హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వ్రతములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

అనంత పద్మనాభ వ్రతం


                        అనంత పద్మనాభ వ్రతం 

                       
 
యమునా పూజ
ధ్యానం: 
శ్లో: క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే,
ధ్యానం కరోమి యమునే విష్ణురూపి నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ధ్యానం సమర్పయామి.

ఆవాహనం:
శ్లో: యమునేతే నమస్తుభ్యం సర్వ కామ ప్రదాయిని,
ఆవాహయామి భక్త్యా త్వాం సాన్నిధ్యం కురు సువ్రతే.
యమునాదేవ్యై నమః ఆవాహయామి.

ఆసనం:  
శ్లో:నమస్కరోమి యమునే సర్వపాపా ప్రణాశిని 
రత్నసింహాసనం దేవే స్వీకురుష్వ మయార్పితం.
యమునాదేవ్యై నమః ఆసనం సమర్పయామి.

పాద్యం: 
శ్లో: సింహాసన సమారూడే దేవశక్తి సమన్వితే,
పాద్యం గృహాణ దేవేశి సర్వలక్షణ సంయుతే.
యమునాదేవ్యై నమః పాద్యం సమర్పయామి.

అర్ఘ్యం:
శ్లో: నందిపాడే నమస్తుభ్యం సర్వపాప నివారిణి,
అర్ఘ్యం గృహాణ యమునే మద్దత్త మిదముత్తమం.
యమునాదేవ్యై నమఃఅర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: హారవైడూర్య సంయుక్తే సర్వలోకహితే శివే, 
గృహాణాచమనీయం దేవి శంకరార్ధ షరీరిణి .
యమునాదేవ్యై నమఃఆచమనీయం సమర్పయామి.

స్నానం:
శ్లో: దేవసలిలే నమస్తుభ్యం సర్వలోక హితేప్రియే
సర్వపాప ప్రశమని తున్గాభాద్రే నమోస్తుతే.
యమునాదేవ్యై నమః స్నానం సమర్పయామి.

వస్త్రయుగ్మం:
శ్లో: గురుపాదే నమస్తుభ్యం సర్వలక్షణ సంయుతే,
సువ్రతం కురుమే దేవి తుంగభద్రే  నమోస్తుతే.
యమునాదేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మధుపర్కం: 
శ్లో: కృష్ణవేణి నమస్తుభ్యం కృష్ణవేణి సులక్షణే 
మధుపర్కం గృహాణేదం మయాదత్తం శుభప్రదే.
యమునాదేవ్యై నమఃమధుపర్కం సమర్పయామి.

ఆభరనాణి :
శ్లో: నందిపాదే నమస్తుభ్యం శంకరార్ధ షరీరిణి 
సర్వలోకహితే తుభ్యం భీమరధ్యై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః ఆభరనాణి సమర్పయామి.

గంధం:
శ్లో: కృష్ణ పాద సమద్భూతే గంగేత్రిపద గామిని,
జటాజూట సమదూతే సర్వకామఫలప్రదే.
యమునాదేవ్యై నమః గంధం సమర్పయామి.

అక్షతలు:  
శ్లో: గోదావరి నమస్తుభ్యం సర్వాభీష్ట ప్రదాయిని,
స్వీకురుష్వ జగద్వంద్యే అక్షతాన్ నమలాన్ శుభాన్.
యమునాదేవ్యై నమఃఅక్షతాన్ సమర్పయామి.

పుష్పై పూజ:
శ్లో: మందారై పారిజాతైస్చ పాటలాశోక చంపకై 
పూజయామి తవప్రీత్యై వందే భక్త వత్సలే .
యమునాదేవ్యై నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ:
ఓం చంచలాయై నమః  -  పాదౌ పూజయామి
ఓం సుజంఘాయ నమః -  జంఘే పూజయామి
ఓం చపలాయై నమః - జానునీ పూజయామి
ఓం పుణ్యాయై నమః - ఊరూం పూజయామి
ఓం కమలాయై నమః - కటిం పూజయామి
ఓం గోదావర్యై నమః  - స్థనౌ పూజయామి
ఓం భవనాశిన్యై నమః - కంటం  పూజయామి 
ఓం తుంగ భద్రాయై నమః - ముఖం పూజయామి
ఓం సుందర్యై నమః - లలాటం పూజయామి
ఓం దేవ్యై నమః - నేత్రే పూజయామి 
ఓం పుణ్య శ్రవణ కీర్తనాయై నమః - కర్ణౌ పూజయామి
ఓం సునాసికాయై నమః - నాసికాం పూజయామి
ఓం భాగీరధ్యై నమః - శిరః పూజయామి 
ఓం యమునాదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. 

ధూపం:
శ్లో: దశాంగం గగ్గులోపెతం చందనాగరు సంయుతం 
యమునాయై నమస్తుభ్యం దూపోయం ప్రతిగృహ్యాతాం.
యమునాదేవ్యై నమఃధూపం సమర్పయామి.

దీపం:
శ్లో: ఘ్రుతవర్తి సమాయుక్తం త్రైలోక్యతిమిరాపహం 
గృహాణ మంగళం దీపం సర్వేశ్వరీ నమోస్తుతే.
యమునాదేవ్యై నమఃదీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: భక్ష్యైస్చ భోజ్యైస్చ రాసి షడ్బిస్సమంవితం 
నైవేద్యం గృహ్యాతాం దేవీ యమునాయై నమోనమః
యమునాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం: 
శ్లో: కర్పూర వాసితం చూర్ణం క్రముకాద్యై స్సమన్వితం
తాంబూలం గృహ్యాతాం దేవీ యమునాయై నమోస్తుతే.
యమునాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారాన్ సమర్పయామి.

శ్రీ అనంత పద్మనాభ పూజాకల్పం 
ధ్యానం:
శ్లో: క్రుత్వాదర్భ మాయం దేవం పరిధాన సమన్వితం 
ఫనైసప్తభి రావిష్టం పింగాలాక్షంచ చతుర్భుజం
దక్షినాగ్రకరే పద్మం శంఖం తస్యాపధ్య కారే
చక్రమూర్ధ్యకరే హమే గదాంతస్యా పద్య కారే
అవ్యయం సర్వలోకేశం పీతాంభరధరం  హరిం
అనంతపద్మనాభాయ నమః ధ్యానం సమర్పయామి

ఆవాహనం:
శ్లో: ఆగచ్చానంత దేవేశ తేజోరాశే జగత్పతే
ఇమాంమయాక్రుతం పూజాం గృహాణ సురసత్తమ.
అనంతపద్మనాభాయ నమః ఆవాహనం సర్పయామి.

ఆసనం:
శ్లో: అనంతాయ నమస్తుభ్యం సహస్ర శిరసే నమః 
రత్నసింహాసనం చారు ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః ఆసనం సమర్పయామి.

తోరస్తాపనం:
శ్లో: తస్యాగ్రతో దృడం సూత్రం కుంకుమాక్తం  సుదోరకం
చతుర్దశి గ్రంధి సంయుక్తం వుపకల్ప్య ప్రజాజాయే 
అనంతపద్మనాభాయ నమఃతోరస్తాపనం కరిష్యామి.

అర్ఘ్యం:
శ్లో: అనంతగుణ రత్నాయ విశ్వరూప ధరాయ చ 
అర్ఘ్యం దదామితెదేవ నాగాదిపతయే నమః 
అనంతపద్మనాభాయ నమః అర్ఘ్యం సర్పయామి.

పాద్యం:
శ్లో: సర్వాత్మన్ సర్వలోకేశ సర్వవ్యాపిన్ సనాతన
పాద్యం గృహాణ భగవాన్ దివ్యరూప నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమః పాద్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో: దామోదర నమోస్తుతే నరకార్ణవతారక
గృహాణాచమనీయం  దేవ మయాదత్తం హి కేశవా.
అనంతపద్మనాభాయ నమః ఆచమనీయం సమర్పయామి.

మధుపర్కం:
శ్లో: అనంతానంత దేవేశ అనంత ఫలదాయక
దధి మద్వాజ్య నమిశ్రం మధుపర్కం దదామితే
అనంతపద్మనాభాయ నమః మధుపర్కం సమర్పయామి.

పంచామృతం:
శ్లో: అనంతగుణ గంభీర విశ్వరూప ధరానమ
పంచామ్రుతైస్చ విదివ త్స్నాపయామి దయానిధే.
అనంతపద్మనాభాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్దోదక స్నానం:
శ్లో: గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
స్నానం ప్రకల్పయేతీర్ధం సర్వపాప ప్రముక్తయే
అనంతపద్మనాభాయ నమః శుద్దోదక స్నానం సమర్పయామి.

వస్త్ర యుగ్మం:
శ్లో: శ్రీధరాయ నమస్తుభ్యం విష్ణవే పరమాత్మనే
పీతాంబరం ప్రదాస్యామి అనంతాయ నమోస్తుతే
అనంతపద్మనాభాయ నమఃవస్త్ర యుగమ సమర్పయామి.

