హెచ్చరిక:- దైవారాధనలు ప్రమాదరహితము . తాంత్రిక సాధనలు ప్రమాద భరితము . మీ అర్హత పాత్రతలను సరియైన గురువులే నిర్ణయించగలరు. మంత్ర సాధనలు , తాంత్రిక ప్రయోగముల విషయమై సుశిక్షితులు , అనుభవజ్ఞులు , గురువుల నాశ్రయించి మంత్రసిద్ధికై యత్నించ వలెను. లేనిచో ప్రమోదమునకు బదులు ప్రమాదములు సంభవించ గలవు . " తస్మాత్ జాగ్రత్త! "

లేబుళ్లు

ఆదివారం, జూన్ 04, 2023

రామాయణ జయ మంత్రం


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |

అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||

ఆదివారం, సెప్టెంబర్ 04, 2022

రాధాష్టమి సందర్భంగా

శ్రీ కృష్ణాష్టమి తర్వాత 15 రోజులకు వచ్చే భాద్రపద శుక్ల అష్టమి (04వ తేది ఆదివారం) రాధాష్టమి పర్వదినం. 

ఆమె ఆరాధనకు ఇదొక అపురూప సమయం. లోకంలో పవిత్రమైన ప్రేమకు ప్రతిరూపాలుగా మొట్టమొదట రాధాకృష్ణులనే పేర్కొంటాం. రాధ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుని ఆంతరంగిక శక్తి స్వరూపమే. పరమాత్మ అనేకానేక శక్తులలో రాధాదేవి ఒకరు. చాలామందికి తెలియని విషయమేమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ కటాక్షాన్ని పొందడానికి అత్యంత దగ్గరి దారి ఆయన హృదయాంశ అయిన రాధమ్మ అనుగ్రహం పొందడమే. హరేకృష్ణ మంత్రంలోని హరే అన్న పదం కూడా ఆమెను సూచించేదే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా రాధాకృష్ణులను ఇద్దరినీ కలిపి ఆరాధిస్తున్నట్టే.


ఈ రోజు రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.


శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదినం సంద్భంగా రాధకృష్ణుల విగ్రహాలకు పెరుగు, పాలు, పండ్ల రసాలు, పాలు, కొబ్బరినీరు తదితరాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


రాధామాధవం ఎంత రమణీయం! రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం, స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం.తనను తాను ప్రేమించుకుందుకు, తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం. మకరందం లాంటి మనస్సు. ఇలకు దిగిన ఇంద్రధనుస్సు. ప్రణయ మాధురి, రాధాసుందరి.

గురువారం, సెప్టెంబర్ 01, 2022

ఋషిపంచమి



సప్తఋషి ధ్యాన శ్లోకములు  

   కశ్యప ఋషి : కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః ఓం అదితి సహిత కశ్యపాయ నమః        

అత్రి ఋషి : అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్| సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్ ఓం అనసూయా సహిత అత్రయే నమః        

భరద్వాజ ఋషి : జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్| కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్    ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః 

విశ్వామిత్ర ఋషి : కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్| దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్    ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః        

గౌతమ ఋషి : యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా| అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః     ఓం అహల్యా సహిత గౌతమాయనమః        

జమదగ్ని ఋషి : అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్|  దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||     
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః
       
వసిష్ఠ ఋషి: శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్|
బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా   
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః

@telugujyotishanilayam
  సప్తఋషిభ్యో నమః🙏

#ఋషిపంచమి

శుక్రవారం, జులై 22, 2022

ఆడి కృత్తిక

23 వ తేదీన ఆడి కృత్తిక
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు  ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు , పార్వతీ దేవి , వినాయకుడు , సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు గానీ , శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి చిత్రపటం ముందు గానీ వెలిగించాలి.

ఆ తరువాత చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు , వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు , తాంబూలం ఇవన్నీ నివేదించి , సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు , సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని , సాయంత్రం వరకూ ఉపవసించి , సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము , చిమ్మిలి, వడపప్పు , అరటి పండ్లు స్వీకరించాలి.

ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు , జడులు , మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు.  తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు

*అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాము*

తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది , కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది , అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. 

పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ , ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 

వీలైతే ఈ రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి , ఎర్రటి పంచ , పైపంచ , శక్తిమేరకు దక్షిణ , తాంబూలం , అరటి పండ్లు , గొడుగు , పాదరక్షలు , రాగి చెంబు ( లేదా పంచపాత్ర ఉద్దరిణ , అర్ఘ్య పాత్ర ) సమర్పించి , తానే సుబ్రహ్మణ్యునిగా భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము.

ఒకవేళ బాల బ్రహ్మచారియైన వెధవిధుడు లేక గృహస్తు అయిన వెధవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే.

ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది , దీనికి ఒక నిదర్శనం కూడా చెబుతాను చూడండి. 

మా పిన్ని ఇది వరకు తమిళనాడు లోని తిరుప్పూరులో ఉండేవారు , ఒక ఆడి కృత్తిక రోజున ఎవరికైన మధ్యాహ్నం భోజనం పెట్టాలి అనుకుంది , కానీ రెండు రోజుల ముందు నుండీ తీవ్ర జ్వరం కారణంగా ఆడి కృత్తిక రోజున కనీసం లేచి నిలబడే శక్తి కూడా లేక ఎంతో బాధపడుతూ సుబ్రహ్మణ్యుని తలచుకుని దుఃఖిస్తుండగా ఉన్నట్లుంది ఒక నెమలి వచ్చి వాళ్ళ బాల్కనీలో వాలింది. మా పిన్ని సుబ్రహ్మణ్యుడే నెమలి రూపంలో వచ్చాడని ఎంతో సంతోషించింది. నిదానంగా లేచి తన తెచ్చుకున్న బ్రెడ్ నే ఆ నెమలికి పెట్టింది , ఆ నెమలి ఆ బ్రెడ్ తినింది , అప్పుడు మా పిన్ని సుబ్రహ్మణ్యుని స్తోత్రం చదువుతుంటే ఆ నెమలి అలానే కాసేపు బాల్కనీలో కుర్చుని , ఆ స్తోత్ర పారాయణ అయ్యాక కదిలింది. ఇది ప్రత్యాన్యామ పధ్ధతి అయినా భక్తికి భగవంతుడు వశుడే అని చెప్పటానికే ఈ లీల చెప్పాను.

కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈ రోజు ఆరాధించండి. 

మరో ముఖ్య విషయం , కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తుంటాయి , ఇది మా అత్తగారి ఇంట్లో లేదు కనుక చేయవచ్చా ? ఒకసారి చేసి మధ్యలో ఆపేస్తే ఆ దేవీ , దేవతలకు ఆగ్రహం వస్తుందా ? ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవలసినది ఒక్కటే , ఏ పూజయైన , వ్రతమైనా అందరూ ఆచరించాలనే మన మహర్షులు వాటిని మనకు అందించారు , ఇది వరకు తరాలలో ఎవరైనా ఏదైనా ఆటంకం వలనో , నాస్తికత్వం వలనో పాటించకపోయి ఉండచ్చేమో , మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టడం వలన మంచే జరుగుతుంది.

 *ఓం శరవణభవ ఓం శరవణభవ*

శనివారం, జులై 09, 2022

తొలి ఏకాదశి

తెలుసుకోండీ... 
తెలియజేయండీ....
రేపు
తొలి ఏకాదశి...
శయన ఏకాదశి
గోపద్మ వ్రతారంభం...
చతుర్మాస వ్రతారంభం
వ్రత విశేషం... 
ఎలా, ఏం చేయాలి?


ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే "శయన ఏకాదశి, పెద్ద ఏకాదశి" అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని "శయన ఏకాదశి" అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. 

 
ఐతే, మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని మన పురాణాలు చెబుతున్నాయి.
 
మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే  సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.
 
వ్రతంలోని ప్రధాన నియమాలు ఉపవాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన వారు 1.దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. 2. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్యమాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 5. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 6. మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 7.అన్నదానం చేయడం చాలా మంచిది.

ఏకాదశి వ్రతమాచరించేవారు తినగూడనివి
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
 
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.
 
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
 
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

 తొలి ఏకాదశి రోజున హరిని పూజిస్తే

ప్రతినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం.
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజగదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు.

బుధవారం, ఏప్రిల్ 13, 2022

ప్రాణహిత నదీ - పుష్కరాలు

🙏ప్రాణహిత నదీ -  పుష్కరాలు 🙏

బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయని పంచాంగం ప్రకారం మనకు, పెద్దలు చెబుతారు...
ఈ ప్రకారముగ ఈరోజు 13 నుండి 24 వరకు 12 రోజులపాటు ప్రాణహితకు పుష్కరాలు జరగనున్నాయి...

    పుష్కరం అంటే

జలం పుట్టిన తరువాతే జీవకోటి ఉద్భవించింది....
జలాధారాల వెంటనే తొలుత నాగరీకత విస్తరించింది.
అలాంటి జలాన్నిదేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం.
అలాగే నదీ స్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు (బలవంత మాగస్నానాలు), మంగళ స్నానాలు అని హిందూ సాంప్రదాయం నీటితో ముడి పడి ఉంది...
అలాగే తీర్ధయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది...
శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు,తర్పణాలు కూడా జలంతో ముడిపడినవే...
నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రథమని హిందువుల విశ్వాసం, 

తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం...

బ్రహ్మ నుండి ఆకాశం,

ఆకాశం నుండి వాయువు,

వాయువు నుండి జలం,

జలంనుండి భూమి,

భూమి నుండి ఔషధులు,

ఔషధుల నుండి అన్నం ,

అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది,

ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు,

పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి.

పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.

*నది - రాశి :-*

1. గంగానది - మేష రాశి

2. రేవా నది (నర్మద) -వృషభ రాశి

3. సరస్వతీ నది -మిథున రాశి

4. యమునా నది- కర్కాట రాశి

5. గోదావరి -సింహ రాశి

6. కృష్ణా నది -కన్యా రాశి

7. కావేరీ నది -తులా రాశి

8. భీమా నది -వృశ్చిక రాశి

9. పుష్కరవాహిని/రాధ్యసాగ నది -ధనుర్ రాశి

10. తుంగభద్ర నది -మకర రాశి

11. సింధు నది -కుంభ రాశి

12. ప్రాణహిత నది -మీన రాశి

బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి...

బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే.

పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది...

పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు...

ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి...

పుష్కర జననం

పవిత్రమైన నదులలో మానవులు స్నానం చేసి వారి పాపాలను పోగొట్టుకొంటారు...

నదులు ఆ పాపాలు స్వీకరించి అపవిత్రులు అవుతున్నాయి, మానవుల వల్ల అపవిత్రులై ఆ నదులు పాపాలు భరించలేక బాధ పడుతుంటె పుష్కరుడు అనే మహానుభావుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ దేవుని అనుగ్రహం పొంది తనను ఒక పవిత్ర క్షేత్రంగా మార్చమని కోరతాడు...
ఈ విధం గా పుష్కరుడు పుష్కర తీర్థం గా మారి స్వర్గలోకమున మందాకిని నది యందు అంతర్భూతమై ఉన్నాడు...
పన్నెండు సంవత్సరాల కాలం, భారత దేశంలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు పేరుతో ఉత్సవాలు జరిపే ఆనవాయితీ ఉంది...
పుష్కర అనేది భూమి మీది సప్త ద్వీపాలలోనూ ఒకదాని పేరు...
కానీ, సాధారణంగా పుష్కరం/ పుష్కరాలు అంటే నదులకు జరిగే పుష్కరోత్సవాలనే స్ఫురిస్తుంది.
మన దేశంలోని పన్నెండు నదులకు పుష్కరాలు జరపడానికి సంబంధించి వాయు పురాణంలో ఒక గాథ ఉంది...

