హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

బుధవారం, జులై 19, 2017

సంతాన భాగ్యం కోసం గర్భ రక్షాంభిక స్తోత్రం


అపుత్రస్య గతిర్నాస్తిఅనగా పుత్ర సంతానం లేనిదే పితురులకు ఉత్తమ లోకాలు ప్రాప్తించవు అని వేద ప్రవచనం. పున్నామ నరకాత్ త్రాయత ఇతి పుత్రః పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు. వంశమును నిలుపుటుకు, వంశాభివృద్ధికి పుత్ర సంతానం అవసరం.
వివాహ సమయంలో చెప్పబడే మహా సంకల్పంలో దశ పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం పితృణా నరకాదుత్తార్యశాశ్వత బ్రహ్మలోకే నిత్యనివాస సిధ్యర్ధం అనగా పుత్రిక మాతృ, పితృ తరముల వారు తరింపబడుతారు.  షోడశ మహా దానాలలో కన్యాదానం ప్రముఖమైనది అని పెద్దలు చెబుతారు. కావున పితృ దేవతలను తరింపజేయుటకు సంతానం అవసరం. సంతానం వలనే పితృరుణం తీర్చుకోగలరు.  కనుక సంపదలెన్ని ఉన్న సంతానం లేనిదే పరిపూర్ణత సిద్ధించదు. ప్రాచీన కాలంలో జ్యోతిష్య శాస్త్రం ద్వారానే సంతాన సౌఖ్య విషయాన్ని పరిశీలించేవారు. భార్యా భర్తల జాతకాలలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకొని శాంతి ప్రక్రియలు చేసుకుంటూ గర్భరక్షాంభికా స్తోత్రాన్ని పఠించిన వారికి సత్ సంతాన భాగ్యం కలుగుతుంది.
గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.
జాతకచక్రంలో సంతానయోగం పరిశీలించేటప్పుడు పంచమ భావం, పంచమాదిపతి, నవమభావం, నవమాధిపతి, సంతాన కారకుడైన గురువు, సప్తాం వర్గ చక్రం పరిశీలించాలి. పై భావాధిపతులు రాశిచక్రంలో, నవాంశచక్రంలో,  సప్తాంశ చక్రంలో  బలం కలిగి ఉండాలి.
పంచమభావం సంతానభావం కాబట్టి పురుష జాతకంలో పంచమభావం నుండి సంతాన విషయాన్ని పరిశీలించాలి. భాగ్యభావం పంచమభావానికి భావాత్ భావం కాబట్టి నవమ స్ధానాన్ని పరిశీలించాలి. భాగ్యభావంలో తృప్తిని, అనుభూతిని సూచించే భావం కాబట్టి స్త్రీ సంతానం పొందటం వలన మాతృత్వం లభించి సంతృప్తి పొందుతుంది కాబట్టి స్త్రీ జాతంకంలో ప్రధానంగా భాగ్యభావాన్ని పరిశీలించాలి.
గర్భ రక్షాంభిక స్తోత్రం
ఓం శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్  స్తువన్తమ్

వాపీతఠే  వామభాగే
వామదేవస్య దేవస్య దేవీ స్థిత త్వమ్
మాన్యా వరేణ్య వదాన్య
పాహి గర్బస్త్య జన్తూన్ తథా భక్తలోకాన్

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్  స్తువన్తమ్

శ్రీ గర్బరక్షాపురే యా
దివ్య సౌందర్య యుక్తా సుమాంగళ్య గాత్రీ  
ధాత్రీ జనిత్రీ జనానామ్
దివ్యరూపామ్ దయాద్రామ్ మనోః జ్ఞాం భజే తామ్

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్  స్తువన్తమ్

ఆషాఢ మాసే సుపుణ్యే
శుక్రవారే సుగన్ధేన గన్దేన లిప్తా
దివ్యంభరాకల్పవేషా
వాజపేయాది యోగస్త్య భక్తః సుదృష్టా

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్

కళ్యాణ ధాత్రీ నమస్తేః
వేది కన్గ స్త్రీయ గర్భ రక్షాకరీ త్వామ్
బాలై సదా సేవితాంగ్రి గర్భ
రక్షార్ధ మారా ధుపేతై రుపేతామ్

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్

బ్రహ్మోత్సవే విప్రవిద్యాః
వాద్యఘోషేణ తుష్టామ్ రతే సన్నివిష్ఠామ్
సర్వార్థధాత్రిం భజేహం
దేవబృంధై రపీఢ్యామ్ జగన్మాతరమ్ త్వామ్

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్ స్తువన్తమ్

యే తత్ క్రుతమ్ స్త్రోత్ర రత్నం దీక్షిత
అనంత రామేన దేవ్యా స్తుతుష్ట్యై
నిత్యం పఠేయస్తు భక్త్యా పుత్ర పౌత్రాది భాగ్యమ్
భవే తస్య నిత్యమ్

