టాలను తొలగిపోయాయి.  సుఖ శాంతులతో జీవితాన్ని గడిపారు.   ఉద్యాపన:  సూర్యభగవానుడు మన కర్మలకు సాక్షి ప్రతి రోజు సూర్యోదయ  కాలములో ఆ మహానీయునకు నమస్కరించుకుని మనం మన నిత్య కార్య క్రమాలకు పూజుకోవారి. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...