బ్రహ్మలోక వాసి పుష్కరుడు గురుగ్రహం ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తుందనే కాలాన్ని బట్టి ఈ పన్నెండు నదులనూ దర్శిస్తుంటాడని ఐతిహ్యం.

బ్రహ్మ స్వయంగా పంపించిన వాడు కావడం చేత పుష్కరుడు నదులకు వచ్చినప్పుడు సప్త మహా ఋషులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి గౌర విస్తుంటారని, వారు సూక్ష్మ దేహంతో నదులకు వస్తారు కనుక వారు వచ్చిన కాలం పవిత్రమైనదనీ ఒక విశ్వాసం...

గురుగ్రహం, అంటే బృహస్పతి
మేష రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు గంగానదికీ, కన్యారాశికి వచ్చినప్పుడు కృష్ణా నదికీ, సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికీ, అలాగే మరికొన్ని నదులకూ పుష్కరాల ఉత్సవాలు జరుగుతాయి...
పుష్కరాలు ప్రారంభమైనప్పటి మొదటి పన్నెండు రోజులే చాలా ముఖ్యం, పితృదేవతలను స్మరించుకోవడానికి, తర్పణాదులకు ఇది చాలా మంచి సందర్భమని పూర్వం నుంచి ఒక విశ్వాసం బలంగా ఉంది...
సప్తర్షులేగాక, చాలా మంది దేవతలు కూడా సూక్ష్మరూపులై ఈ నదుల ప్రాంతంలో పుష్కరాలప్పుడు సంచరిస్తుంటారనీ, పుష్కర స్నానాలు చేసే వారికి శుభాలను కలిగిస్తారనీ కూడా పురాణాలు, ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది...
పుష్కరాలు జరిగే సంవత్సర కాలంలో నదికి సవిూప ప్రాంతాలలోని వారు వివాహాది శుభ కార్యాలు చేయరు, తప్పని సరిగా చేయవలసి వస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి చేస్తారు.

ఉత్సవాలు జరిగే పన్నెండు రోజులూ అవకాశం ఉన్నవారు నదీ స్నానాలు చేస్తారు,
తీరంలో పూజలు, తర్పణాలు, జపాలు, దానాలు చేసే సంప్రదాయం ఉంది...

       
🕉🙏 సమస్త లోకా సుఖినోభవంతు🙏🕉

🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀

శుక్రవారం, జనవరి 21, 2022

శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

SRI MEDHA DAKSHINA MURTHY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం: జయ నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2014 - 2015: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2014/03/2014-2015.html

  ㅤ   ㅤ    ㅤ   
Like  Cᵒᵐᵐᵉⁿᵗ  Sᵃᵛᵉ  Sʰᵃʳᵉ

శుక్రవారం, ఆగస్టు 20, 2021

శ్రావణ వరలక్ష్మీ వ్రతం - పూజా విధానం

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా
మహిళలు అందరికీ ముందస్తుగా 

🌿🌺🍀🌼వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు🌼🍀🌺🌿

🌹శ్రావణ వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం🌹

🙏 పాటించాల్సిన నియమాలు🙏

భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. 
ఈ వ్రతాన్నిఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, 
మడులు కొంచెం ఆచరించి... 
నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు 
వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. 
ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి. 

స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

శ్రీవరలక్ష్మి పూజకు ఉపయోగించే సామగ్రి

పసుపు, కుంకుమ,గంధం, విడిపూలు,పూలమాలలు,
తమలపాకులు, 30వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం,

చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ,
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,కలశం,కొబ్బరి కాయలు,
తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు,
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయకోవచ్చు. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం.

‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.

వ్రత విధానము
వరలక్ష్మీ వ్రతన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి.

తోరం తయారు చేసుకోవడం:

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

ముందుగా గణపతి పూజ: విధానము

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ చేయు విధానము
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై, పూజాద్రవ్యాలపై, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ: పువ్వులు లేదా అక్షతలతో 
కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః,
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః,
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః,
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతి పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః,
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరంపూజ
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి,
లోకమాత్రేనమః తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి,
మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వరలక్ష్మి వ్రత కథా ప్రారంభం
పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహార్షి ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను .శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయను కీర్తిస్తున్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు.

అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతఃకాల గృహకృత్యాలను పూర్తిచేసుకుని అత్తమామలను సేవలో తరించేంది.

శ్రీ వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు... నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. హే జననీ! నీకృపా కటాక్షాలు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’ అని పరిపరివిధాల వరలక్ష్మీని స్తుతించింది.

అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి, భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని, ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతరగరథ వాహనాలతో వచ్చి ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు.

మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి, భక్తితో వేడుకుంటటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి.

                            

గురువారం, ఫిబ్రవరి 18, 2021

రథసప్తమి - 2021

రథసప్తమి నిర్ణయః 
{ధర్మసింధు} 
నిర్ణయ సింధౌః -
మాఘశుక్ల సప్తమీ 
రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ  గ్రాహ్యా!

సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్

అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|
ప్రయాగే యది లభ్యేత
కోటిసూర్య గ్రహైః సమా|| 
ఇతి వచనాచ్చ యత్తు
దివో దాసీయే 
  అచలా సప్తమీ దుర్గా
శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా 
ప్రాగ్యుతా సదా||
   ఇతి షష్ఠీయుతత్వముక్తం!
 
 తత్ యదా,
పూర్వేహ్ని 
ఘటికాద్వయం షష్ఠీ,
సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||

ఇత్యాది వచనముల చేత
 *షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము* అన్న వచనము 
సూర్యోదయ కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి 
సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు  సమాప్తమైనప్పుడు
 మాత్రమే
షష్ఠీ యుత సప్తమి ని గ్రహించవలెను!.... 

 అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే
 రథసప్తమి పర్వము ఆచరించవలెను
  కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున
శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున
 19/02/ 2021 శుక్రవారమే రథసప్తమి

సోమవారం, ఫిబ్రవరి 17, 2020

నరసింహ మహా మృత్యుంజయ మంత్రం


ప్రతిరోజూ ఈ నరసింహ మహా మృత్యుంజయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు ప్రతిరోజూ జపించినా, లక్ష్మీ నరసింహ స్వామిని పూజించినా దోషం నివారింపబడి దీర్గాయుష్మంతులు అవుతారని శాస్త్రవచనం.

ఉగ్రం వీరం మహావిష్ణుం
జ్వలంతం సర్వతోముఖమ్‌
నృసింహం భీషణం భద్రం
మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం

నరసింహ స్వామి అంత గొప్ప రక్షణ ఇస్తారు. 
ఆనాడు మృత్యువు కోరలలో చిక్కుకున్న ప్రహ్లాదుడిని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షణ చేస్తారు. 
పిల్లల చేత ప్రతిరోజూ చేయిస్తే వారికి ఆయుష్షు చేకూరుతుంది. 

 శ్రీ శంకరాచార్యులవారిని రెండు సార్లు మృత్యువు నుంచి కాపాడారు స్వామివారు. ప్రతిరోజు భక్తితో నమ్మి కొలిచేవారికి కొండంత దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి.
@SadhanaAradhana

బుధవారం, సెప్టెంబర్ 11, 2019

గోమాత అష్టోత్తర శతనామావళి

శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి (Sri Gomatha Ashtottaram Shatanamavali)


ఓం కృష్ణవల్లభాయై నమః

ఓం కృష్ణాయై నమః

ఓం శ్రీ కృష్ణ పారిజాతాయై

ఓం కృష్ణ ప్రియాయైనమః 

ఓం కృష్ణ రూపాయై నమః

ఓం కృష్ణ ప్రేమ వివర్దిన్యై నమః

ఓం కమనీయాయై నమః

ఓం కళ్యాన్యై నమః

ఓం కళ్య వందితాయై నమః

ఓం కల్పవృక్ష స్వరూపాయై నమః

ఓం దివ్య కల్ప సమలంకృతాయై నమః

ఓం క్షీరార్ణవ సంభూతాయై నమః

ఓం క్షీరదాయై నమః

ఓం క్షీర రూపిన్యై నమః

ఓం నందాదిగోపవినుతాయై నమః

ఓం నందిన్యై నమః

ఓం నందన ప్రదాయై నమః

ఓం బ్రహ్మాదిదేవవినుతాయై నమః

ఓం బ్రహ్మ నందవిదాయిన్యై నమః

ఓం సర్వధర్మ స్వరూపిన్యై నమః

ఓం సర్వభూతావనతాయై నమః

ఓం సర్వదాయై నమః

ఓం సర్వామోదదాయై నమః

ఓం శిశ్టేష్టాయై నమః

ఓం శిష్టవరదాయై నమః

ఓం సృష్టిస్థితితిలయాత్మికాయై నమః

ఓం సురభ్యై నమః

ఓం సురాసురనమస్కృతాయై నమః

ఓం సిద్ధి ప్రదాయై నమః

ఓం సౌరభేయై నమః

ఓం సిద్ధవిద్యాయై నమః

ఓం అభిష్టసిద్దివర్షిన్యై నమః

ఓం జగద్ధితాయై నమః

ఓం బ్రహ్మ పుత్ర్యై నమః

ఓం గాయత్ర్యై నమః

ఓం ఎకహాయన్యై నమః

ఓం గంధర్వాదిసమారాధ్యాయై నమః

ఓం యజ్ఞాంగాయై నమః

ఓం యజ్ఞ ఫలదాయై నమః

ఓం యజ్ఞేశ్యై నమః

ఓం హవ్యకవ్య ప్రదాయై నమః

ఓం శ్రీదాయై నమః

ఓం స్తవ్యభవ్య క్రమోజ్జ్వలాయై నమః

ఓం బుద్దిదాయై నమః

ఓం బుద్యై నమః

ఓం ధన ధ్యాన వివర్దిన్యై నమః

ఓం యశోదాయై నమః

ఓం సుయశః పూర్ణాయై నమః

ఓం యశోదానందవర్దిన్యై నమః

ఓం ధర్మజ్ఞాయై నమః

ఓం ధర్మ విభవాయై నమః

ఓం ధర్మరూపతనూరుహాయై నమః

ఓం విష్ణుసాదోద్భవప్రఖ్యాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం విష్ణురూపిన్యై నమః

ఓం వసిష్ఠపూజితాయై నమః

ఓం శిష్టాయై నమః

ఓం శిష్టకామదుహే నమః

ఓం దిలీప సేవితాయై నమః

ఓం దివ్యాయై నమః

ఓం ఖురపావితవిష్టపాయై నమః

ఓం రత్నాకరముద్భూతాయై నమః

ఓం రత్నదాయై నమః

ఓం శక్రపూజితాయై నమః

ఓం పీయూషవర్షిన్యై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం పుణ్యా పుణ్య ఫలప్రదాయై నమః