యజ్ఞోపవీతం:
శ్లో: నారాయణ నమోస్తుతే త్రాహిం మాం భావసాగారాట్
బ్రహ్మ సూత్రం చోత్తరీయం గృహాణ పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమఃయజ్ఞోపవీతం సమర్పయామి.

గంధం:
శ్లో: శ్రీగంధం చందనోన్మిశ్రమం కుంకుమాధీ భిరన్వితం
విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం.
అనంతపద్మనాభాయ నమః గంధం సమర్పయామి.

అక్షతాన్:
శ్లో: శాలియాన్ తండులాన్ రంయాన్ మయాదత్తాన్ శుభావహాన్
అచ్యుతానంత గోవింద అక్షతాన్ స్వీ కురుశ్వా ప్రభో 
అనంతపద్మనాభాయ నమః అక్షతాన్ సమర్పయామి

పుష్పపూజ:
శ్లో: కరవీరై ర్జాతికుసుమై శ్చమ్పకై ర్వకులైశుభై 
శాతపత్రైశ్చ కల్హారై రర్చయే పురుషోత్తమ.
అనంతపద్మనాభాయ నమః పుష్పాణి పూజయామి.

అధాంగ పూజ: 
ఓం అనంతాయ నమః   -  పాదౌ పూజయామి
ఓం శేషయ నమః  -  గుల్భౌ పూజయామి 
ఓంకాలాత్మనే నమః -  జంఘే పూజయామి
ఓం విశ్వరూపాయ నమః - జానునీ పూజయామి
ఓం  జగన్నాదాయ నమః -  గుహ్యం పూజయామి 
ఓం పద్మనాభాయ నమః -  నాభిం పూజయామి
ఓం సర్వాత్మనే నమః  -  కుక్షిం పూజయామి
ఓం శ్రీ వత్సవక్షసే నమః - వక్షస్థలం పూజయామి
ఓం చక్రహస్తాయ నమః - హస్తాన్ పూజయామి
ఓం ఆజానుబాహవే నమః - బాహూన్ పూజయామి
ఓం శ్రీ కంటాయ నమః - కంటం పూజయామి
ఓం చంద్రముఖాయ నమః - ముఖం పూజయామి
ఓం వాచాస్పతయే నమః - వక్త్రం పూజయామి.
ఓం కేశవాయ నమః - నాసికాం పూజయామి
ఓం నారాయణాయ నమః - నేత్రే పూజయామి
ఓం గోవిందాయ నమః - శ్రోత్రే పూజయామి
ఓం అనంతపద్మనాభాయ నమః - శిరః పూజయామి
ఓం విష్ణవే నమః - సర్వాంగణ్యాని పూజయామి 

అనంతపద్మనాభ స్వామి అష్ట్తోతరము

ఓం శ్రీకృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుషవిగ్రహాయ నమః
ఓం శ్రీవత్సకౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః
ఓం చ్తుర్భుజాత్తచక్రాసిగదా శంఖాంబుజాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేగసంహారిణే నమః
ఓం బలభద్రప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవితహరణాయ నమః
ఓం శకటాసురభంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః
ఓం నవనీతనటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతనవాహారాయ నమః
ఓం ముచుకుందప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీసహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాకృతయే నమః
ఓం శుకవాగమృతాబ్ధీందనే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం ధేనుకసురభంజనాయ నమః
ఓం తృణీకృతతృణావర్తాయ నమః
ఓం యమళార్జునభంజనాయ నమః
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలాకృతాయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్యసమప్రభాయ నమః
ఓం ఇళాపతయే నమః
ఓం పరంజ్యొతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యాదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః
ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమఃఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంతసంచారిణే నమః
ఓం తులసీదామభూషణాయ నమః
ఓం శ్యమంతమణిహర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసురచాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం మురారినే నమః
ఓం నరకాంతకాయ నమః
ఓం అనాదిబ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసనకర్మకాయ నమః
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః
ఓం దుర్యోధనకులాంతకృతే నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచయే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రాపూర్వజాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తిప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాదవిశారదాయ నమః
ఓం వృషభాసురవిధ్వంసినే నమః
ఓం బాణాసురకరాంతకృతే నమః
ఓం యుధిష్ఠరప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హవతంసకాయ నమః
ఓం పార్థసారధియే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం శ్రీహూదధయేగీతామృతమ నమః
ఓం కాళీయఫణిమాణిక్యరంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞభోక్త్రే నమః
ఓం దానవేంద్రవినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపీ వస్త్రాపహారకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నాగాశనవాహనాయ నమః
ఓం జలక్రీడాసమాసక్తగోపి వస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్ధకృతే నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః

తోరగ్రదిం పూజ:
ఓం కృష్ణాయ నమః - ప్రధమ గ్రంధిం పూజయామి 
ఓం విష్ణవే నమః - ద్వితీయ గ్రంధిం పూజయామి 
ఓం జిష్ణవే నమః - తృతీయ గ్రంధిం పూజయామి 
ఓం కాలాయ నమః - చతుర్ధ గ్రంధిం పూజయామి 
ఓం బ్రహ్మనే    నమః - పంచమ గ్రంధిం పూజయామి 
ఓం భాస్కరాయ నమః - షష్టమ గ్రంధిం పూజయామి 
ఓం శేషయ నమః - సప్తమ గ్రంధిం పూజయామి 
ఓం సోమాయ నమః - అష్టమ గ్రంధిం పూజయామి 
ఓం ఈశ్వరాయ నమః - నవమ గ్రంధిం పూజయామి 
ఓం విశ్వాత్మనే నమః - దశమ గ్రంధిం పూజయామి 
ఓం మహాకాలాయ నమః - ఏకాదశ గ్రంధిం పూజయామి 
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః - ద్వాదశ గ్రంధిం పూజయామి 
ఓం అచ్యుతాయ  నమః - త్రయోదశ గ్రంధిం పూజయామి 
ఓం అనంతపద్మనాభాయ నమః - చతుర్దశ గ్రంధిం పూజయామి 

ధూపం:
శ్లో: వనస్పతి రసైర్దివ్యై ర్నానా గంధైశ్చ సంయుతం
ఆఘ్రేయ సర్వదేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం
ఓం అనంతపద్మనాభాయ నమః దూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో: సాజ్యం త్రివర్తి సంయుక్తం వన్హినాం యోజినామ్మయా 
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపాహం 
ఓం అనంతపద్మనాభాయ నమః దీపం దర్శయామి.

నైవేద్యం:
శ్లో: నైవేద్య గృహ్య దేవేశ భక్తిమే హ్యచాలాంకురు
ఈప్సితం మే వరం దేవహి పరత్రచ పరాం గతిం
అన్నం చతుర్విధం భక్ష్యై రసై షడ్భి సమన్వితం
మయానివేదితం తుభ్యం స్వీకురుష్వ జనార్ధన.
ఓం అనంతపద్మనాభాయ నమః నైవేద్యం సమర్పయామి.

తాంబూలం:
శ్లో:  ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం 
కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం.
ఓం అనంతపద్మనాభాయ నమః  తాంబూలం సమర్పయామి.

నీరాజనం:
శ్లో: సమ సర్వహితార్దాయ జగదాధార మూర్తయే
సృష్టి స్తిత్యంత్యరూపాయ అనంతాయ నమోనమః 
ఓం అనంతపద్మనాభాయ నమః నీరాజనం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారాన్:
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రనస్యంతి ప్రదక్షిణ పదేపదే 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాం క్రుపయాదేవ శరణాగత వత్సల 
అన్యధా శరణంనాస్తి త్వమేవ శరణం మమ 
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్ధన 
నమస్తే దేవేదేవేశ నమస్తే ధరణీధర
నమస్తే సర్వానాగేంద్ర నమస్తే పురుషోత్తమ.
ఓం అనంతపద్మనాభాయ నమః  ప్రదిక్షణ నమస్కారాన్ సమర్పయామి.

తోరగ్రహణం:
శ్లో: దారిద్ర్య నాశానార్దాయ పుత్ర పౌత్ర ప్రవ్రుద్దయే 
అనంతాఖ్య మేడం సూత్రం దారయామ్యః ముత్తమం
ఓం అనంతపద్మనాభాయ నమః తోరగ్రహణం కరిష్యామి.

తోరనమస్కారం:
శ్లో: అనంత సంసార సముద్ర
మాగ్నం మమభ్యుద్దర వాసుదేవ
అనంతరూపిన్ వినియోజయస్వ
హ్యనంత సూత్రాయ నమోస్తుతే
ఓం అనంతపద్మనాభాయ నమః తోరనమస్కారాన్ సమర్పయామి.

తోరబంధనం:
సంసార గాహ్వారగుహాసు సుఖం విహర్తుం 
వాన్చంతి ఏ కురు కులోద్వః శుద్దసత్వా
సంపూజ్యచ త్రిభువనేశ మనంతరూపం 
బద్నంతి దక్షణ కారే వరదోరకం తే.
ఓం అనంతపద్మనాభాయ నమః  టోర బంధనం కరిష్యామి.

