హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

సోమవారం, మార్చి 07, 2016

శ్రీ శివ (ప్రత్యేక) పూజ

శ్రీ శివ (ప్రత్యేక) పూజ

ఓం శివానుగ్రహ సిద్ధిరస్తు - శుచిర్భూతులై ముందుగా శివలింగం కదపకుండా దానిమీది నిర్మాల్యాలను తొలగించి, అనంతరం పూర్వోక్త పూజా విధానాలలాగే సమంత్రకంగా భూశుద్ధి లాంచన మార్జనాదులాచరించి - దిగువ విధంగా స్మరించుకోవాలి.

స్మరణ మంత్రం
ఓంకారం ప్రణవం వందే | ఓంకారం పరమాత్మకం
ఓంకారం శివరూపంచ | శివజ్ఞాన పరేతరా | (అని స్మరించుకోవాలి)

విభూతీ ధారణ మంత్రం:

లలాటంతు మహాదేవం| నాభిం చైవ మహేశ్వర
హృదయం శంకరం జ్ఞేయం | కంటేచ వృషభ ధ్వజం |
భుజాగ్రే శూలపాణించ | మధ్యే కామంగ నాశనం
కరాగ్రే దేవ దేవేశం | శ్రీ కంటః వామ సద్భుజం ||
తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం | తదగ్రే పార్వతీ ప్రియం
కరౌద్వౌ శివరుద్రం చ | కర్ణౌ చైవ మహేశ్వరం ||
బహి: కంటే పశుపతి: శిరః ప్రీతో సదాశివం
స్మరే దేతాని నామాని | త్రిపుండ్రం ధారయే త్సదా ||
(అనే మంత్రంతో ఆయానామాలతో ఆయాస్థానాలలో వీభూదిని ధరించి ముందుగా గణవదనం చేయాలి.)

గణవందనం మంత్రం

ఓం శ్రీమహాగణాధి పతయే నమః |
శ్రీ నంది భ్రుంగిరిటి వీరక వీరభద్ర చండీశ్వర ప్రమాద ముఖ్య మహాగణేభ్య: |
శ్రీరుద్ర మంత్రం నుత సహస్రకోటి భ్రుతయేన ముహురస్తు నమోమహద్భ్యః
(నమస్కరించుకుని, దీపారాధన చేసి ఆచమనం చేయాలి)

శ్రీ శివ (ప్రత్యేక) పూజ

ఆచమన శివనామాని: పైన వవరించబడినవి. ఆచమనానంతరం ప్రాణాయామం చేసి, సంకల్పం చెప్పుకోవాలి.
సంకల్పః ఓం శ్రీశివ శివ శంభో మహారజ్ఞాయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణ ద్వితీయ పరార్ధే (తదుపరి అంతా మామూలే................. చివరలో మాత్రం) శివపూజాం కరిష్యే.... తదంగ కలశారాధానం కరిష్యే (అనుకుని, కలశాన్ని గంధ పుష్పాక్షతాదులతో అలంకరిస్తూ దిగువ నిచ్చిన మంత్రంతో ఆరాధించాలి).

కలశారాధన మంత్రం

ఈశానః కలశస్యా గ్రే | పూర్వే తత్పురుష స్తథా
అఘోరే దక్షిణం చైవ | సద్యో జాతశ్చ పశ్చిమే ||
ఉత్తరే వామదేవశ్చ | మధ్యే చ పరమం శివం
అధోబాగే పరాశక్తి (:) ర్వి (వి) శ్వద్భావ శశి శేఖరే ||
సద్రూపం కలశాకారం | చిద్రూపం కలశస్థితం
మధ్యస్థ జలమానందం | రూపం సాక్షాత్ శివాత్మకం ||
తత్రాస్తి జలముత్ర్కుష్టం | సర్వతీ ర్దోత్త మోత్తమం
చిదానందం సంసాక్షి శివరూపాయ తత్కృతం ||
(కలశానికి నమస్కరించి, ఒక పువ్వును అందులోని నీటిలో ముంచి తీసి పంచాక్షరీ మంత్ర స్మరణయుక్తంగా శివలింగంమీదా, పూజాద్రవ్యాలమీదా, తమమీదా ప్రోక్షించుకుని ఘంటా విధిని స్మరించాలి)