శ్రీ మాధవీ కాననస్థే
గర్భరక్షాంభికే పాహి భక్తమ్  స్తువన్తమ్

ఇతి శ్రీ బ్రహ్మ శ్రీ అనంత రామ దీక్షిత విరచితం గర్భరక్షాంభికా స్త్రోత్రం సంపూర్ణం


శనివారం, జూన్ 10, 2017

॥ కాలీకవచమ్ ॥

కాలీకవచమ్

భైరవ్ ఉవాచ -
కాలికా యా మహావిద్యా కథితా భువి దుర్లభా ।
తథాపి హృదయే శల్యమస్తి దేవి కృపాం కురు ॥ ౧॥

కవచన్తు మహాదేవి కథయస్వానుకమ్పయా ।
యది నో కథ్యతే మాతర్వ్విముఞ్చామి తదా తనుం ॥ ౨॥

శ్రీదేవ్యువాచ -
శఙ్కాపి జాయతే వత్స తవ స్నేహాత్ ప్రకాశితం ।
న వక్తవ్యం న ద్రష్టవ్యమతిగుహ్యతరం మహత్ ॥ ౩॥

కాలికా జగతాం మాతా శోకదుఃఖవినాశినీ ।
విశేషతః కలియుగే మహాపాతకహారిణీ ॥ ౪॥

కాలీ మే పురతః పాతు పృష్ఠతశ్చ కపాలినీ ।
కుల్లా మే దక్షిణే పాతు కురుకుల్లా తథోత్తరే ॥ ౫॥

విరోధినీ శిరః పాతు విప్రచిత్తా తు చక్షుషీ ।
ఉగ్రా మే నాసికాం పాతు కర్ణౌ చోగ్రప్రభా మతా ॥ ౬॥

వదనం పాతు మే దీప్తా నీలా చ చిబుకం సదా ।
ఘనా గ్రీవాం సదా పాతు బలాకా బాహుయుగ్మకం ॥ ౭॥

మాత్రా పాతు కరద్వన్ద్వం వక్షోముద్రా సదావతు ।
మితా పాతు స్తనద్వన్ద్వం యోనిమణ్డలదేవతా ॥ ౮॥

బ్రాహ్మీ మే జఠరం పాతు నాభిం నారాయణీ తథా ।
ఊరు మాహేశ్వరీ నిత్యం చాముణ్డా పాతు లిఙ్గకం ॥ ౯॥

కౌమారీ చ కటీం పాతు తథైవ జానుయుగ్మకం ।
అపరాజితా చ పాదౌ మే వారాహీ పాతు చాఙ్గులీన్ ॥ ౧౦॥

సన్ధిస్థానం నారసింహీ పత్రస్థా దేవతావతు ।
రక్షాహీనన్తు యత్స్థానం వర్జితం కవచేన తు ॥ ౧౧॥

తత్సర్వం రక్ష మే దేవి కాలికే ఘోరదక్షిణే ।
ఊర్ద్ధమధస్తథా దిక్షు పాతు దేవీ స్వయం వపుః ॥ ౧౨॥

హింస్రేభ్యః సర్వదా పాతు సాధకఞ్చ జలాధికాత్ ।
దక్షిణాకాలికా దేవీ వ్యపకత్వే సదావతు ॥ ౧౩॥

ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్దేవదక్షిణాం ।
న పూజాఫలమాప్నోతి విఘ్నస్తస్య పదే పదే ॥ ౧౪॥

కవచేనావృతో నిత్యం యత్ర తత్రైవ గచ్ఛతి ।
తత్ర తత్రాభయం తస్య న క్షోభం విద్యతే క్వచిత్ ॥ ౧౫॥

ఇతి కాలీకులసర్వస్వే కాలీకవచం సమాప్తమ్ ॥

బుధవారం, మార్చి 29, 2017

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు

శ్రీ హేవళంబి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం - రాశి ఫలితాలు







 Ugadi Rasi Phalalu/Raasi Phalalu Ugadi Predictions for the Year 2017 - 2018 Telugu New Year Sri Hevilambi Nama Samvatsara Rasi Phalalu and Telugu Astrology By Kavita Siromani,  Daivajna:  Pantula Venkata RadhaKrishna (Parakri) And Pantula Jaya Maheswari.
www.teluguastrology.tk
#teluguAstrology, #Mesham Rasiphalalu, #vrishabam Rasiphalalu, #mithunam Rasiphalalu, #karkatakam Rasiphalalu, #simha Rasiphalalu, #kanya Rasiphalalu, #tula Rasiphalalu, #vrischika Rasiphalalu, #dhanu Rasiphalalu, #makara Rasiphalalu, #kumba Rasiphalalu, #meena Rasiphalalu,

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...