జీర్నతోరణం విసర్జనం:
శ్లో:  అనంతానంత దేవేశ హ్యనంత ఫలదాయక 
సూత్రగ్రందిషు సంస్థాయ విశ్వరూపాయతే నమః

ఉపాయనదానం :
శ్లో: అనంతః ప్రతిగ్రుహ్న్నతి అనంతోవై దదాతిచ 
అనంత స్తారకోభాభ్యా మనంతాయ నమోనమః 

వ్రతవిధానము :
ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందులో పధ్నాలుగు పడగలు గల అనంతుడుని తయారుచేసి ప్రతిస్ఠించాలి . సామానముగా దర్బలను ఉపయొగించి అనంతుణ్ణి తయారుచేస్తారు . ముందుగా గణపతిని , నవగ్రహాలను పూజించిన తరువాత ' యమునా పూజ ' చేయాలి . యమునా పూజ అంటే నీటిని పూజించాలి . బిందెతో నీటిని తెచ్చుకొని , ఆ నీటిలోకి యమునను ఆవాహనం చేసి పూజించాలి . తరువాత అనంతుడుని షోడశోపచారాలతో పూజించి , బెల్లము తో చేసిన ఇరవై ఎనిమిది అరిసెలను నైవేద్యముగా పెట్టాలి . వ్రతకథ చెప్పుకొని అనంతపద్మనాభస్వామికి నమస్కరించి అక్షతలు తలపై చల్లుకోవాలి . వ్రతముతో తోరమును కట్టుకోవాలి . ఎరుపు రంగులో పద్నాలుగు పోచలతో తయారైన తోరాన్ని ధరించాలి .

అనంతపద్మనాభ వ్రత కథ

సూతపౌరాణికుడు  శౌనకాది మహర్షులను గాంచి యిట్లనియె!  ఓ మునిశ్రేష్టులారా! లోకమున మనుష్యులు దారిద్ర్యముచే పీడింప బడుచున్డిరి .  అట్టి దారిద్ర్యమును తోలగాచేయునట్టి ఒక వ్రత శ్రేష్టంబు కలదు.  దానిని జెప్పెద వినుడు. పూర్వము పాండురాజు పుత్రుడైన ధర్మరాజు తమ్ములతోడ అరణ్య వాసము చేయుచు అన్నో కష్టములను అనుభవించి ఒకనాడు శ్రీకృష్ణుని  గాంచి  "ఓ మహాత్మా! నేను తమ్ములతో కలసి అనేక దినములుగా అరణ్య వాసము చేయుచూ ఎన్నో కష్టములను అనుభవించుచున్నాను.  ఇట్టి కష్టసాగారము నందుండి కడతేరునట్టి వుపాయమును చెప్పవలేయునని ప్రాధించిన శ్రీకృష్ణుడు యిట్లనియె.

            "ఓ ధర్మరాజ! పురుషునకును, స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంత వ్రాతమను ఒక వ్రతము కలదు.  మరియు ఆ అనంత వ్రతమును భాద్రపద శుక్ల చతుర్దశినాడు చేయవలెయును.  అట్లు గావించిన కీర్తియును, సుఖమును, శుభమును, పుత్రలాభమును గలుగును" అని వచించిన ధర్మరాజు యిట్లనియె.
           
               "ఓ రుక్మిణీ ప్రానవల్లభా! ఆ అనంతుడను దైవంబు ఎవరు?  అతడి ఆదిశేషుడా! లేక తక్షుడా! లేక సృష్టికర్త యైన బ్రహ్మయా! లేక పరమాత్మ స్వరూపుడా" అని అడిగిన శ్రీ కృష్ణుడు యిట్లనియె.
               "ఓ పాండుపుత్ర! అనంతుదనువాడను నేనేతప్ప మరిఎవరో కాదు.సూర్య గమనముచే కలాకష్ట ముహూర్తములనియు, పగలు రాత్రనియు, యుగసంవత్సర ఋతు మాసకల్పమనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలము ఏది కలదో అదియే నా స్వరూపము.  నేనే కాలస్వరూపుడను, అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును, రాక్షస సంహారము కొరకును వాసుదేవుని గృహమున జన్మించితిని.  నన్ను క్రుశ్నునిగాను,  విష్ణువు గాను, హరిహరబ్రహ్మలుగను, సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగాను, సృష్టి స్థితి లయ కారనభూతునిగాను, అనంతపద్మనాభునిగాను, మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగాను ఎరుగుదురు.  ఈ నా హృదయమునందే పదునాలుగు ఇంద్రులును, అష్టావసువులును, ఏకాదశ రుద్రులును, ద్వాదశాదిత్యులును, సప్త ఋషులును, భూర్భు వస్స్వర్లోకాదులు నున్నవో అట్టి నా స్వరూపమును నీకు తెలిపితిని" అనిన ధర్మరాజు శ్రీ కృష్ణుని గాంచి " ఓ జగన్నాధ! నీవు వచించిన అనంత వ్రతమును యేతుల ఆచరిన్చావలేయును?  ఆ వ్రతము ఆచరించిన ఏమి పహలము గలుగును?  ఏయే దానములు చేయవలెయును?  ఈ దైవమును పూజింపవలెను? పూర్వం ఎవరైనా ఈ వ్రతం ఆచరించి సుఖము జెందిరి?  అని ధర్మరాజు అడుగగా!  శ్రీకృష్ణుడు యిట్లనియె.

             "ఓ ధర్మరాజ! చెపాడ వినుము.  పూర్వము వశిష్ట గోత్రోద్భవుడు , వేద శాస్త్ర సంపన్నుడు అగు సుమంతుడు అను ఒక బ్రాంహ్మణుడు కలదు. అతనకి భ్రుగుమహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు.  ఆ దీక్షాదేవితో సుమంతుడు సంతోషముగా కాపురము చేయుచుండగా కొంత కాలమునకు దీక్షాదేవి గర్భము దాల్చి సుగునవతియగు ఒక కన్యను గనెను.  ఆ బాలికకు షీలా అను నామకరణము చేసిరి.  

          ఇట్లు వుండగా కొన్ని రోజులకు దీక్షాదేవి తాప జ్వరముచే మృతి చెందెను.  పిదప సుమంతుడు వైదిక కర్మలోప భయంబుచే కర్కశ యను ఒక కన్యను వివాహము చేసుకొనెను.  ఆ కర్కశ ఎంతో కటిన చిత్తురాలుగాను, గయ్యాలిగాను, కలహాకారిణి గాను, ఉండెను.  ఇట్లుండ మొదటి భార్యయగు దీక్షాదేవి పుత్రికయైన శీల తండ్రి గృహముననే పెరుగుచూ, గోడల యందును, గడపలయందును, చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచు, కూటము మొదలగు స్థాలములయండు శంఖ పద్మాదులవలె మ్రుగ్గులు పెట్టిచు దైవభక్తిగలదై యుండెను.  ఇట్లుండగా ఆశీలకు వివాహ వయసు వచ్చినది.  అప్పుడు సుమంతుడు కౌండిన్య మహాముని కొన్నిదినములు తపస్సుచేసి, పిదప పెండ్లి చేసుకోవలేయునని కోరికగలిగి దేశదేశములను తిరుగుచూ ఈ సుమంతుని గృహమునకు వచ్చెను.  అంత సుమంతుడు కౌండిన్య మహామునికి అర్ఘ్యపాద్యములచే పూజించి శుభదినమున ఆ మహామునికి తన కుమార్తె యగు శీలను ఇచ్చి వివాహము చేసెను.  ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వదలచి తన భార్య యగు కర్కశ వద్దకు పోయి "ఓ ప్రియురాలా! మన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వవలేయునుగాడా! ఏమి ఇద్దాము అని అడుగగా,  ఆ కర్కశ చివుక్కున లేచి లూపలికి వెళ్ళి తలుపులు గడియవేసుకొని ఇక్కడ ఏమియు లేదు పొమ్మనెను.  అంత సుమంతుడు ఎంతో చింతించి దారి బట్టేమునకైన ఇవ్వకుండా పంపుట మంచిది కాదని తలచి పెండ్లికి చేయబడి మిగిలిన పెలపుపిండి ఇచ్చి అల్లుడితోనిచ్చి కూతురుని పంపెను.  అంత కౌదిన్యుడును సదాచార సంపన్నురాలగు భార్యతోడను బండిఎక్కి తిన్నగా తన ఆశ్రమమునకు బోవుచూ మధ్యాహ్నవేళ అయినందున సంధ్యావందనాది క్రియలు జరుపుటకై బండిదిగి తటాకంబునకేగెను.  నాటిదినమున అనంతపద్మనాభ చతుర్దశి గావున అచ్చట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు యెర్రని వస్త్రములను ధరించుకొని ఎంతో భక్తిశ్రద్దలతో అనంత పద్మనాభ వ్రతము చేయుచుండగా కౌదిన్యుని భార్య యగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల యొద్దకు వెళ్ళి, "ఓ వనితా మణులారా! మీరు ఎదేవుని పూజించుచున్నారు?  ఈ వ్రతము పేరేమి?  నాకు సవిస్తారముగా తెలుపగలరు అని ప్రార్ధించగా, ఆ పతివ్రతలు యిట్లనిరి.  "ఓ పుణ్యవతి చెప్పెదము వినుము.  ఇది అనంత పద్మనాభ వ్రతము.  ఈ వ్రతమును చేసినచో అనేక ఫలములు కలుగును.  

              భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరమునకు పోయి స్నానము చేసి శుబ్రమైన వస్త్రములను కట్టుకొని పరిశుద్దమైన స్థలమును గోమయమునచే అలికి సర్వతో భాద్రంబాను ఎనమిది దళములు గల తమ పుష్పము వంటి మండలమును నిర్మించి, ఆ మండలమునకు చుట్టునూ పంచవర్ణపు ముగ్గులతోను, తెల్లని బియ్యపు పిండిచేతను అలంకరించి నానావిధ ముగ్గులను పెట్టి ఆవేదికకు దక్షిణ పార్శ్వమున వుదకపూరిత కలశంబు నుంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకున్దయినా అనంత పద్మనాభస్వామిని దర్భతో ఏర్పరచి అందు ఆవాహనము చేసి.
          
              శ్లో:  క్రుత్వాదర్భామయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం,
                    సమన్వితం సప్తఫణై పింగాలాక్షం చతుర్భుజం.

               అను ఈ శ్లోకము చేత శ్వేత ద్వీపవాసియగు, పిన్గాలాక్షుడగు, సప్తఫణి సాహితున్డగు, శంఖ చక్ర గదా ధరున్డుగాను ధ్యానము చేసి, కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజ చేసి, ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదునాలుగు ముళ్ళు గలిగి కుంకుమతో తడసిన క్రొత్త తోరంబును ఆ పద్మనాభ స్వామి సమీపమున వుంచి పూజించి అయిడుపల్ల గోధుమపిండితో  ఇరువది ఎనమిది అతిరసములన్ జేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని పదునాలుగు అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానము ఇచ్చి తక్కిన వానిని తాను భుజిమ్పవలేయును.  మరియు పూజాద్రవ్యములన్నియు పడులాలుగేసి వుండవలేయును.  పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంతపద్మనాభ స్వామిని ధ్యానించుచు నున్దవలేయును.  ఓ శీలా! ఇట్లు వ్రతము పరిసమాప్తముచేసి ప్రతి సంవత్సరము వుద్వాసనము చేసి మరల వ్రతము ఆచరిన్చుచున్దవలెను.  అని ఆ వనితామణులు చెప్పిరి.  అంట ఆ షీలా తక్షణంబున స్నానం చేసి ఆ స్త్రీల సహాయముతో వ్రతము ఆచరించి తోరమును కట్టుకొని దారి బట్టేమునకుగాను తెచ్చిన సత్తుపిందిని వాయనదానమిచ్చి తానును భుజించి సంతుష్ట యై, భోజనాడులచే సంత్రుప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమునకు బోయెను.  

             అంతట శీల అనంత వ్రతం ఆచరించిన మహాత్యమువలన ఆ ఆశ్రమము అంతయు స్వర్ణమయముగాను, గృహం అష్ట ఐశ్వర్య యుక్తముగాను ఉండుట చూచి ఆ దంపతులు ఇరువురు సంతోష భరితులై  సుఖముగానున్దిరి.  శీలా-గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిధి సత్కారములన్ గావించుచుండెను.

           అట్లుండగా ఒకనాడు దంపతులు ఇరువురు కూర్చుంది యుండగా ధర్మాత్ముండగు కౌండిన్యుడు శీల సందితమునుండు తోరముచూచి "ఓ కాంతా! నీవు సందియందొక తోరమును గట్టుకొనియున్నావుకదా! అది ఎందులకు కట్టుకొను యున్నావు?  నన్ను వశ్యము చేసుకోనుతకా లేక మరియోకరిని వష్యంబు చేసుకోనుతకా అని అడిగెను.  అప్పుడు షీలా ఇట్లనియె.

            "ఓ ప్రాణ నాయకా!  అనంతపద్మనాభస్వామి ని ధరించియున్నాను.  ఆదేవుని అనుగ్రహంబున వలననే మనకీ ధనదాన్యాది సంపత్తులు గలిగి యున్నవని" తెలిపెను.  అప్పుడు కౌదిన్యుడు మిక్కిలి కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుదనగా యే దేవుడు అని దూశించుచూ ఆ తోరమును త్రెంచి భాభా మండుచుండేది అగ్ని లో పదవేచెను. అంత ఆ శీల హాహాకారములు చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో తడపి పెట్టెను.  

             పిదప కొన్ని రోజులకు కౌదిన్యుడు చేసిన ఇట్టి అపరాధమువలన అతని ఐశ్వర్యము అంతయు నశించి గోధనములు దొంగల  పాలగును.    గృహము అగ్నిపాలయ్యేను.  మరియు గృహమునండున్న వస్తువులు ఎక్కడివి అక్కడే నశించెను.  ఎవరితో మాట్లాడినాను ఆకారణముగా కలహములు వచ్చుచుండెను.  

             అంతటా కౌదిన్యుడు ఏమియునుదోచక  దారిద్ర్యముచే పీడింప బడుచూ  అడవులందు ప్రవేశించి క్షుద్భాదా పీడితుండై అనంతపద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి ఆ మహాదేవుడిని యెట్లు చూడగలనని మనసులో ధ్యానించుచూ పోయి ఒక చోట పుష్ప ఫల  భారితమగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపై ఒక పక్షియైనాను వ్రాలకుండుట చూచి ఆశ్చర్యం కలిగి ఆ చెట్టుతో ఇట్లనియె: ఓ వ్రుక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచితివా?  యని అడుగగా ఆ వృక్షము నే నేరుగానని చెప్పెను.  

              అంత కౌండిన్యుడు మరికొంత దూరముపోయి పచ్చిగాద్దిలో ఇటుఅటు తిరుగుచున్న దూడతో గూడిన ఒక గోవును చూచి, ఓ కామధేనువా!  అనంతపద్మనాభ స్వామిని చూచితివా అని అడుగగా అనంత పద్మనాభస్వామి ఎవరో నే నేరుగాను అని చెప్పెను.  

                పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మత్తు పచ్చికలో నిలుచున్న ఒక వ్రుశాభామును చూచి ఓ వ్రుశాభారాజమా! అనంతపద్మనాభ స్వామి ని చూచితివా అని అడిగిన, అనంతపద్మనాభ స్వామి ఎవరో నాకు తెలియదు అనిచేప్పెను.  

             పిమ్మట మరికొంత దూరము పోగా ఒకచోట రమ్యమైన మనోహరమైన రెండు కొలనులు తరంగంబులతో గూదియును కమల కల్హార కుముదోత్ఫలంబుల తోడ గూదియును, హన్సకారండవ చక్రకాడులతో గూదియును, ఒక కొలనునుంది జలంబులు మరియొక కొలనుకి పోరాలుచున్డుతయును చూచి, ఓ కమలాకరంబులారా!  మీరు అనంత పద్మనాభ స్వామి ని చూచితిరా యని అడిగెను.  అందులకు ఆ పుష్కరినిలు మే మేరుగమని చెప్పగా, కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒకచోట ఒక గాడిదను ఒక ఏనుగు నిలుచుని యుండెను.  వాటిని జూచి మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను.  అవి అనంతపద్మనాభ స్వామి ఎవరో మాకు తెలియదు అని సమాదానమిచ్చిరి.  

               అంతటా కౌదిన్యుడు ఎంతో విచారముతో  బాధతో మూర్చబోయి క్రిందపడెను.  అప్పుడు భగవంతుని కృప గలిగి వృద్ద బ్రాహ్ణణ రూపదారుడై కౌదిన్యుని చెంతకు వచ్చి " ఓ విప్రోత్తమా! ఇటు రమ్మని పిలుచుకొని తన గృహమునకు తీసుకపోఎను.  అంతటా ఆ గృహము నవరత్న మణిగణ ఖచితంబగు దేవాంగనల తోడ గూడియు ఉండుట చూచి ఆశ్చర్యంబు చెంది, సదా గరుడ సేవితున్డుగాను, శంఖ చక్ర ధరున్డుగాను నుండు తన స్వస్వరూపమును పద్మనాభ స్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగారమగ్నున్డై భగవంతుని ఈ విధంబుగా ప్రార్ధించెను.  

              నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభాలాన్చన త్వన్నమ స్మరణా త్పాపమశేషం నఃప్రణశ్యతి, నమోనమస్తే గోవిందా నారాయణా జనార్దనా" యని ఇటుల అనేక విధములుగా స్తోత్రంచేసిణ అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై "ఓ విప్రోత్తమా! నీవు చేసిన స్తోత్రంబుచే నేను ఎంతో సంతసించితిని.  నేకు ఎల్లప్పటికిని దారిద్ర్యము సంభావించకున్డునటులను, అంత్యకాలమున శాశ్వత విశ్నులోకము గలుగునట్లు వరము ఇచ్చితిని  అనెను.  
అప్పుడు కొందిన్యుడు ఆనందముతో ఇట్లనెను.

                ఓ జగన్నాధా! నేను మార్ఘ మధ్యలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతము ఏమిటి ?  ఆ ఆవు ఎక్కడిది?  ఆ వృషంభు ఎక్కడినుండి వచ్చెను?  ఆ కొలను విశేషము ఏమిటి?  ఆ గాడిద ఏనుగు, బ్రాహ్మనులు ఎవరు?  అని ఆ భగవంతుడిని అడిగెను.  అపుడు ఆ పరమాత్ముడు.
           
                ఓ  బ్రాహ్ణణ శ్రేష్టుడా!  పూర్వము ఒక బ్రాహ్ణణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంబుచే ఎవ్వరికిని విద్య చెప్పక పోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగపడని మామిడి చెట్టుగా జన్మించెను.  ఒకడు మహా భాగ్యవంతుడై యుండి తన జీవిత కాలమునందు ఎన్నడును బ్రాహ్ణణులకు అన్న ప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చి గడ్డిలో తిరుగుచున్నాడు.  పూర్వము ఒక రాజు ధనమదాన్దుడై
బ్రాహ్ణణులకు చవితి భూమిని దానము జేసినందున ఆ రాజు వ్రుషభంబై అడవిలో తిరుగుచున్నాడు.  ఆ కొలంకులు రెండును ఒకటి ధర్మమూ, మరియొకటి అధర్మము.  ఒక మానవుడు సర్వదా పరులను దూశించుచూ నున్దినందున గాదిదయై పుట్టి తిరుగుచున్నాడు.  పూర్వము ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దానధర్మములను తానె విక్రయించి వెనకేసుకోనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను.  అనంత పద్మనాభుదనైన నేనే బ్రాహ్ణణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని.  కావున నీవు ఈ వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరిన్చితివేని నీకు నక్షత్ర స్థానము ఇచ్చెదనని వచించి భగవంతుడు అంతర్దానము నొందేను.

              పిదప కౌండిన్య ముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంత మంతయు జెప్పి పదునాలుగు సంవత్సరములు అనంత వ్రాతంబు నాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపద అనుభవించి అంత్యకాలమున నక్షత్రమందలము చేరెను.  

            ఓ ధర్మరాజా! ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునండు కాన బడుచున్నాడు.  మరియు అగస్త్య మహాముని ఈ వ్రాతంబు ఆచరించి లోకంబున ప్రసిద్ది పొందెను.  సాగర, దిలీప, భారత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతమును ఆచరించి ఇహలోకంబున రాజ్యముల ననుభవించి అంత్యంబున స్వర్గమును బొందిరి.  కావున ఈ వ్రత కథను సంగము వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులు ననుభవించి స్వర్గలోక ప్రాప్తి పొందుదురు. 

సోమవారం, డిసెంబర్ 10, 2012

ఏడురోజుల వ్రతాలు ఎన్నో శుభఫలాలు


వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం!

రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.

ఆదివారవ్రతం: చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.

వ్రతవిధానం: ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.

సోమవార వ్రతం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.

మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.

బుధవారవ్రతం: స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.

వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.

గురువారవ్రతం: మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.

శుక్రవార వ్రతం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.

వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం
లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.

శనివారవ్రతం: వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.

వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.

ఏ పూజ, వ్రతం చేసేటప్పుడయినా ఫలితం కోసం గాక శ్రద్ధాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మ చర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా ఉండాలి.

గురువారం, మే 17, 2012

కాత్యాయని వ్రతం


               కాత్యాయని వ్రతం 
               

ముందుగా  కాత్యాయని దేవిని  ఆవాహన చేయవలెను.  
"అస్మిన్ కలశే సమస్త తీర్దాదివం వారున మావాహయామి" అని పుష్పం వుంచి మరల పుష్పం తీసుకొని 
శ్లో: అస్మిన్ కలశోపరి సాంబ సదాశివ సహిత కాత్యాయనీం 
మహా గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి.  
కలశము ముందు పుష్పమునువుంచి ఈశ్వరుని ఎడమతొడపై  కాత్యాయని దేవి కూర్చున్నట్లుగా భావించి నమస్కరించవలెను.

ధ్యానం:
శ్లో:  ధ్యాయామి దేవీం సకలార్ధధాత్రీంచతుర్భుజం కుంకుం రాగాశోనాం 
ఈశాన వామాంక నివాసినీం శ్రీ కాత్యాయనీం త్వాం శరణం ప్రపద్యే.
కాత్యాయని మహాదేవి శంకరార్ధ స్వరూపిణి 
కల్యాణం కురుమే దేవి శివశక్తి నమోస్తుతే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ధ్యానం సమర్పయామి. ఎర్రటిపుష్పం అమ్మవారి ముందు వుంచవలెను. 

ఆవాహనం: 
శ్లో: సర్వదోష ప్రశమని సర్వాలంకార సంయుటే
యావత్వాం పూజయిష్యామి తావత్వాం సుస్తిరాభవ.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆవాహయామి.

రత్న సింహాసనం:
శ్లో:  భౌమవారే ప్రియే దేవి కుజదోష నివారణి,
స్కందమాత్రే స్వర్ణ రత్నమననం ప్రతిగృహ్యాతాం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

పాద్యము:
శ్లో:  గంగాది సరస్వతీర్ధైశ్చ శోభితం చ సువాసితం,
పాద్యం గృహాణ వరదే హోవ్రి కళ్యాణ కారినీం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.
పుష్పముతో నీళ్ళు చల్లవలెను.

అర్ఘ్యము: 
శ్లో:  శుద్దోదకం సువిమలం గంధ పుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామితే దేవీ గృహ్యాతాం శివవల్లభే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః  హస్తయో అర్ఘ్యం సమర్పయామి.

ఆచమనీయం:
శ్లో:  సువర్ణ కలశానీతం చందనాగరు సంయుక్తం 
గృహాణ ఆచమనీయం దేవి మయాదత్తం శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ముఖే ఆచమనీయం సమర్పయామి.

స్నానం:
శ్లో:  గంగా గోదావరి దివ్యై తీర్డైశ్చ మిళితం శుభం 
శుద్దోదక స్నానమిదం గృహాణ పరమేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః  శుద్దోదక స్నానం సమర్పయామి. 

వస్త్రం:  
శ్లో:  సురార్చితాంఘ్రే యుగళే దుకూల వాసనా ప్రియే,
రక్త వస్త్ర ద్వయం దేవి గృహ్యాతాం సురపూజితే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.

మాంగళ్యం:
శ్లో:  తప్తహేమకృతం  దేవి మాంగళ్యం మంగళప్రదం 
మయా సమర్పితం దేవి గృహ్యాతాం శివ వల్లభే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ ప్రద మాంగళ్యం సమర్పయామి.

ఆభరణములు:
శ్లో:  సువర్ణ భూషణా దేవి నవరత్న మయానిచ 
సమర్పయామి హి దేవి స్వీ కురుష్వ శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః  సర్వాభరణాను  సమర్పయామి.

గంధము: 
శ్లో:  కర్పూరాగరు కస్తూరి రోచనాది సుసంయుతం,
గంధం దాస్యామి శుభాగే స్వీ కురుష్వ శుభప్రదే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః గంధం సర్పయామి.

అక్షతలు: 
శ్లో:  అక్షతాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
గోఘ్రుతాక్తాన్ రక్త వర్ణాన్ స్వీ కురుష్వ మహేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.

పుష్పములు:
శ్లో:  మందారై కరవీరైశ్చ  పాటలైశ్చ  సుశోభనై
పుష్పైస్త్వాం పూజయిష్యామి దేవి కాత్యాయనీ శివే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః పుష్పై పూజయామి.

నమః అన్న తరువాత ఎర్రటి పుష్పములతో, పసుపు, కుంకుమలతో  అమ్మ వారిని పూజింపవలెను.  