ఓం పయః ప్రదాయై నమః

ఓం పరామోదాయై నమః

ఓం ఘ్రుతదాయై నమః

ఓం ఘ్రుతసంభవాయై నమః

ఓం కార్త వీర్యార్జున మృత హేతవే నమః

ఓం హేతుకసన్నుతాయై నమః

ఓం జమదగ్నికృతాజస్ర సేవాయై నమః

ఓం సంతుష్టమానసాయై నమః

ఓం రేణుకావినుతాయై నమః

ఓం పాదరేణుపావిత భూతలాయై నమః

ఓం శిశ్టేష్టాయై నమః

ఓం సవత్సాయై నమః

ఓం యజ్ఞ రూపిన్యై నమః

ఓం వత్స కారాతిపాలితాయై నమః

ఓం భక్తవత్సలాయై నమః

ఓం వ్రుషదాయై నమః

ఓం క్రుషిదాయై నమః

ఓం హేమ శ్రుజ్ఞాగ్రతలశోభనాయై నమః

ఓం త్ర్యైలోక్య వందితాయై నమః

ఓం భవ్యాయై నమః

ఓం భావితాయై నమః

ఓం భవనాశిన్యై నమః

ఓం భుక్తి ముక్తి ప్రదాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కాంతాజన శుభంకర్యై నమః

ఓం సురూపాయై నమః

ఓం బహురూపాయై నమః

ఓం అచ్చాయై నమః

ఓం కర్భురాయై నమః

ఓం కపిలాయై నమః

ఓం అమలాయై నమః

ఓం సాధుశీతలాయై నమః

ఓం సాధు రూపాయై నమః

ఓం సాధు బృందాన సేవితాయై నమః

ఓం సర్వవేదమయై నమః

ఓం సర్వదేవ రూపాయై నమః

ఓం ప్రభావత్యై నమః

ఓం రుద్ర మాత్రే నమః

ఓం ఆదిత్య సహోదర్యై నమః

ఓం మహా మాయాయై నమః

ఓం మహా దేవాది వందితాయై నమః

ఇతి శ్రీ గోమాత అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

శుక్రవారం, ఆగస్టు 23, 2019

గోపాలస్తుతి

గోపాలస్తుతీ

శ్రీ గణేశాయ నమః ।
ఓం నమో విశ్వరూపాయ విశ్వస్థిత్యన్తహేతవే ।
విశ్వేశ్వరాయ విశ్వాయ గోవిన్దాయ నమో నమః ॥ ౧॥

నమో విజ్ఞానరూపాయ పరమానన్దరూపిణే ।
కృష్ణాయ గోపీనాథాయ గోవిన్దాయ నమో నమః ॥ ౨॥

నమః కమలనేత్రాయ నమః కమలమాలినే ।
నమః కమలనాభాయ కమలాపతయే నమః ॥ ౩॥

బర్హాపీడాభిరామాయ రామాయాకుణ్ఠమేధసే ।
రమామానసహంసాయ గోవిన్దాయ నమో నమః ॥ ౪॥

కంసవశవినాశాయ కేశిచాణూరఘాతినే ।
కాలిన్దీకూలలీలాయ లోలకుణ్డలధారిణే ॥ ౫॥

వృషభధ్వజవన్ద్యాయ పార్థసారథయే నమః ।
వేణువాదనశీలాయ గోపాలాయాహిమర్దినే ॥ ౬॥

బల్లవీవదనామ్భోజమాలినే నృత్యశాలినే ।
నమః ప్రణతపాలాయ శ్రీకృష్ణాయ నమో నమః ॥ ౭॥

నమః పాపప్రణాశాయ గోవర్ధనధరాయ చ ।
పూతనాజీవితాన్తాయ తృణావర్తాసుహారిణే ॥ ౮॥

నిష్కలాయ విమోహాయ శుద్ధాయాశుద్ధవైరిణే ।
అద్వితీయాయ మహతే శ్రీకృష్ణాయ నమో నమః ॥ ౯॥

ప్రసీద పరమానన్ద ప్రసీద పరమేశ్వర ।
ఆధివ్యాధిభుజఙ్గేన దష్టం మాముద్ధర ప్రభో ॥ ౧౦॥

శ్రీకృష్ణ రుక్మిణీకాన్త గోపీజనమనోహర ।
సంసారసాగరే మగ్నం మాముద్ధర జగద్గురో ॥ ౧౧॥

కేశవ క్లేశహరణ నారాయణ జనార్దన ।
గోవిన్ద పరమానన్ద మాం సముద్ధర మాధవ ॥ ౧౨॥

॥ ఇత్యాథర్వణే గోపాలతాపిన్యుపనిషదన్తర్గతా గోపాలస్తుతి సమాప్తా ॥

శనివారం, అక్టోబర్ 06, 2018

నవరాత్రి పూజ విధానం

శరన్నవరాత్రి ఉత్సవముల వివరములు


దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. మరి అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలిగా. దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.

ప్రాణ ప్రతిష్ట చేయు విధానం 
అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.

మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః

ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం

స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద

ధ్యానం 
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః

అక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.

ఆవాహనం

ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ 


ఆసనం 
ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై  పుష్పాలను లేదా  అక్షింతలు   చల్లవలెను.


తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహం

దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను.

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రభోదినీమ్
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ 

అర్ఘ్యం

దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను. 

కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్
పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్


ఆచమనీయం 
ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెను

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే 

పంచామృతాభిషేకం 

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

క్షీరం (పాలు)

ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియం
భవావాజస్య సంగధే

దధి (పెరుగు)

దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్

ఆజ్యం (నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః

మధు (తేనె)
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః
మాధ్వీర్నస్సన్త్వౌ షధీః

చక్కెర (పంచదార)
స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్

ఫలోదకం (కొబ్బరి నీరు)
యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనః

శుద్ధోదకం (మంచినీరు) స్నానం

ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః

చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను

ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహమ్
అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుదమే గృహాత్

గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్ 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామి

సుగంధ ద్రవ్యాణి 

ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం
జాయా హేతిం పరిబాధమానాః
హస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్
పుమాన్‌పుమాంసంపరిపాతువిశ్వతః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.

ఆభరణాణి (నగలు)
తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.


మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి
పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శ్రయతాం యశః 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామి

పుష్పాణి (పూలమాలలు)
ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి. 

కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ 


శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.

అధాంగ పూజ 
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి



ధూపం (అగరవత్తులు) 

ఆపః సృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే
ని చ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే 

తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి. 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.

దీపం 
అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి. 

ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం  సువర్ణాం హేమమాలినీమ్
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ 

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెను

నైవేద్యం 

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ

తర్వాత నైవేద్యం సమర్పించాలి

తాంబూలం

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్
యస్యాం హిరణ్యం ప్రభూతం గావోదాస్యోశ్వాన్ విందేయం పురుషానహమ్ 

 శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః తాంబూలం సమర్పయామి.

కర్పూరనీరాజనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.


యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహమ్
శ్రియః పంచదశర్చం చ శ్రీకామః సతతం జపేత్ 


సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః 
కర్పూర నీరాజనం సమర్పయామి.

మంత్రపుష్పమ్ 
చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను. 

శ్రీ సూక్త ఫలము

ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః

ఋషయస్తే త్రయః ప్రోక్తాస్వయాం శ్రీరేవ దేవతా

పద్మాననే పద్మ ఊరూ పద్మాక్షీ పద్మసంభవే
త్వం మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహమ్

అశ్వదాయీ గోదాయీ ధనదాయీ మహాధనే
ధనం మే జుషతాం దేవి సర్వకామాంశ్చ దేహి మే

పుత్రపౌత్రం ధనం ధాన్యం హస్త్యశ్వాదిగవేరథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్

ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః
ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్ను తే

చంద్రాభాం లక్ష్మిమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం
చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే

వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రహా
సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభా మతిః
భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్సదా

వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః
రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మ ద్విషో జహి

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ
గంభీరావర్తనాభిః స్తనభర నమితా శుభ్ర వస్త్రోత్తరీయా
లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితైస్స్నాపితా హేమకుంభైః
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగల్యయుక్తా

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్రగంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీస్సరస్వతీ
శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా

వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాద్యాం జగదీశ్వరీం త్వామ్

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే

సరసిజ నిలయే సరోజహస్తే ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీదమహ్యమ్

ఓం విష్ణుపత్నీం క్షమాం దేవీం మాధవీం మాధవప్రియాం
విష్ణోః ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభామ్

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

శ్రీవర్చస్యమాయుష్యమారోగ్యమావిధాత్ పవమానం మహీయతే
ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః
ఋణరోగాది దారిద్ర్య పాపంక్షుదపమృత్యవః
భయశోకమనస్తాపా నశ్యంతు మమ సర్వదా

శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జరితృభ్యో దధాతు
శ్రియం వసానా అమృతత్వమాయన్ భజంతి సద్యః సవితా విదధ్యూన్

శ్రియ ఏవైనం తచ్ఛ్రియామాదధాతి
సంతతమృచావషట్ కృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః
య ఏవం వేద

ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్

తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.

మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్

ఉద్వాసన 
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః

శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.



                                        తిథి              తేదీ
మొదటి రోజు                పాడ్యమి 10 అక్టోబర్ శ్రీ బాలా త్రిపుర సుందరి
రెండవ రోజు               విదియ,తదియ 11 అక్టోబర్       శ్రీ గాయత్రి
మూడవ రోజు                  చవితి         12 అక్టోబర్      శ్రీ మహాలక్ష్మి
నాలుగో రోజు                  పంచమి       13 అక్టోబర్        శ్రీ అన్నపూర్ణ
ఐదవ రోజు                      షష్ఠి   14 అక్టోబర్        శ్రీ లలితాదేవి
ఆరవ రోజు                    సప్తమి         15 అక్టోబర్        శ్రీ సరస్వతి
ఏడవ రోజు                   అష్టమి          16 అక్టోబర్        శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి)
ఎనిమిదవ రోజు              నవమి          17 అక్టోబర్        శ్రీ మహిషాసురమర్ధిని
తొమ్మిదవ రోజు                దశమి          18 అక్టోబర్        శ్రీ రాజరాజేశ్వరి