ఘంటా విధి:

ఆగమార్ధంతు దేవానాం | గమనార్ధంతు రాక్షసం
కుర్యాద్ఘంటారవం తంత్ర | దేవతార్చన లాంచనం ||
(అనుకొని - దిగువ మంత్రంతో, ఘంటారావం చేస్తూ)

ఆవాహన మంత్రం:

హృదయాది మహావాస | కరుణావాస, శాశ్వత |
పూజా పరి గ్రుహాయాద్య | కరః పీటే నివేషయే ||
(అనే మంత్రంతో శివలింగాన్ని తీసి వామ హస్తంలో ఉంచుకొని ' అపోస్మాన్' మంత్రంతో జలసంస్కారం చేసి - ధ్యానించాలి)

ధ్యాన శ్లోకం:

ఆపాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పుర
జ్యోతిస్పాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు కాంతామృతై (:)
ర (అ) స్తో కాప్లుత మేక మీశమనిశం రుద్రానువాకాం జపేత్
ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభి షించే చ్చివం ||

(అని ధ్యానించి)
పాటికాబంధన మంత్రం : నమస్తే రుద్రా మన్యవ ఉతోతయిషవే నమః (అని పాటికా బంధనం చేసి, నమస్శంభవే' అంటూ పంచామృతాలనూ ప్రోక్షించి పూజాస్థానంలో ప్రతిష్టించాలి)

ప్రతిష్టాపనమంత్రం:

నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే |
అథోయే అన్యసత్వాకో అహంతే భ్యోకరం నమః ||
(ప్రతిష్టించాలి - అనంతరం)

ఇత రేతరో పచారాణి

1 . ఏతత్తే రుద్రాయేతి మంత్రే ణ ఆసన సమర్పణం
2 . మనోమహాంతం - ఇతి ఆవాహన సమర్పణం
3 . యా తే రుద్ర శ్శివా తనూ రాఘోరాపాపనాశినీ | తయాన స్తను వాశం తను మయాగిరి శాన్తా భీ చాకశీ: - ఇతి మంత్రేణ ఉపవేశ నోపచారం
4 . యామిషుల గిరి శన్త హస్తే బిభర్హ స్త వే | శివాంగిరి త్రతాం మరుమాహిగ్ ౦సీ: పురుషం జగత్ - ఇతి న్యాస సమర్పణం
5 . అధ్యవో చ దధి వక్తా ప్రథమో వైవ్యో భిషిక్ | ఆహీగ్౦శ్చ సర్వాన్ జంభయాస్థరాశ్చ యాతు ధ్యానః - ఇత్యధి వాస సమర్పణం
6 . అసౌ జీవ - ఇతి మంత్రేణ దేవతాన్యా సం కృత్వా -
7 . అసయోవ సర్పతి నీలగ్రీవో విలోహితః - ఉతైనం గోపా అదృశన్నదృన్ను గాహార్యః విశ్వాభూతాని సద్రుష్టో మృడయాతి: ఇత్యుప సర్పణం
8 . నమోస్తు నీగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే | అధోయే అస్య సత్వానో హంతేభ్యో కరం నమః - ఇట్ పాద్యం దత్వా
9 . రుద్ర గాయత్ర్యేణ (ఓం పచావక్త్రాయ విద్మహే, మహాదేవాయ ధీమాహీ, తన్నో రుద్రః ప్రచోదయాత్) అర్ఘ్యం దత్వా.
10 . త్ర్యంబకం యజామహే | సుగంధిం పుష్టి వర్ధనం | ఊర్వారుక
మివబంధనా | న్మ్రుత్యో ర్ముక్షీయమామృతాత్ || మంత్రేణ ఆచమన సమర్పణం కృత్వా
11 . పయః పృధివ్యా - ఇతి మంత్రేణ క్షీరేణ అభిషించ్య
12 . దధి క్రావుణ్నో అకారిషం జిష్ణోర శ్వ స్య వాజినః సురభిణో ముఖా కర్ర త్ప్రణ ఆయూగ్ ౦ షితారి పత్ - మంత్రేణ దధ్నా ||
13 . ఘ్రుతం ఘ్రుతయాన - ఇతి మంత్రేణ ఘ్రుతేన
14 . మధువాతా ఋతాయతే - ఇతి మంత్రేణ మధ్వేన
15 . స్వాదు: పవస్య విద్యాయ జన్మని - మంత్రేణ శర్కరాస్నానం
(అభిషేకానంతరం తక్షణమే నాగాభరణాన్ని అలంకరించడం ఒక సాంప్రదాయం)
16 . దేవస్యత్వా - ఇతి మంత్రేణ పుష్పేణ మార్జయిత్వా
17 . మానస్తోకేతనయే మావా ఆయుషిమానో గోశామానో అశ్వేషురీరిషః వీరాన్మానో
రుద్ర భూమి ణో వధి: హవిష్మంతో నమసా విధేయతే ఏవం మంత్రేణ వస్త్ర సమర్పణం కృత్వా
18 . నమో ద్రుష్ణ వే - మంత్రేణ ఉత్తరీయం
19 . యాతే హేతీ - రితి మంత్ర చతుష్కేన - కార్పా సవస్త్ర సమర్పణం కృత్వా