అధాంగ పూజ:
ఉమాయై నమః                 -            పాదౌ పూజయామి
పార్వత్యై నమః                  -            జానునీ పూజయామి
జగన్మాత్రే నమః                 -           ఊరూ పూజయామి
జగత్ప్రతిష్టాయై నమః          -           కటిం పూజయామి
మూల ప్రకృత్యై నమః          -            నాభిం పూజయామి 
అమ్బికాయై నమః             -            ఉదరం పూజయామి 
అన్నపూర్ణాయై నమః          -            స్థనౌ  పూజయామి 
శివ సుందర్యై నమః            -            వక్షస్థలం పూజయామి 
మహా బలాయై నమః          -            బాహూన్ పూజయామి 
గౌర్యై నమః                       -            జంఘే పూజయామి 
శ్రీ పాడాయి నమః               -            హస్తాన్  పూజయామి 
కంభు  కంట్యై నమః            -            కంటం  పూజయామి
బ్రహ్మ విద్యాయై నమః         -            జిహ్వం పూజయామి 
శాంకర్యై నమః                   -            ముఖం పూజయామి 
శివాయై నమః                   -            నేత్రే పూజయామి 
రుద్రాన్యై నమః                   -            కర్ణౌ పూజయామి 
సర్వంన్గాలాయై   నమః        -            లలాటం పూజయామి 
సర్వేశ్వర్యై నమః                -            శిరః పూజయామి 
మంగళ గౌర్యై నమః            -            సర్వాణ్యంగాని పూజయామి 

శ్రీ కాత్యాయని దేవ్యై నమః అష్ట్తోత్తర శతనామావళి 
ఓం గౌర్యై నమః      
ఓం గిరిజాతనుభావాయై నమః 
ఓం జగన్మాత్రే నమః  
ఓం వీరభద్ర ప్రసువే నమః 
ఓం విశ్వరూపిన్యై నమః 
ఓం కష్ట దారిద్రషమన్యై నమః 
ఓం శామ్భావ్యై నమః 
ఓం బాలాయై నమః 
ఓం భాద్రదాయిన్యై నమః 
ఓం సర్వ మంగలాయై నమః 
ఓం మహేశ్వర్యై నమః 
ఓం మంత్రారాధ్యై నమః 
ఓం హేమాద్రిజాయై నమః 
ఓం పార్వత్యై నమః 
ఓం నారాయణంశాజాయై నమః  
ఓం నిరీశాయై నమః 
ఓం అమ్బికాయై నమః 
ఓం ముని సంసేవ్యాయై నమః 
ఓం మేనకాత్మజాయై నమః 
ఓం కన్యకాయై నమః 
ఓం కలిదోష నివారిన్యై నమః 
ఓం గణేశ జనన్యై నమః 
ఓం గుహామ్బికాయై నమః 
ఓం గంగాధర కుతుమ్బిన్యై నమః 
ఓం విశ్వా వ్యాపిన్యై నమః 
ఓం అష్టమూర్తాత్మికాయై నమః 
ఓం శివాయై నమః 
ఓం శాంకర్యై నమః 
ఓం భావాన్యై నమః 
ఓం మాంగల్య దాయిన్యై నమః 
ఓం మంజు భాశిన్యై నమః 
మహా మాయాయై నమః 
ఓం మహా బలాయై నమః 
ఓం హేమవత్యై  నమః 
ఓం పాప నాశిన్యై నమః 
ఓం నిత్యాయై నమః 
ఓం నిర్మలాయై నమః 
ఓం మ్రుదాన్యై నమః 
ఓం మానిన్యై నమః 
ఓం కుమార్యై నమః 
ఓం దుర్గాయై నమః 
ఓం కాత్యాయిన్యై నమః 
ఓం కలార్చితాయై నమః 
ఓం క్రుపాపూర్నాయై నమః 
ఓం సర్వమయి నమః 
ఓం సరస్వత్యై నమః 
ఓం అమర సంసేవ్యాయై నమః 
ఓం అమ్రుతెశ్వర్యై నమః 
ఓం సుఖచ్చిత్పుదారాయై  నమః 
ఓం బాల్యారాదిత భూతదాయై నమః 
ఓం హిరణ్మయై నమః 
ఓం సూక్ష్మాయై నమః 
ఓం హరిద్రా కుంకుమా రాధ్యాయై నమః 
ఓం సర్వ భోగాప్రదాయై నమః 
ఓం సామ శిఖరాయై నమః 
ఓం కర్మ బ్రమ్హ్యై నమః 
ఓం ఓం వాంచితార్ధ యై నమః 
ఓం చిదంబర శరీరిన్యై నమః 
ఓం దేవ్యై నమః 
ఓం కమలాయై నమః 
ఓం మార్కందేయవర ప్రదాయి నమః 
ఓం పున్యాయై నమః 
ఓం సత్యధర్మరతాయై నమః 
ఓం శశాంక రూపిన్యై నమః 
ఓం భాగాలాయై నమః 
ఓం మాత్రుకాయై నమః 
ఓం శూలిన్యై నమః 
ఓం సత్యై నమః 
ఓం కల్యాన్యై నమః 
ఓం సౌభాగ్యదాయిన్యై నమః 
ఓం అమలాయై నమః 
ఓం అన్నపూర్ణాయై నమః 
ఓం అఖిలాగమ సంస్తుతాయై నమః 
ఓం అమ్బాయై నమః 
ఓం భానుకోటి సముద్యతాయై నమః 
ఓం పరాయి నమః 
ఓం శీతాంశు కృత శేఖరాయై నమః 
ఓం సర్వ కాల సుమంగళ్యై నమః 
ఓం సామ శిఖరాయై నమః 
ఓం వేదాంగ లక్షణా యై  నమః 
ఓం కామ కలనాయై నమః 
ఓం చంద్రార్క యుత తాటంకాయై  నమః 
ఓం శ్రీ చక్ర వాసిన్యై నమః 
ఓం కామేశ్వర పత్న్యై నమః 
ఓం మురారి ప్రియార్దాన్గై నమః 
ఓం పుత్ర పౌత్ర వర ప్రదాయి నమః 
ఓం పురుషార్ధ ప్రదాయి నమః 
ఓం సర్వ సాక్షిన్యై నమః 
ఓం శ్యామలాయై నమః 
ఓం చంద్యై నమః 
ఓం భాగామాలిన్యై నమః 
ఓం విరజాయై నమః 
ఓం స్వాహాయై నమః 
ఓం ప్రత్యంగి రామ్బికాయై నమః
ఓం దాక్షాయిన్యై నమః 
ఓం సూర్య వస్తూత్తమాయై నమః 
ఓం శ్రీ విద్యాయై నమః 
ఓం ప్రనవాద్యై నమః 
ఓం త్రిపురాయై నమః 
ఓం షోడశాక్షర దేవతాయై నమః 
ఓం స్వధాయై నమః 
ఓం ఆర్యాయై నమః 
ఓం దీక్షాయై నమః 
ఓం శివాభిదానాయై నమః 
ఓం ప్రణ వార్ధ స్వరూపిన్యై నమః 
ఓం నాద రూపాయి నమః 
ఓం త్రిగునామ్బికాయై నమః 
ఓం శ్రీ మహాగౌర్యై నమః 
ఓం శ్రీ మంగళ గౌరీ దేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి.

ధూపం: 
శ్లో:  దశాంగం గగ్గులోపెతం సుగంధంచ సుమనోహరం 
ధూపం దాస్యామి తే దేవి గృహాణ త్వం సురేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః దూపమాఘ్రాపయామి.

దీపం:
శ్లో:  కాత్యాయని మహాదేవి సర్వాలంకార సంయుతే
దీపం దాస్యామి భో మాతః స్వీకురుష్వ సుశోభనే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః దీపం దర్శయామి.
దూపదీపానంతరం శుద్ధ ఆచా మనీయం సమర్పయామి.  పుష్పముతో కలశంలోని నీళ్ళు చల్ల వలెను.

నైవేద్యం:  
శ్లో:  అపుపాన్ లవణ సంయుక్తాన్ ఇక్షు ఖండైశ్చ  సంయుతాన్ 
భక్ష్యాన్ ఘుతాక్తాన్ హి దేవి! స్వీ కురుష్వ మహేశ్వరి.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఇక్షు ఖండ సహిత లవణాన్ అపుపాన్ నివేదయామి.
ఒక పళ్ళెములో 7 ఉప్పు వేసి వండిన అప్పాలు, చెరుకు గడలోని 7 ముక్కలు అమ్మ వారి ఎదుట వుంచి ఆమెకు నైవేద్యం సమర్పించ వలెను.  

తాంబూలం:
శ్లో: యాలా లవంగ కర్పూర ఫూగీఫల సుశోభితం 
తాంబూలంచ ప్రదాస్యామి స్వీకురుష్వ శివప్రియే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

నీరాజనం:  
శ్లో:  ఘ్రుత వర్తి త్రయోపెతం నీరాజన మిదం శివే 
స్వీకురుష్వ మహాదేవి పాపం నాశయ సత్వరం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః మంగళ నీరాజనం సర్పయామి.
 ఆవునేతితో తడిపిన మూడు వత్తులను హారతిగా అమావారికి చూపవలెను. 

మంత్ర పుష్పం:
శ్లో:  శివే హరిప్రియే దేవి! కాత్యాయని వరప్రదే 
పుష్పాంజలి మిదం తుభ్యం దాస్యామి సురపూజితే.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః సువర్ణ పుష్పాంజలిం సమర్పయామి.

ప్రదక్షిణ నమస్కారములు: 
శ్లో:  గౌ భవాని రుద్రాణి శర్వాణి శంకర ప్రియే 
ప్రదక్షిణం కరిష్యామి పాపాన్నాషయ సత్వరం.
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి.  