యాదేవి సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై సమస్తస్యై నమో నమః
ఆర్తితో అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ ఆప్యాయంగా అక్కు జేర్చుకునే ఆ తల్లికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం... త్రికరణ శుద్ధిగా మనలను మనం అర్పించుకోవడం తప్ప. ఆ జగన్మాతకు సేవచేసే భాగ్యం నవరాత్రుల రూపంలో లభించడం మన జన్మకు లభించిన అద్భుత వరం.
శివునివల్ల రాత్రి ప్రాశస్త్యాన్ని గూర్చి తెలుసుకున్న పార్వతీదేవికి శివుడు నవరాత్రులు ఆ తల్లి పేరిట పవిత్ర దినాలుగా వర్ధిల్లేటట్లు వరమిచ్చాడు. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, అశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులుగా ప్రాచుర్యం పొందాయి. శరన్నవరాత్రులనే 'దేవి నవరాత్రులు'అని, దసరా అని అంటాం. 
నవరాత్రులలో దేవిని నవ మూర్తులుగానూ, నవశక్తులుగానూ ఆరాధిస్తారు. అయినా ఏ రోజు ఏ స్వరూపం అనేది నిర్ధిష్ట నిర్ణయంగా కనిపించదు. వరుస క్రమంలో మార్పులు ఉంటాయి. తిథి, నక్షత్రాలను బట్టి ఆనాటి రూపవిశేషం ఉంటుంది. ఆ తల్లి రూపాలు ప్రాంతీయ ఆచరాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. అంటే శృంగేరి పీఠంలో, విజయవాడ కనకదుర్గ దేవి సన్నిధిలో దసరా ఉత్సవాలు, అలాగే తిరుపతి శ్రీవారి సన్నిధిలో బ్రహ్మూెత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి, ఆయా ప్రాంతాలవారీగా అమ్మవారి రూపాలు మారుతుంటాయి. అమ్మవారి నవశక్తులు గాయత్రీ మాతలో నిక్షిప్తమై ఉన్నాయని పెద్దల భావన. 
నవరాత్రులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. అవి జగన్మాతలోని ఒక్కొక్క కోణాన్ని మనకు చూపిస్తాయి. పూజా విధానాలను భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా ఆధునిక జీవితానికి ఉపకరించే ప్రశాంతత లభిస్తుంది. సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఉత్తేజాన్ని పొందుతాం. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తాం. 
ఆయా తిథులలో అమ్మవారి అవతార విశేషం, ఆ రోజున సమర్పించాల్సిన నైవేద్యం, జపించాల్సిన మంత్రం, గాయత్రి ఈ విధంగా ఉన్నాయి.  

పాడ్యమి - బాలా త్రిపురసుందరి - పాల పాయసం
"దినకర కిరణైః జ్యోతి రూపే శివాఖ్యే -   హేమ వర్ణే హిమ కర కిరణా భాసమా నేన్దుచూడే
సకల జయకరీ, శక్తి బాలే నమస్తే|| "  అని మొదటి రోజున బాల స్వరూపంగా పూజించాలి

బాల గాయత్రి : 
" ఓం త్రిపురేశ్యచ విద్మహే కామేశ్వర్యైచ ధీమహి  - తన్నో బాలా ప్రచోదయాత్‌||"
అనే బాల గాయత్రి సహస్ర గాయత్రి జపించిన మంచి ఫలితం లభిస్తుంది.

విదియ - అన్నపూర్ణేశ్వరి - పాయసన్నం
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే 
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి||
మాతాచ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః

అన్నపూర్ణ గాయత్రి : 
అన్నపూర్ణాయై విద్మహే జగన్మాత్రేచ థీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||

తదియ - శ్రీమహలక్ష్మి - గుఢాన్నం 
మాతర్నమామి కమలే కమలాయతాక్షి -  శ్రీ విష్ణు హృత్కమల వాసిని విశ్వమాతః
క్షీరదజే కమల కోమల గర్భగౌరి -  లక్ష్మీప్రసీద సతతం సమతాం శరణ్యే||

లక్ష్మీ గాయత్రి :  ఓం మహాలక్ష్యైచ విద్మహే సర్వసిద్ధ్యైచ ధీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||
"ఓం అమృతవాసిన్యైచ విద్మహే పద్మలోచన్యైచ ధీమహి -  తన్నో లక్ష్మిః ప్రచోదయాత్‌||"  అని పఠించినా మంచిది.

చవితి - గాయత్రి దేవి -  కట్టు పొంగలి అన్నం
ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి ధియో యోనః ప్రచోదయాత్‌||  
అని పఠించినట్టయితే తల్లి కరుణిస్తుంది. 

పంచమి - శ్రీ లలితా దేవి - పులిహోరాన్నం
అనఘాద్భుత చరిత్రా వాంచితార్థ ప్రదాయినీ -  ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్య శాసనా||

శ్రీలలితా గాయత్రి : లలితాయై చ విద్మహే కామేశ్వర్యైచ థీమహి ఔతన్నో దేవి ప్రచోదయాత్‌||

షష్టి - శ్రీ దుర్గాదేవి - చిల్లు లేకుండా అల్లపు గారెలు
ప్రథమా శైల పుత్రీచ ద్వితీయ బ్రహ్మచారిణే -  తృతీయా చంద్రఘాటేతి కుష్మాండతేతి చతుర్థికీ
పంచమాస్కంద మాతేతి షష్టా కాత్యేయనేతిచ - సప్తమ కాల రాత్రిచ అష్టమా చేతి భైరవీ
నవమా సర్వస్థిశ్చేత్‌ నవదుర్గా ప్రకీర్తితా||

దుర్గా గాయత్రి : ఓం మహా దుర్గాయై విద్మహే సర్వ శక్తయైచ థీమహి - తన్నో దుర్గా ప్రచోదయాత్‌

సప్తమి - మూల నక్షత్రం - సరస్వతి దేవి - కొబ్బరి అన్నం
సరస్వతీత్వియం దృష్టా వీణా పుస్తక ధారిణీ - హంస వాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ||

సరస్వతీ గాయత్రి : సరస్వత్యైచ విద్మహే బ్రహ్మసతియైచ ధీమహి -  తన్నో వాణీ ప్రచోదయాత్‌||

అష్టమి - మహిషాసురమర్ధని - శాకాన్నం, కేసరిబాత్‌
జయ జయహే మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని శైలసుతే

మహిషాసుర మర్ధిని గాయత్రి : మహిషష్యైచ విద్మహే జగన్మాత్రేచ ధీమహి -  తన్నో మాతా ప్రచోదయాత్‌||