పునస్మరణ మంత్రం

భవాయ భవనాశాయ - మాహాదేవాయ ధీమహి
ఉగ్రాయ ఉగ్రనాశాయ - శర్వాయ శశిమౌళినే ||
ఏవం విది శ్రీశివాష్టోత్తర శతనామ పూజానంతరం - ధూప మంత్రః యత్పురుషం వ్యాదధు: తిధావ్యకల్పయన్ - ఇతి ధూప సమర్పణం

దీపం:

శ్లో|| హృదంత ర్వర్తి చిత్ జ్యోతిర్వి దాలంకార కృత్య దీపతః
విధి యా వచితం లింగే సూర్యాచ్చంభో: ప్రపూజనం ||

నైవేద్యం: నివేదించాల్సిన పదార్దాలన్నింటిని చుట్టూ గాయత్రీ మంత్రంతో జలం ప్రోక్షించి - ఆ పదార్ధాల పేర్లు చెప్పి -- నివేదనం సమర్పయామి ' అనుకొని - అయ్యవారికి సమర్పిస్తున్నట్లుగా చూపుతూ -- ' ఓం ప్రాణాయ స్వాహ| ఓం అపానాయ స్వాహా ' అని చెప్పి పూవుతో పదార్ధాలపై నీరు ప్రోక్షిస్తూ -- 'మధ్యే మధ్యే పానీయం సమర్పయామి' అనుకోవాలి. అనంతరం స్వామికి తాంబూలాదులు సమర్పించాలి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాదులను మంత్రపుష్పాన్ని సమర్పించాలి.
పూజానంతర మంత్రం

ఓం హృదయాది మహావాసా - కరుణాకర శాశ్వతా
పూజాంతే పునరావాసే - గచ్చ ప్రభు శుభాశయా ||
(అనే మంత్రంతో లింగాన్ని పూజామందిరంలో భద్రపరచాలి)
శ్లో|| జటాభుజంగ పింగళ స్పుర త్పణా మణిప్రభా
కదంబ కుంకుమద్రవ ప్రలిప్త ది గ్వదూముఖే
మదాంధ సింధుర స్పుర త్వ గుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం భిభ ర్తు భూత భర్త్రరి ||
శివపూజా సమాప్తః

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...