ప్రార్ధన:
దేవ దేవి మహాదేవి శంకరార్ధ స్వరూపిణి 
కాత్యాయని మహాదేవి కైలాసాచల వాసిని
తవపూజా భక్తి యుక్త చేతసాహం సదాముదా
కరిష్యామి తవప్రీత్యై మమాభీష్టం ద్రుతం కురు
గ్రహదోశాది దుర్దోశాన్ క్షిప్రం నాశయ శాంభవి 
కల్యాణం కురుమే దేవి సౌభాగ్యంచ ప్రయశ్చమే .
శ్రీ కాత్యాయని దేవ్యై నమః ప్రార్ధన నమస్కారాన్ సమర్పయామి.  
అని పుష్పముగాని, అక్షతలుగాని అమ్మవారి ముందు వుంచి ఆమెను ప్రార్ధించ వలెను.

అనయా ధ్యాన ఆవాహనాది ఏకవింశత్యుపచార  పూజయా భగవాన్ సర్వాత్మికా శ్రీ కాత్యాయని దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు.  
అని చెప్పి అక్షతలు చేతిలోనికి తీసుకొని నీరు పోసుకొని అమ్మవారి ముందు విడువవలెను.  ఆ తరువాత అక్షతలు చేతిలో పట్టుకొని కథను చదువుకొని కతాక్షతలు అమ్మవారి మీద వేసి పిదప శిరస్సుమీద వేయించు కోవలెను. 

శ్రీ కాత్యాయని దేవి వ్రత కథ 
          పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిశారన్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహుపురానములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి! నీవెన్నియో పురానములను వినిపించిటివి మరియు సందర్భానుసారముగా వ్రతములను, వ్రత మహాత్యములను తెలిపితివి.  అయ్యా! ఇప్పుడు మాకొక ధర్మసందేహము తీర్చవలెను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించెను.  ఈశ్వరుని మొదటి భార్యయగు సతీదేవి తన తండ్రి యగు దక్షప్రజాపతి యజ్ఞ కుండమున  పడి దేహ త్యాగామోనరించెను గదా!  ఆ విధముగా, జరుగుటకు కారణమేమి?  ఈశ్వరుడు ఆమెను రక్షిమ్పలేక పోయేనా?  లేక  సతీ దేవి యందు అనురాగాములేక మౌనముగా ఊరకుండెన?  ఈశ్వరునకు భార్యా వియోగము యెట్లు సంభవించెను?  మా సందేహములను తొలగించుము అని సూత మహర్షిని వేడుకొనిరి.  అప్పుడు సూత మహర్షి ఓ మునులారా!  మీ సందేహమును తప్పక పోగొట్టేడను.  సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను.

          దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవి ఈశ్వరునకు భార్యగా నోసంగెను.  సతి దేవి పరమేశ్వరునితో కలిసో కైలాసమున సుఖముగా  ఉంది కృతయుగము అంటాయి గడిపెను.  త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతిదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్దానము అయ్యెను.  సతి దేవి,  ఈశ్వరుడు మాట్లాడుచూ మాయమైనందుకు పరిపరి విధములుగా ఆలోచిన్చుచుండగా పక పకా నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కారించెను.  సతీదేవి పరమేశ్వరుని గాంచి ఓ నాదా! మీరు ఎక్కడకు వెళ్ళినారు?  ఏదులకు నవ్వుతున్నారు?  నేనేమైనా తప్పుమాట్లాడితినా? అని ప్రశించెను.  వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ!  నాకు విశునువు తండ్రివంటివాడు నేను అతనికి తండ్రివంతివాడను, మా యిరువురకు ఏ విధమగు అంతరమును లేదు.  ప్రస్తుతము మహావిష్ణువు భూలోకమున శ్రీ రామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోను, సోదరుడగు లక్ష్మణుడి తోనూ  వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను.  మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు గొనిపోయెను.  పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వేద్దకుచూ ఆ అడవింతయు గాలించెను.  సీత ఎక్కడను గానరాక, శ్రీరాముడు సీతా వియోగాభాదచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనబడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టాను, రేమ్మను సీతను చూసినారా? అని అడుగుతూ పోవుచుండెను.  ఒక చోట పాడుబడ్డ శివలింగమును చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా, నాసీతను జూచితివా? అని ప్రశ్నించెను.  ణా తండ్రియగు విష్ణువు కేక విన్నవెంటనే నేను అచ్చటకు వెళ్లి శ్రీ రాముని ఎదుట నిలబడితిని.  కాని మానవరూపములో నున్న ఆ మహానీయుడు నన్ను చూడనట్లు గానే ముందుకు బోయెను.  అందుకే నీను నవ్వుచుంటిని.  ఇంతే తప్ప మరియొక కారణము లేదుసుమా! అని ఈశ్వరుడు పలికెను.  
           
                  ఆ మాటలు విన్న సతి ఓ నాదా!  మీ మాటలు నమ్మ శక్యముగాలేవు మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించి భార్యావియోగముచే మతి దప్పుతఎమి?  సీతకోసమని  రాముడు పిచ్చివానిగా సంచరించునా?  ఇవి 
నమ్మ శక్యముగాలేవు మీరు పరిహాసమాడుచున్తిరి.  మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రమున మిమ్ము చూడలేక పోవుటయా?  అని పల్కెను.  వెంటనే శివుడు సతీ నీవు ణా మాటలు నమ్మని యెడల స్వయముగా నేవే అచటకుబోయి  ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా చూడుము.  నీకు అంతయు బోధపడగలదని పలికెను.  వెంటనే సతీ దేవి ఓ నాదా! నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు వెళ్లి అచట శ్రీ రామ చంద్రుడి సీతా వియోగ బాధను కన్నులారా చూసి, చెవులారా విని అతని ఆక్రందనను విని సందేహాస్పదయై రాముని పరీక్షించదలచి "నేను సీతగా మారిపోవలేయునని" తలంచెను.  వెంటనే సతీదేవి సీతగా రూపమును పాడెను.  అదే సమయమునకు కైలాసమండున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏవిధముగా పరీక్షించునో అని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతా మహాదేవిని గాంచి కనులుమూసుకొని చేతులోగ్గి నమస్కారము గావించి మరల చూడగానే ఆమె అభిముఖముగా పోవుచుండెను.  అప్పుడు శివుడు నాతల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించాసాగెను.  ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాతా! నన్ను మోసగిమ్పదలచితివా?  నాకు నాభార్య తప్ప మరియొక స్త్రీ నిజస్వరూపములో కనపడును.  అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపమున ఓ శ్రీరామా! నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపమును దాల్చితిని.  నీ సీత ఎచ్చట నున్నను మహాసాద్వియై యున్దగలదు.  అని పలికి అదృశ్యమయ్యెను.

            శివుడుకూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియు తెలియనివానివలె మౌనముగా నుండెను.  ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా! నేను పోయి శ్రీరాముని పరీక్షించితిని, నిజముగా అతడు మహావిష్ణువై ఉండికూడా మానవునివలె, పామరునివలె నటించుచుండెను అని పలికెను.  వెంటనే శివుడు ఓ సతీ నీవు అతనిని యెటుల పరీక్షించితివి?  అని ప్రశ్నించెను.  వెంటనే ఆమె ఓ నాదా! నీవు పరీక్షినిచిన విధముగానే నేనుకూడా పరీక్షించితిని అని చెప్పెను.  అప్పుడు శివుడు, నీవుదాల్చిన ణా తల్లి రూపము ఇప్పటికి నాకన్నులకు కనబడుచున్నది.  నీవు నాతల్లివి, అని ఆ సతీ దేవికి నమస్కరించి వెళ్లి పోయెను.  అంతట ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒకతప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్దమాడుట మరియొక తప్పు. దీనిచే నేను కళంకము నోదితిని.  ఈ కళంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండు అర్హత కోల్పోతిని.  అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను.  అని అనేక విధములుగా ఆలోచించి, కళంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను.  తన దేహమును విడిచిపెట్టుటకు పలువిధములుగా యోచించి చివరకు తను ఏ ఇంట పుట్టెనో అచ్చటనే తన దేహమును వదులుత యుక్తమని సతీదేవి నిశ్చయించుకొనెను.  సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడన్నాద్వేషము కలిగించి ఈశ్వరుని పిలవకుండా యగ్నమోనరించు కోరికను కలిగించెను.  

            ఆమె నిర్ణయానుసారముగా దక్షుడు  శివుని అవమానింప దలచి శివునకు హవిర్భాగమివ్వకుండా యజ్ఞమును తలపెట్టెను.  దేవతలందరూ ఆ యాగామునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగామునకు పరమేశ్వరునితో కలిసి వెల్లుదుమని ఈశ్వరుని కోరెను.  ఆ యాగామునకు వెళ్ళుట యుక్తముగాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్లి తీరవలేయునని మంకు పట్టు పట్టేను.  దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుడు, బృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను.  

