హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

Labels

Follow by Email

Thursday, June 14, 2012

సత్సంతాన లాభమునకు మంత్ర ప్రక్రియలు:-

  సత్సంతాన లాభమునకు కొన్ని మంత్ర ప్రక్రియలు:-

హైందవ ప్రక్రియలలో పుత్రకామేష్టి వంటి యాగ సంస్కారము లెన్నియో ఉన్నవి. ముఖ్యముగా కాకవంధ్యలైనను సంతాన గోపాలకృష్ణ యంత్ర ధారణలు సత్సంతాన లాభము పొందుటకు మంచి మార్గమును సుగమము చేయగలవు, అంతేకాక సంతాన దోష నివారణకై ఒక నాలుగు సులభ మంత్రములను క్రిందనుదహరించు చున్నాను. 

సంతానము కలుగుటకు, సంతాన ప్రతిబంధక దోషనివరణకు, పుత్ర పౌత్రాది వంశాభివృద్ధికి, సత్సంతానముకొరకు, తన వంశము వృద్ధి చెందుటకు, సంతానం మంచి నడవడి కలుగుటకు. 

1. శ్లో// ఓం శ్రీం హ్రీం క్లీం గ్లీం దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే , దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః శ్రీం హ్రీం క్లీం స్వాహా /
ఈ మంత్రమును దంపతులు నలభై రోజులు బ్రహ్మచర్య నిష్టతో లక్ష పర్యాయములు జపించి బాల కృష్ణుని పఠమునకు తామర పువ్వులు కస్తూరి కుంకుమలతో పూజించ వలెను.
 

2. శ్లో// వైకుంఠాదాగతం కృష్ణం రథస్తం కరుణా నిధిమ్
కిరీటి సారధిం పుత్రమానయంతం జగత్పతిం//
రధస్తం పుత్రమాదాయ గురవే వైదికాయచ /
అర్చయంతం సుతార్ధం భావయామ్యహ మచ్యుతం//
శంఖం చక్రం గదాం పద్మం ధారయంతం జగత్పతిం
అంకే శయనాం దేవక్యా స్సుముఖం మందిరే శుభే
యేవం రూపం బాలకృష్ణం భావయా మచ్యుతం సదా
ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము ఇరవై ఏడుమార్లు పఠించిన సంతాన ప్రాప్తి కలుగ గలదు.
 

3.శ్లో // ఓం ఐం వాగ్భవేశ్వరీ విద్మహే , క్లీం కామేశ్వరీ ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్ // ఈ మంత్రమును దృఢ వ్రతులై 1008 మార్లు జపించిన సత్సంతాన వంతులు కాగలరు.
 

4. శ్లో // ఓం హ్రీం సాం శరవణభవ సాం హ్రీం ఓం -- నలభై రోజులు లక్ష జపము పది వేల తామర పూలు లేదా గింజలు ఆవునేతి పాయస హోమం గావించిన వంధ్యా దోషము తొలగి సంతాన వంతులు కాగలరు.
ఇదే కాక తులసీ కవచమును పఠించి పఠన సమయమున పంచపాత్రలో నీళ్ళలో వ్రేలు ముంచి కవచ పారాయణ తదుపరి ఆ నీళ్ళతో మర్మావయవము శుభ్రము చేసు కొనిన పై ఫలితము లన్నియు పొందవచ్చును. 


సంతాన గోపాల కృష్ణ యంత్రమునకై మమ్ము సంప్రదింపుడు. 
 పంతుల వెంకట రాధాకృష్ణ , సెల్ : 9966455872


linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...