నవమి - శ్రీరాజరాజేశ్వరి - చిత్రాన్నం, లడ్డూలు
అంబా పాలిత భక్తరాజరనిశం అంబాష్టకం యః పఠేత్‌
దంబాలోక కటాక్షవీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబాపావన మంత్ రాజ పఠనాద్ధంతీశ మోక్ష ప్రదా
చిద్రూపీ వరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ||

రాజరాజేశ్వరి గాయత్రి : రాజేశ్వర్యైచ విద్మహే శ్రీభవానీయైచ ధీమహి -  తన్నో దేవి ప్రచోదయాత్‌||

Dates of Navratri 2018

Pratipada (Navratri Day 1) Wednesday 10 October 2018

Dwitiya (Navratri Day 2) Thursday 11 October 2018

Tritiya (Navratri Day 3) Friday 12 October 2018

Chaturthi (Navratri Day 4) Saturday 13 October 2018

Panchami (Navratri Day 5) Sunday 14 October 2018

Sasthi (Navratri Day 6) Monday15 October 2018

Saptami (Navratri Day 7)Tuesday 16 October 2018

Ashtami (Navratri Day 8)Wednesday17 October 2018

Navami (Navratri Day 9) Thursday 18 October 2018

Dashami (Vijayadashami) Friday 19 October 2018


శ్రీ దేవీ నవరాత్రులు -1.బాలాత్రిపుర సుందరి

శ్రీ దేవీ నవరాత్రులు - 2.గాయత్రి

శ్రీ దేవీ నవరాత్రులు - 3. శ్రీ మహాలక్ష్మి

శ్రీ దేవీ నవరాత్రులు - 4.అన్నపూర్ణ

శ్రీ దేవీ నవరాత్రులు - 5.లలిత త్రిపుర సుందరి

శ్రీ దేవీ నవరాత్రులు - 6.సరస్వతి

శ్రీ దేవీ నవరాత్రులు - 7.దుర్గ

శ్రీ దేవీ నవరాత్రులు - 8.మహిషాసుర మర్దిని

శ్రీ దేవీ నవరాత్రులు - 9.రాజరాజేశ్వరి

శనివారం, మే 05, 2018

చక్రసంవహనము

మూలధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతం
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం
సహస్రారం బ్రహ్మరంధ్ర ఇత్యగమ విదో విదుః

- వీటిని ఊర్థ్వలోక సప్తకమంటారు.

7. సహస్రారం – సత్యలోకం – ప్రమాతస్థానం
6. ఆజ్ఞాచక్రం – తపోలోకం – జీవాత్మస్థానం
5. విశుద్ధ చక్రం- జనలోకం – ఆకాశభూతస్థానం
4. అనాహతం – మహర్లోకం – వాయుభూతస్థానం
3. మణిపూరకం – సువర్లోకం – అగ్నిభూతస్థానం
2. స్వాధిష్ఠానం – భువర్లోకం – జలభూతస్థానం
1. ఆధారము – భూలోకం – పృథ్వీభూతస్థానం

1. మూలాధారచక్రం : మలరంధ్రానికి సుమారురెండంగుళాల పై భాగంలో ఉంటుంది. దీని రంగు ఎఱ్ఱగా (రక్తస్వర్ణం) ఉంటుంది. నాలుగురేకులుగల తామరపూవాకారంలో ఉంటుంది. దీనికి అధిపతి గణపతి; వాహనం – ఏనుగు. బీజాక్షరాలు వం – శం – షం అనేవి.
2. స్వాధిష్ఠాన చక్రం : ఇది జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది. అధినేత బ్రహ్మతత్త్వం. జలం – సింధూరవర్ణంలో ఉంటుంది. ఆరురేకుల పద్మాకారంలో ఉంటుంది. దీనికి అక్షరాలు బం – భం – యం – యం – రం – లం. వాహనం మకరం.
3. మణిపూరక చక్రం : బొడ్డునకు మూలంలో వెన్నెముక యందుటుంది. దానికి అధిపతి విష్ణువు. పదిరేకుల పద్మాకారంలో ఉంటుంది. బంగారపు వర్ణంతో ఉంటుంది. అక్షరాలు డం – ఢం – ణం – తం – థం – దం – ధం – నం – పం. వాహనం కప్ప.
4. అనాహత చక్రం : ఇది హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది. దీనికధిదేవత రుద్రుడు. నీలం రంగులో ఉంటుంది. పన్నేండురేకుల తామరపూవులవలె ఉంటుంది. అక్షరాలు కం – ఖం – గం – ఘం – జ్ఞం – చం – ఛం – జం – ఝం- ణం – టం – ఠం. తత్త్వం వాయువు. వాహనం లేడి.
5. విశుద్ధచక్రం : ఇది కంఠము యొక్క ముడియందుంటుంది. దీనికధిపతి జీవుడు. నలుపురంగు. అక్షరాలు అం – ఆం – ఇం – ఈం – ఉం – ఊం – ఋం – ౠం – ఏం – ఐం – ఓం – ఔం – అం – అః. తత్త్వమాకాశం – వాహనం ఏనుగు.
6. ఆజ్ఞాచక్రం : ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది. దీని కధిపతి ఈశ్వరుడు. తెలుపురంగు. రెండు దళాలు గల పద్మాకారంగా ఉంటుంది. అక్షరాలు హం – క్షం.
7. సహస్రారం : ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది. దీనినే బ్రహ్మరంధ్రమంటాం. దీని కధిపతి పరమేశ్వరుడు. వేయిరేకుల పద్మాకృతితో ఉంటుంది. సుషుమ్నానాడి పై కొనమీద ఈ చక్రం ఉంటుంది. అక్షరాలు – విసర్గలు. దీనికి ఫలం ముక్తి.

linkwithin

Related Posts Plugin for WordPress, Blogger...