            దక్షుని యాగామందపములోనికి సతీదేవి ప్రవేశించి అచట తనవారేవ్వారు పలకరింప పోవుటచే అవమానముగా భావించి రాగులుచున్న అగ్ని గుండముచెంతకు  చేరి చేతులు జోడించి "ఓ అగ్ని దేవా! నేనొక అబద్దము ఆడుటచే ఈశ్వరునకు దూరమైతిని.  ఇచ్చట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను.  కావున కళంక మొందిన  ణా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగినవాడును, నిర్మలమగు మనసున్న ధీరహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరునే భర్తగా పొందునట్లు చేయుము".  అని ప్రార్ధించి భగ భగ మండుచున్న అగ్నిగుండము లోనికి దుమికెను.  దేవతలందరూ హాహాకారాలు చేయుచుండగా నందీశ బృంగీశ్వరులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి.  సతి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారామును దాల్చి  వీరభద్రుని సృష్టించెను.  ఆ వీరభద్రుడు దక్షవారికకు చేరి తనవంటి కోటానుకోట్ల  మహావీరులను సృష్టించి దక్షవాతికను స్మశాన వాటికగా మార్చెను.  

           ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరింపలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను .  ఆ సమయమున పరమేశ్వరుని లలాతమునుంది చెమట బిందువొకటి భూమిపై బడెను.  శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే నాలుగు భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను.  ఆ శిశువు భూన భువనాన్తరములు ప్రతిద్వనించునట్లు  రోదన చేయసాగెను.  శివుని భయముచే భూదేవి స్త్రీ రూపమునోంది ఆ శిశువును ఒడిలోనికి జేర్చుకొని స్థన్య మోసంగెను.  అప్పుడు రుద్రుడు ఆమెతో "ఓ భూదేవి నీవు చాలా పున్యాత్మురాలవు. ఈ ణా శిశువును నీవు పెంచుకొనుము.  ఇతడు నీయందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్ధకనాముడు కాగలదు.  ఎర్రని రంగుతో  నుండుటచే అంగారకుడు అనికూకా పిలిచెదరు.  నవగ్రహములలో ఇతడు ఒక గ్రహముకాగలదు.  ఇతడు ఇంట కాలము నన్నాశ్రయించి ఉండుటచే నాకు భార్యా వియోగము కలిగినది.  ఈ కుజుని పుట్టుక ఎవరు విన్డురో వారికి కుజదోష పరిహారముఅగును". అని శివుడు పలికి వెడలి మరియొక చోట సమాధి నిష్టాగరిష్టుడయ్యేను.  

             హిమవంతుడు ఒక పర్వత రాజు.  అతడు నిర్మలమైన, చల్లనైన ధీర హృదయుడు.  అతని భార్య మేనాదేవి.  ఆ మేనాదేవి గర్భావాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగానే ఒక శుభదినమున జన్మించెను.   హిమవంతుడు పూర్వజన్మలో కతియను ముని.  అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే "కాత్యాయని" అనియు, పర్వతరాజు కుమార్తె అగుటచే "పార్వతి" అనియు మహర్షులు ఆమెకు నామకరణము చేసిరి.  ఆ కాత్యాయని శుక్ల పక్షములోని చంద్రునివలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్యా కలాకోవిదయై వెలుగొందెను .  మరియు అఖండ మగు ఈశ్వరాధన ఆమెతో పెల్లుబికసాగెను.  క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను.  పార్వతికి యుక్తవయసు రాగానే, దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని బంపేను.  మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణములను ప్రయోగించెను.  ఆ బాణ ప్రభావముచే శివుడు సమాధిని  వీడి మహా సౌందర్య రాశియగు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్న పరచిన మన్మధుని మూడవ నేత్రముతో భాస్మీపతలము గావించి వెడలిపోయెను.  

           పార్వతి తన కన్నుల యెదుట జరిగిన సంఘటన గాంచి భయపడక, ధైర్యముతో తన తపముచే ఈశ్వరుని వశము గావిన్చుకోదలచి కటోరమైన తపము సలిపెను. ఆ తపస్సు చే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించెను.  సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరనకై శివుడు పంపెను.  ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇచ్చుటకు సంసిద్దము గావించిరి.  ఒక శుభలగ్నమున అత్యంత వైభవో    పేతముగా  శివపార్వతి  కళ్యాణము  బ్రహ్మ   స్వయముగా  జరిపించెను.  

            శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో వుండగా మన్మధుని భార్యయగు రతీదేవి శివుని పాదములపై బడి తన భర్తను బ్రతికింపమని ప్రార్ధింపగా శివుడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రాతీదేవికి మాత్రమె కనిపించునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను.   దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్శము కురిపించిరి.  ఆ సమయమున పార్వతి పరమేశ్వరునితో "ఓ నాదా! కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషముచే గతజన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమోనరించితిని.  తిరిగి అతడు నీ లలాటమునుంది చెమట బిందువు రూపములో నీకు దూరము కావడమువలన మరల నేను నీకు దగ్గరైతిని.  కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు గూడా బాధలేకుండా చేయగలరు అని ప్రార్ధించెను.  వెంటనే శివుడు ఆమెతో "ఓ పార్వై! కుజుని జన్మకతను విన్నవారికి కుజదోష పరిహారము అగునని ఆనాడే వరమిచ్చితిని.  ఎప్పుడు నీకోరిక ననుసరించి లోకములోని జనులకు కుజదోషపరిహారమై శీఘ్రముగా వివాహమగుటకు, వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయు చుంటిని.  ఆ వ్రాతమునకు నీవే ప్రధానాంశము.  భౌమవారముచే కుజుడు, ప్రదోషకాలమగుటచే  నేనునూ అందు భాగాస్వాములమైతిమి.  "కాత్యాయనివ్రతము" అను పేరుతొ భూలోకములో సుస్తిరముకాగలదు.  అని పలికెను.  ఆమాటలు విని పార్వతి ఎటో సంతోశాపడెను.  పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోతిదేవాతలు వెంటరాగా కైలాసమునకు చేరెను.  అని సూత మహర్షి శోవ్నకాడులకు వినిపించెను.  

వ్రత విధానము:  
     వివాహ ప్రతిబంధక దోషములున్ననూ నివారణ అగుటకు, శీఘ్రముగా అనుకూలమగు భర్తను పొందుటకునూ  కాత్యాయని వ్రతముతో సాతియైనది మరియొకటి లేదు.  ఈ వ్రతమును ఆచరిన్చువారికి భక్తి విశ్వాసములు ముఖ్యము.  తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతమును ఆరంభించవలెను.  ఆ రోజు ఉదయము కాళ్ళకృత్యములు, తీర్చుకొని భక్తి శ్రద్దలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోషకాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను.  ముందుగా గణపతిపూజచేసి ఆపిదప ఒక కలశమును ఏర్పాటుచేసి అందు సగమువరకూ పవిత్రోదకము పోసి మామిదిచిగుళ్ళనుంచి, ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై వుంచి, ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై వుంచి, అందు పరమేశ్వరుని నామంకమున  వున్న కాత్యాయనిదేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్దలతో ఇరవదిఒక్క ఉపచారములతో ఆ దేవిని పూజించావలేయును.  ఎర్రని పుష్పములతో, పసుపు, కుంకుమ లతో పూజించవలెను.  బంగారముతోగాని, పసుపుకోమ్ముతోగాని వారి వారి శక్తానుసారము మంగళ సూత్రములను కలశామునకు అలంకరించవలెను.  కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని మరియు చేరుకుగాడతో కోసిన ఏడు చేరుకుముక్కలను కలిపి నైవేద్యము చేయవలెను.  భక్తి శ్రద్దలతో వ్రత సమాప్తి చేసి కథను విని, ఆ అక్షతలను అమ్మవారిమీది వుంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరుపవలెను.  ఈ విధముగా ఏడు వారములు వ్రతము భక్తితో జరుపవలేయును.  మధ్యలో ఎవారమైన అద్దంకి వచ్చినచో ఆపై వారము జరుపుకోవలెను.  ఏనామిదవ మంగళవారము ఉద్యాపన జరుపవలేయును.  ఆ రోజు ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటుపోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి ఏడు అప్పాలను, ఏడు చేరుకుముక్కలను శక్త్యానుసారముగా చీర, రవికలగుడ్డ వాయనమిచ్చి వారినుండి ఆశీస్సులు పొంది, వారికి భోజనము పెట్టవలెను. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషములు నివారణ జరిగి, శీఘ్రాముగా వివాహమగును.  మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును.  పూర్వము దమయంతి ఈ వ్రతమును ఆచరించి నలుని చేపట్టెను, రుక్మిణి ఈ వ్రతమాచరించి వుద్యాపననాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను.  ఈ వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషములు తొలగిపోవును అని సూత మహర్షి శౌనకాది మహామునులకు వివరించెను. 

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...